రామారావు గారూ,
మీ స్పందనకు ధన్యవాదాలు. ఈ వ్యాసంలో చెప్పినట్టు జానకమ్మ పుస్తకం ట్రావెలోగ్ పరిధిని దాటి బాగా ముందుకు వెళ్లిన రచన. కుతూహలం, అబ్బురపడేశక్తి లను దాటి వెళ్లిన రచన.
ఇందులో ‘సమకాలీన’రాజకీయ,చారిత్రక, సామాజిక,వైజ్ఞానిక,సాంస్కృతిక,భౌగోళిక విషయాల ప్రస్తావన విశ్లేషణ ఉంది. మతం, జాతులమధ్య సామరస్యం, సంఘసంస్కరణ,పారిశ్రామిక పురోభివృధ్ధి గురించి చర్చ ఉంది. స్త్రీవిద్య, ఉద్యోగాలు, స్త్రీపురుష సమానత, అనుకూల దాంపత్యాలు గురించి పరిశీలనలున్నాయి. దేశకాలమాన పరిస్థితుల విషయంలో రచయితకు సగటును మించిన పరిజ్ఞానం ఉంది.మాంఛెష్టర్ లోని మిల్లులూ ఇతర పరిశ్రమలూ రచయిత ప్రత్యేకంగా వెళ్లి చూసారు. లండన్ హోటళ్లూ ఇళ్లలోని పనివాళ్ల గురించి ఒకటికి నాలుగుమార్లు చెప్పారు. కొన్నిసార్లు గురజాడ చెప్పిన ఆధునిక మహిళ ఈమేనా అనిపించింది.
ఈ నేపథ్యంలో, ఈ విశాల విశ్లేషణల నేపథ్యంలో వలస,వ్యాపార,కార్మిక,1857ల గురించి పుస్తకం మౌనంగా ఉండటం ఆశ్చర్యపరుస్తోంది అన్నాను..
150 సంవత్సరాల క్రితం వచ్చిన ట్రావెలాగ్, అందులోనూ ఒక మహిళ రాయడం, ఆ కాలంలో ఆచారాలను ధిక్కరించి ముందుకు వెళ్లడం సామాన్యమైన విషయం కాదు. ఆమె గమనింపు, విశ్లేషణ అంత లోతుగా ఉండి కూడా భారతదేశంలోని పరిస్థితులను ప్రస్తావించకపోవడం ఒకరకంగా ఆశ్చర్యంగా ఉంది, బహుశా ఒరిజినల్ తెలుగు వెర్షన్ ఇంకా ఏమైనా ఉండి ఉండొచ్చా అనిపించింది. ఏమైనా మీ క్రిటికల్ రివ్యూ నచ్చింది అమరేంద్రగారు.
1870ల లోనే ఇంత వివరమైన పుస్తకం వచ్చిందంటే ఆశ్చర్యం! కానీ, అప్పటి పుస్తకాలలో వ్యాపార, వలసవాద విశ్లేషణలు ఉండటం Jane Austen లో పని వాళ్ళ కుటుంబాల ప్రస్తావన వెతుక్కున్నట్లు అనుకుంటాను. ప్రయాణీకుడికి ఉండవలసింది, కుతూహలం, మానసిక వైశాల్యం, అబ్బురపడే శక్తి. విశ్లేషణా శక్తి ఉండటం ఉంటే అది కొసరు. కానీ, మన కాలపు విశ్లేషణ ఆ కాలపు విశ్లేషణ ఒక విధంగా ఉండవు కదా? మనం కూడా, మన కాలపు వివాదాలకి, ఆలోచనలకీ, బద్ధులమే! ఎప్పుడైనా కాలాతీత వ్యక్తులు అరుదు.
ఇప్పుడు కూడా, చారిత్రిక యాత్రా పుస్తకాలు చదివితే, అప్పటి విశ్లేషణలు, ఆ రచయిత గురించి తెలుసుకోవడం కోసం వాడుతారు. ఆ రచయిత దేశ కాల మాన పరిస్థితుల గురించి తెలుసుకోవడం కోసం చదువుతారు. ఇప్పుడు ఇబ్న్ బటూటా చీనా గురించి చెబితే, అది చీనా గురించే కాదు, బటూటా సొంత సమాజం, ఆ సమాజం అతనికి ఇచ్చిన దృక్పథం గురించి ఎక్కువ తెలుస్తుంది!
ఇది అనువాదం అంటే నమ్మ బుద్ధి కాదు. ఎంత సరళంగా సాగిపోయిందో. ముగింపు ఎలా ఉంటుందా అని ఎంతో ఉత్సుకతో చదివేను. కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఇంత చక్కని కథ రాసిన జయమోహన్ గారికీ, చక్కగా అనువదించిన మీకూ హృదయపూర్వక అభినందనలు.
పుట్టి పెరిగిన ప్రాణ సమేతమైన పురాతన నివాసాన్ని అవసాన దశలో తన దేహముతో పోల్చుకుని నిసహయ స్థితిలో ఒక నిట్టూర్పుగా కవి కలత చెందే హృదయ స్పందన అనుకుంటా. బహు చక్కగా వున్నది. కృతజ్ఞతలు.
