ప్రోగ్రాం చూడకపోయినా అక్షమార్హమైన వైఖరి అర్ధం అవుతూనే వుంది. మీ అభిప్రాయంతో నేనే గాక విజ్ఞులైన వారందరూ ఏకీభవిస్తారు.
ద్రోణ-ఏకలవ్య శైష్యోపాధ్యాయిక ప్రాతిపదికగా లోకంలో అనేక మంది ఆచార్యులకు తమకు తెలియని వేలాదిమంది శిష్యులుంటారు. అదే విధంగా సంగీత శాస్త్రవిషయాలపై తెలుసుకోదగిన అనేక ఉత్కంఠ భరిత సమాచారాన్ని ఔత్సాహికులకు వ్యాసాల రూపంగా అందిస్తున్న మీకు పరమహంస శిష్యులు (ఉత్తమ రసజ్ఞులు); నావంటి పరమానందయ్య శిష్యులు అనేకులు ఉండి తీరుతారు. నేనొనర్చిన సంబోధన మీపై ఏతదభిమాన సాదర పూర్వకమే గానీ అన్యంగాదు. అది మీకు కుహనా గౌరవ వ్యంగ్యంగా ధ్వనించి వుంటే క్షమించవలసినది. మీరు ఆచార్యత్వాన్ని అంగీకరించకపోయినా, శిష్యత్వాన్ని కోరుకొనేవాళ్ళు చాలామంది ఉంటారనే నా నమ్మకం.
ఎప్పటిలాగానే, మంచి పుస్తకాన్ని భద్రిరాజుగారి వ్యాసవిశేషాలగురించి తెలిపినందుకు హనుమగారికి కృతజ్ఞతలు.
పండితులుచేసే వ్యాఖ్యానాలగురించి ఒక్క మాట. భాషలో నుడికారాలు, సమాసాల సొగసులు, ఉక్తివైచిత్రి వగైరాల గురించి ఎంత చెప్పినా, అసలు చెప్పాల్సినదేదో ఎందుకో వదిలేసిన భావం, కొరత. అంటే వాటి ప్రాముఖ్యతను కాదనడం కాదు. కానీ అవన్నీ వాటికవే సొంతంగా ఎంతవరకు సాధారణ పాఠకులను పుస్తకానికి దగ్గరచేస్తాయి అని, అసలు అవేనా తిక్కన కవిత్వం అంత సొగసుగా అందిస్తున్నది అని కూడా అనిపిస్తుంది.
నెత్తిమీదున్న బతుకు బరువుకు, ప్రస్తుత పరిస్థితులకు తిక్కన రచన ద్వారా ఏమైనా లబ్ధిపడే అవగాహన, నిశితమయ్యే దృక్కు, స్పష్టతనిచ్చే అభివ్యక్తి లాంటివి కొంతైనా, ఎంతైనా, వడలి మందేశ్వరరావు, జీ.వి.సుబ్రహ్మణ్యం గార్ల వలె అందించాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. ఆ demand ఎప్పుడూ ఉంటుందని కూడా అనిపిస్తుంది. అట్లా కాకుండా వొట్టి పాండిత్య ప్రకర్షగా, భాషాశాస్త్రం, పద సంపద వివరించడం, వ్యాకరణ అంశాలతో
వూదరగొట్టడం- రుచికర ఆహారపదార్థాలను scientists వాటి పుట్టుపూర్వోత్తరాలు, చెట్ల పేర్లు, వాటి రసాయనాలు, అవి జీర్ణించబడడానికయ్యే reactions- మొత్తం వాళ్ళకు తెలిసిన శాస్త్రమంతా పేజీలలో గుమ్మరించినట్లుంటుందేమో అని అనుమానం. తీరా ఇదంతా మనకు రుచి, బలం ఇచ్చే ఆహారం గురించే(నా) అన్నది కూడా మరిచిపోయేటట్లు చెప్తారేమోనని కూడా భయం! కుయ్యోమంటున్న పాఠకులను చూసి అయ్యో ఇంత పాండిత్యంతో రాసిన వ్యాఖ్యానాలు చదువుకొ(న)డం లేదని వాపోవడం కూడా అతిశయోక్తి కాదేమో అని కూడా అనిపిస్తుంది.
