మహా భారతం 18 పర్వాల్లో ఒకే ఒక్క సారి చదివింది చాలా చోట్ల విసుగుగా వదిలేసింది శాంతి పర్వమైతే అనేక సార్లు చదివినవి యుద్ధ పంచకం (భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తికాలు) + స్త్రీ పర్వం. (సాహిత్య అకాడమీ వారు శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలు కలిపి ప్రచురించారు) . యుద్ధ పంచకం ఉత్సాహంతో అమూలాగ్రం చదివింప జేస్తుంది. (ఒక్క మినహాయింపు – సౌప్తిక పర్వంలోనె భీభత్త్సం అశ్వత్థామ పై అసహ్య భావాన్ని కలిగిస్తుంది) స్త్రీ పర్వమంతా కరుణా – శోక రసం. ఏకో రసః కరుణ ఏవ అన్న భవభూతి కావ్యం చదవలేదు కానీ, ఈ స్త్రీ పర్వం లోని కరుణా రస భరితమైన వర్ణనలు, శోక భరిత భావాలు కంట తడి పెట్టీంచక మానవు. వ్యాస కర్త గారు దిఙ్మాత్రంగా చూపిన కొన్ని పద్యాలు తిరిగి ఆ పర్వాన్నంతా స్మృతిలోకి తెచ్చి స్పందింపజేశాయి. భారతంలో నా అభిమాన పర్వాల్లో స్త్రీ పర్వం ఒకటి. ఈ పర్వానికి నాయకురాలు గాంధారి, ఈ పాత్ర ద్వారా ఆవిష్కరించిన కరుణా శోక రసాలు, క్రోధావేశాలు మనస్సులను కదిలించివేస్తాయి. రచయిత గారికి కృతజ్ఞతలు.
బాబ్జీలు గారి వేదన్లో సమంజసం లేదు. ఒక శాస్త్రం లోని మెలకువల్ని తెలుసుకునేందుకు వలసిన “శిక్షణ” ఎంతోకొంత లేనిదే ఆ శాస్త్రం లోని అభివృధ్ధినీ..విశేషాల్నీ..గ్రహించటం సాధ్యంకాదు. మీరు అక్షర జ్ణానం..లేని వారి చేతికి ఆంధ్ర మ హాభారతం ఇచ్చి వారిని అందులోని విశేషాల్ని ఆనందించమని అన్నా..లేదా చర్చించమని అన్నా వాళ్ళు ఎలా చేయలేరో.. అలాగే శాస్త్రీయ సంగీతంకూడా!! రాజ దర్బారైనా..ప్రజాదర్బారైనా..కాలంలోని మార్పే గానీ ఆస్వాదనకి సంబంధం ఎప్పుడూ ఆస్వాదనాయోగ్యమైన సంస్కారం మాత్రమే!! సంస్కారం అన్న దానికీ సామాన్య..అసామాన్యతకీ ఏ సంబంధం లేదు. ఎప్పుడూ ఏ కాలంలోనీ ఉండదు కూడా! అందువల్ల అత్రే గారి అభిప్రాయాలన్నీ అర్ధవంతమైనవే! creativity లో గానీ..దాని ఆస్వాదన్లో గాని బాబ్జీలు గారికి ఎంత ఇష్టమైనా సమాన త్వం అన్నిసార్లూ సాధ్యంకాదు గాక కాదు.
ఇంక మన దేశంలోని శాస్త్రీయ సంగీతపు చరిత్ర అందులో జరిగిన వికాసపు పూర్వాపరాలూ క్షుణ్ణంగా తెలిసే వీలు లేనిదే ఎవరు ఏ అభిప్రాయం వెలిబుచ్చినా దానికి బలం తక్కువ. మన దేశంలో అక్షరం వెంట స్వరం నడిచిన దశ తొలిది గానూ…దాని తరువాతి దశ స్వరం మాత్రమే ..లేదా రాగం మాత్రమే ముఖ్యమై అక్షరం వెనక్కి తప్పుకోవటం గానూ అర్ధమౌతోంది. కర్ణాటక సంగీతం ఈ దేశం లోని ప్రాచీన గాన పధ్ధతి కాగా..హిందుస్థానీ దాన్నించి విడివడి స్వర రాగ ప్రధానంగా pure music గా రూపొందిందని చెప్పొచ్చు. ………రమ.
