తిరగేస్తుంటే “పదేళ్ల” పనిపిల్ల టీ పట్టుకువచ్చింది రెండు కప్పుల్లో…. “అవును, చెరి ఆరు టీలు. అక్కడ పనిచేసే కుర్రాడిని చూచి దిగులు పడి పోయావు చదువుకోకుండా పనిచేస్తున్నాడని. అలాంటి వాళ్ళకోసం ఏదన్నా చేయాలని ఆ తర్వాత తరచూ అనేదానివి. I did not understand why she employed underaged children as labor.
కథను ఒక పాత్ర పర్స్పెక్టివ్ నించి మొదలెట్టి, మిగతా కథంతా ఇంకొకరి పర్స్పెక్టివ్ తో రాయడం – ఆకట్టుకుంది.
శ్రీసుధ గారి కథలు ఇంతకు ముందు కొన్ని చదివాను. కథ చెప్పే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కథల్లో తాత్వికత కనపడుతుంది. కొన్ని గుర్తుండిపోయే వాక్యాలు రాస్తారు. ఉదా. “జీవితం మామూలుగానే గడిచినా, ఆనందం లేకపోయినా, విషాదంగా ఉన్నా బానే ఉంటుంది. కానీ తప్పు చేసినట్లు దాన్ని మోస్తూ తిరగడమే కష్టం. తప్పు ఒప్పు అంటూ ఏమీ ఉండవని, తప్పు జరగడం వెనుక తెలియని, అర్థం కాని అన్యాయాలు ఉంటాయని అర్థం కావడానికి చాలా రోజులు పట్టింది.”
చాలా లోతైన పరిశీలన ఉంటుంది. కథలు జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి.
మునుపు ‘వంద కుర్చీలు’ కథ కింద ఈ రచయిత అభిప్రాయం చూశారు కదా. లేకుంటే from: Sivakumar Tadikonda on December 15, 2022, at 7:30 pm చూడండి. అది ఇలా మొదలవుతుంది.
“ఇది కథ కాదు. కల్పన కాదు. చారిత్రికతని నింపుకుని, అద్భుతమైన అక్షరాల పేనికతో చేసిన సంఘర్షణభరిత నిజజీవిత చిత్రణ. భార్యాభర్తలు ఒకరినొకరు ఎంపిక చేసుకోవడంలో కూడా కాల్క్యులేషన్! కథగా మలచింది మాత్రం గుర్తుండిపోయే ముగింపునిచ్చి అనిపిస్తుంది. ఈ జీవితం తన కెలా తెలిసిందో రచయిత కథలోనే చెబుతాడు…”
‘వందకుర్చీలు’ కథ వీరికి బాగా అర్ధమైంది. ఓహో జయమోగన్, ఓహోహో భాస్కరన్ అన్నారు. పాత వాస్తవిక ‘వార్తలు’ ఉదహరించారు. (వార్తను కథగా, కవితగా తాము మలుస్తామని కొందరు రచయితలు ఈ పత్రికలో పూర్వం చెప్పియున్నారు.)
సరే, వీరి ఆ అభిప్రాయం చదివిన వారు, వీరిదే మరో కథ కింద వెలువరించిన అభిప్రాయం ఇస్తున్నాను. పరిశీలించండి. ఆ కథ పేరు ‘ప్రతీక.’ ఈ మాట పత్రిక లోనే చూడవచ్చును.
“అక్కర్లేని చోట కామాలు విరివిగా దర్శనమిచ్చి చదవడానికి చాలా ఇబ్బందిని కలిగించాయి. ఉదాహరణలు: మొదటి వాక్యంలో కామా అవసరమే లేదు. అలాగే, “నిసి, రెసిడెన్సీ అప్పుడు ఛార్లీ బెన్సన్, బ్రాంక్స్ వెటరన్స్ హాస్పిటల్‌కు వారం వారం, విజిటింగ్ ప్రొఫెసర్‌గా వచ్చి వారి ప్రోబ్లమ్ కేస్ లకు సొల్యూషన్స్ చెప్పేవాడు.” అన్న వాక్యంలో మొదటి మూడు చోట్ల కామాలుండడంలో అర్థంలేదు. అది వుండాల్సిన ఒకేచోట – “వచ్చి” తరువాత కామానే లేదు.”
