పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. గడినుడి – 60 గురించి manjari lakshmi అభిప్రాయం:

    10/02/2021 12:34 am

    నిలువు, 57 కు గడి లేదు. 58, 59 లకు క్లూ లేదు. చూడగలరు.

  2. అక్టోబర్ 2021 గురించి ఏకాకి అభిప్రాయం:

    10/01/2021 8:06 pm

    ప్రస్తుతం వున్నదీ, నడుస్తున్నదీ – వెన్ సాహిత్యం. ఇదేదో కొత్త సాహిత్యం అని కంగారు పడకండి. వెన్ డయాగ్రమ్‌లా అల్లుకుంటున్న గుంపు సాహిత్యం.

    ప్రతీ గుంపుకీ ఒక ఎజెండా. అందరూ – Ignorance is the best form of offense – అని తీవ్రంగా నమ్ముతారు. అదే అన్ని గుంపులకీ పైకి కనిపించని జెండా. అందరూ అన్నివేళలా నమ్ముతారు. తు.చ తప్పక పాటిస్తారు. ప్రతీ గుంపూ సాహిత్యాన్ని భుజాన మోస్తున్న బిల్డప్! ఏ గుంపూ ఇంకోక గుంపుని గుర్తించదు. కొంతమంది అన్ని గుంపుల్లోనూ తచ్ఛాడుతూ వుంటారు.

    మరలా ఈ పెద్ద గుంపుల్లో చిన్న గుంపులూ వుంటాయి; కులాల్లో ఉపకులాలున్నట్లుగా. ఎవరికి వారు మేధావులన్నట్లు పెద్ద బిల్డప్ ఇచ్చుకుంటూ వుంటారు. ఒక గుంపు కాకి ఎక్కడైనా వాలితే – Bravo BravO అంటూ మిగతా కాకులూ వచ్చి వాలతాయి. ఒంటరి కాకులు మనడం కష్టం. ప్చ్!

    కాకులకి పిండ ప్రదానం ప్రీతి. గతించిన పాత కాకుల్ని స్తుతిస్తున్నట్లుగా భ్రమింప జేసి – మధ్యలో తమ పాటలని తాము ఎలుగెత్తి పాడుకుంటాయి. ఇప్పుటి కాకులకి ఈ మధ్య వచ్చిన వెసులుబాటు. ఏ చెట్టూ, గుట్టా అవసరం లేదు. జూమ్, జూమ్ అనుకుంటూ ఇంట్లోంచే గాన కచేరీ మొదలెడతాయి. రికార్డింగ్ ఫెసిలిటీ కూడా వీటికి ఉంది. పాపం – మిస్సైన కాకులకోసం. ఈ కాకులన్నీ ఎవరి క్యాసెట్లు వారు ఎదుటికాకికి ఫ్రీగా అందజేస్తాయి. బోనస్ – గుంపులో వారికి రెండేసి. ఇవి కాకుండా ఏ కాకిని దర్శించినా వారి సొంతవి రెండీకలు ఇచ్చి నెమలీకల గిఫ్ట్ అన్నట్లు పోజు పెడతాయి. తీసుకున్నవారు – మా ఇంటికొస్తావు కదా? – ఇంతకంటే పెద్దీక సింగారించి మరీ పంపుతాను – అనుకుంటాయి.

    ఈ కాకుల్లో వేరేఖండాలు ఎగిరిన Dia-కాకులూవున్నాయి. వాటి గురించి వేరే వెబ్ సీరీస్. అదంతా – వెబ్ సీరీస్ – రెండో భాగంలో.

    ఇదీ ఇప్పుడు నడుస్తున్న కాకిగోల. వెరశి సాహిత్య హేల.

