నవలకి ముడిసరుకు జీవితమే. కానీ ఏ వ్యక్తి జీవితమూ యథాతథంగా నవలకి వస్తువుగా పనికి రాదనే భ్రమలో ఉన్నవారికి ఇది కనువిప్పులాంటి వ్యాసం. నిజానికి నిజాయితీగా ప్రయత్నించాలే గానీ ప్రతి మనిషి జీవితంలోని ప్రతి చిన్న సంఘటనా సందర్భమూ సన్నివేశమూ కూడా ఎన్నో ముఖాలని కలిగి ఉంటుంది. అందులో ఎదుటివారికి కనపడేది ఒకటి, తనకి మాత్రమే తెలిసినది ఒకటి, తనకి తెలియకుండానే తనమీద తన చుట్టూ ఉన్న సమాజం ద్వారా ప్రభావితమయ్యేది ఒకటి, తనకి తెలియకుండానే అసంకల్పిత స్పందనలకి సంబంధించినది ఇంకొకటి, తన పూర్వీకులద్వారా తనకి సంక్రమించిన లక్షణాలకి సంబంధించినది వేరొకటీ ఇలా బహుముఖాలుగా ఉంటుంది.
మళ్ళీ అందులోకూడా ఎదుటివారికి కనపడే ముఖంలో చాలా ముఖాలుంటాయి. అవన్నీ చూసేవాళ్ళ దృష్టినిబట్టి ఉంటాయి. ఒకరికి మంచి అనిపించిందే మరొకరికి చెడుగానూ ఇంకొకరికి లౌక్యంగానూ మరొకరికి మోసం గానూ దానివల్ల లాభం పొందినవారికి సహృదయతగానూ కనిపిస్తుంది. వాటిలో ఏది నిజం? ఏది ఆ వ్యక్తి అసలైన ముఖాన్ని పట్టి ఇవ్వగలదు? ఆ పట్టు దొరికిన ముఖం అలాగే ఉందా లేక కాలాన్నీ పరిస్థితులనీ అనుసరించి మారిపోయిందా? రాయడం అంటూ మొదలుపెట్టాలేగానీ అన్నీ ప్రశ్నలే. ఇలాంటి ప్రశ్నలన్నిటికీ జవాబులు వెతుక్కుంటూ తిరిగేవారికి ఈ వ్యాసం ఒక గొప్ప మజిలీ. ఇక్కడ ఆగితే చాలా ప్రశ్నలకి జవాబులు దొరుకుతాయనే నమ్మకం దొరికింది. మిగిలిన వ్యాసభాగం కోసం ఎదురు చూస్తున్నాను.
పప్పు నాగరాజుగారూ, మీ అనువాదం చాలా బాగుంది. ముఖ్యంగా ఎక్కడా అనువాదం అని అనిపించలేదు. కృతకమైన పదజాలం లేదు. చాలా సహజంగా సాగింది. చాలా చక్కటి వ్యాసాన్ని అందించినందుకు కృతజ్ఞతలు.
హెమింగ్వె తన నవల “A farewell to Arms” ముగింపుని బోలెడన్ని సార్లు తిరగ రాసాట్ట 🙂 Fitzgerald మరికొన్ని రకాల ముగింపులని హెమింగ్వెకి సూచన చేసాట్ట. తెలుగులో మరి అలాంటి సంప్రదాయం లేదాయె 🙂
పోనీ మొదలెడితే సరి. యజ్ఞం కధని బూర్జువా పధ్ధతి లో ముగిస్తే ఎలా ఉంటుందీ?? కమ్యూనిస్టుల పధ్ధతి లో ముగిస్తే ఎలా ఉంటుందీ? గాంధేయ విధానం లో అయితే ఎలా ఉంటుందీ? దళితుల కోణం లోంచి అయితే ఎలా ఉంటుందీ?? ఇలా ఎవరికి తోచిన రీతి లో వాళ్ళు ఊహించి రాసుకోడమే 🙂
ఒక కధకి ఒకే ముగింపు ఉండాలని సూత్రం ఏమీ లేదు కదా? కాక పోతే నాకు ఓ చిన్న సందేహం , ఏమంటే .. వాస్తవాలనే రాస్తే అది వ్యాసం కదా అవాలీ? కల్పన అంటే దానికి వాస్తవాలతో సంబంధం ఎందుకూ? కధ అంటే కల్పన కదా? కధలో చెప్పదలుచుకున్న విషయం కోసం రచయిత తన కధ ని మలుచుకోడా?? అతడు తన శైలి ని నిర్ణయించుకోడా? ఒకే తరహా మూస కధ మాత్రమే కావాలా దోపిడీ మీద?