జానకమ్మ ఇంగ్లండ్ యాత్ర గురించి Amarendra Dasari అభిప్రాయం:
10/02/2022 11:33 pm

జానకమ్మ ఇంగ్లండ్ యాత్ర గురించి Sudha అభిప్రాయం:
10/02/2022 9:03 pm
150 సంవత్సరాల క్రితం వచ్చిన ట్రావెలాగ్, అందులోనూ ఒక మహిళ రాయడం, ఆ కాలంలో ఆచారాలను ధిక్కరించి ముందుకు వెళ్లడం సామాన్యమైన విషయం కాదు. ఆమె గమనింపు, విశ్లేషణ అంత లోతుగా ఉండి కూడా భారతదేశంలోని పరిస్థితులను ప్రస్తావించకపోవడం ఒకరకంగా ఆశ్చర్యంగా ఉంది, బహుశా ఒరిజినల్ తెలుగు వెర్షన్ ఇంకా ఏమైనా ఉండి ఉండొచ్చా అనిపించింది. ఏమైనా మీ క్రిటికల్ రివ్యూ నచ్చింది అమరేంద్రగారు.
కూటి రుణం గురించి Gireesh Kunnathattil అభిప్రాయం:
10/02/2022 12:07 pm
ఆహా! ఎంత హాయిగా ఉంది! కథ, అనువాదమూ రెండూ చాలా చక్కగా, చిక్కగా ఉన్నాయి భాస్కర్ గారూ!
గడినుడి – 72 గురించి సంపాదకులు అభిప్రాయం:
10/02/2022 11:20 am
ముందుగా దోషాలను చూసుకోకపోవడం వలన గడినుడి ఆధారాలలో ఒక చిన్నమార్పు చేయాల్సివచ్చింది.
7 నిలువుకు ఆధారం మార్చాము. పొరబాటుకు క్షంతవ్యులం.
— సంపాదకులు
జానకమ్మ ఇంగ్లండ్ యాత్ర గురించి RAMARAO KANNEGANTI అభిప్రాయం:
10/02/2022 5:29 am
1870ల లోనే ఇంత వివరమైన పుస్తకం వచ్చిందంటే ఆశ్చర్యం! కానీ, అప్పటి పుస్తకాలలో వ్యాపార, వలసవాద విశ్లేషణలు ఉండటం Jane Austen లో పని వాళ్ళ కుటుంబాల ప్రస్తావన వెతుక్కున్నట్లు అనుకుంటాను. ప్రయాణీకుడికి ఉండవలసింది, కుతూహలం, మానసిక వైశాల్యం, అబ్బురపడే శక్తి. విశ్లేషణా శక్తి ఉండటం ఉంటే అది కొసరు. కానీ, మన కాలపు విశ్లేషణ ఆ కాలపు విశ్లేషణ ఒక విధంగా ఉండవు కదా? మనం కూడా, మన కాలపు వివాదాలకి, ఆలోచనలకీ, బద్ధులమే! ఎప్పుడైనా కాలాతీత వ్యక్తులు అరుదు.
ఇప్పుడు కూడా, చారిత్రిక యాత్రా పుస్తకాలు చదివితే, అప్పటి విశ్లేషణలు, ఆ రచయిత గురించి తెలుసుకోవడం కోసం వాడుతారు. ఆ రచయిత దేశ కాల మాన పరిస్థితుల గురించి తెలుసుకోవడం కోసం చదువుతారు. ఇప్పుడు ఇబ్న్ బటూటా చీనా గురించి చెబితే, అది చీనా గురించే కాదు, బటూటా సొంత సమాజం, ఆ సమాజం అతనికి ఇచ్చిన దృక్పథం గురించి ఎక్కువ తెలుస్తుంది!
సోల్జర్ చెప్పిన కథలు: మొదటి ఏడాది గురించి Srinivas అభిప్రాయం:
10/02/2022 2:35 am
Last sentence is classic.
కూటి రుణం గురించి n s murty అభిప్రాయం:
10/02/2022 1:37 am
భాస్కర్ గారూ,
ఇది అనువాదం అంటే నమ్మ బుద్ధి కాదు. ఎంత సరళంగా సాగిపోయిందో. ముగింపు ఎలా ఉంటుందా అని ఎంతో ఉత్సుకతో చదివేను. కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఇంత చక్కని కథ రాసిన జయమోహన్ గారికీ, చక్కగా అనువదించిన మీకూ హృదయపూర్వక అభినందనలు.
సోల్జర్ చెప్పిన కథలు: మొదటి ఏడాది గురించి Thota Reddemma అభిప్రాయం:
10/01/2022 6:12 pm
ఆర్మీ అంటే నేరము లేకుండానే శిక్ష, అదే శిక్షణలో భాగమా అని తెలియచేసే సైనిక జీవన స్మృతి. బాగుంది. కృతజ్ఞతలు.
మాటల అంచున గురించి Amarendra Dasari అభిప్రాయం:
10/01/2022 5:53 pm
కాదేదీ కవితకనర్హం అన్న పెద్దాయన మాట మరోసారి ఋజువు చేసారు. అభినందనలు
మాటల అంచున గురించి తోట రెడ్డెమ్మ అభిప్రాయం:
10/01/2022 5:48 pm