    (సరదాకి ఇదొక కాగ్గోల)

  3. భౌతికశాస్త్రంలో ప్రభంజనాలు: ఒక విహంగావలోకనం 1 గురించి Rao Vemuri అభిప్రాయం:

    10/01/2021 2:29 pm

    ఉందండీ. సంపాదకులవారు కూడా అభ్యంతరం చెప్పేరు. నేనే మొరాయించేను. కారణాలు అనేకం. Dark Vs Black మధ్య తేడా చూపించడం ఒకటి. మనకి Black body అనే మాట ఉందికదా. లక్షణాలలో black body కీ black hole కీ మధ్య పోలికలు ఉన్నాయి. Black body ని కృష్ణ కాయం అనడానికి మనస్సు ఒప్పుకోలేదు. ఎందుకంటే కృష్ణుడు నీలి వర్ణం వాడు, నలుపు వాడు కాదు. సంస్కృతంలోంచి తెలుగులోకి వచ్చి నల్లబడింది. కృష్ణ శబ్దం energy కి ప్రతీక కనుక dark matter, dark energy లకి కృష్ణ శబ్దమే వాడేను. ఈ వ్యత్యాసం చూపించడానికి dark = కృష్ణ, black = కర్రి అని ప్రయోగించేను. వ్యాసం చదివి అభిప్రాయం వెలిబుచ్చినందుకు ధన్యవాదాలు.

  4. అక్టోబర్ 2021 గురించి purnima అభిప్రాయం:

    10/01/2021 1:31 pm

    Firstly, the editorial notes in recent times have been at a different level. Appreciate the rage and passion that is coming out so strongly in these notes.

    నేను కక్కలేకా మింగలేకా సతమవుతున్న పాయింట్ అదే: ప్రస్తుతం రాసేవాళ్ళ మీద ఎవరికీ ధ్యాస లేదు. ధ్యాస ఉన్నవాళ్ళు తమ దోస్తులు, ఫంకాలు. అలా లేనివారు ఇంకా ఆక్టివ్ గా రాస్తుండగానే ఎవరికీ గుర్తు రారు. అసలు గత ఏడాదిగా ఫేస్బుక్ లో కోవిడ్ కారణాన అన్ని ఈవెంట్స్ ఆన్లైన్ అవ్వడం, ఆ ఈవెంట్స్ లో సాహిత్య జనాలు మాట్లాడేది వింటుంటే విరక్తి వస్తుంది. ఇహ వాటిల్లో “సమకాలీన” అని టైటిల్ లో పేరు ఉంటే అంతే సంగతులు! పూర్తిగా భజన. నాకు అర్థమవుతున్నంత వరకూ ప్రస్తుతం రాస్తున్నవారి గురించి ఎవరికీ పట్టడం లేదు. కూర్చుని చదివే ఓపిక తోటి రచయితలకి, విమర్శకులకే లేదు. వాళ్ళకి నచ్చిన ఒకరిద్దరు రచయితలెవరో ఉంటారు. వాళ్ళ గురించే తిప్పి తిప్పి మాట్లాడుతుంటారు. కొత్తగా తెలుగు సాహిత్యానికి పరిచయమవుతున్న వారు ఆ ఒక్కళ్ళిద్దరే చదవదగ్గ వారని నిశ్చయించుకుంటారు… అదో లూప్.

    శ్రీశ్రీని సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పు లేదు. కానీ పుస్తకం మార్కెట్టులో ఉన్నంత సేపే కవి గుర్తొస్తాడు. ఏదో, చలాన్ని మాత్రమే కొంచెం గట్టిగా, అప్రయత్నంగా తలుచుకుంటుంటారు అనిపిస్తుంది నాకు.

    రామారావు గారి పల్ప్, మీడియోకోర్, సీరియస్ లిటరేచర్ గురించి కూడా మనం కొంచెం విస్తారంగా మాట్లాడుకోవాల్సి ఉంది. Westలో ఉన్న terms and patterns ఇక్కడ కాపీ-పేస్ట్ చేయలేము.