నా సంశయ నివృత్తి చేస్తూమీరు వెలువరించిన సమాధానానికి చాలా కృతజ్ఞుడను. సాహిత్యం యొక్క అవలంబన చాలా స్వల్పంగా ఎక్కువ భాగం స్వీయ మేధోజనితమైన స్వరాల హేలతో జనరంజకమైన సంగీతాన్ని సృజించడానికి ఎక్కువ ప్రతిభా వ్యుత్పత్తి కావాలి. అది సాధకులకి అదరికి ఎలా పట్టువడుతుంది. అదీ గాక గురువు గారి ముఖంనుండి వెలువడే రాగాలాపననే ఆధారం చేసుకొని ప్రారంభకులు రాగాలను ఎలా పట్టుకోగలుగుతారు. 12 లేదా 16 స్వరాల మధ్య అంతరాలను కేవలం స్వరం విని పట్టుకోవడం సాధ్యమా. దానికన్నా కర్ణాటక సంగీతంలో సాహిత్యం సమావలంబనం వుండడం వలన మెట్లు మెట్లుగా రాగాన్ని తెలుసుకోవడం సాధ్యం అవుతుంది కదా. (మీరు ప్రారంభకులకు సినిమా పాటల ద్వారా స్థూలంగా రాగాలను గుర్తుపట్టే పరిజ్ఞానాన్నీ సమకూర్చినట్లు)
నువ్వు ఈ యుద్ధాన్ని ఆపగల సమర్థుడివి. అయినా నీవు ఆ పని చెయ్యలేదు. అందుగ్గాను నేను నిన్ను శపిస్తున్నాను. కృష్ణుడిని, అతని యాదవ కులాన్నీ, దిక్కులేని చావు చస్తారని శపిస్తుంది, గాంధారి. – వ్యాసకర్త.
అంతే. అంతే.
అవును. కొందరు స్త్రీలు అలానే ఉంటారు. గాంధారిలా. వాళ్ళకే శక్తి ఉంటుంది. వాళ్ళే చెయ్యొచ్చు ఆ పని. ఐనా ఇంకెవరో మగవాడు ఆ పని చెయ్యలేదని సాధిస్తూ ఉంటారు. మగవాళ్ళు మనమే కదా శౌర్యవంతులం అని -స్త్రీ ఏడ్చిందనో, నవ్విందనో, దెప్పిందనో, మెచ్చుకుంది అనో -ఎలాటి యుద్ధాలైనా
చేసేస్తూ ఉంటారు.
మొత్తం యాదవ వంశాన్నే నాశనం చెయ్యగల, కృష్ణ నిర్యాణాన్నే ఘటించగల శాపం ఇవ్వగల శక్తిఉన్న గాంధారికి, భారత యుద్ధం ఆపే శక్తి లేదూ? ఉన్న ఆస్థి పంచుకు తినలేక, పోట్లాటలు సృష్టించుకునేవాళ్ళు ఆమె ఇంట్లో వాళ్ళూ, యుద్ధం ఆపాల్సింది కృష్ణుడూనా?
మరి భారతకథ రాసిన పురుషులు సరే, పై వ్యాసం రాసిన, చదివిన, ఈనాటి పురుషులూ, ఆ కథలో గాంధారీ నారికి ఆ శక్తి ఉన్నదనీ గ్రహించరు. ఎందుకనో?
దక్షులెవ్వారు? స్త్రీలా? పురుషులా? అని ఆలోచిస్తున్నాను. 🙂
లైలా
PS: I liked this essay three years back and I still like it today.
హనుమంతరావు గారూ!!
తప్పకుండా ఆంధ్ర మ హాభారతం కాస్త తీరుబాటు దొరికినప్పుడల్లా కొంచెమ్ కొంచెం గానైనా చదవ్వల్సిన ఇతిహాసం. ఉత్తమ తెనుగు[బహుమంచి తెనుగు]మీకు ఎదురుపడుతుంది. చదువుతూ ఉంటే అప్పుడు తెలుస్తుంది, తిక్కన గారు తెలుగు వాడకంలో ఎంతటి నేర్పరులో! మీకు మంచి పుస్తకాల్ని సేకరించుకుని చదివే అలవాటు ఉన్న ట్టుగా అర్ధమౌతోంది. భారతం చదవటం మంచి సాహిత్యానుభవం సుమండీ!!
