పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16489

  1. అసామాన్య సంగీతదర్శకుడు సి.ఆర్.సుబ్బరామన్ గురించి M.S.Prasad అభిప్రాయం:

    06/03/2009 2:01 am

    తెర ముందు వారి గురించే గానీ తెర వెనుక వారి గురించె ఏమంత తెలియని నాకు ఒక మహావ్యక్తి గొప్పతనాన్ని పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు.

    భవదీయుడు

  2. గురువుల సంస్మరణ కొనసాగిస్తున్న గాయని ప్రభా అత్రే గురించి M.S.Prasad అభిప్రాయం:

    06/03/2009 1:35 am

    నేను ఆలిండియా రేడియోలో పని చేసినప్పుడు తరుచుగా దక్షిణాది సంగీతం వినేదాన్ని. నాకు వారి గమకాలూ, సరిగమలు పాడే విధానమూ నచ్చుతాయి. ఆ సంగీతం కూడా నేర్చుకుని ఉంటే బావుండేది” అన్నారామె.

    కర్ణాటక-హిందుస్తానీ సంగీతాలు ఒకదానితో ఒకటి ఇంత తీవ్రంగా విభేదిస్తాయా? ఒకదానిలో నిష్ణాతులైనవారు వేరొకదానిలో పూర్తి అనభిజ్ఞులుగానో ప్రారంభదశలోనో ఉంటారా? వీటి మధ్య దూరం వైద్య – ఇంజనీరింగుల మధ్య అంత విస్తృతమైనదా లేక వృక్ష-జంతు శాస్త్రాల మధ్య అంత సన్నిహితమైనదా? వివరించరా.

  3. స్త్రీ పర్వంలో గాంధారి గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    06/02/2009 10:35 pm

    మూడేళ్ళ క్రితం ఈ వ్యాసం చదివినప్పుడు స్త్రీ పర్వం చదవాలి అనుకున్నాను గాని, మిగతా పర్వాలలాగే దానినీ చదవడానికి ఇంకా కుదరలేదు. ఇవాళ సాయంత్రం మా అమ్మాయిని పార్కుకి తీసుకెళ్తూ ఏ పుస్తకం తోడు తీసుకెళదామా అనుకొని, నా కంప్యూటర్ వ్యాసానికి గడువు దగ్గర కొచ్చింది, కాస్త మంచి తెలుగు మాటలున్న దేదైనా చదివితే ఉపయోగపడుతుందని, ఓ తెలుగు పుస్తకాన్ని తీసుకుకెళ్ళాను. అది వడలి మందేశ్వరరావు గారి “శోకం నుంచి స్వర్గానికి: (ఆంధ్ర మహాభారతంలోని స్త్రీ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వాల కథాకథనం).”

    నిఘంటువు అవసరం లేకుండానే, దీంట్లో గాంధారి గుండె మంట మనల్ని కాల్చేస్తుంది. గాంధారి శాపమున్న పద్యాన్ని విశ్లేషిస్తూ, వడలి మరో పద్యాన్ని గుర్తు చేశారు. దీనిని భారతంలో కెల్లా చెప్పుకోదగ్గ పద్యమంటారు. నాకు చాలా ఇష్టైమైన పద్యం కూడా. శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు సభలో దక్షులైన సభాసదులు ఉపేక్షిస్తే సర్వనాశనం తప్పదని హెచ్చరించే పద్యం:

    “సారపు ధర్మమున్ విమల సత్యమున్‌ పాపముచేతన్‌ బొంకుచేన్‌
    పారమున్‌ పొందలేక చెడఁబాఱినదైన యవస్థ దక్షు లె
    వ్వార లుపేక్ష సేసిరది వారలచే టగుఁగాని ధర్మని
    స్తారక మయ్యు సత్యశుభదాయక మయ్యును దైవముండెడున్.

