పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16479

  1. ఆఖరి మనిషి గురించి satya అభిప్రాయం:

    07/09/2012 3:41 am

    నటులేకాదు, ప్రేక్షకులు కూడా
    ఒకరొకరుగా నిష్క్రమిస్తారు.
    బాగుంది

  2. యజ్ఞం కథ: మరో పరిశీలన గురించి aditya reddi అభిప్రాయం:

    07/08/2012 8:53 pm

    3) సుందరం పాలెం గ్రామ రైతుల స్థితిగతులను చెప్పేటప్పుడు విరుద్ధభావాలు కనిపిస్తాయి రచయిత చెప్పినదానికి మరొకచోట పాత్ర చెప్పినదానికి చాలా వ్యత్యాసాలుంటాయి. ఎక్కడా నిర్దిష్టత ఉండదు. (అవన్ని పేరాలు పేరాలుగా ఉటంకిచాల్సి ఉంటుంది. నాకు టైపింగ్ సరిగా రాని కారణం చేత రాయటం లేదు.) అయితే రైతుల నష్టాలు కొంతవరకు ఎలా తీరాయంటే ఇళ్ళ జాగాలకి కల్లాలు అమ్మడం ద్వారా అంటాడు అప్పలరాముడు. ఇది ఎంతవరకు వాస్తవమో ఆలొచిద్దాం. కధాకాలం 1963 లేదా 1966. ఆనాటికి సుందరపాలెం అనే 400 ఇళ్ళు గల గ్రామంలో ఇళ్ళ జాగాల వ్యాపారం జరుగుతుందా. అదీ కేవలం ఒక హైస్కూలు వచ్చిన కారణంగా? 1982, 84 ప్రాంతానికి విశాఖపట్నం లోనే రియల్ ఎస్టేటు వ్యాపారం అంతగా లేదు. నేటి గురుద్వార జంక్షన్లో గల బాలయ్య శాస్త్రి లే అవుట్ లో గజం 4 రూ అంటే ఆలోచించవల్సి వచ్చేది అని స్థానికులు చెప్తారు.అలాంటిది ఎంత జాగా ను ఎంతమందికి ఏ రేటు చొప్పున అమ్మితే రైతుల అప్పులు తీరిపొయాయో అర్ధం కాదు.

    4) రచయితలు, ముఖ్యంగా ప్రగతి శీల భావజాలం గల రచయితలు, ఆశా వాద దృక్పధం కలిగి ఉంటారు. తమ రచనలలొ దానినే ప్రతి ఫలింప జేస్తారు. అలా చెయాలి కూడా. కాని ఈ కధలో ఎక్కడా ఆశ అనేది మచ్చుకి కనబడదు.

    శ్రీరాములు నాయుడు హైస్కూల్ కావాలంటాడు. దానికి ఎర్రయ్య అనే పాత్ర చదువుకునే కూలీలు కావాలి గదా అంటాడు. చదువుల పట్ల నిరసన వినిపిస్తాడు. రచయిత ఆపాత్ర ద్వారా తప్ప ఖండించడు. మరో చోట రోడ్డు వస్తుందంటే పాతిక మంది బళ్ళ వాళ్ళ వ్యాపారాలు పోతాయంటాడు. కరెంటు వస్తుందంటే దంపుళ్ళ కూలీలు పొతాయంటాడు. మరొక పాత్ర గాని రచయిత గాని ఖండించక పోవడం వలన కధలో అవే అభిప్రాయాలు పాఠకుడికి అందుతాయి గదా. ఇది పాక్షిక నష్టాలను చూపించి ప్రగతిని లేదా మార్పుని అడ్డుకోవడమేగదా. (యింకావుంది)

  3. బింబం గురించి ravikiran timmireddy అభిప్రాయం:

    07/08/2012 4:33 pm

    అద్భుతవైన కథ. అనువాదం కూడా చాలా బాగుంది. కానీ మీనాక్షి ప్రొద్దున్నే ఆ ఉత్తరాన్ని మెయిల్ చేస్తుందా? సర్దుకపోవటవే బతుకైన మనిషికి, బతుకుకి తిరగబడటం చాతనవుతుందా?
    -కిరణ్

  4. ఆఖరి మనిషి గురించి Dadala Venkateswara Rao అభిప్రాయం:

