పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16460

  1. గ్రీకు పురాణ గాథలు 5 గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    05/26/2020 1:18 pm

    పురాణాలు అవీ బయటకి తీసి తవ్వుతున్నారు కనక కొన్ని విషయాలు.

    భగవంతుడనేవాడున్నాడు అనేది ఒప్పుకున్నట్టైతే కొన్ని విషయాలు గ్రహించాలి. మొదటిది – ఉన్న భగవంతుడు జ్ఞానం, బలం, ఐశ్వర్యం, వీర్యం, శక్తి, తేజస్సులు కలవాడు. జ్ఞానం ఉన్నవాడు కనక మనకి ఆ జ్ఞానం లేనపుడు ఆయనని తెలుసుకోలేము. అందుకే మొదటగా చేయాల్సిన పని జ్ఞానం కోసం వెదకడం. ఆ జ్ఞానాన్ని వెదకడానికి మనకున్న బుద్ధి, మనసు ఎందుకూ పనికిరావని తెలుసుకోవడం రెండో మెట్టు. అదయ్యాక అంతర్గతంగా చూడడం, ఆ దారిలో అహంకారం పోగొట్టుకోవడం అది వదిలాక అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటే అప్పుడు జ్ఞానం కలికి భగవంతుడి గురించి మాట్లాడ్డానికి అర్హత సంపాదించుకోవచ్చు. అప్పటివరకూ మరెలా అంటే ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడిగుండంత సుఖంలేదు అని చెప్పుకోవాల్సిందే.