వెంకటేశ్వర్రావు గారు అన్న ట్టు …ముఖ్యమైన తెలుగు పుస్తకాలకి ఇవాళ్టి వాడకంలో వ్యాఖ్యానాలు రావటం కూడా ముఖ్యమే! ఆంధ్ర మ హాభారతాన్నించి..అన్నమయ్య పద సాహిత్యం దాకా!! తెనుగుని నిలబెట్టుకోవటం కోసం ఇది అత్యవసరం. చదువరులంతా దీని గురించి గాడంగా యోచన చేయవలసిన ఆవశ్యకత ఉన్న ది.
ఉత్తరాది సంగీతకారులు కర్నాటక సంగీతాన్ని ఆసక్తితో వినడం అరుదే. విన్నకొద్దిమందికీ సదభిప్రాయం కలగలేదని నాకనిపించింది. అయితే దక్షిణాదివారు సంప్రదాయాన్నీ, గ్రామరునూ తు.చ. తప్పకుండా పాటిస్తారని రవిశంకర్ చాలా ఏళ్ళ క్రితమే రాశాడు. బాలమురళీకృష్ణ ప్రతిభను మొదటగా గుర్తించినది లతామంగేశ్కర్. గత పాతికేళ్ళుగా ఆయన ప్రఖ్యాతి దేశమంతటికీ తెలిసింది. నేను ఒక పంజాబీ సంగీతాభిమానికి ఆయన పాడిన రికార్డు వినిపించాక ఆయన అన్నది ఇది: “If this is Carnatic music, what I have heard so far is not Carnatic music. I used to think that Carnatic music was two ladies singing a bhajan”.
కర్నాటక, హిందూస్తానీ పద్ధతుల్లో ముఖ్యమైన వ్యత్యాసం మనోధర్మం విషయంలో కనిపిస్తుంది. దక్షిణాదిలో ఎవరో వాగ్గేయకారుడు రాసిన కీర్తనను పూర్తిగా పాడడం ముఖ్యం. అవసరమనిపిస్తే (నే) ముందు కాస్త రాగాలాపన, చివరికి స్వరకల్పన చేస్తారు. హిందుస్తానీలో అటువంటి “పప్పులు” ఉడకవు. నాలుగే లైన్లున్న సాహిత్యం ఆధారంగా అరగంట పాటు గాయకులు (వాద్యకారులు) రాగాన్ని తాముగా ఆవిష్కరిస్తూ పోవాలి. బట్టీపట్టి పాడే అవకాశం కర్నాటకంలో ఉంటుందేమోగాని హిందుస్తానీలో అసాధ్యం. ఈ రెండూ విభిన్న శైలుల్లో పరిణామం చెందడానికి అనేక కారణాలు ఉన్నాయి. హిందుస్తానీలో రాగాలూ, స్వరాలే ప్రధానం. కర్నాటకంలో అపరిచితరాగాల్లోని ఏదో ఒక కీర్తన అయిదునిమిషాల్లో పాడి అయిందనిపించవచ్చు. అటువంటిది హిందూస్తానీలో సాధ్యం కాదు. రాగాన్ని అర్థం చేసుకునే అవకాశం కనిపించకపోవడంతో ఉత్తరాదివారు దక్షిణాది సంగీతాన్ని ఎక్కువగా వినరు. సాహిత్యం అర్థంకాకపోవడం మరొక కారణం.
మంచి వ్యాసం. చక్కని పద్యాలను ఎన్నో విషయాలను గుర్తుండేలా చెప్పారు.
ఇది ఇటీవల మృణాళిని గారి “గాంధారి” వ్యాసాన్ని (“అంధ్రజ్యోతి”లో)గుర్తుకుతెచ్చింది. ఆ వ్యాసం కూడా గాంధారి గురించి ఆలోచనాత్మకంగా, మంచి పరిశీలనతో వ్రాయడం ఆకట్టుకుంది. మా అమ్మకు ఫోనులో పూర్తి వ్యాసం చదివి వినిపించాను, కాని కాపీ చేద్దామనుకొని చేయాలేకపోయాను.