‘ప్రతీక’ -comma, full stop ల గురించి చెప్పే కథ లాగా, మరెవరికైనా అనిపించిందా? ‘వంద కుర్చీలు’ లో ఎలాటి దర్శనాలు వీరికి ఇబ్బంది కలిగించలేదు! రచయిత (జయమోహన్) సొంత పేరుతో కథలో వ్యాస భగవానుడిలా, వచ్చి కూర్చున్నందున కాబోలు! అతడు రాసిందంతా ‘నిజమని’ అనుకోటం! ‘ప్రతీక’ చదివినపుడు అలాటి అనుమానం కూడా రాదు, ఆ కథ ఎందుకో మరి అర్ధమే కాదు.
‘అభిప్రాయాలలో రచయితలు వివక్షత చూపటం’ కి ఇది ఒక ‘వాస్తవ’ ఉదాహరణ. Thanks to scientists, కోవిడ్ టెస్ట్, ప్రెగ్నెన్సీ టెస్ట్లు తమ అభిప్రాయాలలో ఇలాటి వివక్షతలు చూపవు కదా!
“ముఖ్యంగా రెండవ చరణంలో సాగరుడ వీవె అన్న చోట సా-ని సాగదీస్తూ పలికిన గమకం, ‘సహస్రబాహువులతో కాళిందిని అక్కున జేర్చుకుంటున్న సముద్రుణ్ణి గుర్తుకు చేసిందని, … చదివినప్పుడు, తెనాలి రామకృష్ణ కవి పాండురంగమహత్యం లోని ఈ పద్యం గుర్తొచ్చింది.
కథ పేరు “అమూర్తం” అయినా, చేతివ్రాత లో ఉన్న పాట తిరిగి ఇచ్చేయడంతో, గత స్మృతిలోని హిమజ్వాల రగిలి ప్రజ్వలిస్తూనే ఉంది అని తెలుపడం ద్వారా “మూర్తివంతమైన” కథకుడి విశ్వరూపాన్ని ఆవిష్కరించింది ఈ కథ.
ఆకట్టుకొనే కథనం తో సాగిన మంచి కథ అందిచినందుకు ధన్యవాదములు స్వామిన్!
మీరు కధని నడిపించిన తీరు నాకు చాలా నచ్చింది. పాత్రల వ్యవహారం సరేసరి. కధలో కొంత వైరాగ్యం కనిపించింది. కానీ జీవితం పట్ల మనిషికుండాల్సిన ఆలోచనల ఫ్రెష్ నెస్ ప్రతీ వాక్యంలో నన్ను హత్తుకుంది. బిగి సడల్లేదు. నిర్మాణం చక్కగా ఉంది. మీలో ఉన్న సారాంశ బలం, పరిణితి కధని కత్తి అంచుపై నడిపించాయి. సాహిత్య జీవులపై చేసిన వ్యాఖ్యల నిడివి తగ్గించినా కధకి ఎటువంటి నష్టం జరిగేది కాదు. మీ వాక్యం చాలా బాగుంది. కవిత్వం కంటే కధలో మరింత, మరింత గొప్పగా ఉంది. మీకు నా హృదయ పూర్వక శుభాభినందనలు.
మనిషి ఆశలు,ఆశయాలు,ఆలోచనలు ఈ మూడింటి మధ్య కొట్టుమిట్టాడుతాము అనే సత్యాన్ని చాలా చక్కగా చెప్పారు బాస్కర్ గారు. కథ చదువుతున్నంతసేపు మదిలో చాలా అలజడే కలిగిందంటే నమ్మండి.
చిట్ట చివరిది గురించి Narahari అభిప్రాయం:
02/22/2023 8:25 am
తిరగేస్తుంటే “పదేళ్ల” పనిపిల్ల టీ పట్టుకువచ్చింది రెండు కప్పుల్లో…. “అవును, చెరి ఆరు టీలు. అక్కడ పనిచేసే కుర్రాడిని చూచి దిగులు పడి పోయావు చదువుకోకుండా పనిచేస్తున్నాడని. అలాంటి వాళ్ళకోసం ఏదన్నా చేయాలని ఆ తర్వాత తరచూ అనేదానివి. I did not understand why she employed underaged children as labor.
ఫిబ్రవరి 2023 గురించి Amarendra అభిప్రాయం:
02/20/2023 7:53 pm
1989 నుంచి రాస్తున్నాను..అయినా రచయితను అని చెప్పడానికి సంకోచమే.
విభాజకం గురించి ram kanteru అభిప్రాయం:
02/14/2023 6:29 am
కథను ఒక పాత్ర పర్స్పెక్టివ్ నించి మొదలెట్టి, మిగతా కథంతా ఇంకొకరి పర్స్పెక్టివ్ తో రాయడం – ఆకట్టుకుంది.
