పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. నా టేస్టులేనితనం గురించి Vidya Jayaraj అభిప్రాయం:

    06/13/2018 2:39 pm

    😂😂😂😂

  2. ఆహవి గురించి అజిత్ కుమార్ అభిప్రాయం:

    06/13/2018 10:05 am

    అసుందా, అహవి ఒకే పోలికలలో ఉండడమే ఈ కథలో క్లైమాక్స్. అది ఎన్నో ప్రశ్నలకు జవాబుగా నిలిచింది. అఖిలకు కొండంత బలాన్ని ఇచ్చింది. సినిమా రీలులా కళ్ళముందు కదిలిన మనోహర దృశ్యకావ్యమిది. చాలా బాగుంది.

  3. సిలువ గుడి గురించి అజిత్ కుమార్ అభిప్రాయం:

    06/13/2018 9:44 am

    ఆసాములు తినే బువ్వగాబట్టి సాంబువ్వ అవలేదు. దేవునికి ప్రసాదంగా వరి అన్నంలో బెల్లం వేసి పాశెం వండుతారు దానిని సాంబువ్వ అని అంటారు. అలాగే ‘జిలేబి, పోసుమిటాయి’ అని అనే మాటల్లో పూసమిటాయి అని ఉండాలేమో…

  4. రెండు ప్రశ్నలు గురించి మోహన అభిప్రాయం:

    06/12/2018 2:55 am

    రాఘవగారు, వ్యాసము నచ్చినందులకు, మీ ప్రోత్సాహమునకు కృతజ్ఞతలు.

    (1) నాదగ్గర ఉండే పుస్తకములో నేను వ్రాసినట్లే ఉన్నది. లేఖక దోషమో లేక ముద్రారాక్షసమో తెలియదు.
    (3) ఋ-కారమును వృత అని వ్రాయకుండా (ఆ అక్షరము భాషలో ఉన్నా) వ్రిత అని వ్రాసినారు. దీనినిబట్టి పలికే విధముగా చెక్కేవారని నేను తీర్మానమునకు వచ్చినాను. ఈ ఋ-కారము తిక్కన కాలములో పలుకుబడిలో రు-కారము అయినది. దొరసామిశర్మగారు ఒక చోట ఋ-కారమునకు రు-కారమునకు యతిని తిక్కన భారతమునుండి చూపారు.
    (4) పాతకాలపు డ్రామా రికార్డు సెట్టులో (సతీ అనసూయ అనుకొంటాను) కటా ఎటుల్ భరింతు నీ ఘోర పాప బాధ అని గంగ నోటితో పాడించారు! అదే విధముగా ఎటుల ప్రయోగము కూడ ఉన్నది, ఉదా. నటన సూత్రధారీ మురారీ ఎటుల దాటగలడో నా యానతి.
    (6) కందప్ప చెట్టి ప్రచురణ ప్రకారము తిక్కన కాలపు నాటి శాసనములో దంత్య చ-కారము త్స గా చెక్కబడినది. ఆ పుస్తకమునకు భద్రిరాజు కృష్ణమూర్తి గారు సంపాదకులు.

    విధేయుడు – మోహన

  5. కలలు ఇచ్చిన బలిమి గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    06/11/2018 8:16 am

    యద్దనపూడి సులోచనారాణి గారి సాటి ప్రముఖ రచయిత్రులుగా తెన్నేటి హేమలత, కోడూరి కౌసల్యాదేవి గార్ల గురించి ప్రస్తావించటం ఓ చారిత్రక ఆవశ్యకత అని; ఇదో సమగ్రమైన వ్యాసం; జీవించి ఉన్నంతవరకూ ఎక్కడా ఆగలేదు, ప్రవహిస్తూనే ఉన్నారు అంటూ సులోచనారాణిగారిని విశ్లేషిస్తూ రాసిన గొప్ప నివాళి అని అంటూ రచయిత్రి డా. మైథిలి అబ్బరాజుగారికి తన అభినందనలను, ఆశీస్సులను తెలియజెయ్యమన్నారు త్రిపుర గారి ఆప్తమిత్ర, పెద్దలు శ్రీ భమిడిపాటి జగన్నాథ రావుగారు.