గాంధారి కృష్ణుని శపించడం అమెరికాలో tongue_in_cheek అనడానికి నిలువెత్తు దర్పణంలాకా తోస్తుంది. వేలూరి గారు వివరించినట్లు “ధర్మంబేతల ననూనమగు నిద్ధ మాతలకు నెట్లయిన సిద్ధమగు” _”ధర్మం ఎటు వుంటే అటే జయం” అన్న గాంధారి, ధర్మము యొక్క అవగాహన, స్పృహ స్పష్టంగా తెలిసికూడా, దాని పర్యవసానంగా వచ్చే పరిణామాలు అంతకంటే బాగా “చూడగలిగి” కూడా, బిడ్డలను కట్టడి చేయలేకపోవడం, చూసే కళ్ళున్నా గంతలు కట్టుకొన్న చందాన సాక్షాత్కరింపచేసిన వ్యాసుని brilliance ఊహించినప్పుడెల్లా అద్భుతమనిపిస్తుంది! యుద్ధాన్ని కృష్ణుడు ఆపగలిగి కూడా ఆపలేదని రగిలిన గాంధారికి, తను ఇవ్వబోయే, లేదా ఇచ్చిన శాపాన్ని సైతం కృష్ణుడు ఆపగలగికూడా, ఆపలేదనే స్పృహ తట్టకపోవడం, కాదుఆమెకు
తట్టకుండా ఉండేటట్లు చెప్పడం, ఆ పాత్రకు ఎంతో సహజత్వాన్ని ఆపాదిస్తూ
వ్యాసుడు చేసిన అమేయ రూపకల్పన అనికూడా అనిపిస్తుంది!
_____
విధేయుడు
_Srinivas
ఈ వ్యాసం 2-3 మార్లు చదివినా నాకేమీ అర్ధం కాలేదు. అర్ధం చేసుకోడానికి తాళం, దరువు, లయ, అక్షరాలు, మాత్రలు అనే కనీస పదాల నిర్వచనాలు తెలిసి వుండాలని మాత్రం అర్ధం అయింది. అయిదక్షరాల పాటల్లో పాట “ఏడ తానున్నాడొ బావా” ఏడక్షరాల అప్పగింతల పాట “పోయిరా మా తల్లి” అనేవి అర్ధం కాలేదు.
స్త్రీ పర్వంలో గాంధారి గురించి M.S.Prasad అభిప్రాయం:
06/04/2009 2:43 am

గురువుల సంస్మరణ కొనసాగిస్తున్న గాయని ప్రభా అత్రే గురించి rama bharadwaj అభిప్రాయం:
06/03/2009 11:11 pm
బాబ్జీలు గారి వేదన్లో సమంజసం లేదు. ఒక శాస్త్రం లోని మెలకువల్ని తెలుసుకునేందుకు వలసిన “శిక్షణ” ఎంతోకొంత లేనిదే ఆ శాస్త్రం లోని అభివృధ్ధినీ..విశేషాల్నీ..గ్రహించటం సాధ్యంకాదు. మీరు అక్షర జ్ణానం..లేని వారి చేతికి ఆంధ్ర మ హాభారతం ఇచ్చి వారిని అందులోని విశేషాల్ని ఆనందించమని అన్నా..లేదా చర్చించమని అన్నా వాళ్ళు ఎలా చేయలేరో.. అలాగే శాస్త్రీయ సంగీతంకూడా!! రాజ దర్బారైనా..ప్రజాదర్బారైనా..కాలంలోని మార్పే గానీ ఆస్వాదనకి సంబంధం ఎప్పుడూ ఆస్వాదనాయోగ్యమైన సంస్కారం మాత్రమే!! సంస్కారం అన్న దానికీ సామాన్య..అసామాన్యతకీ ఏ సంబంధం లేదు. ఎప్పుడూ ఏ కాలంలోనీ ఉండదు కూడా! అందువల్ల అత్రే గారి అభిప్రాయాలన్నీ అర్ధవంతమైనవే! creativity లో గానీ..దాని ఆస్వాదన్లో గాని బాబ్జీలు గారికి ఎంత ఇష్టమైనా సమాన త్వం అన్నిసార్లూ సాధ్యంకాదు గాక కాదు.