    ఒక వైపు, మనం చుట్టు తిప్పి తిప్పి ఈమాట, సారంగ – ఇలా ఒక నాలుగైదు పత్రికల గురించే మాట్లాడుకుంటున్నాం అనిపిస్తుంది. pratilipi.com లాంటి సైట్లలో ఒక్కోళ్ళు నాలుగైదు నవలలు రాసేసినవారున్నారు, మనమిక్కడ తెలుగులో నవల్లే రావడం లేదు సరిగ్గా అంటున్నాం. వారికి వ్యూస్ లక్షల్లోనూ, అవార్డులు వేలలోనూ వస్తున్నాయని వినికిడి, ఇక్కడ మనం పాఠకులే లేరనుకుంటున్నాం. మనం ఎంత elitists గా ఫీల్ అయిపోయినా ప్రతిలిపిలో వచ్చేది కూడా తెలుగు సాహిత్యమే. ఇదే రామారావుగారి పాయింట్ అనుకుంటాను.

    అయినా కూడా నేను ఇక్కడ సోషల్ మీడియా భాష గురించి, సాహిత్యం గురించి అన్న మాటలతో ఏకీభవిస్తున్నాను. అన్ని రకాల సాహిత్యాలూ ఉండవలసిందే. ఒకదాని కోసం మరోటి పణంగా పెట్టనవసరం లేదు. అయితే నా వాల్ మీద కనిపించే తెలుగు/ఇండియన్ ఇంగ్లీష్ సాహిత్యకారుల పోస్టులు కంపేర్ చేస్తూ చెప్తున్నాను: మన వాళ్ళు, ది సో కాల్డ్ elitist సాహిత్యకారులు కూడా సాహిత్యానికి తగిన గౌరవం ఇవ్వడం లేదు. “నేను చెప్పే మాట ఎంత అవసరమైంది. అది ఎక్కువ మందికి చేరేలా, ఎక్కువ కాలం అందుబాటులో ఉంచేలాంటి platforms ఏవి?” అనే ఆలోచన లేకుండా కేవలం తమ వాల్స్ మీద వచ్చే ఇమ్మీడియట్ రెస్పాన్స్ కి ప్రాధాన్యత ఇస్తున్నారు. మన వాల్స్ మీద రాసుకునేవి కొన్ని ఉంటాయి, పత్రికలకి వెళ్ళాల్సినవి కొన్ని ఉంటాయి. ఆ జడ్జ్మెంట్ ఉండాలి కదా! అవును, ఫేస్బుక్ ఆల్గోరిథమ్ బయట లింక్స్ ఇచ్చిన పోస్టులకి ప్రాధాన్యత ఇవ్వదు. అందుకని కథో, వ్యాసమో అంతా పోస్టులో డంప్ చేస్తే ఎట్లా?

    కథలో, కవితలో చదవమని సతాయించడం మామూలే తెలుగులో, కానీ రెండు వేల పదాల కథలని ముక్కలు ముక్కలుగా చేసి వాట్సాప్ లో ఫార్వార్డ్ చేస్తుంటారు. కవితలు పంపేటప్పుడు కనీసం బేసిక్ ఫార్మాటింగ్ కూడా లేకుండా వచనం ఉన్నట్టు వస్తాయి మెసేజెస్. అదే, కాగితం మీద రాసిన కథనో, కవితనో లుంగచుట్టి ఎవరి మొహానికైనా వేసి కొడతారా చదవమని? ఎంత సేపని టెక్నాలజీని నిందిస్తాం? కొత్త కొత్త ఆప్స్ వస్తూనే ఉంటాయి… మన పని మీద మనకి గౌరవం ఉండక్కర్లేదా? ఇవ్వన్నీ immediate consumption కోసం వెంపర్లాటలే.

    Sorry state of affairs. I’ll end my rant here.