    ఇప్పుడా భగవంతుడు ఎలా పుట్టాడు, ఎందుకిలా చేసాడు, ఆ కాలంలో శూద్రుడు తపస్సు చేస్తుంటే రాముడు వెళ్ళి వాణ్ణి చంపాడు కనక అది పరమ దరిద్రమైన విషయం అనడానికి ముందు పైన జ్ఞానం అనేది సంపాదించాలి. ఎప్పుడో మరో యుగంలో జరిగిన దాన్ని బయటకి తీసి ఇప్పటి సూత్రాల ప్రకారం ఆ నిండు చూలాలైన సీతని అడవిలోకి తోసాడు కనక రాముడు ఇదీ అదీ అనడానికి మనకి అర్హత ఉండబోదు. అప్పట్లో ఆయన ఏం చేశాడో ఆ ధర్మాలెలా ఉన్నాయో, అది అసలు ధర్మమా కాదా అనేది నిర్ణయించడానికి మనకి జ్ఞానం ఏదీ ముందు? ఎన్ని విషవృక్షాలు రాసినా ముందు మనకి జ్ఞానం ఉందా భగవంతుణ్ణి గురించి మాట్లాడ్డానికి? అదలా ఉంచితే మానవ జీవితం కానీ పశుపక్ష్యాదులన్నీ కానీ సృష్టించబడాలంటే ఒక మొగ, ఒక ఆడ కలిసి తీరాలని – మనకి ఇప్పుడు తెల్సిన, అదీ పరిమితంగా – విషయాలని క్రోడీకరించి ఫలానా పుట్టి ఫలానాని పెళ్ళి చేసుకున్నందు వల్ల, ఆవిడ ఈయనకి చెల్లెలూ, ఈవిడ ఆయన బామ్మర్ది కూతురి మనవరాలూ అనడం మనకున్న అవగాహనా రాహిత్యం చూపిస్తుంది. హిందూమతాన్ని పక్కనపెట్టి మొదట్లో ఒక ఆడం ఈవ్ లు మాత్రమే ఉన్నారనుకుంటే, వాళ్ళసంతతిలోంచి మొత్తం జనాభా ఎలా వచ్చిందీ, ఎవరికెవరు చెల్లెళ్ళూ అక్కలూ అన్నీ లాగవచ్చు, అసహ్యించుకోనూ వచ్చు, నవ్వుకోనూ వచ్చు. అయితే అవి అర్ధం కావడానికి జ్ఞానం మనకి ఉందా? మనకి అది లేదు కనక (నాకెలా తెలుసు అంటే, ఆ జ్ఞానం ఉన్నవాళ్ళం అయితే ఇలా ఈమాటలో వ్యాఖ్యలూ, కధలూ రాయం కనక) పురాణాల్లో ఎవరెవకి పుట్టారు ఎవరెవరికకి ఏమౌతారూ అనేవి వదిలేసి అవి చెప్పే విషయాలు గ్రహిస్తే జ్ఞానంకోసం ఓ అడుగుముందుకి వేయవచ్చు. ప్రస్తుత కాలంలో కరోనా వైరస్ వల్ల ఒకర్నొకరు ముట్టుకోకూడదు. పొరపాట్న ముట్టుకుంటే, వెంఠనే చేతులు కడుక్కోవాలి. ఇంటికొచ్చాక ఆ బయటకెళ్ళేటప్పుడు వేసుకున్న బట్టలు ఉతుక్కుంటే మంచిది అని మనం కొత్తగా నేర్చుకుని చచ్చినట్టూ చేస్తున్నాం కదా? మరి చాలా ఏళ్ళ క్రితం – అనేకానేక వేల సంవత్సరాల క్రితం ఇటువంటిదే వచ్చి ఫలానా వారిని ముట్టుకుంటే వైరస్ అంటుకుంటుంది అనేది వచ్చిందేమో అని ఒక బ్లాగర్ అన్నారు. నిజమే అయిండవచ్చు ఎవరు చూసారు. మనకి తెలియదు కనక నోరు మూసుకుందాం. అయితే ఈ కాలంలో అలా చేయవచ్చా, అనేది ప్రస్తుత పరిస్థితుల ప్రకారం తప్పే; కాదని ఎవరూ అనడంలేదు. అందువల్ల ఒకనాడెప్పుడో వచ్చిన వ్యవస్థ మీద ప్రస్తుత జీవితంలో సూత్రాలు పెట్టి మెలికలు తిప్పితే మరో కొన్ని విషవృక్షాలు అద్భుతంగా పండుతై. అసలు జననమరణాలు ఒక ఆడ, మొగ కలవకుండా జరగవచ్చేమో? కొన్ని రకాల నత్తలు ఆడ మొగా తేడా లేకుండా మారుతూ వృధ్ధి పొందుతాయని మల్లాది గారి నవల “నత్తలొస్తున్నాయ్ జాగ్రత్త” లో చదివాం కూడా. అలాగే వాలి సుగ్రీవులకి తల్లీ తండ్రీ కూడా ఒకరే. అందువల్ల బ్రహ్మ గారు సృష్టి చేస్తున్నారంటే ఎవరో ఒకర్ని పెళ్ళి చేసుకుని అనంతంగా పిల్లల్ని కనేస్తున్నారనుకోవడం అంత బుద్ధి తక్కువ ఆలోచన మరోటి లేదు. ఎందుకంటే భగవంతుడు ఏమేం లక్షణాలు ఉన్నవాడో మొదట్లోనే చూసాం కదా? “ఏదైనా చేయగల” భగవంతుడు – మనకి జ్ఞానం కలిగేవరకూ కనీసం – నిజంగానే ఏదైనా చేయగలడు కనక సృష్టి ఆయనిష్టం ప్రకారం ప్రభవించింది అనుకోవడం ఉత్తమం. అబ్బే దానిబదులు మన బుద్ధి, మనస్సు మనకి తోచిన విషయాలూ మనకి తెల్సిన గూగిల్ ప్రకారం ఇదీ అనేవీ కలిపి సృష్టి ఇలాగే ఆడా మొగా లేకుండా జరగదూ అనుకోవడం ఎటువంటిదంటే, భాగవతం చదివి పోతనగారు మొత్తం గోపికల అంగాంగాలు వర్ణించడం తప్ప అందులే ఏం లేదురా, కావాలిస్తే “ఆదిన్ శ్రీపతి కొప్పుపై..” అనే పద్యంలో బూతు చూడండోహో అని చెప్పడం, అనుకోవడం, మిగతావారి దగ్గర చెప్పుకోవడం వంటిదే.

    రాముడు పుట్టాక, అవతారం చాలించాక ఆయన పేరు కోటానుకోట్ల జనాలకి వాడారు/వాడుతున్నారు ఇప్పటికీ. బుధ్ధుడి కాలంలో రాముడనే రాజు, ఆయనకో చెల్లెలు సీత అనే వారు ఉంటే త్రేతాయుగంలో సీతారాముల్తో పోల్చి [అసలే మనకి బుధ్ధి చాలా పదును కదా?] చూసారా హిందూ మతంలో రాముడు చెల్లెలైన సీతని పెళ్ళిచేసుకున్నాడని చెప్పడం అతి ఏహ్యమైనది. మీ పేరు రామారావు అయితే మీకు హనుమంతరావు అనే తమ్ముడూ, ఆ తమ్ముడికి సీతాలక్ష్మి అనే పెళ్ళాం ఉండకూడదంటే ఎలా? యుగాలన్నీ కలిపేసి ఆయాధర్మాలన్నీ కలిపేసి ఏదీ నాకు చూపించు అంటే ఎందుకు చూపించాలి? దీన్ని అద్భుతమైన సమన్వయం అనుకోవడం, ఎవరో ఏదో కావాలని మీ/మా కోసం ఇలా తయారు చేసారనుకోవడం మన లేకితనాన్ని తప్ప మరోదాన్ని విశదం చేయదు.