    07/08/2012 1:53 pm

    మనిషి బ్రతికే ఉన్నాడు
    ఆఖరి వరకు బ్రతికే ఉంటాడు
    మరణం తప్పని మానవుడు
    తన ప్రాణాలను మాత్రమే విడుస్తాడు
    జీవితం అనే సంసారవృక్షం సాయంతో
    తన రూపాన్ని ఈ భూమిపై
    విడచి వెళుతున్నాడు
    నిరంతర మనుగడ
    సాగిస్తున్నాడు

  5. రెండు కవితలు – ఇద్దరు కవులు గురించి Dadala Venkateswara Rao అభిప్రాయం:

    07/08/2012 1:34 pm

    రెండు కవితలు వ్రాసి వాటిని
    రెండు చెవుల్లో గింగిరాలు తిరుగుతూ,
    రెండు కళ్ళలో నిలిచిపొయెలా చెయనా .
    గిరిధరుణ్ణి తేనీటి వీందుకి పిలిచి
    తేనీటి దాతా సుఖీభవ! అనిపించుకొనా

  6. ఒక జనవరి శుక్రవారం, లోకస్ట్‌ వాక్‌ కార్నర్లో గురించి Hymavathy.Aduri అభిప్రాయం:

    07/08/2012 12:46 am

    ఈమాట బావుంది. ఎంతోమంది తెలుగు వారికి ఇలా శేవలందించడం సామాన్య మైన విషయం కాదు. అయ్యా! నేనూ చిన్నపిల్లల కోసం నీతికధలు వ్రాస్తుంటాను. ఈ మాటలో ప్రచురించే అవకాశం ఉందా? తెలుపగలరు. తెలుగు మరువకుండా టచ్ లో ఉంచుకునేందుకై కర్ణాటకలో ఉంటున్న నా ప్రయత్నం, ఆంధ్రలో టీచర్ గా 40 సం. పని చేసి విశ్రాతి పొందుచూ ఇలా ఆనుభవంతో చిన్న కధలు వ్రాయటం మొదలెట్టాను. మీ జవాబు కోసం ఎదురుచూడవచా?
    ఈమాట లోని అంశాలకు ప్రాభావితమైన చదువరి.
    ఆదూరి.హైమవతి.

    [రచనలు ఎలా పంపాలో రచయితలకు సూచనలులో చూడండి. దయచేసి అభిప్రాయం పంపే ముందు అచ్చు తప్పులు సరిచేసుకోమని సవినయంగా మనవి చేస్కుంటున్నాం. – సం.]

  7. ఆఖరి మనిషి గురించి ravikiran timmireddy అభిప్రాయం:

    07/07/2012 11:21 pm

    “క్రమక్రమంగా
    మరణానికి అలవాటుపడటమే
    జీవితంగా మారిపోతుంది.”

    నిజవేనండి, ఎప్పుడూ చూడని ఈ చావు హఠాత్తుగా అనుభవం లోకి వస్తుంది. మరలా, మరలా నేనున్నానని చెబుతూనే ఉంటుంది. కానీ రవిశంకర్ గారు ఈ రంగస్థలం ఎప్పటికీ ఖాళీ కాదు, ప్రేక్షకులు మారుతారు, మారిన వారే మన వారవుతారు. బతుకులో దుఖం, సుఖం కూడా అదే కదండీ.

    -కిరణ్

  8. స్మృతి గురించి ravikiran timmireddy అభిప్రాయం:

    07/07/2012 10:57 pm

    ఒక్క క్షణపు వేదన, ఒక్క క్షణపు నిశ్శబ్ధం, ఒక కన్నీటి బొట్టు
    కలసిపోయిన ఆ నిస్తేజం, ఆ స్మశాన వైరాగ్యం
    అనతం లో కలసిపోతుంది, ఆ జ్ఞాపకం మాత్రం
    మనసు పొరల్లో మిగిలిపోతుంది
    ఎప్పుడో ఒక సారి కన్నెరై కారిపోతుంది
    అప్పుడప్పుడూ మన గుండె చప్పుడై
    ఎప్పుడన్నా మనకు వినిపిస్తూనే ఉంటుంది.
    కానీ వైదేహి గారు, ఈ భయంకరవైన రొటీన్ మాత్రం,
    చావు కూడా బ్రద్దలు కొట్టలేని ఈ రొటీన్ మాత్రం
    మరు నిముషం లోనే అనుభవానికి వస్తుంది
    ఎప్పటిలాగానే పొగలు కక్కే ఆ తేనీటి వాసన
    ఎవ్రి మాణింగ్ కిచనంతా పరచుకుంటుంది.
    -కిరణ్

