పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. నటనకు గీటురాయి గురించి subhadra అభిప్రాయం:

    07/01/2018 9:34 am

    చాలా మంచి పరిచయం. ఇప్పటికిప్పుడు పుస్తకం కొని చదవాలనిపించేంత బాగా రాశారు. అభినందనలు అమరేంద్రగారూ.

  2. కాళీ పదములు గురించి Subrahmanyam అభిప్రాయం:

    07/01/2018 6:40 am

    అద్భుతం!!

  3. జూన్ 2018 గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    06/30/2018 10:52 pm

    మాకు రచన ముఖ్యం, రచయిత ఎవరు అన్నది అనవసరం.

    *నా రచనలూ అప్పుడప్పుడూ రిజెక్ట్ అవుతాయి. కానీ, దాని దారి దానిదే. దాని డిస్కషన్స్ దానివే. ఆ కారణంగా ఈ సాహితీ శిఖరాన్ని చిన్నది చేసి మాట్లాడాలనే అపరాధ భావం అస్సలు కలగదు మనసులో.

    నాకు తెలుసు. – ఈమాట ఇంత ఖరాఖండిగా, ముక్కుసూటిగా వ్యవహరించడం వల్ల ఎన్నో వ్యతిరేకతలని ఎదుర్కోవాల్సి వస్తుందని. అయినా, తలవంచని ఆ ధీరత్వం నాకు చాలా నచ్చుతుంది. హీరోఇజం అంటే అదే మరి.

    మరో గొప్ప లక్షణం ఏమిటంటే – గుంపుల గోల వుండదు. ప్రాణం హాయిగా వుంటుంది. 🙂

    ఇంకా, సొంత వారి కోసం డబ్బాలు మోగించడం, అయిన వారి కోసం కాలమ్స్ కేటాయించబడటం వంటి చౌకబారు చర్యలు వుండవు. నిన్నటి నీ అద్భుతమైన రచన రేపటి నీ రిజెక్టయ్యే రచనకు ఒక రెఫెరెన్స్ గా గానీ, రికమండేషన్ గా కానీ ఎలాటి పరిస్థితుల్లోనూ కన్సిడర్ చేయబడదు :-).

    అందుకేనండీ, ఈ మాటంటే నాకొక ప్రత్యేకమైన విశిష్ట గౌరవం.

    ప్రతి జర్నలిస్ట్ తమ తమ వృత్తిలో ఎంతో నిజాయితీగా వ్యవహరించేందుకు – ‘ఈమాట’ ఒక అత్యున్నతమైన ఆదర్శంగా నిలుస్తుంది అని చెప్పక తప్పదు.

    డియర్ ఈమాటా!

    రచనల ఎంపికలో ఈ మీ నిజాయితీ కొరవడనంత వరకు నేనెప్పటికీ మీ అభిమానినే.

    ఎందరో మహానుభావులు అందరకీ వందనములు.
    శుభాభినందనలతో..
    ఆర్.దమయంతి.

    (*డిస్‌క్లైమర్: ఈ మాగజైన్ నడుపుతున్న వారితో నాకు ఎలాటి పరిచయాలూ లేవు. అసలెవరన్నది కూడా చూడలేదు, చూడను. సొంత పబ్లిసిటీల కోసం ఈ స్పేస్ ని వినియోగించుకునే అవసరాలంతకన్నా లేవు. వున్నదల్లా ఒక్కటే. – ఇక్కడి విలువైన రచనలతో నాకు గల సాహిత్యానుబంధం మాత్రమే అని సవినయంగా తెలియచేసుకుంటున్నాను.)

  4. సిలువ గుడి గురించి amarendra dasari అభిప్రాయం:

    06/30/2018 7:04 pm

    అజిత్ కుమార్ గారి సూచన వివరాల్లోకి వెళ్లదగినది. థాంక్స్.

  5. రెండు ప్రశ్నలు గురించి మల్లేశ్వరరావు పొలిమేర అభిప్రాయం:

    06/30/2018 6:02 pm

    నమస్కారము మోహనరావు గారు, మీ అభిప్రాయాలు బాగున్నాయండి. భాషలో ధ్రుతములు, విభక్తుల శోభవల్ల వచ్చినవే పొల్లుల్ , ఎవరికో నచ్చలేవని వాటికి పరిష్కార మార్గాలు ఇవ్వాలంటారా?