ఆదిత్య రెడ్డి గారి భావాలలో మరీ ఎక్కువ “ఎర్రతనం” తొణికిసలాడుతోంది. కధలు చదివిన అనుభవం తక్కువగానూ, అభిప్రాయాలు మాత్రం బోలెడూనూ ఉన్నట్టుగా అనిపిస్తోంది ఆయన వ్యాఖ్యానంలో. అయితే ఇన్నేళ్ళు తెలుగు పాఠకులందరూ ఉత్త వెర్రి వాళ్ళే అయిపోయారన్న మాట ఈ వ్యాఖ్యాత చెప్పేదాకా “యజ్ఞం” కధ లోని ఇలాంటి అసలు కిటుకులని తెలుసుకోలేక.
తెలుగు లో ఇటుపైన రచనలు చేసేవాళ్ళు “మతాతీతం”గానూ, “వర్గాతీతం” గానూ, కుల ప్రస్తావనలు లేకుండానూ, జెండర్ జోలికి వెళ్ళకుండానూ, వాస్తవాలు మాత్రమే ప్రతిఫలించేలాగా రచనలు చేయవలసి ఉంటుంది. బాగానే ఉంది. అయితే వీటికి పాఠకులు ఉంటారా?? వాళ్ళూ ఎవరూ అన్నది మరో చర్చ.
బావుంది, బావుందోచ్! నారాయణస్వామి గారూ నాలాంటి ఈ-బుక్ చదవటం ఇష్టంలేనివాళ్లచేత కూడా చదివించగలిగేలా ఉంది మీ కథానిక….ఈ శైలి కొత్తగానూ చదివించేదిగాను ఉంది…కంగ్రాట్స్
5) కధ ముగింపు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సీతారాముడు లోకం తెలిసిన మనిషి. తన తండ్రి చేసిన పని తనకు నచ్చక పోతే, తండ్రిని, గ్రామపెద్దలని ఎదిరించలేని నిస్సహాయతకు లోనయితే, తన బిడ్డని తీసుకుని ఆ గ్రామం విడిచి పెట్టి పోతాడు. లేదు, ఆవేశానికి లోనయితే తనను తాను శిక్షించుకుంటాడు. అంతేగాని తన కొడుకుని ఏ తండ్రి చంపుకోడు. అందులోనా సీతారాముడు అస్సలు అలా చేయలేడు. తన భార్య మరొకరితో పోయినా తన బిడ్డ కోసమే మరో పెళ్ళి కూడా చేసుకోలేదు (చేసుకున్నట్టు ఎక్కడా లేదు.) అయినప్పటికీ, ఒక వేళ ఆవేశముతో కూడిన మూర్ఖత్వముతో చేసాడనే అనుకుందాం. కాసేపటి తరువాతనన్నా వాస్తవంలోకి వచ్చి భయపడతాడు. తాను చేసిన పనికి నిష్కృతి లేదని మనోవేదనకు గురి అవుతాడు.
కాని కధలో చాలా భిన్నంగా ఉంటుంది. – ఒక మాఫియా ముఠా వ్యక్తిలాగా, నిరంతరం హత్యలు చేసి కరుడు గట్టిన వ్యక్తిలాగ, తాను చంపిన వ్యక్తితో ఏమాత్రము సంబంధం లేని వ్యక్తి లాగ, చంపిన శవాన్ని బస్తాకెత్తి దానిని పంచాయితీ వరకు మోసుకు వచ్చి నిబ్బరంగా మాత్లాడుతాడు.