———-
విధేయుడు
_Srinivas
ప్రసాద్‌గారూ,
మొదటి సంగతి: నేనేమీ ఆచార్యుణ్ణి కాను.
సోనూ నిగం ప్రసిద్ధ కళాకారులకు చప్పట్లు కొట్టమని ప్రేక్షకులకు విజ్ఞప్తి చెయ్యవలసిన అవసరం కనిపించలేదు. అతను పుట్టకముందే వారంతా పేరు మోసిన కళాకారులు. చిన్నపిల్లల విషయంలోనూ, వర్ధమాన కళాకారుల విషయంలోనూ కాలేజి ఫంక్షన్లలో అలా అనడం పరిపాటి. ఇవన్నీ చవకబారు పోకడలు. ప్రోగ్రాం చూసినవారికి నేనంటున్నదేమిటో అర్థమవుతుంది.
మీ అభిమానానికి కృతజ్ఞతలు. నేను సంగీతం శాస్త్రీయంగా అభ్యసించినవాడిని కాదు. అయితే పాటలు పాడటం మా ఇంట్లో అందరికీ ఇష్టం కావటంతో, చిన్నప్పటి నుంచీ సంగీతంపై మోజు వల్ల తెలిసిన వారి దగ్గరనుంచి నేర్చుకుంటూ పాటలు పాడేవాడిని. నా కవల సోదరుడైన రామన్నకూ, నాకూ (కవలలం కావటం వల్లనేమో!) పాటలు తొందరగానే పట్టుపడేవి. కానీ సంగీతంలో మా పరిమితులు మాకు తెలుసు. ఒక ఔత్సాహిక గాయకుడిగా నేను నేర్చుకున్న విషయాలు చెప్ప ప్రయత్నించిన ఫలితమే ఈ వ్యాసాలు. దానికి తోడు స్వయంగా నేర్చుకున్న వేణువు వల్ల స్వరాలతో అనుబంధం ఎక్కువైంది.
రాగాలను ‘ఈమాట ‘లో పరిచయం చేస్తున్నప్పుడు “ఈ వ్యాసాలు ఎవరికైనా ఏమాత్రం ఉపయోగమా?” అన్న అనుమానం నాకు ఎక్కువగా వస్తూ ఉండేది. శ్రోత – పాఠకుల నుంచి స్పందన ఎక్కువ లేకపోటమే ఇందుకు ఒక కారణం అనుకుంటా! కొంత రాగ, స్వర జ్ఞానం వచ్చిన తరవాత ఎవరికి వారే తమంత తాముగా మరింత తెలుసుకోగలరని నా నమ్మకం. అందువల్లే మరిన్ని వ్యాసాలు రాసే ప్రయత్నం చెయ్య లేదు. పైగా వృత్తి రీత్యా అమెరికా నుండి ఫ్రాన్స్ 2002 సంవత్సరంలో వెళ్ళటంతో ఈమాటకి ఎక్కువ రాయలేకపోయాను.
గత సంచికలలో ఈమాటలో శ్రీ కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు చాలా వ్యాసాలు సంగీత పరంగా రాసారు. ఆ అనుభవాలతో ఔత్సాహికులు స్వయం కృషి వల్ల చాలానే నేర్చుకోవచ్చు. ఇది నా స్వానుభవం.
ఆచార్యా!