  6. ఉదాహరణములు -2: శారదోదాహరణ తారావళి గురించి మల్లేశ్వరరావు పొలిమేర అభిప్రాయం:

    06/30/2018 5:00 pm

    చాలా బాగా వ్రాసారండి, పద్యములు చదువుటకు అర్థము చేసుకొనుటకు చాలా అనువుగా ఉన్నవి.

  7. బ్రెడ్‌ ప్యాకెట్‌ గురించి Vidya Jayaraj అభిప్రాయం:

    06/25/2018 1:41 pm

    Always a pleasure to read your articles..they are so simple and yet so strong and real.. keep up the good work Rajireddy garu…

  8. మైదానానికి చెలియలి కట్ట గురించి yaddanapudi kameswari అభిప్రాయం:

    06/24/2018 12:22 pm

    తన అభిప్రాయాన్ని చెప్పదలచుకున్న రచయిత మొత్తం రచనలో దాన్ని కళాత్మకంగా వెలువరిస్తాడు. మనకు అనుకూలంగా భావించే అభిప్రాయాలను చక్కగా వెలువరించినట్లుగాను మనకు అనుకూలంగా కనిపించని అభిప్రాయాలను రచయిత తాను కల్పించిన ప్రతిపాత్రలోను ప్రవేశించి చెప్పించినట్లుగా భావించటం న్యాయం కాదేమో

  9. ఉదాహరణములు – 1 గురించి టి శ్రీరంగ స్వామి అభిప్రాయం:

    06/21/2018 9:09 pm

    ఆర్యా, మీ వ్యాసం చాలా బాగుంది. మీ వ్యాసం ద్వారా నాకు 6 గురు ఉదాహరణ కర్తలు తెలిసారు. ధన్యవాదాలు.

    ఉదాహరణం గురించి నేను రాసిన వ్యాసం మే 2018 సంచికలో వెలువడినది. ఈ వ్యాసం + ఇతరవ్యాసాలు కలిపి పుస్తకంగా తెద్దామని ఆలోచన, మీ ఉదాహరణము గురించి అడిగినదందుకే.

    మీ చిరునామా తెలిపిన నా పుస్తకం పంపగలను.

    మీ,
    టి శ్రీరంగ స్వామి

  10. కులవ్యవస్థ – భావవ్యక్తీకరణ హక్కు: పెరుమాళ్ మురుగన్ ప్రసంగం గురించి lyla yerneni అభిప్రాయం:

    06/21/2018 1:54 pm

    “కుల వ్యవస్థ గురించిన జ్ఞానం లేకుండా ఆ వివక్షను ఛేదించే ప్రయత్నం లేకుండా, ఆ స్పృహ కూడా లేని మనోస్థితిలో జీవించే మనుషులున్న సమాజంలో భావవ్యక్తీకరణ‌‌ అన్న ఆధునిక నిర్వచనాల గురించిన అవగాహన ఉండాలని ఎలా ఆశించగలం? దాని అవసరాలను ఎలా చర్చించగలం?” – (28-04-17 బెంగళూరు పెన్‌ సంస్థ నిర్వహించిన లేఖన-2017 కార్యక్రమంలో ప్రసిద్ధ అరవ రచయిత పెరుమాళ్ మురుగన్ చేసిన ప్రసంగపాఠం.)

    పెరుమాళ్ మురుగన్ -బెంగళూరు పెన్ సంస్థలో ఏ భాషలో ప్రసంగించారో తెలియదు. అరవంలో ఉపన్యాసమిస్తే వీరు చెప్పినదానిలో ఏదో ఘనత వహించిన విషయం ఉందని అనువదించి, ఈ తెలుగు సాహిత్య పత్రికలో దించినారేమో, అని చదివాను. ఎంత మాత్రం లేదు.

    ఎప్పటి కాలం మనుషుల గురించి ఈ మాటలు! ఏనాటి సంగతులు! ఈ ప్రసంగం ‘వక్త’ వారి తాతగారి తాళపత్ర గ్రంథం నుండి చదివి వినిపించిందా? ఇప్పటి చదువుకున్న పౌరుల కొరకు 2017 లో, ఆలోచించి రాసుకొచ్చి చదువుతున్నట్టు మాత్రం లేదు.

