ఈమాట సెప్టెంబర్ 2008 సంచికకు స్వాగతం

ఈమాట సెప్టెంబర్ 2008 సంచికకు స్వాగతం. ఈ సంచికలో –

తెలుగులో పుస్తక సమీక్షల ఆవశ్యకత గురించి, ఒకప్పుడు మన తెలుగు పత్రికలలో వచ్చిన సమీక్షల గురించి ప్రస్తావించే వేలూరి వెంకటేశ్వర రావు సంపాదకీయం “పుస్తక సమీక్షల గురించి..

కొడవళ్ళ హనుమంతరావు గారి “కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు” వ్యాస పరంపరలో అయిదవ వ్యాసం: “గణితంలో ఫ్రేగె జయాపజయాలు“, నాగమురళీకృష్ణ వాడవల్లి గారి “జ్యోతిషమూ-లోపలి సంగతులు” వ్యాస పరంపరలో చివరి భాగం, చీమలమర్రి బృందావనరావు గారి “నాకు నచ్చిన పద్యం” వ్యాస పరంపరలో తరువాతి వ్యాసం “భాస్కర రామాయణంలో వర్షాగమన వర్ణన“, వాడుక భాషలో ఛందోబద్ధ పద్యాలు రాయడాన్ని వివరించే జెజ్జాల కృష్ణమోహనరావు గారి వ్యాసం “వాడుక భాషలో పద్యాలు“.

వాగ్గేయకారుడిగా త్యాగరాజు జీవితాన్ని చారిత్రక ఆధారాల సహాయంతో పరిశీలించే గొర్తి సాయి బ్రహ్మానందం గారి వ్యాస పరంపర “మనకు తెలియని మన త్యాగరాజు” లో మొదటి భాగం. తెలుగువారికి గర్వకారణమైన ప్రముఖ గాయకుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గురించి కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు మనతో పంచుకున్న కొన్ని ముచ్చట్లతో “బాలమురళీకృష్ణ” వ్యాసం.

ఇప్పటి వరకూ ఈమాట పాఠకుల అభిప్రాయాలు శీర్షికలో సవ్యసాచిలా అభిప్రాయ బాణాలు సంధిస్తున్న బాబ్జీలు గారు తాపీ ధర్మారావు గారు రాసిన ‘సాహిత్య మొర్మొరాలు’ పుస్తకంపై విసిరిన “మరో గుప్పెడు మొర్మొరాలు“. ఇది ఈమాటలో వీరి మొదటి రచన.

సమాజాన్ని పట్టి పీడిస్తున్న కుల సమస్యను లోతుగా చర్చించి, ‘’భారతీయులంతా ఒక్కటే’’ అనే జాతీయతా వాదాన్ని స్థాపించే నాటకంగా అభివర్ణించబడే బోయి భీమన్న గారి పౌరాణిక-సాంఘిక నాటకం “రాగ వాసిష్టం” గురించి డాక్టర్ దార్ల వెంకటేశ్వర రావు గారి వ్యాసం “రాగవాసిష్ఠం- నాటక వైశిష్ట్యం“.

పుస్తక సమీక్షలు శీర్షికలో, రచయిత నవీన్ తన అమెరికా పర్యటన తరువాత రాసిన “అమెరికా, అమెరికా” అన్న పుస్తకంపై విన్నకోట రవిశంకర్ సమీక్ష, ప్రముఖ కవి ఇస్మాయిల్ కవిత్వానికి ఇంగ్లీషు అనువాదం “Tree, My Guru” పై రామారావు కన్నెగంటి సమీక్ష.

దేవరపల్లి రాజేంద్ర కుమార్, శారద, వేలూరి వెంకటేశ్వరరావు గార్ల కథలు: “ధార“, “పడవ మునుగుతోంది“, “దేశమును ప్రేమించుమన్నా“. కొల్లూరి సోమశంకర్ అనువదించిన కథ “సెన్సిటివిటీ ట్రెయినింగ్

ఇంకా, వైదేహీ శశిధర్, టీ. శ్రీవల్లీ రాధిక, ఇంద్రాణి పాలపర్తి, కే.గీత, మూలా సుబ్రహ్మణ్యం గార్ల కవితలు: “ఏటి ఒడ్డున“, “గుప్పెడంత మనసు“, “తారామతి బిరాదరి“, “చంద్రోదయం“, “జ్ఞాపకాల ఎదురుచూపు“.

ఈ సంచిక నిర్మాణంలో సహాయపడిన వారందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఈ సంచికపై కూడా మీ నిర్మాణాత్మకమైన అభిప్రాయాలు తెలియచేస్తారని ఆశిస్తున్నాము.

— సంపాదకులు