    సమాజంలో సత్యం, ధర్మం దారుణంగా పతనమౌతూ ఉంటే, దానిని నిరోధించే
    శక్తి కలిగి ఉండీ, ఉపేక్షచేస్తే, ఆ ఉపేక్ష ఫలితం తమ పతనానికీ, సర్వ
    అనర్థాలకూ కారణమవుతుంది.”

    గాంధారి కృష్ణుణ్ణి, కురుపాండవుల మధ్య యుద్ధాన్ని ఆపగలిగే సామర్ధ్యం ఉండీ ఉపేక్ష చేశాడనీ, దానికి ఫలితం అనుభవించాలనీ శపిస్తుంది.

    “దక్షులెవ్వారు లుపేక్ష సేసిరది వారల చేటగు” – అది అనేక సందర్భాలలో గుర్తుంచుకోవాల్సిన మాట.

    కొడవళ్ళ హనుమంతరావు

  4. వెంటాడుతున్న ఊడుగపూత పరిమళం గురించి rama bharadwaj అభిప్రాయం:

    06/01/2009 10:14 pm

    మొన్న ఆదివారం నాడు పుణె లో ప్రసిధ్ధ ఆంగ్ల కవయిత్రి కమలాదాస్ తన 75వ ఏట [చిన్న కుమారుని ఇంట్లో] తీవ్ర అనారోగ్యంతో మరణించారు. ఆమె రాసిన అనేక కవితలు చాలా ప్రఖ్యాతినందినవి. ఆమె మాధవికుట్టి పేరుతో మళయాళంలో కధలు రాసేరు. ఆమె ఆత్మకధ my story చాలా సంచలనం రేపింది. వ్యక్తిగతంగా సూటిగా..సున్నిత స్వభావిగా ఉండే కమలాదాస్ జీవితం చివరి దశకంలో ఇస్లాం స్వీకరించి కమలా సురయ్యా గా పేరు మార్చుకున్నారు. ఆమె మళయాళీ నాయర్ కుటుంబంలో హిందువుగా పుట్టి..కృష్ణ భక్తురాలిగా గడిపి..చివర్లో ముస్లింగా మారటం..కేరళ సమాజాన్ని విభ్రాంతి పరిచింది. తన రచనల ద్వారానూ..తన జీవితం ద్వారానూ కమలాదాస్ ఒక రెబెల్ గానే చివరిదాకా కొనసాగారు. ఆమెని భారతీయులెందరో స్త్రీ మనోకామనల్ని ఎటువంటి సంకోచమూ లేకుండా వ్యక్తీకరించిన తొలి indian modern poetess గా గుర్తుపెట్టుకుంటారు.

    రమ.

  5. మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా గురించి పరుచూరి శ్రీనివాస్ అభిప్రాయం:

    06/01/2009 2:46 pm

    > ఘంటసాల, రాజాలు ఇద్దరు ఒకే చిత్రంలో పాడినా, ఘంటసాల సంగీత దర్శకత్వంలో రాజా ఎప్పుడూ పాడలేదు, కాని రాజా దర్శకత్వంలో ఘంటసాల (శొభ చిత్రానికి) పాడారు.

    ఈరోజు పి.బి.శ్రీనివాస్ 1964-65 ప్రాంతంలో “జ్యోతి” మాసపత్రికలో వివిధ సంగీతదర్శకులపై రాసిన వ్యాసాలు చదువుతూ తెలుసుకున్న విషయం: ఘంటసాల నిర్మించి, సంగీత దర్శకత్వం వహించిన “పరోపకారం” (1953) చిత్రంలో రాజా పాడారని. పాటల పుస్తకం చూసి ఒకటి కాదు రెండు పాడారని నిర్ధారించుకునడమైనది.; “తీయని ఈ కాపురమే దివ్యసీమ విరితేనెలూరు…” (A.P.కోమలతో), “హృదయము ఊగిసలాడే…” (ఘంటసాల, A.M.రాజా, P.లీల, A.P.కోమల)

