పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16461

  1. జీవితానందం ఎక్కడున్నది? గురించి Sriram Bhamidipati అభిప్రాయం:

    05/10/2020 3:13 pm

    మినిమలిజంలో ఉన్న మజా.. అది అనుభవించితే తెలియునులే …

  2. ఆ రేయి నీరెండ! గురించి Sriram Bhamidipati అభిప్రాయం:

    05/10/2020 3:11 pm

    ఎప్పుడేనాడో ఈ భూమి ఇంకా కన్యగా ఉండి సూర్యుడి దయవల్ల నెలతప్పి తొలిప్రాణిని ఎపుడు కన్నదో? ఆ ఆకుపచ్చని అంకురాన్ని గుండెలకు హత్తుకుని, దోసిటిలో ఉంచి సూర్యునికీ, ఆకాశానికీ చూపించి ఆనాడెలా సంబరపడిపోయినదో?

    ఎంత గాఢత!

    గగుర్పాటంటే…
    ఇలాంటివి చదివితేనేనేమో?

  3. కెహర్వా! గురించి అం అః అభిప్రాయం:

    05/10/2020 9:08 am

    అన్నా శర్మన్నా

    మల్ల ఎంత బా చెప్పిర్రో! గయితె ఒక్క ఇసయం మట్కు మంచిగ సమజ్ జేయించనవన్నా!

    “ఒక్క పైస అప్పుకు కోటి రూపాల్ వడ్డి వసుల్ జేసినవ్ తీ” అని మా ముసిలోడు, యాద్గిరి తాత చెప్పెటోడు. మా తాత చెప్పేట్ది ఈరోజు మీ కమెంటురాత చూసినంక అరె తాత నిజమే చెప్పిండుగ అన్పించవట్టె. ఇట్ల ఈ కోటి రూపాల్ వడ్డి తీర్న రాస్తె, ఆల్లు మీ కతల్ పేజీల్ పేజిల్కు కట్ జెయ్యకుండ ఎట్ల ఏసుకుంటరు? సమాదానమెందుకిస్తరు?

    పోనిలె, అంత తీర్కు మీరు హుషార్గున్నరు అంతనె సాలు

    ఇంగ ఉంట శర్మన్నా!

    అం అః

  4. కర్త కర్మ క్రియ గురించి T.subrahmanyam అభిప్రాయం:

    05/09/2020 7:44 am

    Doubt whether this unfinished and utterly unpalatable(she could seek several ways to handle the scoundrel)short story really emanated from, the stables of Abburi chaaya devi gaaru?.Not expected from such a senior and great writer even if the incident is true.

  5. పరిపాకం గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    05/08/2020 1:04 pm

    దేశికాచార్యులు గారు
    ఇక్కడ కూడా చూడండి. https://burmese-buddhas.com/blog/anathapindika/ (బాగా కిందన ఇటువంటి కధ ఉంది)

  6. కెహర్వా! గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    05/08/2020 12:27 pm

    >> ఎందుగాల్నంటే కెహర్వా వొంటి మాట ఈడ సర్పోయె గావట్టి.

    అయ్యా కెహర్వా అనేది సరిపోలేదనీ ఆ మాట చెడ్డదనీ నేననలేదు. ఓ సారి సరిగ్గా చదవండి. హిందీలో ‘హమ్ దో హమారే దో’ అనేదాన్ని పొందికగా ‘మేమిద్దరం మాకిద్దరు’ అని తెలుగులో అందంగా కూడా అనవచ్చు. నా ఏడుపు ఏమిటంటే మొత్తం కవిత అద్భుతంగా తెలుగులో రాయగల్గినవారు ఆ కవిత కి పేరు తెలుగులో ఓ మంచి పేరు ఎందుకు పెట్టలేకపోయారు? ఒక్క తెలుగు పదం దొరకలేదా? మీరు రాసేది తెలుగు పత్రికకి, మీకు తెలుగు వచ్చు, మరి ఏమిటి అభ్యంతరం? కెహర్వా కి సరిపోయే పదం హిందీలో మరోచోటో ఉండడం అసంభవం అంటారా, సరే ఆ మాటతోటే మీకు తెలుగు భాష పట్ల ఉన్న న్యూన్యత అర్ధమౌతోంది.

