విజయ్ గారు: “అంజలిదే మానవోత్తమా పాట(4) చిత్తరంజన్ గారువపాడినది వేసారు. మోహన్‌రాజు గారు కూడా పాడారు.”
మీ నాన్నగారు పాడిన పాట రికార్డింగు కూడా నా దగ్గరున్నది కానీ, పై వ్యాసం/నివాళి రాసి పంపిన సమయంలో అది నాకందుబాటులో లేదు. అందువల్ల, పైన చెప్పినట్లు టి.వి.రావుగారి దగ్గర చిత్తరంజన్ వెర్షన్ తీసుకుని వాడుకున్నాను.
“ఎన్నిసారులు అన్నదొ… మోహన్‌రాజు గారు పాడినది”.
అవును! సాధారణంగా నేను MP3 ఫైలు పేరులోనే పాటయొక్క అన్ని వివరాలు రాసే ప్రయత్నం చేస్తాను. తరువాత ఈమాట సంపాదకులు ఓపిగ్గా దాని నుండి వివరాలు మరల వ్యాసంలో విడిగా తీసి ఇస్తారు. ఒక్కొక్కసారి నేను హడావిడిలో పూర్తి సమాచారం ఇవ్వని సందర్భాలున్నాయి. ఇక్కడ అలాంటి తప్పు నా వైపునుండి జరిగింది.
ఇక్కడి అభిప్రాయాలు చాలా ఆలస్యంగా చూస్తున్నాను. క్షంతవ్యుణ్ణి!
“బెజవాడ రేడియో లో శ్రీరంగం గోపాలరత్నం, వి బి కనకదుర్గ గార్లతో పోల్చినప్పుడు లక్ష్మి గారు చాలా పేలవంగా (నా చిన్నతనం లోనే) అనిపించేవారు.”
మీ అభిప్రాయంతో – ముఖ్యంగా అలా పోల్చి చూస్తే – అంగీకరిస్తాను.
మీరు గతంలో మీ తోటి విద్యార్థిని వింజమూరి సూర్యసుబ్బలక్ష్మిగారి గురించి అడిగారు. కానీ నా దగ్గరున్న పిల్లల పాటలు సంఖ్యా పరంగా తక్కువ. దాదాపుగా అన్నీ నా చిన్నతనంలో రికార్డు చేసుకున్నవి. అన్నీ బృందగానాలే. నాకున్న మరొక సమస్య పాడిన వాళ్ల వివరాలు అప్పట్లో టేపులపైన రాసుకోకపోవడం. “అందమైన చందమామ” పాటని చాలామంది పాడారని అర్థమయ్యింది.
మీకు తెలిసే వుంటుంది. “‘నూపుర్” లో (భైరవిలో) స్వరజతి పాడిన (D.V.) కనకదుర్గగారు — బెజవాడ సంగీత కళాశాలలో పనిచేస్తూ చిన సత్యంగారి ట్రూపులో పాడేవారు, వి.బి.కనకదుర్గగారు వేర్వేరు వ్యక్తులు.
విజయ్ గారు: మీ నాన్నగారు “హృదయమా కదులుమా” అన్న పాట పాడిన విషయం నాకు తెలియదు. ఇప్పుడే ఫేస్‌బుక్‌లో చూసి, విన్నాను. Thank you!!
యెంతో హాయిగా చదివించే చక్కటి తెలుగు అనువాదం. చదువరులకు శారద అనబడే ఒక తమిళ యువకుదు యవ్వనంలో వుండగా తెలుగులో వ్రాసిన కథలను గుర్తుకు తెచ్చింది. సూటిగా స్పష్టంగా వ్రాసిన ఈ కథ అనువాదం తెలుగుని ఉన్నత శిఖరాలకు తీసుకువెడుతుంది.
అశోక్‌కుమార్‌గారు, బహుశా యేదో దివ్యమైన శక్తి మీచేత ఈ పురాణం (కథ కాదు) వ్రాయించి వుంటుంది. యెంత ఒడుపైన భాషా పటిమ, యెంత జిగి! దీనిని చదవటానికి కూడా యేదో సుకృతం వుండాలి అంటే అతిశయోక్తి కాదు. కృతజ్ఞతలు. మీరు నూరేళ్ళు జీవించి తెలుగు సాహిత్యాన్ని సంపన్నం చేయగలరు.
శర్మ గారూ!
“భగవంతుడనేవాడున్నాడు అనేది…ఆ భగవంతుడి గురించి మాట్లాడ్డానికి అర్హత సంపాదించుకోవచ్చు.”
