శ్రీవల్లీ రాధిక గారు “వ్యాఖ్యలు వ్రాసే విషయంలో ఈమాట వారు పాఠకులకు చేస్తున్న సూచనలు (కొన్ని) నాకు నచ్చనందువలన ఇక ఈ పత్రికకి ఎప్పుడూ వ్యాఖ్య వ్రాయకూడదని అనుకున్నాను.” అన్నారు. అలాటి వారికి ఈ అభిప్రాయం కలగటం పత్రికకి దురదృష్టకరం. అభ్యంతరకరమైన సూచనల్ని నేరుగా చర్చించి తెలుసుకుని ఇలాటి మంచి రచయితల్ని రాయమని ప్రోత్సహించటం పత్రికకే కాదు, పాఠకులకీ అవసరం. ఇదివరకు వారు ఎన్నో చక్కటి కథలు, కవితలు ఇక్కడ ప్రచురించారు.
పద్యములు రెండు విధములు – (1) కేవలము చదువుకొనుటకు మాత్రమే, (2) చదువుతోబాటు, పాడుకొనుటకు కూడ. అన్ని పద్యములను వారికిష్టమైన రాగములలో పాడుకొనవచ్చును. కాని వాటిలో కొన్నిటిని మాత్రమే తాళముతో పాడుకొనుటకు వీలవుతుంది. పాడుకొనేటప్పుడు పొల్లులు, ద్రుతములు శోభించవు, ఏ “సుధవోల్ సుహాసిని” లాటివి తప్ప. అప్పుడు పొల్లులను అజంతములుగా మార్చితే గానసౌలభ్యము లభిస్తుంది. అందుకే ఈ పరిష్కార మార్గాలు, మల్లేశ్వర రావుగారు. నా ఉద్దేశములో ఛందస్సుకు గానసౌలభ్యము లభిస్తే దాని విలువ ఇనుమడిస్తుంది. ఒక పద్యమునకు కావలసినవి – ఉచితమైన ఛందస్సు, భావము, పదముల ఎన్నిక, వాటి విఱుపులు, సులభముగా అర్థమయ్యేటట్లు ఉండే ద్రాక్షాపాకము. ఇవన్నీ చేరినప్పుడు పద్యము పాట అవుతుంది, పాట నోట మెదులుతుంది. ఛందస్సు కలకాలము నిలుస్తుంది. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయము మాత్రమే. అంగీకరిచడము, లేకపోవడము అన్నది పాఠకుల స్వంత అభిప్రాయము. నమస్సులతో విధేయుడు – మోహన
ఈ పోటీని నిర్వహించింది కేవలం DTLC మాత్రమే. DTLC పోటీల్లో ఎన్నికైన వ్యాసాలన్నిటినీ ఒక పుస్తకంగా ప్రచురించడంతో పాటు, మాలాగే లాభాపేక్షలు లేని స్వచ్ఛంద సంస్థ అయిన ఈమాట పత్రికలో ప్రచురణకు ఒప్పుకున్నది కేవలం వ్యాసాలను అందరికీ అందుబాటులోకి తేవడం కోసమే. పోటీ కోసమే వ్రాసిన వ్యాసం కాబట్టి, నిబంధనల ప్రకారం DTLCకి సర్వ హక్కులూ చెందినా, రచయిత ప్రచురణా స్వాతంత్ర్యాన్ని మేమెప్పుడూ నిర్బంధించలేదు, బోము. మూలప్రచురణను ఉటంకిస్తూ వ్యాసాన్ని యధాతథంగా ప్రచురించడానికి ఈమాటకు అనుమతివ్వడం కూడా, ఈమాట వ్యాపార పత్రిక కానందువల్లే (fair use of copyright). పోటీకి వచ్చిన వ్యాసాలతో ఎవరైనా లాభసాటి పుస్తకవ్యాపారం చెయ్యదలుచుకుంటే, అప్పుడు రచయితల అనుమతి పొందవలసిందే. అప్పుడుకూడా, DTLC వ్యాసరచన పోటీలో ఎన్నికైన వివరాలను (బహుమతి పొందిన వ్యాసమనో లేక ప్రచురణకు ఎన్నుకున్న వ్యాసమనో) ఇవ్వవలసి ఉంటుంది.
డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి తరపున,
మద్దిపాటి కృష్ణారావు
డా. కామేశ్వరి గారు వెలుబుచ్చిన సంశయాలు నాకూ కలిగాయి. ఇదే వ్యాసం నిర్వాహకులు రేపు మరొక పత్రికలో ప్రచురించవచ్చా? నిబంధన ప్రకారం నిర్వాహకులు వారి పత్రికలో ప్రచురించుకోవడానికి హక్కు ఉంటుంది. కానీ వేరొక పత్రికలో ప్రచురించేట్లయితే ఆ రచయిత అనుమతి తీసుకోవడం బావుంటుంది అనిపిస్తున్నది.
డీ టి ఏల్ సి వారు ఈమాట వారితో కలిసి ఈ పోటీ నిర్వహించారా? సాధారణంగా ఏదో ఒక పత్రికతో కలిసి ఇటువంటి పోటీలు జరపటాన్ని గమనిస్తాం.
ప్రచురణ హక్కులు నిర్వహించే వారికి ఉంటాయనే నిబంధన సాధారణమే. కానీ, అలా కలిసి నిర్వహించిన పత్రికలో గాని, లేదా ఆ సందర్భంగా వెలువరించే ప్రత్యెక ప్రచురణలో గాని ప్రచురిస్తారు. ఇలా ఏ సంబంధమూ లేని మరొక పత్రికలో ప్రచురించటానికి పోటీ నిర్వహించిన సంస్థకు హక్కు ఉంటుందా! ఆ నిబంధనకు అంత విస్తృతి ఉందా!
ఎక్కడో ఒకచోట రచయిత పేరిట ప్రచురణ పొందటమే మహాభాగ్యంగా రచయితలు తృప్తి పడాలా!
మేము పోటీకి వచ్చిన వ్యాసాలలో ఎన్నదగిన వాటిని ప్రచురించే హక్కు పై పోటీ ప్రకటనలోనే వివరంగా తెలిపాము.
నిబంధన 7:
“….బహుమతి పొందిన వ్యాసాలతో పాటు, మిగిలిన వాటిలో ఎన్నదగినవాటిని ప్రచురించే హక్కులు నిర్వాహక వర్గానివే.”
పోటీకి వ్యాసాలు పంపేవారు నిబంధనలననుసరించాల్సి ఉంటుందని కూడా తెలిపాము.
ఈ నిబంధనలననుసరించే, పోటీకి వచ్చిన వ్యాసాల్లో ఎన్నుకున్న వాటిని అందరూ చదవాలనే ఉద్దేశంతో ఈమాట లో ప్రచురణకు అనుమతించాం. ఇప్పుడు ఇది మీరు సబబు కాదనుకోవడం విచారకరం.
డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి తరపున,
మద్దిపాటి కృష్ణారావు
ఈ వ్యాసం చదివాక నాకు వివేకానందుని మాటలు గుర్తుకు వచ్చాయి:
Who enjoys the picture, the seller or the seer? The seller is busy with his accounts, computing what his gain will be, how much profit he will realise on the picture. His brain is full of that. He is looking at the hammer, and watching the bids. He is intent on hearing how fast the bids are rising. That man is enjoying the picture who has gone there without any intention of buying or selling. He looks at the picture and enjoys it. So this whole universe is a picture, and when these desires have vanished, men will enjoy the world, and then this buying and selling and these foolish ideas of possession will be ended. The money-lender gone, the buyer gone, the seller gone, this world remains the picture, a beautiful painting.