    తిరుపతిలో కూడా ఇదే సంత. తిరుమంజనం, ఆళ్వారుకోయిల్, అనేటువంటి తమిళ పదాలు వాడ్డానికి తెలుగువాళ్ళమైన మనం సిధ్ధమే కానీ తెలుగు నాట ఉన్న తిరుపతిలో ఉన్నదేవుడు ఎవరు అంటే “శ్రీవెంకటేశ్వరుడు” అని చెప్పడానికి మనకి ఇష్టం ఉండదు. ఆయన్ని బాలాజీ అనీ ఉండేచోటు ఏలుమలై అనీ, మరోటనీ అనడానికెప్పుడూ సిధ్ధమే. ఆ మధ్యన ఏలూరులో భోజనానికి వెళ్ళాం హోటల్ కి. వడ్డించే కుర్రాణ్ణి ‘చారు’ ఉందా అంటే నవ్వు. చారు అనకూడదుట; రసం అనాలి. ఎక్కడి మద్రాస్, ఎక్కడి ఏలూరు? నేనూ మద్రాస్, మధ్యప్రదేశ్ లలో చదువుకున్నవాణ్ణే, ఎవో రెండు మూడు తమిళ/హిందీ వ్యాక్యాలు మాట్లాడి, రాసి, చదవగలిగినవాణ్ణే. కానీ ఏలూరు లో తమిళం ఎందుకు మాట్లాడాలి? మన భాష తల నరుక్కుని తెలుగుతల్లిని పబ్లిగ్గా రోడ్డు మీద మానభంగం చేయడానికి మనం ఎప్పుడూ సిద్ధమే. దానికి పేద్ద ఉదాహరణ మన ముఖ్యమంత్రిగారే. తెలుగు మాధ్యమం అక్కర్లేదని ఓ ఆర్డర్ పారేసారు. తెలుగు అక్కర్లేదు, రెండో భాషగా హిందీ, మూడో భాషగా ఫ్రెంచ్ లేదా సంస్కృతం తీసుకుంటాం. వాటికి సమాధానాలు ఇంగ్లీషులో రాసేయవచ్చు. నూటికి 90 వేస్తారు. పోనీ బయటకి వచ్చాక ఆ భాషలు వస్తాయా మనకి? తెలిసీ తెలుగుని సర్వనాశనం చేసుకునేది మనమే. ఇంగ్లాండ్ నుంచి మనని ఏలడానికి వచ్చిన కాటన్, బ్రౌన్ లు కూడా ఎప్పుడూ తెలుగు తల్లిని మానభంగం చేయాలని చూడలేదనుకుంటా. దానిబదులు వాళ్ళు నిఘంటువులు తయారు చేసుకుని తెలుగు నేర్చుకోవడానికి ప్రయత్నించి తెలుగుతల్లికి పట్టుచీర కట్టడానికి ప్రయత్నం చేసారని నేను అనుకుంటున్నాను – నాకు తెల్సినంతలో. మన తమిళ తంబిలు కూడా సంగీతం నేర్చుకునేటపుడు చివరకి ఒక్క త్యాగరాజ పంచరత్న కృతి నేర్చుకుందామనే అనుకుంటాడు. మనమో? ఒక్క మాట గమనించండి – నాకు తెల్సినది “అతి” తక్కువ, అది ఒప్పుకోవడానికి ఏమీ సిగ్గు పడడం లేదు.

    >> అయితెగాని అది గట్ల పక్కంబెట్టి జూస్తే మీర్మట్కు సంపాదకుల గూర్సి ఎప్పుడు జూసినా మంచి మాటల్ జెప్త ఉంటరు.