సోనూ నిగం వైఖరిపై మీ ఆక్షేపణ చాలా సమంజసమైనదిగా కనబడుతుంది. కానీ విద్యాపర శేష భోగులు, దిగ్గజాలవంటి ఉద్దండ పండితుల గురించి వారి మాహత్మ్యం గురించి ఏ విధమైన వాక్యాలతో ప్రస్తుతించకుండా వారిని రంగస్థలంపైకి కేవలం పేరు పిలచి ఆహ్వానించడం, వారి రాకను రసజ్ఞులు కళాభిమానులైన వారు సాదరంగా కరతాళధ్వనులతో స్వాగతించకపోవడం సమంజసమనిపిస్తుందా? సోనూ నిగం గానీ వేరెవరైనా గానీ అట్టి సందర్భాలలో ఏ విధంగా నిర్వహిస్తే హుందాగా ఉంటుందని మీరు భావిస్తారు?
మీరు వెలువరించిన భావాలు, ఉద్భోధించిన సక్రమ ప్రవర్తన సూచనలు సర్వదా సర్వధా అనుసరణీయములు ఆచరణీయములే.
శ్రీ లక్ష్మన్న గారికి అనంత కోటి ధన్యవాదాలు. మీ వ్యాసాలు వాటిలో ఇస్తున్న సమాచారం మాకు ఎంతో ఉపయోగకరంగాఉన్నాయి. ఒకే రాగంలో వున్న పాటలను ఒకదాని తరువాత మరొక్కటి పలికిస్తుంటే ఆ రాగంలో పలికే స్వరాల గురించిన ప్రాధమిక పరిజ్ఞానం కలుగుతున్నట్లు అనిపించి స్ఫూర్తి నిస్తున్నాయి. మీరీ వ్యాసాలు 1999-2001 వత్సరాలలో వ్రాసారు. అప్పటినుండి ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలు గడిచాయి. ఎన్నో కొత్త జనాదరణపొందిన పాటలు వచ్చాయి. మీరు రాగాల వ్యాసాలలో ఇచ్చిన పాటల పట్టికలను పునర్నవీకరించి అనుబంధంగా ఇవ్వరా. ఇది మా విన్నపం మాత్రమే. తరువాత మీరు రాగాల పరిచయ వ్యాసాలను విరమించారెందుకు? మరికొన్ని రాగాలు మాకు పరిచయం చేయ రాదా.
నాది ఇంకొక్క ప్రార్ధన. ఈ శతాబ్దపు ఉత్తమ పాటలలో ఒకటిగా (నేను) భావించే “వేణు మాధవా” పాట ఏ రాగం తెలుపరా. ఈ పాట ఏ సినిమాలోదో తెలియదు గానీ శ్రియా-నాగర్జునలు తెరపై కనిపిస్తారు.
అని చదివితే, అబ్బ! ద్రౌపది కసి ఏం కసి, అనిపించింది. చిన్న చిన్న తెలుగు మాటలతో తిక్కన లెక్కలేనన్ని కొత్త కొత్త సమాసాలూ నుడికారాలూ మన భాషకి చేర్చాడట . ‘నెత్తురు మడువు’, ”కయ్యపునేల’, ‘మెత్తనిపులి’, ‘పెట్టనికోట’, ‘గుండెకాయ’, ‘చెలియలికట్ట’, ‘చిందరవందర’, ‘తేనె పూసిన కత్తి”, ఇలా అనంతం – అని భద్రిరాజు గారి వ్యాసంలో [1] చదివాను. తిక్కన కవితా శిల్పంలో సొగసులు చూడాలంటే, దగ్గరికిపోయి నిలకడతో చూడాలన్నారు. దానికి నాకింకాస్త తీరిక దొరకాలి.
ముఖ్యమైన తెలుగు పుస్తకాలకి వ్యాఖ్యానాల అవసరం ఉంది కాని దాని గురించి కేవలం చదువుకున్న వాళ్ళు ఆలోచించి చేసేదేముంది? వాటిమీద పండితులు పని చెయ్యాలి. అందుకు తెలుగు విశ్వవిద్యాలయం లాంటి సంస్థలు సాయం చెయ్యాలి. “దక్షులెవ్వారు లుపేక్ష సేసిరది వారల చేటగు…”
కొడవళ్ళ హనుమంతరావు
[1] భద్రిరాజు కృష్ణమూర్తి “భాష, సమాజం, సంస్కృతి”, పుస్తకంలో “తిక్కన పదసంపద” అన్న వ్యాసం.
