పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16489

  1. రాగాలూ స్వరాలూ గురించి rama bharadwaj అభిప్రాయం:

    05/27/2009 11:05 am

    మహేష్ కుమార్ గారి అభిప్రాయం తో ఏకీభవిస్తూ..మ చ్చుకి అలాంటి అనుభవం ఎలా ఉంటుందో చెప్తాను. “సామ జ వర గమనా”..త్యాగరాజ కృతిని చాలా బాగా పాడుతూనే….యాదవకుల.. మురళీ..అని విరవ్వల్సిన చోట మ హారాజ పురం .”యాదవ..కులమురళీ” అని “కుల”మురళీ పదం మీద పాడినత సేపూ stress చేస్తూంటే..ఆయన గొంతుని ఎంతగా న చ్చుకునే వారికైనా కూడా అది, పానకంలో పుడక లాగా గుచ్చుకుంటూ నే ఉంటుంది.
    ఆమాట చెప్తే ఆ తమిళులు అంటారు కదా!” అసలు త్యాగరాజ కీర్తనల్ని మీకు అందించింది మేమే కదా!” అని. అది నిజమే అయినా తప్పులు లేకుండా పాడొచ్చు కదా అంటేనో..తమిళం తప్పుల్తో ఉచ్చరిస్తే మీరు ఊరుకుంటారా? అంటేనో మాత్రం ఉలకరు. తప్పుల్తో ఎంత గొప్పగా పాడినా ఆ అసలుభాషలో రక్తి కట్టటం కష్టం. కానీ అది ముఖ్యమైన సమ స్య అన్న ది..ముందు చర్చకి రావాలి. దాన్ని issue చేయందే దక్షిణాదిన తెలుగులోశాస్త్రీయ సంగీతం పాడే వాళ్ళు…వళ్ళు దగ్గర పెట్టుకోరు. తెలుగుభాష మీద ఉన్న నిర్లక్ష్యం వల్లనే అర్ధ, భావాల విరుపుల మీద పాడేవారు శ్రధ్ధ పెట్టరు. అయితే అంత మాతృభాషాభిమానం ..అలా శ్రధ్ధతో తెలుగుని రాగయుక్తంగానే కాదూ..భావ యుక్తంగానూ..అర్ధం చెడకుండానూ..పాడాలని గాయకులని అడగాలన్న దీక్ష ..భాష్ మీద కనీసపు గౌరవం..అలాగే..అలా పాడే వారి వైఖరి మీద విమర్శ పెట్టే బాధ్యతా..ఏనాడైనా..తెలుగువారికి ఏదీ?? తెలుగుని హాయిగా ఆస్వాదించటంలో తెలుగు వారిలో తగినంత శ్రధ్ధ ఏదీ?? అంతేనా తమిళుల్ని అనుకరిస్తూ తెలుగు కృతుల్ని తప్పుల్తో పాడే తెలుగు వారే ఉన్నారు కూడాను.
    రమ.

  2. పునరపి గురించి Ananth Mallavarapu అభిప్రాయం:

    05/27/2009 7:40 am

    కథ చాలా చక్కగా ఉంది. రచయితకు అభినందనలు. నిజంగా రాఘవ లాంటి భర్తలు ఉంటే, మారాల్సిన అవసరం చాలా ఉంది. భార్యాభర్తలు ఇద్దరూ సంసారానికి జోడెడ్ల వంటి వారు. ఇద్దరూ సమానంగా సంసార భారాన్ని మోయాల్సి ఉంటుంది.

  3. పాటల్లో లయవిన్యాసాలు గురించి M.S.Prasad అభిప్రాయం:

    05/26/2009 11:27 pm

    మోహన గారికి

    ఒకే గురులఘువుల అమరికతో వేరువేరు గతులలో రాయడానికి
    వీలవుతుందని ఛందస్సు రచ్చబండ వేదికలపైన ఎన్నో ఉదాహరణలతో
    నేను నిరూపించిన సంగతి కొందరికి గుర్తు ఉందనుకొంటాను. ఇది
    కూడా ఒక చిత్రకవిత్వమే.