    సంపాదకుల దగ్గిరనుంచి “నేను మాత్రమే” నేర్చుకున్నవి అలా చెప్పానండి. మీకు నచ్చాలని ఎక్కడాలేదు. నేను రాసిన కధలూ, పత్రాలూ అనేకానేక సార్లు దిద్దించుకుంటూ అక్షింతలు వేయించుకుంటూ ఉంటా – ఇది దాదాపు ప్రతీసారీ జరిగేదే. అందువల్ల మొదట్లో వచ్చే కోపం, కన్నీళ్ళూ అన్నీ కట్టిపెట్టి వాళ్లెందుకు అలా చెప్తున్నారా అని ఆలోచించడం మొదలుపెట్టాక నా రచనా జీవితం బాగు పడింది. ఇది మరోసారి చెప్తున్నా మళ్ళీ గొడవ లేవదీయకండి – నాకు జరిగినట్టూ మీకు జరగాలని ఎక్కడాలేదు. అందువల్ల మీకు నచ్చకపోతే దానికి నేను బాధ్యుణ్ణి కాదు. మరో విషయం. నేను రాసేవన్నీ సంపాదకులు మెచ్చేసుకుంటారని మీరనుకుంటే అది శుధ్ధ తప్పు. ఎందుకంటే ఈమాటవారే నేను పంపేవి ఎలా ఎందుకు నచ్చలేదో చెప్తూ ఉంటారు. నచ్చినా అందులో రెండేసి పంక్తులూ, పేరాలు, పుఠలూ తీసేస్తారు. అది వాళ్ల ఇష్టం. ఒక్కొక్కప్పుడు నేను రాసినవి నచ్చకపోతే – ‘అసలిది మేము వేసుకుంటామని ఎలా అనుకున్నారు?’ అని అడుగుతారు కూడా. కొంతమంది ఏమీ చెప్పరు. ఎన్ని సార్లు అడిగినా మౌనమే నీ భాష ఓ మూగ మనసా’. రెండే రెండు రోజుల క్రితం ఒక సంపాదకులు పంపిన సమాధానం – “మీరు రాసినది మా వెబ్ సైట్ లో వేసుకోవడానికి పనికిరాదు అని మేము తేల్చాము.” ఆ తర్వాత ఎన్ని సార్లు ‘అమ్మా దీన్ని ఏమి చేసి బాగు చేయవచ్చో చెప్పగలరా?’ అని అడిగినా సమాధానం రాదు. ఇంకా వీళ్ల గురించి వివరంగా చెప్పాలంటే కిందన చూడండి.

    >> సంపాదకులెవ్వలైన గాని ఏద్జూసినా సరే ఆల్ల నోటనుంచి వచ్చేట్ది, అనంగా మొదటి మాట ఏందంటె “ఇది బాగలె” …ఆల్లు ఆ మాటను గాట్టిగ పట్కోని కూకుంటరు.

    ఎవరైనా రాసినది సంపాదకులు మనం రాసినది వెంఠనే ఎందుకు వేసుకోవాలంటారు? వాళ్ళ కష్టాలు వాళ్లకున్నాయి. నేను పాతిక పేజీలు కధ రాసాననుకోండి. దాన్ని పది పేజీలు మించకుండా కథ సరిగ్గా చెప్పవచ్చేమో? ఆ మధ్యన ఒక పరిశోధన పత్రం రాసాను. పది మంది దిద్దాక చెప్పారు – “అయ్యా ఇది బాగానే ఉంది కానీ పేజీకి పాతిక తప్పులున్నై అని మేము అనుకుంటున్నాం. దిద్దితే వచ్చే ఏడు – అంటే ఎనిమిది నెలలు ఆగాలి – వేసుకుంటాం. లేకపోతే మీకో దణ్ణం మా సమయం చెడతినకండి.” ఏదైనా నేను రాసినది నా కళ్ళకి అద్భుతమైన వస్తువు. అది సంపాదకులకి ఎందుకు నచ్చాలి? మీరో కవిత రాసారనుకుందాం. ఎవరో చదివేసి ‘అద్భుతం’ అన్నారు. మరోటి మరోటీ రాసారు. ఎప్పుడూ కూడా అదే సమాధానం వస్తోంది. అంటే ఏమిటో తెలిసిపోతోంది కదా – మీరు రాసేది అవతలవాళ్ళు చదవడంలేదు. మీరు పంపారు కదా అని అద్భుతం అంటున్నారంతే. ఫేసు బుక్కులో లైకులు, ఫోనుమీద వచ్చేవీ ఇటువంటివే. ఎవరికీ తీరికలేదు. అవతల వాడు ఏదో పెట్టాడు పేజీలో నేను వాడి స్నేహితుణ్ణి కనక ఓ లైకు కొట్టేసి తప్పుకుంటే చాలు. లైకు కొట్టకపోతే వాడేమనుకుంటాడేమో అని మరో చింత.