పైన నేను ఉట్టంకించిన మేరా మీరు భగవంతుడి గురించి (ఎంతోకొంత) మాట్లాడారని నేను అనుకోవచ్చా? నేను అలా అనుకోవటంలో తప్పు లేకపోతే, భగవంతుడి గురించి మాట్లాడే అర్హత మీకు ఉన్నది అని మీరు చెఫ్పుకుంటున్నారని నేను అనుకోవచ్చా? కాదూ – ఏమి మాట్లాడితే, ఎంత మాట్లాడితే భగవంతుడి గురించి మాట్లాడినట్టు?
ఇక f(x,y)=z అంటే x,y లకు z పుట్టటం అన్న పద్ధతిలో పురాణాలు చెప్పి ఉండవచ్చును గదా పుట్టటం గురించి ఇంత గొడవ ఉందేదిగాదు. అక్కడ ఒక మొగ పాత్రని, ఒక ఆడ పాత్రని ప్రవేశపెట్టి వాళ్ళకు ఒక బిడ్డ పుట్టినట్లు చెబితే నా వంటివాడికి బుద్ధి తక్కువ ఆలోచనలు రావద్దంటే ఎలా? లంచం తీసుకోవటమే కాదు లంచం ఇవ్వజూపటమూ తప్పేగదా!
వ్యాసంలో లింక్స్ ఇచ్చాను కదా అని బద్ధకించాను. టే హాహాఫ్, విలియం గిఫర్డ్ లింకులు ఆ సంఘటనల గురించి నెట్‌లో ఉన్న వ్యాసాలకు దారి తీస్తాయి. ఆన్రీ షారియే పుస్తకం ఏ ప్రతిలో ఉందో తెలియక ఆ ప్రతి ప్రచురణ వివరాలు ఇవ్వలేదు. (కాని, ఏ అనువాదం ముందుమాటలో అయినా ఉంటుందనుకుంటాను.)
పాలగుమ్మి విశ్వనాథం (1919-2012) – లలిత సంగీత నివాళి గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:
06/01/2020 7:55 am
విజయ్ గారు: “అంజలిదే మానవోత్తమా పాట(4) చిత్తరంజన్ గారువపాడినది వేసారు. మోహన్‌రాజు గారు కూడా పాడారు.”
మీ నాన్నగారు పాడిన పాట రికార్డింగు కూడా నా దగ్గరున్నది కానీ, పై వ్యాసం/నివాళి రాసి పంపిన సమయంలో అది నాకందుబాటులో లేదు. అందువల్ల, పైన చెప్పినట్లు టి.వి.రావుగారి దగ్గర చిత్తరంజన్ వెర్షన్ తీసుకుని వాడుకున్నాను.
“ఎన్నిసారులు అన్నదొ… మోహన్‌రాజు గారు పాడినది”.
అవును! సాధారణంగా నేను MP3 ఫైలు పేరులోనే పాటయొక్క అన్ని వివరాలు రాసే ప్రయత్నం చేస్తాను. తరువాత ఈమాట సంపాదకులు ఓపిగ్గా దాని నుండి వివరాలు మరల వ్యాసంలో విడిగా తీసి ఇస్తారు. ఒక్కొక్కసారి నేను హడావిడిలో పూర్తి సమాచారం ఇవ్వని సందర్భాలున్నాయి. ఇక్కడ అలాంటి తప్పు నా వైపునుండి జరిగింది.
ముఖం కడగని అందగత్తె గురించి tadepalli subrahmanyam అభిప్రాయం:
06/01/2020 7:47 am
అతి చక్కనైన అనువాదం. ఒలీవియా చాలాకాలంపాటు గుర్తుకువచ్చి (పాలు తాగే చిన్నారితో సహా) పెదిమలపై చిరునవ్వులు పూయిస్తారు.
కొన్ని లలితగీతాలు గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:
06/01/2020 7:08 am
ఇక్కడి అభిప్రాయాలు చాలా ఆలస్యంగా చూస్తున్నాను. క్షంతవ్యుణ్ణి!
“బెజవాడ రేడియో లో శ్రీరంగం గోపాలరత్నం, వి బి కనకదుర్గ గార్లతో పోల్చినప్పుడు లక్ష్మి గారు చాలా పేలవంగా (నా చిన్నతనం లోనే) అనిపించేవారు.”
మీ అభిప్రాయంతో – ముఖ్యంగా అలా పోల్చి చూస్తే – అంగీకరిస్తాను.
మీరు గతంలో మీ తోటి విద్యార్థిని వింజమూరి సూర్యసుబ్బలక్ష్మిగారి గురించి అడిగారు. కానీ నా దగ్గరున్న పిల్లల పాటలు సంఖ్యా పరంగా తక్కువ. దాదాపుగా అన్నీ నా చిన్నతనంలో రికార్డు చేసుకున్నవి. అన్నీ బృందగానాలే. నాకున్న మరొక సమస్య పాడిన వాళ్ల వివరాలు అప్పట్లో టేపులపైన రాసుకోకపోవడం. “అందమైన చందమామ” పాటని చాలామంది పాడారని అర్థమయ్యింది.