    దయచేసి మీరు పై విషయంపై వ్రాసిన వ్యాసం (వ్యాసాలు) అందజేయగలరా?
    లేదా వాటిని నేనెక్కడ (అంతర్జాలంలో) పొందగలనో తెలియజేయండి.

    భవదీయుడు

  4. జనరంజని: మహానటి సావిత్రి గురించి M.S.Prasad అభిప్రాయం:

    05/26/2009 11:29 am

    ఇప్పుడే విన్నాను. పొందిన ఆనందం వర్ణనాతీతం. మీరు చేస్తున్న జన రంజనం చల్లగా అవితధంగా సాగాలి. దశ సహస్ర శత కోటి ధన్యవాదాలు.
    భవదీయుడు

  5. పాటల్లో లయవిన్యాసాలు గురించి mOhana అభిప్రాయం:

    05/26/2009 11:01 am

    తాళం గురించి చదివిన తరువాత రెండు విషయాలు జ్ఞాపకానికి వచ్చాయి.

    1. పురందరదాసు కింది కీర్తన –
    తంబూరి మీటిదవ భవాబ్ధి దాటిదవ
    తాళవ తట్టిదవ సురరొళు సేరిదవ
    గెజ్జెయ కట్టిదవ ఖలరెదె మెట్టిదవ
    గాయన పాడిదవ హరి మూర్తి నోడిదవ
    విఠలన నోడిదవ వైకుంఠ సేరిదవ
    (తంబురాను మీటినవాడు భవాబ్ధిని దాటినవాడు,
    తాళాన్ని వేసినవాడు సురులలో చేరినవాడు,
    అందెలను ధరించినవాడు దుష్టులను అంతము చేసినవాడు,
    గానాన్ని పాడినవాడు హరిమూర్తిని చూచినవాడు,
    విఠలుని చూచినవాడు వైకుంఠాన్ని చేరినవాడు)

    2. హంసగీతె చిత్రంలో శిష్యుడు గురువుతో శ్యామశాస్త్రి పాటను
    మరొక తాళంలో పాడటానికి వీలవుతుంది అని నిరూపించాడు.
    గురువు ఓటమిని అంగీకరించి ఆత్మహత్య చేసికొంటాడు.

    ఒకే గురులఘువుల అమరికతో వేరువేరు గతులలో రాయడానికి
    వీలవుతుందని ఛందస్సు రచ్చబండ వేదికలపైన ఎన్నో ఉదాహరణలతో
    నేను నిరూపించిన సంగతి కొందరికి గుర్తు ఉందనుకొంటాను. ఇది
    కూడా ఒక చిత్రకవిత్వమే.

    ((పగలే వెన్నెల చరణం నింగి పైన చందమామ … మాత్రలు త్ర్యస్ర గతియే)

    విధేయుడు – మోహన

  6. తెలుగు వార్తాపత్రికలు – ఒక ప్రసంగం గురించి M.S.Prasad అభిప్రాయం:

    05/26/2009 10:37 am

    శ్రీనివాస్ గారికి
    అనేకానేక నమస్కారలతో
    తిరుపతి వేంకటీయములైన వేరే పుస్తకాలు మీ సమాచారం వలన లభించినాయి కానీ “నానా రాజసందర్శనము” మాత్రము మీ లింకు ద్వారానూ DLI వద్దనుండి గానీ లభ్యం కాలేదు. మరొక్క మారు మీరు పంపగలరా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టుతున్నందుకు క్షమించండి.

