వంగూరి చిట్టెన్‌రాజు గారు పంపిన కామెంటు పై నా సవరణ అవసరం అనిపించి ఈ మూడు మాటలూ రాస్తున్నాను.
హ్యూస్టన్ సదస్సు అని అనడం నా పొరపాటే. క్షమార్హుణ్ణి.
అది వంగూరి ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన సాహితీ సదస్సు.
మేము ముగ్గురమూ, అంటే, బాపుగారు, పెమ్మరాజు గారు నేనూ అద్దె కారులో ప్రయాణం చేసాము. సదస్సు జరిగే స్థలానికి రావుగారు, తిరిగి వచ్చేటప్పుడు నేనూ, కారు తోలినట్టు నాకున్న జ్ఞాపకం. వంగూరి గారు మాతో వచ్చినట్టు నాకు గుర్తు లేదు.
ఆ సందర్భంలో బాపూ గారితో ఇంకా చాలా విషయాలు మాట్లాడుకున్నాం — ముఖ్యంగా నవతా కృష్ణంరాజు గురించి. వంగూరి ఫౌండేషన్ వారి సదస్సు ముగిసిన తరువాత ఆ అద్దె కారు తిరిగి ఇచ్చెయ్యడానికి మాకు నానా యాతనా అయ్యింది. అప్పుడూ నేనే డ్రైవర్ని.
“బాపు” గారి మీద వేలూరి గారి వ్యాసం ఇప్పుడే చూశాను. అందులో ఆయన యాదాలాపంగా ప్రస్తావించిన హ్యూస్టన్ సదస్సు పేరు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నిర్వహించిన ఐదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు. ఆయన పస్తావించిన కారు ప్రయాణం డ్రైవర్ పేరు వంగూరి చిట్టెన్ రాజు. అప్పుడు వారు ముగ్గురూ మా ఇంట్లోనే ఉన్నారు.
ఈ వ్యాసమూ, చేకూరి గారి మీద వ్యాసమూ చూడగానే అసలు ఆశ్చర్యం ఏమిటంటే అదే పెమ్మరాజు వేణు గోపాల రావు గారు మరణించిన అతి కొద్ది రోజులలో వెలువడబోతున్న “ఈ మాట” లో ఆయన మరణ వార్త ప్రకటించమని ప్రత్యేకంగా కోరినప్పుడు “We don’t publish obituaries in Emaata” అనే సమాధానం వచ్చింది.
మీ మంజులమైన హృద్ఘోష బాగున్నది. శ్రీ శ్రీ గురజాడలు వారి వారి దారిలో వారు ప్రయాణించారు. అయితే నేటి కవికపులు చాలమంది వారి అడుగులజాడలో నడుస్తున్నట్లు నటిస్తూ, పద్యాన్ని తిట్టి పోస్తూ, చేస్తున్న రచనలు మీరు చెప్పినట్లు వారి జీవితంలో వాస్తవాలు కాని వాస్తవాలే సుమా!
నాకు సర్దేశాయి తిరుమలరావు గారి “కన్యాశుల్కనాటకకళ” మరియు బోయిభీమన్న గారి “గుడిసెలు కాలిపోతున్నాయి” పుస్తకాలు కావాలి. అంతర్జాలంలో ఎక్కడ లభ్యమవుతాయో తెలుపగలరు.
బాపూ గురించి v r veluri అభిప్రాయం:
10/20/2014 4:27 pm

శలవు –వే వే
స్వర్గంలో స్ట్రిప్ టీజ్ గురించి arunkumar అభిప్రాయం:
10/20/2014 10:37 am
ఇది కాపీ కథ . ఇదే కథ ను నేనింతకు ముందు చదివాను అయితే అందులో ఇన్ని పాత్రలు లేవు
బాపూ గురించి వంగూరి చిట్టెన్ రాజు అభిప్రాయం:
10/20/2014 1:02 am
“బాపు” గారి మీద వేలూరి గారి వ్యాసం ఇప్పుడే చూశాను. అందులో ఆయన యాదాలాపంగా ప్రస్తావించిన హ్యూస్టన్ సదస్సు పేరు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నిర్వహించిన ఐదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు. ఆయన పస్తావించిన కారు ప్రయాణం డ్రైవర్ పేరు వంగూరి చిట్టెన్ రాజు. అప్పుడు వారు ముగ్గురూ మా ఇంట్లోనే ఉన్నారు.