    మొత్తానికి చెప్పేదేమంటే భగవంతుడు – మరోసారి ఆయన లక్షణాలు ఇక్కడ -జ్ఞానం, బలం, ఐశ్వర్యం, వీర్యం, శక్తి, తేజస్సులు ఉన్నవాడు, ఆయన గురించి మాట్లాడి ఇదీ ఫలానా అని చెప్పాలంటే ఆ జ్ఞానం మనకి ఉండాలి. ఇవన్నీ పుక్కిటి పురాణం, సరదా కథ అనుకుంటే సరే, అప్పుడు ఈ కధలని గ్రీకులతోటే కాదు ఆదిమ మానవుల గురించి కూడా పోల్చి చెప్పుకోవచ్చు – ఒకప్పుడు ఈమాటలో ప్రచురించిన విశ్వనాధ గారి నవల్లో పాత్రని ఏదో ఆంగ్ల సినిమా హీరోయిన్ తో కంపేర్ చేసి పెద్ద వ్యాసం రాసినట్టూ. శుభం.

  2. ఎడిటర్లూ, రచయితలూ, ఎడిటింగూ గురించి ఇంద్రగంటి ప్రసాద్ అభిప్రాయం:

    05/26/2020 12:45 pm

    ఇన్నేళ్ల తర్వాత ఈ సంపాదకీయం మీద వ్యాఖ్య రాయడానికి కారణం రేమండ్ కార్వర్. 2009 ఎడిషన్ ఇటీవల చదివేను. లీష్ కత్తిరించిన కథల్ని వాటి అసలు రూపంలో చదివేను. కొన్ని కథలు కత్తిరింపు వల్ల బావున్నాయి కానీ, కార్వర్ కి పెరు తెచ్చిన గొప్ప కథలు A small, good thing కానీ, so much water so close to home కానీ విస్తార రూపంలోనే బావున్నాయి. దగ్గరగా చూసినప్పుడు లీష్ వెర్షన్ అసమగ్రంగా అనిపించింది. విషాద వాస్తవికత చేదుగా అర్ధమవుతుంది.

  3. గ్రీకు పురాణ గాథలు 5 గురించి Dr. Indrakanti pinakapani అభిప్రాయం:

    05/26/2020 4:55 am

    జగదీశ్వర్ వల్లభదాసు గారి అభ్యంతరం సరైనదే ! అయితే ఇక్కడ ఆదిమ పురాణాలను దిద్ది ఉంటారని ఊహించ వచ్చు. ఏకోదర వివాహాలను నిషేధించే వరకు వీళ్ళందరూ బ్రహ్మ గారికి పుత్రులే ఐ ఉంటారు. తరువాతి కాలంలో మానస పుత్రులు కావడం పౌరాణికులు సాధించిన అద్భుతమైన సమన్వయం !
    జైన పురాణాలు మాత్రం ఇలా దిద్దినట్లు లేవు. వారి ఆదిమ పురాణాల్లో రాముడికి సీత చెల్లెలు ఐన సందర్భాలు కూడా ఉన్నాయని ఆరుద్ర గారు రాశారు.

  4. అటో యిటో గురించి Viswam అభిప్రాయం:

    05/22/2020 6:07 am

    కథ చక్కగ వున్నదండి. శైలి కూడా బాగుందండి.

  5. అసమర్థులు గురించి Viswam అభిప్రాయం:

    05/22/2020 5:49 am

    కథ ఇది కాదు, ఒక అమూల్యమైన అద్బుతమైన సందేశం ఇప్పటి తల్లి తండ్రులకు అనుకుంటున్నాను. కథను మించిన సందేశం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

  6. ఓ వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్ గురించి Viswam అభిప్రాయం:

    05/21/2020 11:02 pm

    స్వప్నరాగలీన, గీతాదేవి, కృష్ణచైతన్య, శ్రీపతి తెలుగు నవలాసాహిత్యం ఉన్నంతవరకు వెలుగులీనుతూనే ఉంటారు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు.

  7. పరిపాకం గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    05/20/2020 5:59 am

    ప్రియమైన శ్రీ దంతుర్తి శర్మ గారికి నమస్కారములు.

    మనుషుల ప్రవృత్తిని బుధ్ధుడు ఎలా మార్చగలడో మీ ” పరిపాకం ” కధ ద్వారా ( అనాథపిండికుడు, కలాపిని పాత్రల ద్వారా ) విశదం చేసారు. ధన్యవాదాలు.