    — శ్రీనివాస్

  6. రాగాలూ స్వరాలూ గురించి mOhana అభిప్రాయం:

    05/30/2009 1:33 pm

    నాకు సంగీతంలో పాండిత్యం సున్నా, అయినా నా ఉద్దేశంలో అన్నమాచార్యులవంటి మహానుభావులు, రామదాసు కూడా పాటలోని పదాలను ఎన్నుకొనేటప్పుడు అవి మాత్రలుగా విరిగేటట్లు జాగ్రత్తగా ఎన్నుకొన్నారు. అందుకే అవి సాహిత్యపరంగా కూడా ఉత్తమమైనవి. అందరు వాగ్గేయకారులు ఈ నియమాన్ని సరిగా పాటించలేని కారణాన ఇప్పటి ఇక్కట్లు వచ్చాయి. జయదేవుని అష్టపదులలో కూడా ఈ నియమం ఎక్కువగా పాటించబడినది. సంస్కృత సాహిత్యంలో పద విచ్ఛేదన యతిగా పరిగణించబడినది కాబట్టి ఆ వృత్తాలను, అందులో మాత్రాబద్ధమైన తాళవృత్తాలను పాడుకోవచ్చు. మనం సామాన్యంగా ఉపయోగించే చంపకమాలవంటి వృత్తాలను కూడా ఇలా రాయడానికి, పాడటానికి వీలవుతుందని నేను నిరూపించి ఉన్నాను.(మరుగేల చరా) (చర రూప పరా) (త్పర సూర్య సుధా) (కర లోచనా) అనివిరిచి పాడగా విని ఉన్నాను. అందుకే కొన్ని పాటలు వాద్య సంగీతంగా బాగుంటాయి, గాత్ర సంగీతంకన్నా. విధేయుడు – మోహన

  7. రాగాలూ స్వరాలూ గురించి rama bharadwaj అభిప్రాయం:

    05/30/2009 10:30 am

    సంగీతంలో సాహిత్యం ఒక ఉపాంగం మాత్రమే నని ప్రసాద్ గారు అంటున్నారు. కానీ మన దేశాన సంగీతపు వృధ్ధి..వికాసమూ బాగా తెలిసిన రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు మాత్రం ఇలా అన్నారు.”మన దేశమున సంగీత సాహిత్య రచనలు అనాదిగా అవినాభూతముగా కలిసి న డుచుచున్నను సంగీతము సాహిత్యమునకు శోభాకరము మాత్రముగానే వెనుకనుండి న డచిదనియు వట్టి నాద రచనలు అంతగా పూర్వకాలమున లేవనియు చెప్పవచ్చును.ఎట్లును దక్షిణ దేశమున భక్తి,శృంగారము,వీరము
    మొదలగు భావములను భగవద్విషయముగాగాని, ప్రభువులను గూర్చి కాని
    వెలువరించు రచనలు చాలవరకు నిబధ్ధగేయములేయైనను వాని భాషా రచన
    కు దేశములోనున్న విలువ నాద రచనకు లేదు గావుననే ఆ గానపధ్ధతులు నశించినవి.”

    అనంతకృష్ణశర్మ గారి అభిప్రాయము ప్రకారము..సంగీతమే సాహిత్యాన్ని అనుసరించి న డిచిందిగానీ..సాహిత్యం సంగీతాన్ని అనుసరించలేదు..అన్న ది
    విస్పష్టమౌతోంది. సాహిత్యం సంగీతానికి ఉపాంగం కాదనీ..ప్రధానాంగమేననీ కూడా ఇందువలన తేటతెల్లమౌతోంది.

    రమ.