ఈ వ్యాసమూ, చేకూరి గారి మీద వ్యాసమూ చూడగానే అసలు ఆశ్చర్యం ఏమిటంటే అదే పెమ్మరాజు వేణు గోపాల రావు గారు మరణించిన అతి కొద్ది రోజులలో వెలువడబోతున్న “ఈ మాట” లో ఆయన మరణ వార్త ప్రకటించమని ప్రత్యేకంగా కోరినప్పుడు “We don’t publish obituaries in Emaata” అనే సమాధానం వచ్చింది.
అదీ సంగతి.
మంజుఘోష గురించి arya marati balaji rao అభిప్రాయం:
10/17/2014 2:35 pm
సమవర్తి గారూ,
మీ మంజులమైన హృద్ఘోష బాగున్నది. శ్రీ శ్రీ గురజాడలు వారి వారి దారిలో వారు ప్రయాణించారు. అయితే నేటి కవికపులు చాలమంది వారి అడుగులజాడలో నడుస్తున్నట్లు నటిస్తూ, పద్యాన్ని తిట్టి పోస్తూ, చేస్తున్న రచనలు మీరు చెప్పినట్లు వారి జీవితంలో వాస్తవాలు కాని వాస్తవాలే సుమా!
చంద్రరేఖావిలాపము గురించి I A P S MURTHY అభిప్రాయం:
10/17/2014 10:08 am
ఈ గ్రంధం సభ్య సాహితీ సదనంలో ఉండదగ్గది కాదు. ఇటువంటివి “ఈమాట”కు మచ్చ తెచ్చేవి. తక్షణమే తొలగించ ప్రార్ధన.
కన్యాశుల్కం మళ్ళీ ఎందుకు చదవాలంటే … గురించి లావణ్య అభిప్రాయం:
10/15/2014 12:22 pm
ఈమాట వారికి నమస్కారం,
నాకు సర్దేశాయి తిరుమలరావు గారి “కన్యాశుల్కనాటకకళ” మరియు బోయిభీమన్న గారి “గుడిసెలు కాలిపోతున్నాయి” పుస్తకాలు కావాలి. అంతర్జాలంలో ఎక్కడ లభ్యమవుతాయో తెలుపగలరు.
ధన్యవాదములు
దేశభక్తి గేయాలు గురించి T V Rao అభిప్రాయం:
10/13/2014 3:35 am
శ్రీనివాస్ గారు,
ఎంత చక్కని గీతాలు ఇవి. నాలాంటి ఎంతోమందికి స్పూర్తి మీరూ మీ సేకరణ. ధన్యవాదాలు చెప్పడం చాలా తక్కువ మీ ఈ ప్రెసెంటేషన్-కు. ధన్యులం మేమంతా. నమస్కారం.
టి వీ రావు.
తెలుగు, ఇతర ద్రావిడ భాషలు: వాటి ప్రాచీనత గురించి Dr. Bhaskar Poldas అభిప్రాయం:
10/12/2014 6:59 am
ఎంతో చక్కని వ్యాసం! చాలా సరళంగా మరియు సుబోధకంగా వ్రాయబడింది. నా అభినందనలు!
మంచు గురించి Dr. CBS Venkataramana అభిప్రాయం:
10/11/2014 9:25 am
కధలో పరిసరాల వర్ణన, కధ శైలీ బావున్నాయి. కానీ, కధలో అర్ధం పర్ధం ఏమీ లేవు. మొదలు బాగా వుంది కానీ, కధలోని ప్లాటు చాలా బలహీనంగా వుంది.
ఓ వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్ గురించి chitti balasubrahmanyam అభిప్రాయం:
10/11/2014 8:29 am
చాలా మంచి వ్యాసం. నలభై యేళ్ళ తరువాత మళ్ళీ చదివాను ఇవ్వాళ. హిమజ్వాలలో కొత్త అర్థాలు వచ్చాయి… కృష్ణ నుంచి సారథి అయ్యాక.