పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. ఎడిట్ వార్స్ గురించి లలిత అభిప్రాయం:

    10/06/2021 4:29 pm

    పూర్ణిమ వ్రాసిన కథలలో “℞: మారేజ్” కథ నాకు బాగా అర్థమైన, నచ్చిన కథ. ఇప్పుడు ఆ కథ ప్రస్తావన రావడం వల్ల మళ్ళీ పూర్తిగా చదివాను. నాకు ఆ కథ సారంశం గుర్తుంది. అది తట్టిన అంశం గుర్తుంది. అందులో అమ్మాయి వేదన గుర్తుంది. మరి “దేహ భాషల మూస” అని ఎందుకన్నారు అని తెలుసుకోవడం కోసం ఇప్పుడు మళ్ళీ చదివాను.

    ఆ కథని వర్ణించడానికి ఆంగ్లంలో “graphic description” ఆనడం సరిపోతుందనిపించింది. అర్థం రూఢి చేసుకుందామని వెతితికితే దొరికిన వివరణ నప్పినట్టు అనిపించింది:

    “If you say that a description or account of something unpleasant is graphic, you are emphasizing that it is clear and detailed.”

    ఆ కథకి, కథనానికీ ఆమె అలా చెప్పడం సరిపోయింది. అది సహజంగా ఉంది కానీ తెచ్చిపెట్టినట్లు అనిపించలేదు. అలా అయ్యి ఉంటే “మూసలో” కథ అనవచ్చునేమో.

    ఆ కథకీ, ఈ ప్రస్తుత కథకీ సామ్యం ఉంది. “చినుకులా సాగి నదులుగా పారి” అన్నట్లు ఒక సమస్య, ఎప్పుడూ ఉన్న సమస్య, ఎప్పటికప్పుడు తగ్గిపోయినట్టు మభ్యపెట్టుకుంటూ వస్తుంటే దాని మానాన అది ఉధృతంగా పెరుగుతూ పోవడం కళ్ళకి కట్టబ్దుతోంది. ℞: మారేజ్ కథలోనూ అంతే. ఇక తల వొగ్గాను అనుకుని చెప్పిన మందు తీసుకుంటే అక్కడితో సమస్య తీరలేదు, ఈ కథలో లానే.

    మరి ఈ రెండు కథలో ఒక మూసకు చెందుతాయేమో, ఆ విధంగా చూస్తే?

  2. ఒక కవిత ఏమి చేయలేదు గురించి రామారావు కన్నెగంటి అభిప్రాయం:

    10/06/2021 12:52 pm

    చాలా బాగా వచ్చింది. మూలం, అనువాదం రెండూను. ఒక్క చోట, “ఇది ఆమె రక్తం వేడిని అనుభవించదు” అన్నది లయ బద్ధంగా లేదు. ఇది ఆమె రక్తం వేడిని అనుభవించలేదు అంటే సరిపోతుందేమో, మిగతా పద్యంతో చూస్తే.

    మీరన్నట్లు, అంతకు ముందటి కవితకంటే, ఇదే బాగా ఉంది.

    పోయెట్రీ మ్యాగజిన్ చరిత్ర తెలిపినందుకు ధన్యవాదాలు. రూత్ లిలీ గురించి గుర్తు ఉంది కానీ, ఆ గిఫ్ట్ ఏంచేసారో తెలియదు ఇప్పటిదాకా.

  3. ఊహల ఊట 5 గురించి Chaganti.prasad అభిప్రాయం:

    10/06/2021 11:15 am

    ఊహల ఊట ఊరే బావిలో మరోసారి ముంచారు తులసిగారు.

    మా తాతగారు మా ఇంట్లో నుయ్యి తవ్వినప్పుడు అడిగా:
    తాతగారు! నీళ్ళు పై వర దాకా రావాలి కదా! ఇంకా అడుక్కే ఉన్నాయేంటి అని. రేపటికి ఊరతాయిరా! అన్నారు.

    ఊరడం నూతి పని. మనల్ని ముంచడం తులసిగారి పనిలా ఉంది. స్నేహ జ్ఞాపకాలు అందరికి సుపరిచితం. అవి వెన్న తో కలిపిన గోంగూర పచ్చడి కలుపుకుని తిన్నాకా వదలని సువాసనతో కలిపిన జిడ్డులా వదలవు. బాల్యంలో నేస్తం నచ్చితే, వాళ్ళు బాధ పడితే ఏదైనా సరే ఇచ్చేయాలనే తపన, అదే కనిపించింది నాగమణిని మన పిల్ల చూపించే స్నేహంలో.

    మగాళ్ళకు గుండె ఉంటుందిట. అవును! కరిగే గుండె తో మానసిక ధైర్యం తక్కువ గల జీవి మగాడని నా అభిప్రాయం, స్త్రీలు మానసికంగా బలమైన వారు. మగాడు గుండె జార్చుకుంటాడు తప్ప, ఏడవడు. తులసిగారు చెప్పినది అక్షర సత్యం. ఒక బుర్ర, ఒక గుండె. గల మంచివాడని కితాబిచ్చేసారు.