    భవదీయుడు

  7. పునరపి గురించి rama bharadwaj అభిప్రాయం:

    05/26/2009 1:50 am

    ఎక్కువశాతం మంది భారతీయుల ఇళ్ళల్లో చాలా మామూలుగా కన్పించే ఈ అంతులేని చాకిరీ వెనక ఎంత మంది ఆడవాళ్ళ క్షోభ నిశ్శబ్దంగా
    అలుముకుని ఉంటుందో..కోట్లాది మంది గృహిణులకి తెలుసు. ఆడవాళ్ళు స హజంగా వంట చేస్తారు. మ గవాళ్ళు స హజంగా భోంచేస్తారు అన్న ఆలోచనా విధానం బాగా మనసుకి పట్టించిన నాగరికతలు మనవి. ఇందులో ఆడవాళ్ళూ భాగమే!! ఇష్టం..మమ త..అనురాగం ఇద్దరి మ ధ్యా ఉన్నప్పుడు ఇలాంటి అ హంకారం ఉండదు.ఆధిపత్యం సాగదు. చదువుకుని ఉద్యోగం చేస్తూ ఉన్న భార్యలు రెండింతల బరువు మోస్తున్నారు ఇటువంటి ఇళ్ళల్లో.దాని గురించి స్త్రీలు ఎందుకు స్పష్టంగా ఆలోచించడం లేదో?? పై కధలో ఆ అమ్మాయికి భర్త మీద కొద్దో గొప్పో ఇష్టం ఉన్నా..అది ఆతడి ప్రవరతోనతో..క్రమేపీ చచ్చి్ ఉంటుంది. ఇహ్ ఆ బంధం ఏం బంధం!?? అలాంటి సంసారం లోని రోజు రోజూ చాకిరీ కింద నలిగిపోయే స్త్రీలో ఇంక్ ఏం రాసిక్యం మిగుల్తుందీ?? ఆ లత మొగుడు ఏమీ సరసుడు కాడని కొట్టొచ్చిట్టుగానే తెలుస్తోంది. అలాంటి నీరస వాతావరణంలో పెరిగే పిల్లల పరిస్థితి ఏమిటీ? ఆ చిన్న పిల్లవాడు పెద్దయ్యాకా..ఆ తండ్రినే అనుకరించడని చెప్పలేం. బయటి సంబంధాలు అవసరం కావటం..ఇంట్లో దొరకని తీరని ఇష్టాలు ఇంకెక్కడో దొరుకుతాయన్న భ్రమ జీవితాల్లోకి రావటం అప్పుడే కలుగుతుంది. ఆ మ గవాడు కూడా మునుపటి వాడి కన్నా భిన్నమైన వాడు కాకపోతే అంతకన్నా అపనమ్మకం ఆడదానికి ఇంకొకటి ఉండదు.ఇన్ని సమ స్యలు ఉంటాయి.యూరోప్ లో లాగా రాబోయే కాలంలో” పెళ్ళి” వెనకబట్టినా ఆశ్చర్యం లేదు. పెళ్ళికి అమ్మాయిలు విముఖత చూపించొచ్చు. గిరిధర్రావుగారి కధలో విషయం ముఖ్యమైందే..గానీ కధనంలో మాత్రం పట్టు లేదు. “పునరపి” అని అనుకోకుండా జీవిత నాయికలైన లతలు ఆ విష.. పోనీ విషమ స్థితిని దాటాలి.కొత్త ఆడుగుకి సంశయం మానాలి.అందంలేని స హజీవితం కన్నా..అందమైన ఒంటరితనం మేలు.
    రమ.

  8. పాటల్లో లయవిన్యాసాలు గురించి M.S.Prasad అభిప్రాయం:

    05/26/2009 1:07 am

    త్రిశ్ర, చతురశ్ర, ఖండ, మిశ్ర తాళ గతులు అర్ధం కాలేదు. వాటికి మీరుదహరించిన పాటలలో అక్షరాలు గానీ మాత్రలు గానీ సరిపోవడం లేదు. ఉదాహరణకి త్రిశ్ర గతి పగలే వెన్నెలా పాటలో మూడు మూడు అక్షరాలుండగా మాత్రలు నాలుగు ఐదు వున్నాయి. జగమే మాయా లో మూడు రెండు అక్షరాలు, నాలుగు నాలుగు మాత్రలున్నాయి. ఇటువంటి అవగాహనతో ఇంకా ముందుకు పోతే ఖండ మిశ్ర గతుల పాటలలో ఇంకా అయోమయంగా కనుపడుతోంది. పూర్తి ప్రాధమిక దశలో వున్న నా బోటి వారికి త్రిశ్ర, చతురశ్ర, ఖండ, మిశ్రాది గతులను మరికొంచెం విశదపరచగలరా?