  9. యజ్ఞం కథ: మరో పరిశీలన గురించి aditya reddi అభిప్రాయం:

    07/07/2012 8:51 pm

    యజ్ఞం కధ తిరోగమన కధ ఎందుకయ్యిందంటే:

    1) ఏ రచన కైనా వాస్తవమే పునాది. వాస్తవాలను విస్మరించి లేదా వాస్తవాలకు దూరంగా జరిగి చేసే రచన ఏదైనా అంతిమంగా సమాజానికి నష్టమే చేస్తుంది.యజ్ఞం కధలో దళితుడైన అప్పల రాముడి తండ్రికి 12 ఎకరాల భూమి ఉంటుంది.ఎప్పుడూ. కధా కాలానికి యాభై ఏళ్ళ క్రితమే, అంటే నేటికి వందేళ్ళ క్రితమే నన్న మాట. ఇది ఎంతటి సత్య దూరమయిన విషయమో ఏ దళితున్ని అడిగినా తెలుస్తుంది. లేదా నాటి ప్రభుత్వ గణాంకాలు చూసినా తెలిసి పోతుంది .ఆ రోజుల్లో దళిత స్త్రీలు వీసెల కొద్ది వెండి మోసేవారట! ఎంత అవాస్తవమో! తిండికి లేక ప్రతి దలితుడు పాలేరుగా ఉండే స్థితి. చిన్నపిల్లలని సైతం చిన్నపాలేరులుగా పెట్టి కుటుంబం మొత్తంగా ఆ రైతు పొలంలో కల్లములో పనిచేస్తూ పెట్టింది తిని అర్దాకలితొ కాలం గడిపే వారు. ఈ స్థితి 1975, 76 ల వరకు మన కళ్ళ ముందున్నది.

    2)ఆదిమ కాలం నుండి మానవుడు అడవి నుండి గ్రామానికి గ్రామం నుండి పట్టణానికి ప్రయాణిస్తూనే ఉన్నాడు. ఈరొజుల్లో నగరాలనుంచి మహానగరాలకు, విదేశాలకు వెళ్తున్నాడు. ఎందుకని? ఉన్న స్థితి నుంచి మెరుగైన స్థితితి ని పొందాలనే కదా. కధలో సీతారాముడు అలాగే పట్నం వెల్తాడు. అక్కడ బస్తాలు మోస్తాడు, రిక్షా లాగుతాడు. అయితే “వాడి పెళ్ళాం మరొకడితో లేచిపొయింద”ట . దానిని వెటకారంగా, వేళాకోళంగా చెప్తాడు రచయిత ఒక పాత్ర ద్వారా .(అక్కడికి పల్లెల్లొ ఎవడి పెళ్ళామూ మరెవడితొ లేచిపోదని గ్యారంటి నేమో మరి.) ఇక్కడ నూతన వృత్తులను వెతుక్కొవడాన్ని అంగీకరించలేక మళ్ళీ సీతారాముడ్ని వెనక్కి రప్పిస్తాడు. నిజానికి ఒకసారి పట్నం వెళ్ళిన వ్యక్తి అక్కడే క్రిందా మీదా పడతాడు గాని వెనక్కు రావటానికి యిష్టపడడు. పెళ్ళాము లేచిపోయినవాడు అసలే రాడు సి గ్గుపడి. కాని కధలో దానికి భిన్నంగా ఉంటుంది. బహుశా దళితునికి మానాభిమానాలు ఉండవేమో!? (యింకా ఉంది. దయచేసి రేపు యిక్కడే చూడగలరు)

    [ఆదిత్య గారూ – దయచేసి మీ అభిప్రాయాలలో అచ్చుతప్పులు సరిదిద్దుకున్న తర్వాతనే పోస్ట్ చెయ్యగలరు. ప్రతీ వాక్యాన్ని ఇంచుమించు తిరగరాసి ప్రచురించడం అన్నిసార్లూ మాకు కుదరని పని. – సం.]

  10. కాల్వీనో కథల నుంచి – 4 గురించి తఃతః అభిప్రాయం:

    07/07/2012 1:57 pm

    Madhav;

    The first one is an impossibly great story. You did a good job in bringing it close to us. [You did not mention its date]. The second one brings to my my mind lines from Sahir”s ‘khuda -e – bartar’.

    (Year of the story added – Ed.)