    కుల మతాల గురించీ, కులమత వివక్షతలనేవి ఉన్నాయని, ముందు నేర్పించకుండా, ఇప్పటి కాలం మనుషులకు ‘వాక్స్వాతంత్రం’ గురించి తెలిసే విధానం లేదంటున్నాడీయన.

    చదువుకున్నంత మాత్రాన జ్ఞానం రాదంట. ఉద్యోగాలు చేసినా రాదంట. పౌరహక్కుల గురించి, తెలియాలన్నా, స్వతంత్రించి మాట్లాడాలన్నా, ఎప్పుడో దేశంలో వర్తింపచేసిన కులమత తత్వాలు గురించి ఈనాడైనా తెలుసుకోపోతే ఎలా అంటున్నాడీయన.

    కొన్ని ఆహారాలు కొందరికి సహించకపోటానికి ఉపన్యాసకుడికి కులమొక్కటే కారణంగా తోస్తుంది. ఏ రోజుల మాటలు? ఎప్పటినుండో హోటల్స్‌లో , సమావేశాల్లో, ఎయిర్ లైన్స్‌లో మీకు ఎలర్జీలున్న్నయ్యా, గ్లూటెన్ పడదా లాక్టోస్ పడదా, మాంసం పడదా, -ఇలాటి ప్రశ్నలడుగుతున్నారు, వంటలు వండి వడ్డించే వాళ్లు. పడని వస్తువులకు కొందరికి రకరకాల బాధలు. కొందరికి ప్రాణాపాయం. అందువల్ల ఈ జాగ్రత్తలు అవసరం. వీరెవరూ ఈ రోజుల్లో మీ కులమేంటి అని అడగరు.

    ఎప్పుడో ఏదో రోజుల్లో కుల భేదాల బట్టి, కొందరు మనుషులను, మరికొందరు వారి ముందు వంగి మాట్లాడమన్నారేమో. ఇప్పడా అద్భుత చారిత్రక విషయం 2017లో, ఒక డెమొక్రాటిక్ దేశంలో పౌరులకు ఈ ఉపన్యాసంలో ఎందుకు చెపుతున్నట్టు.

    ఇప్పటి కాలంలో, కొందరు మనుషులు పొట్టిగా ఉంటే, వారి ముందు ఎవరైనా పొడుగు వాళ్లు వంగి, చెవొగ్గి మాటలు వినాల్సొస్తే, వారు బహు మర్యాదస్తులు. ఎవరూ ఎవరికీ సేవకులు కారు.

    ఫ్లూ సీజన్లో, దగ్గేప్పుడు తుమ్మేప్పుడు ఎవరి మీదా ఏ తుంపరలు పడకుండా, అవతలికి ముఖం తిప్పుకుని, చేతులు అడ్డు పెట్టుకోండి, మేస్క్ వేసుకోండి, చేతులు కడుక్కోండి అని సలహాలిచ్చే వాళ్లున్నారు. ఆ నిబంధనలు ఆచార వ్యవహారాల విషయంగా కాదు. కుల మత భేదాల గొడవ లేదు. ఇలాటి ప్రస్తుత ఆవశ్యక ఆరోగ్య కారణాలు వక్త ఉపన్యాసంలోకి రావు.

    ఇది ఆలోచన పాలోచన లేని సోదిబుచ్చి ప్రసంగం. వక్తకు ఎప్పడూ తన ఆలోచనలను సవరించుకోటంలో సంసిద్ధత ఉండాలి. పాత ఆలోచనైతే గుడ్ బై చెప్పగలగాలి. సమాజం ముందుకు సాగింది. కాని ఈ ప్రసంగంలో వక్త -కులమతాల ఆలోచనలో కూరుకు పోయి ఉన్నారు. చాలా ఏళ్ల కింది కాలంలో కొంత relevancy, ఉపయోగం ఉన్న, ఆలోచనా పద్ధతులనే ఇప్పటికీ సాధనాలుగా వాడాలనుకుంటున్నారు.

    To approach the present people’s education about much beloved, cherished – Freedom, Freedom of speech – thru caste and religion is perverse, divisive, old grudge propagating. It is counter-productive. To think it is essential to do so, in these times, is a corrupt, retrogressive thought. It is not necessary to know about religion and caste, to understand concepts of Freedom, the Freedom of speech.

    -Lyla