6)సీతారాముడు మూట భుజాన్న తెస్తుంటే జనమంతా అటు వైపు చూస్తారు ఆసక్తిగా. అప్పుడే చేసిన హత్య గదా శవం నుంచి రక్తం కారాలి గదా. అతని చేతులు, బట్టలు రక్తంతో కనపడాలి గదా, కాని అవేమి అక్కడ కనపడవు. (తెలుగు సినిమా హీరో లాగ చేతికి మట్టి అంటకుండా ఎంత చక్కగా చేస్తాడో హత్య!)
7)కధకు యజ్ఞం అని పేరు. ఆకధ ఒక బలితో పూర్తవుతుంది, అని ఆలోచించినపుడు హిందూ మత భావనలు పాఠకుడి మనసులోనికి రావా?
యిలా చెప్పుకుంటూ పొతే చాలా ఉన్నాయి. కానీ యిక్కడికి ఆపేస్తున్నాను.
ఉరుము ఉరిమి… గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
07/11/2012 8:10 pm
భాస్కర్ గారూ!
మీ కాంప్లిమెంట్స్ కి నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ..
ధన్యవాదాలతో –
ఆర్.దమయంతి.
జీవిత నవల – 1 గురించి రాణి. అభిప్రాయం:
07/11/2012 6:49 am
నవలకి ముడిసరుకు జీవితమే. కానీ ఏ వ్యక్తి జీవితమూ యథాతథంగా నవలకి వస్తువుగా పనికి రాదనే భ్రమలో ఉన్నవారికి ఇది కనువిప్పులాంటి వ్యాసం. నిజానికి నిజాయితీగా ప్రయత్నించాలే గానీ ప్రతి మనిషి జీవితంలోని ప్రతి చిన్న సంఘటనా సందర్భమూ సన్నివేశమూ కూడా ఎన్నో ముఖాలని కలిగి ఉంటుంది. అందులో ఎదుటివారికి కనపడేది ఒకటి, తనకి మాత్రమే తెలిసినది ఒకటి, తనకి తెలియకుండానే తనమీద తన చుట్టూ ఉన్న సమాజం ద్వారా ప్రభావితమయ్యేది ఒకటి, తనకి తెలియకుండానే అసంకల్పిత స్పందనలకి సంబంధించినది ఇంకొకటి, తన పూర్వీకులద్వారా తనకి సంక్రమించిన లక్షణాలకి సంబంధించినది వేరొకటీ ఇలా బహుముఖాలుగా ఉంటుంది.
మళ్ళీ అందులోకూడా ఎదుటివారికి కనపడే ముఖంలో చాలా ముఖాలుంటాయి. అవన్నీ చూసేవాళ్ళ దృష్టినిబట్టి ఉంటాయి. ఒకరికి మంచి అనిపించిందే మరొకరికి చెడుగానూ ఇంకొకరికి లౌక్యంగానూ మరొకరికి మోసం గానూ దానివల్ల లాభం పొందినవారికి సహృదయతగానూ కనిపిస్తుంది. వాటిలో ఏది నిజం? ఏది ఆ వ్యక్తి అసలైన ముఖాన్ని పట్టి ఇవ్వగలదు? ఆ పట్టు దొరికిన ముఖం అలాగే ఉందా లేక కాలాన్నీ పరిస్థితులనీ అనుసరించి మారిపోయిందా? రాయడం అంటూ మొదలుపెట్టాలేగానీ అన్నీ ప్రశ్నలే. ఇలాంటి ప్రశ్నలన్నిటికీ జవాబులు వెతుక్కుంటూ తిరిగేవారికి ఈ వ్యాసం ఒక గొప్ప మజిలీ. ఇక్కడ ఆగితే చాలా ప్రశ్నలకి జవాబులు దొరుకుతాయనే నమ్మకం దొరికింది. మిగిలిన వ్యాసభాగం కోసం ఎదురు చూస్తున్నాను.