    నేను సంగీతం నేర్చుకొన్న అతి కొద్ది కాలంలో మాకు ఆది తాళం (ఎనిమిది), రూపక తాళం (ఆరు) మాత్రమే తెలిసాయి. పైన చెప్పిన గతులు యస్పీ గారి ప్రొగ్రాం లోను తరువాత మీ వ్యాసం ద్వారా నామ మాత్రంగా పరిచయం అయ్యాయి.

    భవదీయుడు

  9. రాగాలూ స్వరాలూ గురించి M.S.Prasad అభిప్రాయం:

    05/25/2009 10:14 pm

    సంపాదకులవారికి
    నమస్కారం
    మీనుండి నాకెటువంటీ సందేశం రాలేదు. నేను ప్రతి దినమూ నా మెయిలు చూసుకుంటాను. ఇవాళ కూడా చూసాను. మీ మెయిలు ఎడ్రసు తెలుపనందు వలన మళ్ళీ దీని ద్వారానే సంపర్కించవలసి వచ్చింది. నా చిరునామా
    msprasad2004@rediffmail.com maringantis@email.com

    భవదీయుడు

    [మీకు గత 24 గంటలలో రెండు వేర్వేరు అకౌంట్లనుండి ఈ మెయిళ్ళు పంపాము. మీ ఇన్‌బాక్సులో అవి లేకపోతే మీ మెయిల్ సెట్టింగ్స్ తనిఖీ చేసుకోగలరు. అలానే మీ బల్క్ లేదా స్పాం ఫోల్డరులలో కూడా. మీరు పైన ఇచ్చిన రెండు అడ్రసులలో రెండవది పని చేయుటలేదు. మీ రీడిఫ్ అడ్రస్సుకి పంపిన మెయిళ్ళు ఏమీ తిరిగిరాలేదు. మీరు – editors[AT]eemaata.com ( [AT] స్థానంలో @ వుంచి) అడ్రసు కు మెయిలు పంపి మమ్మల్ని “సంప్రదించ”గలరు.ఇదే మీ ఉద్దేశమని మాకు తోస్తున్నది. మీ ప్రతీ మెయిలుకీ మేము వెంటనే రిప్లై ఇస్తూనే వుంటాము. మీకు అవి అందకపోతే మీ మెయిల్ అడ్మినిస్ట్రేటర్లను సంప్రదించండి. – సం]

  10. పురూరవ: శ్రవ్య నాటిక గురించి SIVARAMAPRASAD KAPPAGANTU అభిప్రాయం:

    05/25/2009 8:39 am

    చాలా చక్కటి పనిచేశారు ఈ నాటకాన్ని నలుగురికీ అందించి. నేను నా చిన్నతనంలో ఒక మోనో టేపు రికార్డర్ తో ఆకాశవాణి విజయవాడ కేద్రం నుండి ప్రసారమయిన కొన్ని చిన్న నాటికలను రికార్డు చెయ్యగలిగిన అదృష్టం కలిగింది. ఆ నాటికలను నేను సురసా నెట్లోకి అప్లోడ్ చేశాను. ఈ కింద లింక్ తో ఆ నాటికలను వినవచ్చు. అక్కడే, గణపతి నాటకం కూడ మరెవరో అందించారు. ఆసక్తి గలవారు ఈ సైటులోకి వెళ్ళి వినవచును.

    http://surasa.net/music/telugu-natika

    కన్యాశుల్కం, వరవిక్రయం, గణపతి నాటకాలు సి డి లరూపంలో ఆకాశవాణి విజయవాడ ప్రాంగణంలో ఉన్న చిన్న షాపులో అమ్ముతున్నారు.

    శివరామప్రసాదు కప్పగంతు