శ్రీసుధ గారి కథలు ఇంతకు ముందు కొన్ని చదివాను. కథ చెప్పే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కథల్లో తాత్వికత కనపడుతుంది. కొన్ని గుర్తుండిపోయే వాక్యాలు రాస్తారు. ఉదా. “జీవితం మామూలుగానే గడిచినా, ఆనందం లేకపోయినా, విషాదంగా ఉన్నా బానే ఉంటుంది. కానీ తప్పు చేసినట్లు దాన్ని మోస్తూ తిరగడమే కష్టం. తప్పు ఒప్పు అంటూ ఏమీ ఉండవని, తప్పు జరగడం వెనుక తెలియని, అర్థం కాని అన్యాయాలు ఉంటాయని అర్థం కావడానికి చాలా రోజులు పట్టింది.”
చాలా లోతైన పరిశీలన ఉంటుంది. కథలు జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి.
మనకున్న గొప్ప కథకులలో శ్రీసుధ గారు ఒకరు.
కట్టమంచి వారి “కవిత్వతత్వ విచారం” గురించి జీ కే షంషీర్ ఖాన్ అభిప్రాయం:
02/13/2023 12:02 pm
సర్.
సి ఆర్ ఆర్ గారి గురించి, వారి రచన పై విశ్లేషణ చాలా బాగుంది. వారి రచన శైలిపై అభిప్రాయాలు కుండబద్దలు కొట్టింది రీతిలో ఉంది.
ఆక్సిజన్ మాస్క్ గురించి Lyla yerneni అభిప్రాయం:
02/12/2023 9:48 am
మునుపు ‘వంద కుర్చీలు’ కథ కింద ఈ రచయిత అభిప్రాయం చూశారు కదా. లేకుంటే from: Sivakumar Tadikonda on December 15, 2022, at 7:30 pm చూడండి. అది ఇలా మొదలవుతుంది.
“ఇది కథ కాదు. కల్పన కాదు. చారిత్రికతని నింపుకుని, అద్భుతమైన అక్షరాల పేనికతో చేసిన సంఘర్షణభరిత నిజజీవిత చిత్రణ. భార్యాభర్తలు ఒకరినొకరు ఎంపిక చేసుకోవడంలో కూడా కాల్క్యులేషన్! కథగా మలచింది మాత్రం గుర్తుండిపోయే ముగింపునిచ్చి అనిపిస్తుంది. ఈ జీవితం తన కెలా తెలిసిందో రచయిత కథలోనే చెబుతాడు…”
‘వందకుర్చీలు’ కథ వీరికి బాగా అర్ధమైంది. ఓహో జయమోగన్, ఓహోహో భాస్కరన్ అన్నారు. పాత వాస్తవిక ‘వార్తలు’ ఉదహరించారు. (వార్తను కథగా, కవితగా తాము మలుస్తామని కొందరు రచయితలు ఈ పత్రికలో పూర్వం చెప్పియున్నారు.)
సరే, వీరి ఆ అభిప్రాయం చదివిన వారు, వీరిదే మరో కథ కింద వెలువరించిన అభిప్రాయం ఇస్తున్నాను. పరిశీలించండి. ఆ కథ పేరు ‘ప్రతీక.’ ఈ మాట పత్రిక లోనే చూడవచ్చును.
“అక్కర్లేని చోట కామాలు విరివిగా దర్శనమిచ్చి చదవడానికి చాలా ఇబ్బందిని కలిగించాయి. ఉదాహరణలు: మొదటి వాక్యంలో కామా అవసరమే లేదు. అలాగే, “నిసి, రెసిడెన్సీ అప్పుడు ఛార్లీ బెన్సన్, బ్రాంక్స్ వెటరన్స్ హాస్పిటల్‌కు వారం వారం, విజిటింగ్ ప్రొఫెసర్‌గా వచ్చి వారి ప్రోబ్లమ్ కేస్ లకు సొల్యూషన్స్ చెప్పేవాడు.” అన్న వాక్యంలో మొదటి మూడు చోట్ల కామాలుండడంలో అర్థంలేదు. అది వుండాల్సిన ఒకేచోట – “వచ్చి” తరువాత కామానే లేదు.”