పప్పు నాగరాజుగారూ, మీ అనువాదం చాలా బాగుంది. ముఖ్యంగా ఎక్కడా అనువాదం అని అనిపించలేదు. కృతకమైన పదజాలం లేదు. చాలా సహజంగా సాగింది. చాలా చక్కటి వ్యాసాన్ని అందించినందుకు కృతజ్ఞతలు.
రాణి.
మత్తకోకిల కథ గురించి kasi viswanadham y అభిప్రాయం:
07/11/2012 6:11 am
మీ మత్తకోకిల వ్యాసం చదివి చాల అనందించిన వారిలో నేను ఒకడిని.
యజ్ఞం కథ: మరో పరిశీలన గురించి mkrao అభిప్రాయం:
07/11/2012 4:55 am
నచ్చొచ్చు నచ్చకపోవచ్చు – కానీ ఇంత చర్చకి కారణమైన ఆ కథ తన పరమార్ధం సాధించినట్టే.
ఉరుము ఉరిమి… గురించి DVR BHASKAR అభిప్రాయం:
07/11/2012 4:15 am
మీ కథ చాలా బాగుంది. శైలి సహజ సుందరంగా ఉంది. ఇంత చక్కటి కథను అందించినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు.
యజ్ఞం కథ: మరో పరిశీలన గురించి yasasvi అభిప్రాయం:
07/10/2012 2:52 pm
హెమింగ్వె తన నవల “A farewell to Arms” ముగింపుని బోలెడన్ని సార్లు తిరగ రాసాట్ట 🙂 Fitzgerald మరికొన్ని రకాల ముగింపులని హెమింగ్వెకి సూచన చేసాట్ట. తెలుగులో మరి అలాంటి సంప్రదాయం లేదాయె 🙂
పోనీ మొదలెడితే సరి. యజ్ఞం కధని బూర్జువా పధ్ధతి లో ముగిస్తే ఎలా ఉంటుందీ?? కమ్యూనిస్టుల పధ్ధతి లో ముగిస్తే ఎలా ఉంటుందీ? గాంధేయ విధానం లో అయితే ఎలా ఉంటుందీ? దళితుల కోణం లోంచి అయితే ఎలా ఉంటుందీ?? ఇలా ఎవరికి తోచిన రీతి లో వాళ్ళు ఊహించి రాసుకోడమే 🙂
ఒక కధకి ఒకే ముగింపు ఉండాలని సూత్రం ఏమీ లేదు కదా? కాక పోతే నాకు ఓ చిన్న సందేహం , ఏమంటే .. వాస్తవాలనే రాస్తే అది వ్యాసం కదా అవాలీ? కల్పన అంటే దానికి వాస్తవాలతో సంబంధం ఎందుకూ? కధ అంటే కల్పన కదా? కధలో చెప్పదలుచుకున్న విషయం కోసం రచయిత తన కధ ని మలుచుకోడా?? అతడు తన శైలి ని నిర్ణయించుకోడా? ఒకే తరహా మూస కధ మాత్రమే కావాలా దోపిడీ మీద?
ఆదిత్య రెడ్డి గారి భావాలలో మరీ ఎక్కువ “ఎర్రతనం” తొణికిసలాడుతోంది. కధలు చదివిన అనుభవం తక్కువగానూ, అభిప్రాయాలు మాత్రం బోలెడూనూ ఉన్నట్టుగా అనిపిస్తోంది ఆయన వ్యాఖ్యానంలో. అయితే ఇన్నేళ్ళు తెలుగు పాఠకులందరూ ఉత్త వెర్రి వాళ్ళే అయిపోయారన్న మాట ఈ వ్యాఖ్యాత చెప్పేదాకా “యజ్ఞం” కధ లోని ఇలాంటి అసలు కిటుకులని తెలుసుకోలేక.
తెలుగు లో ఇటుపైన రచనలు చేసేవాళ్ళు “మతాతీతం”గానూ, “వర్గాతీతం” గానూ, కుల ప్రస్తావనలు లేకుండానూ, జెండర్ జోలికి వెళ్ళకుండానూ, వాస్తవాలు మాత్రమే ప్రతిఫలించేలాగా రచనలు చేయవలసి ఉంటుంది. బాగానే ఉంది. అయితే వీటికి పాఠకులు ఉంటారా?? వాళ్ళూ ఎవరూ అన్నది మరో చర్చ.