  6. రెండు ప్రశ్నలు గురించి రాఘవ అభిప్రాయం:

    06/11/2018 7:06 am

    నమస్కారం మోహనరావుగారూ

    1. ఛందఃపరిణామాలను ఆధారంగా చేసుకుని మీరు చేసిన ప్రతిపాదన తార్కికంగా చాల బాగుందండీ.

    2. ఒక్కొక్క గుణంబు కల్గుదు — టంకణదోషమో ఏమిటో గణభంగమయ్యింది. గమనించగలరు.

    3. అజంత-హలంతాల విషయం: పలికే భాషకీ వ్రాసే భాషకీ అంతరం నేటి కాలంలో మాదిరిగానే పూర్వకాలంలో కూడా ఉండే ఉంటుంది. అందువలన పదాన్ని అజంతంగా వ్రాసి హలంతంగా పలకటానికి కూడా అవకాశం ఉందనుకుంటానండీ. ఇది కేవలం నా ఊహ మాత్రమే.

    4. నామటుకు నాకు ద్రుతాంతమైనా అజంతమైనా బాధ లేదనిపిస్తుంది. ఐతే ద్రుతాంతంకాని హలంతం కొన్నిచోట్ల కృతకంగా అనిపిస్తుంది. ఉదాహరణకు, ఇటులన్ అంటే బాగానే ఉంటుంది, కానీ అదే అర్థంలో ఇటుల్ అంటే ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.

    5. అంచున్ + అల = అంచునల / అంచున్నల.

    6. దంత్య చకారాన్ని త్స గా వ్రాయటం నేటికీ కొన్ని చోట్ల నేను చూచానండీ. ఉదాహరణకు, అమలాపురంలో చల్లా వారి వీథిని కొందఱు త్సల్లా వారి వీథిగా వ్రాస్తారు.

    ఇట్లు
    భవదీయుడు

  7. బ్రెడ్‌ ప్యాకెట్‌ గురించి Ravichandra Enaganti అభిప్రాయం:

    06/11/2018 5:19 am

    సాక్షి ఆదివారం పుస్తకంలో వచ్చిన రియాలిటీ చెక్, వాటి తర్వాత ఇక్కడ స్వగతం వ్యాసాలు, నిజజీవిత చిత్రణలో రాజిరెడ్డి గారిది అందె వేసిన చేయి అనిపిస్తుంది నాకు. అంత అందంగా, ఆసక్తిగా చదివేలాగా రాయడం ఆయన బలం.

  8. ఆహవి గురించి రాఘవ అభిప్రాయం:

    06/11/2018 4:34 am

    భాస్కర్ గారూ, బాగుంది అనటం చాల తక్కువే ఔతుంది. అనువాదమే ఇలా ఉంటే మూలం ఇంకెంత ఘాటుగా ఉండి ఉంటుందో! కథ చదివాక… ఏమిటో… బుఱ్ఱ అంతా అదోలా ఐపోయిందండీ.

    ముత్తులింగం గారూ, నన్ఱి.

  9. బ్రెడ్‌ ప్యాకెట్‌ గురించి నగేష్.పంజా అభిప్రాయం:

    06/10/2018 7:03 am

    మీ రాతల్లో వాడే పదాల్లో సింప్లిసిటీ నాకు భలే నచ్చుద్ది. అసలు ఆ వర్ణన నేను కూడా మీ పక్కనే కూర్చుని జరిగిందంతా చూసినట్లు కళ్ళకు కట్టింది

  10. రెండు ప్రశ్నలు గురించి mUrti అభిప్రాయం:

    06/09/2018 8:11 am

    అయ్యా: “చస్తే కురవదు అమృతం.” వింతగా ఉంది.