    రచయిత్రిగారు, మరో ఊటబావి కోసం ఎదురుచూస్తూ

    చాగంటి ప్రసాద్ (చా.ప్ర)

  4. ఎడిట్ వార్స్ గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    10/05/2021 8:43 pm

    సాంఘిక మాధ్యమాలు నిజాలని బూటకాలుగా, అబద్ధాలని నిజంగా చూపిస్తూ, ఆస్తిత్వవాదాల రాజకీయాలతో ప్రజల జీవితాలని ఎలా ప్రభావితం చేస్తున్నవో, సోదాహారణంగా (ఆ సంఘటనలు చదువుతుంటే తెలిసిపోతుంది) తెలియజెప్పిన కథ. తెలుగులో ఇటీవల వస్తున్న ‘దేహ భాష’ల మూసలో వస్తున్న కథలకి భిన్నంగా వుంది. ఒక సంస్కారవంతమైన కథ, ప్రిస్క్రిప్షన్ – మారేజీ లాంటి కథలు రాసిన కథకురాలు ఇలాంటి సామాజిక అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని రాయడం ముదావహం.

  5. నేను సైతం గురించి Deepthi Yerubandi అభిప్రాయం:

    10/05/2021 7:07 am

    The ending was a surprise, so Ravudu character is judging others about their greed for money but in the end his motive to visit is also the same greed.

  6. ఊహల ఊట 5 గురించి అనూరాధ కొంకేపూడి అభిప్రాయం:

    10/05/2021 2:28 am

    ఊహల ఊట చదివిన కొద్దీ చదవాలనిపిస్తుంది. మళ్ళీ నెల కొత్త ఊహలు ఏమిటని ఎదురు చూడాలనిపిస్తుంది. ఇలా రాయడం తులసి గారికి సాధ్యం కొత్త కొత్తగా ఆ కొబ్బరి కురిడి తీపి మర్చిపో గలమా? అసలు ఇప్పటి తరం పిల్లలు ఎవరైనా ఆ కొబ్బరి కురిడి నవల గలరా?

    కథలో చిన్నపిల్ల అయినా నా పెద్ద మనసుతో నాగమణికి బట్టలు పెట్టాలనుకోవడం; తనకు నచ్చిన నల్లగళ్ల గౌను ఇవ్వడం భోజనానికి పిలవడం; బూరెలలో నెయ్యి వేసుకుని తినడం పులిహార లో పెరుగు వేసుకుని తినడం కమ్మని పెరుగు ఆఖర్న నాక్కుని తినడం; ఇవన్నీ ఇప్పటి తరానికి ఆహారం తినే విధానం కొత్త రుచులు పద్ధతులు స్నేహబంధం చక్కగా అందించారు తులసి గారు.

    ఇలాంటి రచనలు ఇప్పటి తరానికి ఇప్పటికే అవసరం. తన రచనల ద్వారా మనస్తత్వాలు మనుషుల మధ్య బంధాలు, ఇంకా ఎన్నో విషయాలు అందిస్తున్న తులసి గారికి ధన్యవాదములు🙏💐

  7. వసుచరిత్రంలోని వర్ణనలలో సంఘస్థితి ప్రతిబింబాలు గురించి Desikachary అభిప్రాయం:

    10/04/2021 9:56 am

    ‘బలిచూడామణులందు’ అను పద్యంలో పొరపాటున నేను రెండు విషయముల నుజ్జగించినాను. బలిచూడామణు లను పదమునకు బలవంతులకు తలమానికమైన వారు, అంటే బలవంతులలో శ్రేష్ఠులు అనే ప్రత్యక్షాన్వయాన్నీ, ‘సారె వారించు’ అను పదాలవల్ల గలిగే ‘మాటిమాటికి వారిస్తున్నదనే’ అర్థాలను విస్మరించినాను. ‘సారె వారించు’ అని చెప్పడంవల్ల, చంద్రునిలోని హరిణము ఎనలేని బుభుక్షచేత మాటిమాటికి వరికుప్పల పైభాగాలలో మొలకెత్తిన అంకురములను తినబోవుచున్నదని, దానిని ఆకాశగంగ నిర్విరామముగా వారిస్తున్నదనే విశేషార్థము తోచుచున్నది.

  8. నేను సైతం గురించి P L Muralikrishna అభిప్రాయం:

    10/04/2021 7:45 am

    సర్వం మనీ మనీ మనీ.

  9. విషాద నగరం గురించి P L Muralikrishna అభిప్రాయం:

    10/04/2021 7:18 am

    Last line of story is superb. Katha prastutha paristitulaku addam padutundi.

  10. నేను సైతం గురించి మాధవ్ యినుగంటి అభిప్రాయం:

    10/04/2021 6:09 am

    సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. ముంగిపు అద్భుతం. అనిశెట్టి శ్రీధర్ గారు పెద్దకధలు కూడా వ్రాయాలి.