‘ప్రతీక’ -comma, full stop ల గురించి చెప్పే కథ లాగా, మరెవరికైనా అనిపించిందా? ‘వంద కుర్చీలు’ లో ఎలాటి దర్శనాలు వీరికి ఇబ్బంది కలిగించలేదు! రచయిత (జయమోహన్) సొంత పేరుతో కథలో వ్యాస భగవానుడిలా, వచ్చి కూర్చున్నందున కాబోలు! అతడు రాసిందంతా ‘నిజమని’ అనుకోటం! ‘ప్రతీక’ చదివినపుడు అలాటి అనుమానం కూడా రాదు, ఆ కథ ఎందుకో మరి అర్ధమే కాదు.
‘అభిప్రాయాలలో రచయితలు వివక్షత చూపటం’ కి ఇది ఒక ‘వాస్తవ’ ఉదాహరణ. Thanks to scientists, కోవిడ్ టెస్ట్, ప్రెగ్నెన్సీ టెస్ట్లు తమ అభిప్రాయాలలో ఇలాటి వివక్షతలు చూపవు కదా!
-Lyla
అమ్మ చెప్పిన అబద్ధం గురించి లట్టుపల్లి విక్రమ్ అభిప్రాయం:
02/11/2023 12:01 pm
రచన బాగుంది… పాలిపోయిన నిజం కంటే, రంగేసిన అబద్ధమే బాగుంటుందని అర్థమైంది.
అమూర్తం గురించి అల్లాడి మోహన్ అభిప్రాయం:
02/09/2023 8:39 pm
“ముఖ్యంగా రెండవ చరణంలో సాగరుడ వీవె అన్న చోట సా-ని సాగదీస్తూ పలికిన గమకం, ‘సహస్రబాహువులతో కాళిందిని అక్కున జేర్చుకుంటున్న సముద్రుణ్ణి గుర్తుకు చేసిందని, … చదివినప్పుడు, తెనాలి రామకృష్ణ కవి పాండురంగమహత్యం లోని ఈ పద్యం గుర్తొచ్చింది.
గంగా సంగమ మిచ్చగించునె? మదిన్ కావేరి దేవేరిగా/
అంగీకారమొనర్చునే? యమునతో ఆనందముం పొందునే?/
రంగత్తుంగ తరంగ హస్తముల ఆ రత్నాకరేంద్రుండు నీ/
అంగంబంటి సుఖించునేని గుణభద్రా, తుంగభద్రా నదీ!
కథ పేరు “అమూర్తం” అయినా, చేతివ్రాత లో ఉన్న పాట తిరిగి ఇచ్చేయడంతో, గత స్మృతిలోని హిమజ్వాల రగిలి ప్రజ్వలిస్తూనే ఉంది అని తెలుపడం ద్వారా “మూర్తివంతమైన” కథకుడి విశ్వరూపాన్ని ఆవిష్కరించింది ఈ కథ.
ఆకట్టుకొనే కథనం తో సాగిన మంచి కథ అందిచినందుకు ధన్యవాదములు స్వామిన్!
ఆక్సిజన్ మాస్క్ గురించి bhaskar అభిప్రాయం:
02/09/2023 3:02 pm
చాలా జీవితాలు ఇంతే 🙂 కథ మాత్రం చాలా బావుంది. నేను ముందే గెస్ చేసా.
వాడి కథ గురించి శ్రీరామ్ పుప్పాల అభిప్రాయం:
02/09/2023 8:49 am
మీరు కధని నడిపించిన తీరు నాకు చాలా నచ్చింది. పాత్రల వ్యవహారం సరేసరి. కధలో కొంత వైరాగ్యం కనిపించింది. కానీ జీవితం పట్ల మనిషికుండాల్సిన ఆలోచనల ఫ్రెష్ నెస్ ప్రతీ వాక్యంలో నన్ను హత్తుకుంది. బిగి సడల్లేదు. నిర్మాణం చక్కగా ఉంది. మీలో ఉన్న సారాంశ బలం, పరిణితి కధని కత్తి అంచుపై నడిపించాయి. సాహిత్య జీవులపై చేసిన వ్యాఖ్యల నిడివి తగ్గించినా కధకి ఎటువంటి నష్టం జరిగేది కాదు. మీ వాక్యం చాలా బాగుంది. కవిత్వం కంటే కధలో మరింత, మరింత గొప్పగా ఉంది. మీకు నా హృదయ పూర్వక శుభాభినందనలు.
వాడి కథ గురించి Gorantla Saheb peera అభిప్రాయం:
02/08/2023 10:54 pm