[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- రేఫలోపించిన శ్రీమతి గాంధీ
సమాధానం: కస్తూబా
- ఆదివారానికి సోమవారం
సమాధానం: మరునాడు
- రక్షణ
సమాధానం: కాపాడుట
- మధ్య
సమాధానం: నడి
- సాగు
సమాధానం: పద
- పన్నీరు – అంటారు గులాబిని
సమాధానం: పువ్వు
- మధుర దైవం
సమాధానం: మీనాక్షి
- తలతిరుగుడు రచయిత్రి
సమాధానం: లత
- స్నానానికి సబ్బు
సమాధానం: హమాం
- సూరకవిది సుత్తి పెట్టు
సమాధానం: తిట్టు
- ఒక వ్యాపార కేంద్రం
సమాధానం: డిపో
- మనం ఉంటున్నది
సమాధానం: సమాజం
- రుచి విశేషం
సమాధానం: కారం
- నిరంకుశ పరిపాలనలో అక్రమం
సమాధానం: రంకు
- సంధ్యారాగం
సమాధానం: నాట
- బహుశా
సమాధానం: కాబోలును
- దీనిలోనే తెలుగుతనం ఉంది.
సమాధానం: ఆవకాయ
- ఉభయులకు మిత్రుడైన కవి.
సమాధానం: తిక్కన
నిలువు
- చిన్నదైనా శుభసూచకం!
సమాధానం: చిరునవ్వు
- మిక్కిలి
సమాధానం: కడు
- ప్రచార సాధనం
సమాధానం: బాకా
- బానిసలా, సినిమాలా కోరేది
సమాధానం: విడుదల
- నిదానించడానికి
సమాధానం: నాడి
- కావాలి కంటికి, ఇంటికి!
సమాధానం: పాప
- రోదసీయాత్ర చేసింది
సమాధానం: లూనా
- గురజాడ బొమ్మ
సమాధానం: పుత్తడి
- విచారం
సమాధానం: మీమాంస
- చెట్టు
సమాధానం: క్షితిజం
- లోహవిశేషం
సమాధానం: తగరం
- ఒకరకం భూమి. దాన్ని అక్రమంగా ఆక్రమించేవాడు!
సమాధానం: పోరంబోకు
- సగం ఋతువు
సమాధానం: మాసం
- ఇవి కాలుటకా? చెడిపోయి మారుటకా?
సమాధానం: కాటకాలు
- పలుకులలో తిరిగిన లోయ
సమాధానం: కులు
- ఎడారిలో ఒంటె
సమాధానం: నావ
- తిరగేసి ఆరగించు
సమాధానం: నుతి
- ఒట్టు ఆజ్ఞ
సమాధానం: ఆన