[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- ఉగాదికి చిగురు
సమాధానం: వేప
- పడతుల పక్షపాతి
సమాధానం: చలం
- 16 నక్సలిజానికి నాంది.
సమాధానం: వసంత
- అల్లసాని అగ్రహారం
సమాధానం: కోకటం
- ఆంధ్రదేశం అన్నం
సమాధానం: పూర్ణ
- బాలకృష్ణుడు
సమాధానం: కంసారి
- కనుక
సమాధానం: కాన
- శ్రుతి విభాగం
సమాధానం: పనస
- నాటకానికి తెర ఎత్తడం
సమాధానం: ఆరంభం
- చూడు 5 అడ్డం
సమాధానం: మేఘగర్జన
- ముగ్గురు కవుల ముద్దుబిడ్డ
సమాధానం: భారతం
- ఆకర్షించి
సమాధానం: తిగిచి
- నావి (బహువచనం)
సమాధానం: మావి
- జనానాలలో కనిపించేది
సమాధానం: పరదా
- విజాతి
సమాధానం: లాతి
- జంట
సమాధానం: కవలు
- హైదరాబాదులో ఆఖరివాడు
సమాధానం: నవాబు
- తగ్గు
సమాధానం: డిగు
- వికారంతో విస్తృతి
సమాధానం: విరి
నిలువు
- తోకతెగిన ఋతువు
సమాధానం: వేసం
- వెండిది సాధారణంగా రెండోది
సమాధానం: పతకం
- వెన్నెల తిండి
సమాధానం: చకోరి
- చుట్టూ నీళ్ళు
సమాధానం: లంక
- అంటే రంగులు పులమడమా?
సమాధానం: వర్ణన
- చప్పుడు వింటిని
సమాధానం: టంకారం
- వయో విశేషం
సమాధానం: పూప
- రాజమండ్రిలో ట్రాజెడీ
సమాధానం: సారంగధర
- శ్రావణ మేఘం
సమాధానం: నభం
- కూడింది.
సమాధానం: సమేతం
- నమస్కారం
సమాధానం: ఆనతి
- కూచిపూడి కలాపం
సమాధానం: భామా
- రవి కవీంద్రుని 15 అడ్డం
సమాధానం: రవిక
- అలంక్రియ
సమాధానం: గిలాబు
- ప్రోగు
సమాధానం: చితి
- పిట్ట గుడ్లగూబ
సమాధానం: పలుగు
- రాక్షసి
సమాధానం: దానవి
- తెలుగు యతి
సమాధానం: వడి
- పువ్వు, వాహం మబ్బు
సమాధానం: వారి