పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16479

  1. తెలుగు వ్యాకరణాల పరిచయం గురించి గంటి లక్ష్మీ నరసింహ మూర్తి అభిప్రాయం:

    07/13/2012 11:59 am

    సురేశ్ గారూ! తెలుగులో వ్యాకరణగ్రంధాలను చాలా చక్కగా పరిచయంచేశారు. ఈ విధంగా పరిచయచేయడం నిడదవోలు వెంకట రావుగారి తర్వాత మీరేనేమో. ధన్యవాదాలు. కవిజనాశ్రయం గురించి యొక విషయం. కవిజనాశ్రయంలో మూడధికారముల వఱకు బ్రౌణ్ దొరగారు భాషాంతరీకరణం చేసారనియు, 1917కి ముందే వారి యెద్దనున్న ప్రతిలో కవిజనాశ్రయము మల్లియరేచన కృతమని స్పష్టముగ నున్నదని కీ.శే.వావిళ్ళ వెంకటేశ్వరులుగారు 1950లో వ్రాసిన తమ విజ్ఞప్తిని, 1951 శివరాత్రి నాడు కీ.శే.నిడదవోలు వెంకటరావుగారు వ్రాసిన సుదీర్ఘమైన “తెలుగుభాషలో చంధో లక్షణగ్రంధములు” అనే శీర్షికతో వ్రాసిన పీఠికతో 1966లో ముద్రించేరు. ఆ పీఠికలోనే సుమారు 35 వ్యాకరణ లక్షణ గ్రంధములు పేర్కొని యింకను ఇటువంటివి తంజావూరు పుస్తక భాండాగరమున గలవని వ్రాసిరి. అంచేత ఇంకా ఎన్నోయుండి యుండవచ్చు. కొన్నిటినైనా పరిచయం జేసినందుకు మీకు నా ధన్యవాదములు.

    భవదీయుడు
    గంటి లక్ష్మీనరసింహమూర్తి
    (బెంగుళూరు)

  2. బింబం గురించి G.S.Lakshmi అభిప్రాయం:

    07/13/2012 10:47 am

    ఆలోచింపచేసే కథ. మహిళలు ఎదుర్కొంటున్న సమస్య విశ్లేషిస్తూనే పరిష్కారం కూడా చెప్పిన మూలకథ, అనువాదం కూడా చాలా బాగున్నాయి.

  3. ఆంధ్రభాషలో చరిత్రాత్మక నవల గురించి గంటి లక్ష్మీ నరసింహ మూర్తి అభిప్రాయం:

    07/13/2012 10:41 am

    ఆంధ్రభాషలో చారిత్రక నవల అనే వ్యాసం చాలాబాగుంది. ఎన్నో చారిత్రక నవలలు వాటిలో విశేషాలు చాలా చక్కగా వివరించేరు నోరి వారు. వారి నవల కవిసార్వభౌముడు నా దృష్టిని శ్రీనాధుని వైపు మళ్ళించింది. పై వ్యాసంలో తెలుగులో వచ్చిన అద్భుత నవల ‘సత్యప్రభ’ గురించి ప్రస్తావన లేకపోవడానికి కారణాలు మనకు తెలియవు. ఈ నవల రచయిత కావ్యకంఠ వాశిష్ఠ గణపతిమునిగారు. ఇది 1937 లోనే భారతి మాస పత్రికలో ధారావాహికంగా వచ్చింది. తదుపరి వారి కుమారుడు కీ.శే. వాశిష్ఠ మహదేవశాస్త్రిగారు 1964లో ఆంధ్రప్రభ వారపత్రికలో ధారావాహికంగా ప్రచురించేరు. పిదప ఈ నవలను విశాలాంధ్ర పుస్తక ప్రచురణలు, హైదరాబాదు వారు ముద్రించేరు. ఈ నవలను నా సోదరుడు కీ.శే. డా.గంటి శ్రీరామమమూర్తి, 1982లో ఆంగ్లము లోనికి అనువదించేరు. 2011 అక్టోబరు నుంచి “పొద్దు” అంతర్జాల పత్రికలో ధారావాహికంగా రావడం ముదావహం. కాని ఈ నవల తెలుగు, ఇంగ్లీషు కూడా ఇప్పుడు ఒకటి రెండు కాపీలు తప్ప ఆంధ్రదేశంలో ఎక్కడా దొరకక పోవడం ఆంధ్రుల దురదృష్టం.

    ఈ నవల ఇతి వృత్తం అలనాటి ఆంధ్రసామ్రాజ్యమునేలిన శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ. ఆంధ్ర, మగధ రాజ్యాల రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక పరిస్థితుల నాధారంగా జేసుకొని విస్తృతమైన తెరమీద ఎన్నో పాత్రలను సంధానం చేస్తూ ఆంధ్రమహావిష్ణువు యొక్క చారిత్రాత్మక ప్రణయగాధగా మలచిన శ్రీకావ్యకంఠ వాశిష్ఠ గణపతి మునిగారి స్వకపోల కల్పితం.చివరి కొంత భాగమ మాత్రం వారి కుమారుడు వాశిష్ఠ పూరించేరు.