వ్యాఖ్యలు వ్రాసే విషయంలో ఈమాట వారు పాఠకులకు చేస్తున్న సూచనలు (కొన్ని) నాకు నచ్చనందువలన ఇక ఈ పత్రికకి ఎప్పుడూ వ్యాఖ్య వ్రాయకూడదని అనుకున్నాను. కానీ ఈ రచనకి వ్రాయవలసి వచ్చింది. అందుకు రెండు కారణాలు.
1. DTLC వారు ఈ రచనని తమ పుస్తకంలో ప్రచురిస్తామని మాత్రమే నాకు వ్రాసిన ఇమెయిల్ లో చెప్పారు. దానిని మరలా ఈమాటకు ఇస్తామని వారు కానీ, ఆ పుస్తకం నుండి తీసుకుని ఈమాటలో ప్రచురిస్తామని ఈమాట వారు కానీ నాకు తెలియచేయలేదు. ఇది సబబు కాదు.
2. వ్యాసాన్ని ప్రచురించడంలో కూడా అశ్రద్ధ కనబడింది. “పాఠకుడిగా విమర్శకుడిగా వ్యవహరించడంలో తడబాటు” అనేది ఉపశీర్షిక. కానీ మిగిలిన ఉపశీర్షికలలా అది ప్రత్యేకంగా చూపబడలేదు. దానిని మిగిలిన text లో కలిపి ప్రచురించడం అస్పష్టతకి కారణమవుతుంది.
సమకాలీన తెలుగు సాహితీ విమర్శ – కొన్ని పరిశీలనలు గురించి K.V.S. Ramarao అభిప్రాయం:
07/02/2018 8:15 pm
శ్రీవల్లీ రాధిక గారు “వ్యాఖ్యలు వ్రాసే విషయంలో ఈమాట వారు పాఠకులకు చేస్తున్న సూచనలు (కొన్ని) నాకు నచ్చనందువలన ఇక ఈ పత్రికకి ఎప్పుడూ వ్యాఖ్య వ్రాయకూడదని అనుకున్నాను.” అన్నారు. అలాటి వారికి ఈ అభిప్రాయం కలగటం పత్రికకి దురదృష్టకరం. అభ్యంతరకరమైన సూచనల్ని నేరుగా చర్చించి తెలుసుకుని ఇలాటి మంచి రచయితల్ని రాయమని ప్రోత్సహించటం పత్రికకే కాదు, పాఠకులకీ అవసరం. ఇదివరకు వారు ఎన్నో చక్కటి కథలు, కవితలు ఇక్కడ ప్రచురించారు.
కొత్తనేలపాట గురించి అఫ్సర్ అభిప్రాయం:
07/02/2018 5:06 pm
మానసా
మీ తొలి ప్రవాస కవిత కదా! ఆ జంకు ఇప్పటికీ పోలేదు నా మటుకు నాకు! మీరు బాగా వ్యక్తం చేశారు, నేను వ్యక్తం చేయలేనిది!
రెండు ప్రశ్నలు గురించి మోహన అభిప్రాయం:
07/02/2018 4:19 pm
పద్యములు రెండు విధములు – (1) కేవలము చదువుకొనుటకు మాత్రమే, (2) చదువుతోబాటు, పాడుకొనుటకు కూడ. అన్ని పద్యములను వారికిష్టమైన రాగములలో పాడుకొనవచ్చును. కాని వాటిలో కొన్నిటిని మాత్రమే తాళముతో పాడుకొనుటకు వీలవుతుంది. పాడుకొనేటప్పుడు పొల్లులు, ద్రుతములు శోభించవు, ఏ “సుధవోల్ సుహాసిని” లాటివి తప్ప. అప్పుడు పొల్లులను అజంతములుగా మార్చితే గానసౌలభ్యము లభిస్తుంది. అందుకే ఈ పరిష్కార మార్గాలు, మల్లేశ్వర రావుగారు. నా ఉద్దేశములో ఛందస్సుకు గానసౌలభ్యము లభిస్తే దాని విలువ ఇనుమడిస్తుంది. ఒక పద్యమునకు కావలసినవి – ఉచితమైన ఛందస్సు, భావము, పదముల ఎన్నిక, వాటి విఱుపులు, సులభముగా అర్థమయ్యేటట్లు ఉండే ద్రాక్షాపాకము. ఇవన్నీ చేరినప్పుడు పద్యము పాట అవుతుంది, పాట నోట మెదులుతుంది. ఛందస్సు కలకాలము నిలుస్తుంది. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయము మాత్రమే. అంగీకరిచడము, లేకపోవడము అన్నది పాఠకుల స్వంత అభిప్రాయము. నమస్సులతో విధేయుడు – మోహన
సమకాలీన తెలుగు సాహితీ విమర్శ – కొన్ని పరిశీలనలు గురించి మద్దిపాటి కృష్ణారావు అభిప్రాయం:
07/02/2018 12:24 pm
ఈ పోటీని నిర్వహించింది కేవలం DTLC మాత్రమే. DTLC పోటీల్లో ఎన్నికైన వ్యాసాలన్నిటినీ ఒక పుస్తకంగా ప్రచురించడంతో పాటు, మాలాగే లాభాపేక్షలు లేని స్వచ్ఛంద సంస్థ అయిన ఈమాట పత్రికలో ప్రచురణకు ఒప్పుకున్నది కేవలం వ్యాసాలను అందరికీ అందుబాటులోకి తేవడం కోసమే. పోటీ కోసమే వ్రాసిన వ్యాసం కాబట్టి, నిబంధనల ప్రకారం DTLCకి సర్వ హక్కులూ చెందినా, రచయిత ప్రచురణా స్వాతంత్ర్యాన్ని మేమెప్పుడూ నిర్బంధించలేదు, బోము. మూలప్రచురణను ఉటంకిస్తూ వ్యాసాన్ని యధాతథంగా ప్రచురించడానికి ఈమాటకు అనుమతివ్వడం కూడా, ఈమాట వ్యాపార పత్రిక కానందువల్లే (fair use of copyright). పోటీకి వచ్చిన వ్యాసాలతో ఎవరైనా లాభసాటి పుస్తకవ్యాపారం చెయ్యదలుచుకుంటే, అప్పుడు రచయితల అనుమతి పొందవలసిందే. అప్పుడుకూడా, DTLC వ్యాసరచన పోటీలో ఎన్నికైన వివరాలను (బహుమతి పొందిన వ్యాసమనో లేక ప్రచురణకు ఎన్నుకున్న వ్యాసమనో) ఇవ్వవలసి ఉంటుంది.
డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి తరపున,
మద్దిపాటి కృష్ణారావు
సమకాలీన తెలుగు సాహితీ విమర్శ – కొన్ని పరిశీలనలు గురించి Bhimaraju Venkata Ramana అభిప్రాయం:
07/02/2018 8:39 am
డా. కామేశ్వరి గారు వెలుబుచ్చిన సంశయాలు నాకూ కలిగాయి. ఇదే వ్యాసం నిర్వాహకులు రేపు మరొక పత్రికలో ప్రచురించవచ్చా? నిబంధన ప్రకారం నిర్వాహకులు వారి పత్రికలో ప్రచురించుకోవడానికి హక్కు ఉంటుంది. కానీ వేరొక పత్రికలో ప్రచురించేట్లయితే ఆ రచయిత అనుమతి తీసుకోవడం బావుంటుంది అనిపిస్తున్నది.
సమకాలీన తెలుగు సాహితీ విమర్శ – కొన్ని పరిశీలనలు గురించి Dr. Y. Kameswari అభిప్రాయం:
07/02/2018 3:42 am
ఈ చర్చ చూశాక నాకు కలిగిన అనుమానం
1 + 1 గురించి mani అభిప్రాయం:
07/02/2018 1:02 am
మోస్ట్ ప్రాక్టికల్ స్టొరీ. ఐ లవ్‌డ్ ఇట్ పూర్ణిమా!