  8. రాగాలూ స్వరాలూ గురించి M.S.Prasad అభిప్రాయం:

    05/30/2009 2:52 am

    పైన వెలువరించిన రమ గారి అభిప్రాయం చాలా సమంజసమైనది. శ్రద్ధ చూపదగినది కూడా. బాల మురళీ కృష్ణ గారితో సమానమైన ప్రతిభ గలిగిన విద్వాంసులైనా “మగా గనబదిం మనసా స్మరామి” అంటూ లేదా “ఎంద నేర్చినా ఎంద జూసినా” అంటూ పాడితే మనస్సు చివుక్కు మంటుంది. హ, ణ, ప, త అనే అక్షరాలు తమిళంలో లేక పోవచ్చు కానీ సులభోఛ్ఛారణా సాధ్యమైన ఆ ధ్వనులున్నాయి గదా.
    కానీ మహేశ్ గారి అభిప్రాయం ఆచరణ సాధ్యం కాదేమో. కొంచెం లోతుగా సహృదయంతో ఆలోచిస్తే వారు తమ అభిప్రాయాన్ని మార్చుకుంటారని భావిస్తాను. సంగీతం చ సాహిత్యం చ సరస్వతీ కుచద్వయం ఐనా కూడా సంగీతంలో సాహిత్యానికి, సాహిత్యంలో సంగీతానికి సరి సమ ప్రాధాన్యత ఇవ్వడం సాధ్యం కాదు. సంగీతంలో సాహిత్యం ఒక ఉపాంగం మాత్రమే. రాగం తాళం వంటి సంగీత ప్రధానాంశాల తరువాతనే సాహిత్యం యొక్క విలువ గుర్తించబడుతుంది. వ్యాసకర్త (గురువుగారే) వివరించినట్లు “పక్కల నిలబడి” అనే సాహిత్యాన్ని సంగీతంలో పక్కాలా నీలాబాడి అని పాడక తప్పదు. దీనికి కారణం రాగ శ్రావ్యత. సంగీతంలో ప్రతి స్వరాక్షరానికి ఒక సాహిత్యాక్షరం ఉండదు. “నిలువలేని మోహమాయె” అనే తొమ్మిది అక్షరాల సాహిత్యానికి “నీ సద సనిదపమ గమాపా మపదని పదనిద రిస” అనే ఇరవై ఒక్క స్వరాక్షరాలు కావాలి. “వనజాక్షిరో విరహమోర్వలేనె వాసుదేవు గొని తేవె” అనే సాహిత్యాన్ని పలికే స్వరాక్షరాలు విద్వంసుని ప్రతిభను బట్టీ అనేక రెట్లు ఎక్కువగా వుంటాయి. ఇక సాహిత్యాక్షరం లఘువైనా గురువైనా దీర్ఘం తప్పనిసరి. సంగీత పరమోద్దేశం శ్రుతిపేయత, శ్రావ్యత అని గుర్తించి సంగీత రసజ్ణులు దీనిని ఉపేక్షింపక తప్పదు. దీనిపై గురువుగారు చాలా సమంజసమైన సమాధానం ఇచ్చారు. కీర్తన తెలుగు భాషలో ఉంది కాబట్టీ, మీరు తెలుగు వారు కాబట్టీ కదా ఇంత గొడవ. అదే మీకు తెలియని వేరే భాష ఐతే లేదా అది గాత్ర సంగీతం గాక వాద్య సంగీతమైతే, కేవలం శ్రుతిపేయమైన ఆ మధుర సంగీతాన్ని ఆస్వాదించి ఊరుకుండేవారు కాదా. సంగీతం శ్రావ్యతా ప్రాధాన్యం కలిగినిది కాబట్టి ఇటువంటి అపరిహార్యములైన చిన్న చిన్న విషయాలను ఉపేక్షించరాదా. కాబట్టి మహేశ్ గారు గారు దీనిని పునరాలోచించి శాస్త్రీయ సంగీతంపై తమ అభిప్రాయాన్ని ఏర్పరుచుకోవాలి.