    కర్మ పరిపాకం ఫలితం అనుభవించేటపుడు కానీ చేసినది ఎంతటి పాపపు కర్మో గుర్తురాదు. తాను చేసేది చెడు కర్మ అనుకుంటూ, చేసిన మంచి పని వల్ల అనాథపిండకుడికి మంచి ఫలితం వస్తే; మంచి కర్మ అనుకుంటూ చెడ్డ కర్మ చేసిన కలాపినికి చెడ్డ ఫలితం ఇచ్చింది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదే. పరహింస అనేది అతి దారుణమైన కర్మ. ఎన్నడూ తప్పుడు ఆలోచనలు కానీ తప్పుడు పనులు కానీ చేయవద్దు, అహింసా పరమో ధర్మః”

    అంగుళీ మాలుడుది ఇలాంటిదే మరో గాధ. దారికాచి వచ్చే పోయే బాటసారులను దోపిడీ చేసి తర్వాత హతమార్చి.. అలా తాను దోచిన వ్యక్తుల లెక్కగా, గుర్తుగా వారి బొటన వేళ్లను ఖండించి మెడలో మాలగా వేసుకునే అంగుళీ మాలుడనే బందిపోటు దొంగ… తనకు దర్శనం ఇచ్చిన బుద్ధుని నిశ్చలతకు నివ్వెరపోయి ప్రభావితుడై, హింసాయుత జీవనాన్ని విడనాడి బుద్ధుని శిష్యగణలలో చేరి పోయాడు.

    కోట్లకి పడగలెత్తిన వర్తకుడు… దానధర్మాలు చేస్తూ అనాథలకి అన్నదానాలు చేస్తూ అనాథపిండికుడు అని పేర్గాంచిన సుదత్తుడు; బుద్ధభగవానుణ్ణి శ్రావస్తి కి రప్పించటానికి నగరంలో బౌధ్ధ భిక్షువులకో విహారం నిర్మించిన అనాథపిండికుడు; అనాథపిండికుడు ఇంట ఆశ్రయం పొంది ఓ క్షుద్రదేవతారాధన చేస్తున్న కలాపిని, జేతవనము, శ్రావస్తి నగరం, రాజు ప్రసేనజిత్తు, తధాగతుడు, బుధ్ధుని శిష్య భిక్షువు ఆనందుడు.

    “ధర్మం కనుక్కోవడమే మనుష్య జీవితానికి పరమావధి. ఆ కనుక్కోవడంలో క్షుద్రదేవతారాధనలు ఎందుకూ పనికిరావు ” అని మందలించిన తధాగతుడు… తనకి ఇచ్చిన భరోసాతో ఒక్కసారి మనసులో భయం, కలవరం అన్నీ పోయి తేటపడిన మనసుతో కలాపిని.

    పరిపాకం కి పర్యాయ పదాలు : పరిపక్వత, పరిపక్వము, పరిపూర్ణత, పరిపాకము, పరువము, సంపూర్తి, సంపూర్ణత.

    Shravasti ( located in the fertile Gangetic plains in Uttar Pradesh ) was the capital of the Kosala Kingdom during 6th century BCE to 6th century CE and one of the six largest cities in India ( and even overshadowed Magadha’s capital, Rajgir ) during Gautama Buddha’s lifetime. Gautama Buddha is believed to have spent 24 Chaturmases here. Shrasti’s king was called Pasenadi, who was a disciple of Buddha.

    Jetavana , located just outside the old city of Savatthi, was one of the most famous Buddhist monasteries or Viharas in India, given to Lod Budhdha by his chief male disciple Anathapindika. It was the second vihara donated to Gautama Buddha after the Venuvana in Rajgir. Jetavana was the place where the Buddha gave the majority of his teachings and discourses, having stayed at Jetavana nineteen out of 45 vassas, more than in any other monastery.

  8. పుస్తకాల గుళ్ళో ధ్వజస్థంభం ‘నవోదయ’ గురించి GVR Prasad అభిప్రాయం:

    05/18/2020 12:21 pm

    పుస్తకాల గుళ్ళో ధ్వజస్తంభంలా నవోదయను నిలపాలన్నది నా కల. నేనింకా ఆ కల కంటూనే ఉన్నాను.

    నదులన్నీ సముద్రములో కలిసినట్లు “మతా”లన్నీ మతాలలో కలిసిపోతాయా? శుధ్ధ కమ్యూనిస్ట్ అయిన రామ మోహనరావుగారు పై విధంగా అనడం చూస్తే అల్లాగే అనిపిస్తుంది.

    రమణగారు అందాలరాముడు సినిమాలో ఇలాగే చెప్పేరు.

  9. మన శాస్త్రీయ సంగీతం గురించి Murali అభిప్రాయం:

    05/18/2020 8:48 am

    చాలా బాగుంది.

  10. దేశభక్తి గేయాలు గురించి చింతలపాటి బాల సుబ్రహ్మణ్యం అభిప్రాయం:

    05/18/2020 12:13 am

    ముందుగా మీకు కృతజ్ఞతలు, ఎంతో చక్కని రేడియో పాటలు అందిస్తున్నారు.