    ఇప్పుడు మీరు అదే కవిత సంపాదకుడికి పంపారు, ఆయన – “అబ్బాయి ఇందులో అక్షర దోషాలున్నై, కవిత పెద్దదైంది ఇలా చేస్తే బాగుంటుంది” అన్నారనుకోండి. దానివల్ల మీకు కొత్తగా కవిత చిన్నదిగా పొందిగ్గా రాయడం ఎలా అనేది తెలియవచ్చు. మీ కళ్లలో కనిపించని అక్షర దోషాలు ఆయనకి కనిపించినై. ఇప్పుడు చెప్పండి మీక్కావాల్సింది ఇటువంటిదా లేకపోతే ఫేసుబుక్కు లైకులా? నా మటుక్కి నాకు ఎవరైనా నేను రాసేదాంట్లో ఫలానాది ఇలా చేస్తే బాగుండొచ్చుఅని చెప్తేనే నా రాత బాగు పడొచ్చు అనిపిస్తుంది. ఇంకో విషయం నేను రాసిన పాతికపేజీలు కథ వేయాలంటే సంపాదకులకి తలనెప్పి – వెబ్ సైట్ మీద కంటెంట్ వల్ల, పుస్తకంలో కాయితాల వల్లా, పొడుగు వల్లా, అంత పెద్దది అసలు మన పాఠకులు చదువుతారా అనేదాని వల్లా. మొదట్లో చెప్పినట్టూ వాళ్ళ కష్టాలు వాళ్లవి. మీకు ఇష్టం ఉంటే రాయండి లేకపోతే మీ ముక్కు మూసి, మీ గొంతుకలో బలవంతంగా ఎవరూ కాకర రసం పోయాలనీ అది మీరు మింగి తీరాలనీ చూడడం లేదు కదా? అసలు ఈ పత్రికలు చదవమనే మిమ్మల్ని ఎవరూ బలవంతం చేయలేరు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం పత్రిక వాళ్లది. మిమ్మల్ని బొట్టుపెట్టి పిల్చి రాయమన్నారా? చదవమన్నారా? నేను పంపించే పత్రికల్లో, పరిశోధన పత్రాల్లో ‘బాగాలేదు, దిద్దండి, వేసుకోం’ అనే సమాధానాలు నూటికి 99 సార్లు వస్తాయి. మీకు ఇంకా తెలియకపోతే ఇది వినండి. మొదట్లో నేను ఈమాట పత్రికకి ‘అతి ఉత్సాహం’ వల్ల టాల్ స్టాయ్ కధ ఒకటి తెలుగులో ముక్కస్య ముక్కార్ధంగా రాసి పంపించా. “అనువాదం అంటే ఇది కాదండి, కొన్ని చోట్ల మిగతావాళ్ళు చేసిన అనువాదాలు చూసి నేర్చుకోండి’ అని చెప్పారు. ఇదేమిటిలా అన్నారని వెనక్కి చూసుకున్నాక మిగతావి చేయగలిగాను. అందువల్ల నేను నేర్చుకున్నా కొన్ని విషయాలు. అయితే అందరికీ అలా అవ్వాలని లేదు. నాకొచ్చిన పదో తరగతి తెలుగుకంటే ఇక్కడ అతిరధ మహారధులైన రచయిత(త్రు)లకి చాలా బాగా వచ్చు. వాళ్ళకి ఎలాంటి అనుభవం అయిందో నాకు తెల్సుకోవల్సిన అవసరం లేదు. ఎవరి ఇష్టకష్టాలు వారివి. మరోమాట చెప్పనివ్వండి. సంపాదకులు వేసేవన్నీ మహా గొప్పవేమీ కానక్కర్లేదు. కొండొకచో వాళ్లకి నచ్చినవి పాఠకులు మెచ్చరు. మనం నేర్చుకుంటున్నట్టే వాళ్లకీ ఓ లెర్నింగ్ కర్వ్ ఉందనేది పచ్చి నిజం.