సమకాలీన తెలుగు సాహితీ విమర్శ – కొన్ని పరిశీలనలు గురించి మద్దిపాటి కృష్ణారావు అభిప్రాయం:
07/01/2018 10:41 pm
శ్రీవల్లీ రాధిక గారు,
మేము పోటీకి వచ్చిన వ్యాసాలలో ఎన్నదగిన వాటిని ప్రచురించే హక్కు పై పోటీ ప్రకటనలోనే వివరంగా తెలిపాము.
నిబంధన 7:
“….బహుమతి పొందిన వ్యాసాలతో పాటు, మిగిలిన వాటిలో ఎన్నదగినవాటిని ప్రచురించే హక్కులు నిర్వాహక వర్గానివే.”
పోటీకి వ్యాసాలు పంపేవారు నిబంధనలననుసరించాల్సి ఉంటుందని కూడా తెలిపాము.
ఈ నిబంధనలననుసరించే, పోటీకి వచ్చిన వ్యాసాల్లో ఎన్నుకున్న వాటిని అందరూ చదవాలనే ఉద్దేశంతో ఈమాట లో ప్రచురణకు అనుమతించాం. ఇప్పుడు ఇది మీరు సబబు కాదనుకోవడం విచారకరం.
డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి తరపున,
మద్దిపాటి కృష్ణారావు
జీవితానందం ఎక్కడున్నది? గురించి Usman khawaja అభిప్రాయం:
07/01/2018 4:13 pm
ఈ వ్యాసం చదివాక నాకు వివేకానందుని మాటలు గుర్తుకు వచ్చాయి:
Who enjoys the picture, the seller or the seer? The seller is busy with his accounts, computing what his gain will be, how much profit he will realise on the picture. His brain is full of that. He is looking at the hammer, and watching the bids. He is intent on hearing how fast the bids are rising. That man is enjoying the picture who has gone there without any intention of buying or selling. He looks at the picture and enjoys it. So this whole universe is a picture, and when these desires have vanished, men will enjoy the world, and then this buying and selling and these foolish ideas of possession will be ended. The money-lender gone, the buyer gone, the seller gone, this world remains the picture, a beautiful painting.
https://www.vivekananda.net/BooksBySwami/JnanaYoga/7.html
God in everything – Swami Vivekananda
(Delivered in London, 27th October 1896)
సమకాలీన తెలుగు సాహితీ విమర్శ – కొన్ని పరిశీలనలు గురించి శ్రీవల్లీ రాధిక అభిప్రాయం:
07/01/2018 9:43 am
వ్యాఖ్యలు వ్రాసే విషయంలో ఈమాట వారు పాఠకులకు చేస్తున్న సూచనలు (కొన్ని) నాకు నచ్చనందువలన ఇక ఈ పత్రికకి ఎప్పుడూ వ్యాఖ్య వ్రాయకూడదని అనుకున్నాను. కానీ ఈ రచనకి వ్రాయవలసి వచ్చింది. అందుకు రెండు కారణాలు.
1. DTLC వారు ఈ రచనని తమ పుస్తకంలో ప్రచురిస్తామని మాత్రమే నాకు వ్రాసిన ఇమెయిల్ లో చెప్పారు. దానిని మరలా ఈమాటకు ఇస్తామని వారు కానీ, ఆ పుస్తకం నుండి తీసుకుని ఈమాటలో ప్రచురిస్తామని ఈమాట వారు కానీ నాకు తెలియచేయలేదు. ఇది సబబు కాదు.
2. వ్యాసాన్ని ప్రచురించడంలో కూడా అశ్రద్ధ కనబడింది. “పాఠకుడిగా విమర్శకుడిగా వ్యవహరించడంలో తడబాటు” అనేది ఉపశీర్షిక. కానీ మిగిలిన ఉపశీర్షికలలా అది ప్రత్యేకంగా చూపబడలేదు. దానిని మిగిలిన text లో కలిపి ప్రచురించడం అస్పష్టతకి కారణమవుతుంది.
[ఉపశీర్షిక సరిదిద్దాము – సం.]