పాపినేని శివశంకర్ ఆధునిక తెలుగు కవిత్వ ప్రపంచంలోని అగ్రశ్రేణి కవులలో ఒకరు. ఆయన కథకులు, విమర్శకులు కూడా. సాహితీ త్రిముఖుడుగా ప్రసిద్ధిగాంచారు. పాపినేని శివశంకర్ 6 నవంబర్ 1953న గుంటూరు జిల్లా నెక్కల్లులో జన్మించారు. రెండు కథాసంపుటాలు, ఐదు కవితా సంకలనాలు, మూడు వ్యాససంపుటాలు, ఒక పరిశోధనా గ్రంథం, తల్లీ నిన్ను దలంచి పద్యపరిచయ గ్రంథం ప్రచురించారు. రజనీగంధ కవితాసంపుటానికి 2016లో కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు లభించింది. జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ చేసి గుంటూరులో నివాసం చేస్తున్నారు. ఆలోచనల, అనుభూతుల మేళవింపు శివశంకర్ కవిత్వం. అందులోని తాత్త్వికమైన లోతులు చదువరులను ఆలోచింపజేస్తాయి.