ఇంక మన దేశంలోని శాస్త్రీయ సంగీతపు చరిత్ర అందులో జరిగిన వికాసపు పూర్వాపరాలూ క్షుణ్ణంగా తెలిసే వీలు లేనిదే ఎవరు ఏ అభిప్రాయం వెలిబుచ్చినా దానికి బలం తక్కువ. మన దేశంలో అక్షరం వెంట స్వరం నడిచిన దశ తొలిది గానూ…దాని తరువాతి దశ స్వరం మాత్రమే ..లేదా రాగం మాత్రమే ముఖ్యమై అక్షరం వెనక్కి తప్పుకోవటం గానూ అర్ధమౌతోంది. కర్ణాటక సంగీతం ఈ దేశం లోని ప్రాచీన గాన పధ్ధతి కాగా..హిందుస్థానీ దాన్నించి విడివడి స్వర రాగ ప్రధానంగా pure music గా రూపొందిందని చెప్పొచ్చు. ………రమ.
గురువుల సంస్మరణ కొనసాగిస్తున్న గాయని ప్రభా అత్రే గురించి M.S.Prasad అభిప్రాయం:
06/03/2009 9:58 pm
నా సంశయ నివృత్తి చేస్తూమీరు వెలువరించిన సమాధానానికి చాలా కృతజ్ఞుడను. సాహిత్యం యొక్క అవలంబన చాలా స్వల్పంగా ఎక్కువ భాగం స్వీయ మేధోజనితమైన స్వరాల హేలతో జనరంజకమైన సంగీతాన్ని సృజించడానికి ఎక్కువ ప్రతిభా వ్యుత్పత్తి కావాలి. అది సాధకులకి అదరికి ఎలా పట్టువడుతుంది. అదీ గాక గురువు గారి ముఖంనుండి వెలువడే రాగాలాపననే ఆధారం చేసుకొని ప్రారంభకులు రాగాలను ఎలా పట్టుకోగలుగుతారు. 12 లేదా 16 స్వరాల మధ్య అంతరాలను కేవలం స్వరం విని పట్టుకోవడం సాధ్యమా. దానికన్నా కర్ణాటక సంగీతంలో సాహిత్యం సమావలంబనం వుండడం వలన మెట్లు మెట్లుగా రాగాన్ని తెలుసుకోవడం సాధ్యం అవుతుంది కదా. (మీరు ప్రారంభకులకు సినిమా పాటల ద్వారా స్థూలంగా రాగాలను గుర్తుపట్టే పరిజ్ఞానాన్నీ సమకూర్చినట్లు)
భవదీయుడు
స్త్రీ పర్వంలో గాంధారి గురించి lyla yerneni అభిప్రాయం:
06/03/2009 4:47 pm
నువ్వు ఈ యుద్ధాన్ని ఆపగల సమర్థుడివి. అయినా నీవు ఆ పని చెయ్యలేదు. అందుగ్గాను నేను నిన్ను శపిస్తున్నాను. కృష్ణుడిని, అతని యాదవ కులాన్నీ, దిక్కులేని చావు చస్తారని శపిస్తుంది, గాంధారి. – వ్యాసకర్త.
అంతే. అంతే.
అవును. కొందరు స్త్రీలు అలానే ఉంటారు. గాంధారిలా. వాళ్ళకే శక్తి ఉంటుంది. వాళ్ళే చెయ్యొచ్చు ఆ పని. ఐనా ఇంకెవరో మగవాడు ఆ పని చెయ్యలేదని సాధిస్తూ ఉంటారు. మగవాళ్ళు మనమే కదా శౌర్యవంతులం అని -స్త్రీ ఏడ్చిందనో, నవ్విందనో, దెప్పిందనో, మెచ్చుకుంది అనో -ఎలాటి యుద్ధాలైనా
చేసేస్తూ ఉంటారు.
మొత్తం యాదవ వంశాన్నే నాశనం చెయ్యగల, కృష్ణ నిర్యాణాన్నే ఘటించగల శాపం ఇవ్వగల శక్తిఉన్న గాంధారికి, భారత యుద్ధం ఆపే శక్తి లేదూ? ఉన్న ఆస్థి పంచుకు తినలేక, పోట్లాటలు సృష్టించుకునేవాళ్ళు ఆమె ఇంట్లో వాళ్ళూ, యుద్ధం ఆపాల్సింది కృష్ణుడూనా?