మీకు తెలిసే వుంటుంది. “‘నూపుర్” లో (భైరవిలో) స్వరజతి పాడిన (D.V.) కనకదుర్గగారు — బెజవాడ సంగీత కళాశాలలో పనిచేస్తూ చిన సత్యంగారి ట్రూపులో పాడేవారు, వి.బి.కనకదుర్గగారు వేర్వేరు వ్యక్తులు.
విజయ్ గారు: మీ నాన్నగారు “హృదయమా కదులుమా” అన్న పాట పాడిన విషయం నాకు తెలియదు. ఇప్పుడే ఫేస్‌బుక్‌లో చూసి, విన్నాను. Thank you!!
ఐదు కాళ్ళ మనిషి గురించి Tadepalli subrahmanyam అభిప్రాయం:
06/01/2020 6:49 am
యెంతో హాయిగా చదివించే చక్కటి తెలుగు అనువాదం. చదువరులకు శారద అనబడే ఒక తమిళ యువకుదు యవ్వనంలో వుండగా తెలుగులో వ్రాసిన కథలను గుర్తుకు తెచ్చింది. సూటిగా స్పష్టంగా వ్రాసిన ఈ కథ అనువాదం తెలుగుని ఉన్నత శిఖరాలకు తీసుకువెడుతుంది.
గడినుడి – 44 గురించి రవిచంద్ర అభిప్రాయం:
06/01/2020 6:03 am
ఏడు నిలువు రెండక్షరాలే ఉన్నాయి. ఆధారంలో ఆరు అని చూపించారు.
[సవరించాము. ధన్యవాదాలు. — సం.]
జిగిరీ – 2వ భాగం గురించి tadepalli subrahmanyam అభిప్రాయం:
05/31/2020 2:19 am
అశోక్‌కుమార్‌గారు, బహుశా యేదో దివ్యమైన శక్తి మీచేత ఈ పురాణం (కథ కాదు) వ్రాయించి వుంటుంది. యెంత ఒడుపైన భాషా పటిమ, యెంత జిగి! దీనిని చదవటానికి కూడా యేదో సుకృతం వుండాలి అంటే అతిశయోక్తి కాదు. కృతజ్ఞతలు. మీరు నూరేళ్ళు జీవించి తెలుగు సాహిత్యాన్ని సంపన్నం చేయగలరు.
మునులేం చేస్తారు నాన్నా? గురించి తఃతః అభిప్రాయం:
05/30/2020 9:44 am
ధన్య వాదాలు శ్రీ తాడేపల్లి:
తఃతః
:
మునులేం చేస్తారు నాన్నా? గురించి tadepalli subrahmanyam అభిప్రాయం:
05/30/2020 7:16 am
ఎంత సొగసుగా రాసేరు దీనిని! చదువుతుంటే సంతొషంతో, కూసింత తెలియని ఆవేదనతో కంటిలోనికి నీరు చేరినాది.
గ్రీకు పురాణ గాథలు 5 గురించి తః తః అభిప్రాయం:
05/28/2020 1:33 pm
శర్మ గారూ!
“భగవంతుడనేవాడున్నాడు అనేది…ఆ భగవంతుడి గురించి మాట్లాడ్డానికి అర్హత సంపాదించుకోవచ్చు.”
పైన నేను ఉట్టంకించిన మేరా మీరు భగవంతుడి గురించి (ఎంతోకొంత) మాట్లాడారని నేను అనుకోవచ్చా? నేను అలా అనుకోవటంలో తప్పు లేకపోతే, భగవంతుడి గురించి మాట్లాడే అర్హత మీకు ఉన్నది అని మీరు చెఫ్పుకుంటున్నారని నేను అనుకోవచ్చా? కాదూ – ఏమి మాట్లాడితే, ఎంత మాట్లాడితే భగవంతుడి గురించి మాట్లాడినట్టు?
ఇక f(x,y)=z అంటే x,y లకు z పుట్టటం అన్న పద్ధతిలో పురాణాలు చెప్పి ఉండవచ్చును గదా పుట్టటం గురించి ఇంత గొడవ ఉందేదిగాదు. అక్కడ ఒక మొగ పాత్రని, ఒక ఆడ పాత్రని ప్రవేశపెట్టి వాళ్ళకు ఒక బిడ్డ పుట్టినట్లు చెబితే నా వంటివాడికి బుద్ధి తక్కువ ఆలోచనలు రావద్దంటే ఎలా? లంచం తీసుకోవటమే కాదు లంచం ఇవ్వజూపటమూ తప్పేగదా!
నమస్కారాలతో
తః తః
ఈమాట సంపాదకుల పద్ధతి గురించి Madhav అభిప్రాయం:
05/28/2020 12:38 pm

మాధవ్