    భవదీయుడు
    గంటి లక్ష్మీ నరసింహమూర్తి (బెంగుళూరు).

  4. ఉరుము ఉరిమి… గురించి pandu అభిప్రాయం:

    07/13/2012 8:50 am

    చాలా బాగుంది. ఇవి అన్ని ఇళ్ళలో రొజు మామూలే, పనిమనుషులతో.

  5. యజ్ఞం కథ: మరో పరిశీలన గురించి sathya అభిప్రాయం:

    07/13/2012 6:33 am

    యజ్ఞం పై కొన్ని అభిప్రాయాలు ఈ బ్లాగులో చూడండి.

  6. రచయితలకు సూచనలు గురించి Varanasi Nagalakshmi అభిప్రాయం:

    07/13/2012 2:32 am

    ఈ మాట వెబ్ పత్రిక చాలా బావుంది.పుస్తక సమీక్ష కోసం పుస్తకాలు పంపాలంటే ఎలాగో చెప్పగలరా?
    వారణాసి నాగలక్ష్మి

    [ఈమాట సంపాదకులు పుస్తకాల సమీక్ష చేయరండీ. సమీక్షలు వ్రాసి లేదా వ్రాయించి ప్రచురణకి పంపితే పరిశీలించగలం. – సం.]

  7. యజ్ఞం కథ: మరో పరిశీలన గురించి aaditya reddi అభిప్రాయం:

    07/12/2012 7:46 pm

    యశస్వి గారూ:మీరు యిలా అన్నారు “ఆదిత్య రెడ్డి గారి భావాలలో మరీ ఎక్కువ “ఎర్రతనం” తొణికిసలాడుతోంది” అని.కాని నిజానికి నేను చాలా నల్లవాణ్ణి, నా భావాలు కూడా నల్లవే. ఎర్రవాళ్ళు, ఎర్రచొక్కాల వాళ్ళు, ఈ కథని ఎర్రకథ అన్నారు,ఆకాశానికి ఎత్తేసారు, అదే నా బాధ. అలా కాకుండా ఈ కధని ఏ ఆర్ష ధర్మ ప్రచార సభ వారో ప్రచారం చేసుంటే అసలు గొడవే లేకపోను. నేను బాగా ఇష్టపడేవాణ్ణికూడా.

    ఎం కె రావు గారూ: ఈ కధని గురించి సి.యస్.రావు గారు పైన ఏమన్నారో చూడండి. “ఈ కథ ద్వారా రామారావుగారు ఇంతకూ చెప్పదలచుకున్నది ఏమిటంటే అదేదో చెప్పటం కష్టం. ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లేకుండా కథ సాగుతుంది.” అని. దాని పరమార్ధమేదో దానికే తెలియదు. యింక అదేం సాధిస్తుందంటారు.

  8. మత్తకోకిల కథ గురించి తఃతః అభిప్రాయం:

    07/12/2012 2:53 pm

    మోహన గారూ — చక్కని వ్యాసం మరొకటి చదివించారు. మత్త కోకిల మీద హైస్కూల్ రొజుల్లొ నాకెందుకొ చిన్న చూపుగా ఉండేది, చాలా తేలిగ్గా రాసెయ్యొచ్చని. తెలుగు భాష లాగా నెమలి ఆటా కొయిల పాటా రెండూ ఉన్న మత్త కొకిల అందాలు మీ వ్యాసం లొ వెల్లి విరిసాయి.

    ఒక మాట: మీ ఆఖరి పద్యం ఆఖరి చరణంలో “గిన్నెపాలిని పిల్లి తాగెను” లొ తెలుగు లొ ‘పాలను’ అంటాము గానీ ‘పాలిని’ అని అనమనుకుంటాను. అది అలా ఉంచితే అందులొ సింహము పాలి సొమ్ము గోమాయువు దోచుకు పొయిందన్న ధ్వని ఉన్నట్టనిపిస్తొంది. ఆ పాలను పిల్లిని తాగనీయకండి.

    నమస్కారాలతొ
    మిత్రుడు
    తఃతః

  9. స్మృతి గురించి Seetha Kumari అభిప్రాయం:

    07/12/2012 1:57 am

    కవితలో ఆర్ద్రత ఉంది.

  10. వేసవి గురించి Seetha Kumari అభిప్రాయం:

    07/12/2012 1:38 am

    మీలో ఎంత భావుకత్వమో సుమా! ఎంత బాగా వ్రాసారంటే ప్రతి చిన్న విషయాన్నీ కదలికనూ ఎంతో కవితాత్మంగా… Keep writing. All the best.