మరి భారతకథ రాసిన పురుషులు సరే, పై వ్యాసం రాసిన, చదివిన, ఈనాటి పురుషులూ, ఆ కథలో గాంధారీ నారికి ఆ శక్తి ఉన్నదనీ గ్రహించరు. ఎందుకనో?
దక్షులెవ్వారు? స్త్రీలా? పురుషులా? అని ఆలోచిస్తున్నాను. 🙂
లైలా
PS: I liked this essay three years back and I still like it today.
అత్యుత్తమ హిందుస్తానీ గాయకుడు బడేగులాం అలీ ఖాన్ గురించి Rohiniprasad అభిప్రాయం:
06/03/2009 12:12 pm
http://www.musicindiaonline.com/music/hindustani_vocal/m/artist.207/

http://indianmelody.com/badeghulam.htm
మొదటి రెండూ కొన్ని రికార్డింగులకు పనికొస్తాయి. మూడోది ఆయన గురించిన విశేషాలను వివరిస్తుంది. ఇవికాక google.com ద్వారా audio links వెతుక్కోవచ్చు.
స్త్రీ పర్వంలో గాంధారి గురించి rama bharadwaj అభిప్రాయం:
06/03/2009 10:17 am
హనుమంతరావు గారూ!!
తప్పకుండా ఆంధ్ర మ హాభారతం కాస్త తీరుబాటు దొరికినప్పుడల్లా కొంచెమ్ కొంచెం గానైనా చదవ్వల్సిన ఇతిహాసం. ఉత్తమ తెనుగు[బహుమంచి తెనుగు]మీకు ఎదురుపడుతుంది. చదువుతూ ఉంటే అప్పుడు తెలుస్తుంది, తిక్కన గారు తెలుగు వాడకంలో ఎంతటి నేర్పరులో! మీకు మంచి పుస్తకాల్ని సేకరించుకుని చదివే అలవాటు ఉన్న ట్టుగా అర్ధమౌతోంది. భారతం చదవటం మంచి సాహిత్యానుభవం సుమండీ!!
వెంకటేశ్వర్రావు గారు అన్న ట్టు …ముఖ్యమైన తెలుగు పుస్తకాలకి ఇవాళ్టి వాడకంలో వ్యాఖ్యానాలు రావటం కూడా ముఖ్యమే! ఆంధ్ర మ హాభారతాన్నించి..అన్నమయ్య పద సాహిత్యం దాకా!! తెనుగుని నిలబెట్టుకోవటం కోసం ఇది అత్యవసరం. చదువరులంతా దీని గురించి గాడంగా యోచన చేయవలసిన ఆవశ్యకత ఉన్న ది.
రమ.
గురువుల సంస్మరణ కొనసాగిస్తున్న గాయని ప్రభా అత్రే గురించి Rohiniprasad అభిప్రాయం:
06/03/2009 7:29 am
ఉత్తరాది సంగీతకారులు కర్నాటక సంగీతాన్ని ఆసక్తితో వినడం అరుదే. విన్నకొద్దిమందికీ సదభిప్రాయం కలగలేదని నాకనిపించింది. అయితే దక్షిణాదివారు సంప్రదాయాన్నీ, గ్రామరునూ తు.చ. తప్పకుండా పాటిస్తారని రవిశంకర్ చాలా ఏళ్ళ క్రితమే రాశాడు. బాలమురళీకృష్ణ ప్రతిభను మొదటగా గుర్తించినది లతామంగేశ్కర్. గత పాతికేళ్ళుగా ఆయన ప్రఖ్యాతి దేశమంతటికీ తెలిసింది. నేను ఒక పంజాబీ సంగీతాభిమానికి ఆయన పాడిన రికార్డు వినిపించాక ఆయన అన్నది ఇది: “If this is Carnatic music, what I have heard so far is not Carnatic music. I used to think that Carnatic music was two ladies singing a bhajan”.