సో, ఈమాట వారికి ఇహ బోలెడంత మేటర్ 🙂
యశస్వి
ఒక జనవరి శుక్రవారం, లోకస్ట్ వాక్ కార్నర్లో గురించి వాసుదేవ్ అభిప్రాయం:
07/09/2012 9:15 pm
బావుంది, బావుందోచ్! నారాయణస్వామి గారూ నాలాంటి ఈ-బుక్ చదవటం ఇష్టంలేనివాళ్లచేత కూడా చదివించగలిగేలా ఉంది మీ కథానిక….ఈ శైలి కొత్తగానూ చదివించేదిగాను ఉంది…కంగ్రాట్స్
యజ్ఞం కథ: మరో పరిశీలన గురించి aaditya reddi అభిప్రాయం:
07/09/2012 8:15 pm
5) కధ ముగింపు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సీతారాముడు లోకం తెలిసిన మనిషి. తన తండ్రి చేసిన పని తనకు నచ్చక పోతే, తండ్రిని, గ్రామపెద్దలని ఎదిరించలేని నిస్సహాయతకు లోనయితే, తన బిడ్డని తీసుకుని ఆ గ్రామం విడిచి పెట్టి పోతాడు. లేదు, ఆవేశానికి లోనయితే తనను తాను శిక్షించుకుంటాడు. అంతేగాని తన కొడుకుని ఏ తండ్రి చంపుకోడు. అందులోనా సీతారాముడు అస్సలు అలా చేయలేడు. తన భార్య మరొకరితో పోయినా తన బిడ్డ కోసమే మరో పెళ్ళి కూడా చేసుకోలేదు (చేసుకున్నట్టు ఎక్కడా లేదు.) అయినప్పటికీ, ఒక వేళ ఆవేశముతో కూడిన మూర్ఖత్వముతో చేసాడనే అనుకుందాం. కాసేపటి తరువాతనన్నా వాస్తవంలోకి వచ్చి భయపడతాడు. తాను చేసిన పనికి నిష్కృతి లేదని మనోవేదనకు గురి అవుతాడు.
కాని కధలో చాలా భిన్నంగా ఉంటుంది. – ఒక మాఫియా ముఠా వ్యక్తిలాగా, నిరంతరం హత్యలు చేసి కరుడు గట్టిన వ్యక్తిలాగ, తాను చంపిన వ్యక్తితో ఏమాత్రము సంబంధం లేని వ్యక్తి లాగ, చంపిన శవాన్ని బస్తాకెత్తి దానిని పంచాయితీ వరకు మోసుకు వచ్చి నిబ్బరంగా మాత్లాడుతాడు.
6)సీతారాముడు మూట భుజాన్న తెస్తుంటే జనమంతా అటు వైపు చూస్తారు ఆసక్తిగా. అప్పుడే చేసిన హత్య గదా శవం నుంచి రక్తం కారాలి గదా. అతని చేతులు, బట్టలు రక్తంతో కనపడాలి గదా, కాని అవేమి అక్కడ కనపడవు. (తెలుగు సినిమా హీరో లాగ చేతికి మట్టి అంటకుండా ఎంత చక్కగా చేస్తాడో హత్య!)
7)కధకు యజ్ఞం అని పేరు. ఆకధ ఒక బలితో పూర్తవుతుంది, అని ఆలోచించినపుడు హిందూ మత భావనలు పాఠకుడి మనసులోనికి రావా?
యిలా చెప్పుకుంటూ పొతే చాలా ఉన్నాయి. కానీ యిక్కడికి ఆపేస్తున్నాను.
ఉరుము ఉరిమి… గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
07/09/2012 4:16 pm
హేమలత గారూ.. చాలా చాలా థాంక్స్..
శుభాభినందనలతో-
ఆర్.దమయంతి.
ఉరుము ఉరిమి… గురించి hemalatha putla అభిప్రాయం:
07/09/2012 7:13 am
🙂 హ హ హ… చాలా సహజంగా వుంది.