    పరిహార్యాలైన దోషాలకు ఇది వర్తించదు. రమగారు చెప్పినట్లు “కుల మురళి” అని సాగదీసి పాడడం ఖండించ వలసినదే. (రాగ పరంగా సాధ్యమైన పరిస్థితులలో) సంగీతం (రాగం) సహకరించని పరిస్థితులలో, “యాదవ” లోని “వ” ని స్వల్పంగా భంజించకుండా సాగించి “కుల” ని పాడి, అక్కడ అతి స్వల్ప కాలం ఖండించి తరువాత పదం పాడడం (యస్పీ గారు ఇటువంటి మార్పులు తమ కార్యక్రమాలలో చూపిస్తుంటారు), సంగీతం సాహిత్యం రెండిటినీ అభిమానించే వారు చేస్తారు. లేకుంటే సాహిత్య భావం దోష భూయిష్టమౌతుంది. నా చిన్నప్పుడు నేర్చుకున్న
    ఫణి రాజకం
    కణవిఘ్ననివా
    రణశాంభవశ్రీ
    అనే పదాలకులు (ఫణి రాజ కంకణ, విఘ్న నివారణ, శాంభవ అని విడదీసి) అర్థం తెలుసుకోవడానికి నాకు పదిహేను సంవత్సరాలు పట్టింది. హంసధ్వనిలోని ఈ కృతిని ఇప్పటికీ పై విరుపులతోనే పాడుతారు. సాహిత్యం తెలిసిన వారు మాత్రం యస్పీ గారు చూపిన మార్గంలో సంగీత సాహిత్యాలకు భంగం కలుగ కుండా పాడుతారు.
    గురువుగారు రోహిణీ ప్రసాదు గారినుండి గానీ లేదా తదితర ఈమాట సంగీత కళా కోవిదులైన వారినుండి గానీ ఒక చిన్న ప్రశ్న కు సమాధానం ఆశిస్తాను.
    సంగీతంలో సాహిత్యానికి చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఒక గంట సేపు పాడే కచేరీలో సాహిత్యం మొత్తం 1-2 నిముషాలకు మించదు. సంగీత విద్వాంసులకు సాహిత్యం మీద అంత పట్టుండదు. (మన ఈ మాట వ్యాసాలలోనే త్యాగరాజు గారి కీర్తనలలో సాహిత్య విలువ గణనీయం గాదని ఉటంకించారు) కానీ సంగీత సాహిత్యాలను సమంగా సంభావించేవారు ముఖ్యంగా కీర్తనలలో చివరలో స్వర విహారం చేసేటపుడు స్వరంతో పాటు సాహిత్యం కూడా జోడించి పాడుతే ఇంకా హృదయంగమంగా వుంటూంది గదా. ఉదాహరణకి శంకరాభరణం పాట చివరిలో
    రీస సాస రిరి సాస రీ సాస నినిసరీ నినిసరీ సనిప నీ నీ నీ (తప్పుండవచ్చు మన్నించాలి) తొ పాటు
    దేవ రార, కన రార, వే రార, ఉరు కృపా గుణ గణాభరణ సాకారా లాగా
    సంగీత సాహిత్యాలను జోడెద్దుల బండ్లమీద ప్రతి స్వరాక్షరానికి ఒక సాహిత్యాక్షరం నిర్మిస్తూ ఎందుకు పాడరు. ఈ విధమైన రచన త్యాగరాజుల వారు “ఎందరో మహానుభావులు” కృతిలో చేశారు కదా?

  9. తెలుగు నవలలో అస్తిత్వ వాదం గురించి Rajesh అభిప్రాయం:

    05/28/2009 12:11 am

    Hi
    Especially the last 3 Paragraphs in the article [ http://www.sartre.org/Writings/Americansandtheirmyths.htm ] are true and good ….

    Thanks for the Article.

    Rajesh Devabhaktuni.

  10. మా అమ్మ గదే! గురించి prasanna అభిప్రాయం:

    05/27/2009 11:12 pm

    చాలా బావుంది కథ.
    ఎండింగ్ బావుంది.