కర్నాటక, హిందూస్తానీ పద్ధతుల్లో ముఖ్యమైన వ్యత్యాసం మనోధర్మం విషయంలో కనిపిస్తుంది. దక్షిణాదిలో ఎవరో వాగ్గేయకారుడు రాసిన కీర్తనను పూర్తిగా పాడడం ముఖ్యం. అవసరమనిపిస్తే (నే) ముందు కాస్త రాగాలాపన, చివరికి స్వరకల్పన చేస్తారు. హిందుస్తానీలో అటువంటి “పప్పులు” ఉడకవు. నాలుగే లైన్లున్న సాహిత్యం ఆధారంగా అరగంట పాటు గాయకులు (వాద్యకారులు) రాగాన్ని తాముగా ఆవిష్కరిస్తూ పోవాలి. బట్టీపట్టి పాడే అవకాశం కర్నాటకంలో ఉంటుందేమోగాని హిందుస్తానీలో అసాధ్యం. ఈ రెండూ విభిన్న శైలుల్లో పరిణామం చెందడానికి అనేక కారణాలు ఉన్నాయి. హిందుస్తానీలో రాగాలూ, స్వరాలే ప్రధానం. కర్నాటకంలో అపరిచితరాగాల్లోని ఏదో ఒక కీర్తన అయిదునిమిషాల్లో పాడి అయిందనిపించవచ్చు. అటువంటిది హిందూస్తానీలో సాధ్యం కాదు. రాగాన్ని అర్థం చేసుకునే అవకాశం కనిపించకపోవడంతో ఉత్తరాదివారు దక్షిణాది సంగీతాన్ని ఎక్కువగా వినరు. సాహిత్యం అర్థంకాకపోవడం మరొక కారణం.
స్త్రీ పర్వంలో గాంధారి గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
06/03/2009 7:06 am
మంచి వ్యాసం. చక్కని పద్యాలను ఎన్నో విషయాలను గుర్తుండేలా చెప్పారు.
ఇది ఇటీవల మృణాళిని గారి “గాంధారి” వ్యాసాన్ని (“అంధ్రజ్యోతి”లో)గుర్తుకుతెచ్చింది. ఆ వ్యాసం కూడా గాంధారి గురించి ఆలోచనాత్మకంగా, మంచి పరిశీలనతో వ్రాయడం ఆకట్టుకుంది. మా అమ్మకు ఫోనులో పూర్తి వ్యాసం చదివి వినిపించాను, కాని కాపీ చేద్దామనుకొని చేయాలేకపోయాను.
గాంధారి కృష్ణుని శపించడం అమెరికాలో tongue_in_cheek అనడానికి నిలువెత్తు దర్పణంలాకా తోస్తుంది. వేలూరి గారు వివరించినట్లు “ధర్మంబేతల ననూనమగు నిద్ధ మాతలకు నెట్లయిన సిద్ధమగు” _”ధర్మం ఎటు వుంటే అటే జయం” అన్న గాంధారి, ధర్మము యొక్క అవగాహన, స్పృహ స్పష్టంగా తెలిసికూడా, దాని పర్యవసానంగా వచ్చే పరిణామాలు అంతకంటే బాగా “చూడగలిగి” కూడా, బిడ్డలను కట్టడి చేయలేకపోవడం, చూసే కళ్ళున్నా గంతలు కట్టుకొన్న చందాన సాక్షాత్కరింపచేసిన వ్యాసుని brilliance ఊహించినప్పుడెల్లా అద్భుతమనిపిస్తుంది! యుద్ధాన్ని కృష్ణుడు ఆపగలిగి కూడా ఆపలేదని రగిలిన గాంధారికి, తను ఇవ్వబోయే, లేదా ఇచ్చిన శాపాన్ని సైతం కృష్ణుడు ఆపగలగికూడా, ఆపలేదనే స్పృహ తట్టకపోవడం, కాదుఆమెకు
తట్టకుండా ఉండేటట్లు చెప్పడం, ఆ పాత్రకు ఎంతో సహజత్వాన్ని ఆపాదిస్తూ
వ్యాసుడు చేసిన అమేయ రూపకల్పన అనికూడా అనిపిస్తుంది!
_____
విధేయుడు
_Srinivas
అత్యుత్తమ హిందుస్తానీ గాయకుడు బడేగులాం అలీ ఖాన్ గురించి M.S.Prasad అభిప్రాయం:
06/03/2009 3:04 am
ఉస్తాద్ ఖాన్ గారి కచేరి రికార్డ్ క్లిపింగ్ ఏదైనా కూడా మేము విని ఆనందించడానికి జత చేయరా. ఇది విన్నపం మాత్రమే.
భవదీయుడు
సినిమా పాటల్లో తాళం నడకలు, విరుపులు గురించి M.S.Prasad అభిప్రాయం:
06/03/2009 2:36 am