    >> పోతె మీరు “డు” అనె పదం పుచ్చుకోని ఎన్ని పైదా బెట్టించొచ్చు అని అడ్గిరి. నే లెక్కెసిన, 3666 పదాలు పైదా అయితయ్…ఔ! తీన్ హజార్ పైననే అయితయ్! కావల్నంటె ఫ్రి డిక్షనరి డాట్ కాం లా సూస్కోండి.

    Do అనే దానిలో D, O అనే రెండు అక్షరాలతో మొదలయ్యే పదాలు లెక్కబెట్టినట్టున్నారు. నేను చెప్పినది “Do” అనే క్రియాపదంలోంచి వచ్చే పదాలు. చేయు, చేయను, చేయించు, చేయగలను వగైరా. కవిత చాలాబాగుంది అందువల్ల శ్రీనివాస్ గారికి అభినందనలు చెప్పాలి. చివరగా, ఈ వ్యాఖ్యల వల్ల కవిత గురించి మనం అసలు విషయం మాట్లాడ్డం మానేసి పక్కదోవపడుతున్నాం కనక ఇక్కడ ముగిద్దాం. దయచేసి ఇంక లాగకండి. మీరు చెప్పినట్టుగా ఇంగ ఇక్కడ్నే ఉందాం. 🙂

  7. భయం – భక్తి గురించి T.subrahmanyam అభిప్రాయం:

    05/08/2020 7:30 am

    చాలా బాగుంది కాని ఇరాఖ్ లో భార్యతో వున్నపుడు నిరొధ్ గురించి చెప్పినపుడు కొంచం సున్నితముగా రాసి వుందవలసినది.

  8. మరణ మృదంగం గురించి tadepalli subrahmanyam అభిప్రాయం:

    05/08/2020 1:43 am

    Sir,your translation into Telugu is excellent and far beyond imagination(In childhood I tried to follow telugu Soviet bhoomi,but due to terrible and scary translation; could not continue).Now am in a dilemma whether this translation is more versatile and beautiful than that of Tolstoy.congratulations

  9. మధ్య వ్యవధిలో నీడలు గురించి వారణాసి నాగలక్ష్మి అభిప్రాయం:

    05/07/2020 9:54 pm

    ఊహకీ మాటకీ, మాటకీ చేతకీ మధ్య ఎంత అంతరం! చటుక్కున వచ్చిపడ్డ అవాంతరం. ‘మధ్య వ్యవధిలో నీడలు’ భలే శీర్షిక. నేటి ‘థప్పడ్’ సినిమా నేపధ్యంలో, అదే ఇతివృత్తం మీద రెండు దశాబ్దాల క్రితమే ఇంత పదునైన కథ వచ్చిందని ఇప్పుడే తెలిసింది. చంద్ర కన్నెగంటి గారికి అభినందనలు! ముఖపుస్తకంలో ఈ కథని షేర్ చేసిన చంద్రలతకి ధన్యవాదాలు.

  10. మనుషులెందుమూలంగా జీవిస్తారు? గురించి Raghunadhachari.P అభిప్రాయం:

    05/07/2020 7:52 am

    Good evening sir,

    Thanks for giving us the opportunity to read Leo Tolstoy. I can’t understand exactly if i read in english.

    Super narration by you sir.

    Once again thanks for translating Leo Tolstoys supreme thoughts.