  5. భౌతికశాస్త్రంలో ప్రభంజనాలు: ఒక విహంగావలోకనం 1 గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    10/01/2021 1:05 pm

    మంచి వ్యాసం. తెలుగులో బ్లాక్ హోల్ కి “కృష్ణబిలం” అనే మాట వాడడం చాలాకాలం నుండి ఉంది కదండి? మీరు కొత్త పదం వాడినట్టున్నారు. గురుత్వ తరంగాలు ఉన్నాయని ఐన్‍స్టయిన్‍గారు ఎప్పుడో చెప్పారనీ, అవి ఉన్నాయనీ ఈ మధ్య ఋజువు చేసారు కదా? ఈ matter, dark matter విషయంలో సరదాకి ఒకాయన గీసిన కార్టూన్ లో ఇలా అంటాడు. “Along with dark matter and anti-matter we have recently discovered ‘does not matter’ and as you can guess it really makes no difference on anything in the universe.”

  6. గడినుడి-59 సమాధానాలు గురించి ద్రోణంరాజు వెంకట మోహన్ రావు అభిప్రాయం:

    10/01/2021 1:00 pm

    నేను అన్ని సరైన జవాబులు పంపిచాను. నాకు మెయిల్ కూడా పంపించారు. కాని సరైన సమాధానాలు పంపించిన వారి పేర్ల‌లో నా పేరు లేదు.

  7. డివైన్ కామెడీ: దాన్తె అలిగ్యేరి గురించి Rao Vemuri అభిప్రాయం:

    10/01/2021 12:44 pm

    ఎప్పుడో ఇంటర్ చదివే రోజుల్లో జోగారావు మేష్టారు దాన్తె గురించి, వర్జిల్ గురించి ఒకటి రెండు సార్లు ప్రస్తావించేరు. మా ఇంట్లో పేరడైజ్ లాస్ట్ ఉండేది. ఇవేమీ ఆ రోజుల్లో అర్థం అయేవి కాదు. ఇటీవల క్లార్క్ నోట్స్ చేత్తో పట్టుకుని డివైన్ కామెడీని అర్థం చేసుకుందికి ప్రయత్నించేను. ఈ వ్యాసం చదివిన తరువాత ఆ పుస్తకాలు మళ్ళా చదివి అర్థం చేసుకుందుకి ప్రయత్నించాలని ఉంది. రచయితకి ధన్యవాదాలు!

  8. ఎడిట్ వార్స్ గురించి ప్రసాద్ చరసాల అభిప్రాయం:

    10/01/2021 10:51 am

    కథ పొడుగునా బాధ, నవ్వు, నిస్సహాయత లాంటి భావాలెన్నో కలిగాయి.

    నేటి మీడియా పోకడలు, ప్రభుత్వాల చర్యలు, రాజకీయ పార్టీల స్వార్థం, మనగొంతుకే వుచ్చుగా మారుతున్న టెక్నాలజీ.. ఎన్నెన్నో విషయాల్ని ఒక్క కథలో చెప్పారు.

  9. ఎడిట్ వార్స్ గురించి ఎ. కె. ప్రభాకర్ అభిప్రాయం:

    10/01/2021 10:22 am

    సత్యం ఎంత పెళుసుబారిపోయిందో అద్భుతంగా ఆవిష్కరించారు. వర్చ్యువల్ రియాలిటీ వికృత రూపం చూపించిన వినూత్న కథనం. Manufacturing and manipulation of truth (ఈ పదాలకు తెలుగు నావద్ద లేదు) ని కళ్ళ ముందు నిలబెట్టిన శ్వేత విషాదం (black commedy కి వ్యతిరేకం) ఇది.

    Congratulations and thank you for this story Purnima Tammireddy.

  10. ఎడిట్ వార్స్ గురించి శ్రీనివాస్ బందా అభిప్రాయం:

    10/01/2021 9:33 am

    ఇలా రాయడం ఒక్క పూర్ణిమ గారికే చెల్లు. అటు టెక్నాలజీనీ ఇటు ప్రస్తుత సాంఘిక రాజకీయ పరిస్థితులనీ బ్లెండ్ చేసి కథనాన్ని అల్లడం పరమాద్భుతంగా ఉంది. చదువుతుంటే మధ్యలో ‘ఇదే ఇదే ఇప్పుడు కావలసిన, రావలసిన సాహిత్యం’ అనిపించింది ఎన్నోసార్లు. Hats Off!