కాలచక్రం వేగంగా ఎవరితోనూసంబంధం లేకుండా తిరుగుతుంది. తనతో పాటు అనేక సంస్కృతులనీ సంప్రదాయాలనీ మార్పులకు గురిచేస్తూ పోతుంది. కాలానుసారంగా మారగలిగినన్నాళ్ళూ ఎవ్వరికీ ఏ బాధా వుండదు. కానీ ఎప్పుడైతే ఇదే నిజమైన సర్వజనులూ ఆదరించి ఆచరించాల్సిన సంస్కృతి సంప్రదాయం అని ఎక్కడ మనం ఆగిపోతామో, అక్కడనుండే మన కష్టాలు ప్రారంభం అవుతాయి. ఎన్ని రామసేనలు వచ్చినా అనివార్యమైన కాలం తెచ్చే మార్పులను ఆపడం సాధ్యం కాదు. కాలానుగుణంగా మారి తీరాలి. లేకపోతే మనకే నష్టం కష్టం. జన జీవన స్రవంతి, జనాభీష్టాలు కాలాదిష్టమైన మార్పులతో వాటి తోవన అవి సాగి పోతూనే వుంటాయి. సంగీత సాహిత్యాలకు సంబంధించిన సామాన్య ప్రజానీక అభిరుచులు దీనికి అతీతం కావు.
ఐతే జీవితమంతా అభిరుచులను మార్పు చేసుకుంటూ పోలేము. మనకి ఆదర్శప్రాయంగా అనిపించిన విలువల వద్ద స్థిరపడి వుండడమే ఉత్తమ లక్షణం.
సంగీతానికి స్పందన గురించి M.S.Prasad అభిప్రాయం:
06/09/2009 1:44 am

భవదీయుడు
స్త్రీ పర్వంలో గాంధారి గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
06/08/2009 9:32 pm

సంగీతానికి స్పందన గురించి Rohiniprasad అభిప్రాయం:
06/08/2009 7:37 am
ప్రసాద్‌గారూ,
మొదటి సంగతి: నేనేమీ ఆచార్యుణ్ణి కాను.
సోనూ నిగం ప్రసిద్ధ కళాకారులకు చప్పట్లు కొట్టమని ప్రేక్షకులకు విజ్ఞప్తి చెయ్యవలసిన అవసరం కనిపించలేదు. అతను పుట్టకముందే వారంతా పేరు మోసిన కళాకారులు. చిన్నపిల్లల విషయంలోనూ, వర్ధమాన కళాకారుల విషయంలోనూ కాలేజి ఫంక్షన్లలో అలా అనడం పరిపాటి. ఇవన్నీ చవకబారు పోకడలు. ప్రోగ్రాం చూసినవారికి నేనంటున్నదేమిటో అర్థమవుతుంది.
వాద్య సంగీతానికి అద్భుతదీపం వెలిగించిన అల్లాఉద్దీన్‌ఖాన్ గురించి Rohiniprasad అభిప్రాయం:
06/08/2009 7:32 am
సినిమా పాటల్లో వాద్యసంగీతం గురించిన నా కొత్త వ్యాసంలో మరిన్ని వివరాలు రాశాను. http://www.pranahita.org/2009/06/music01_cinema_patallo_vayidyalu/
రాగలహరి: సింధుభైరవి గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
06/08/2009 7:04 am
శ్రీ ప్రసాద్ గారికి:
మీ అభిమానానికి కృతజ్ఞతలు. నేను సంగీతం శాస్త్రీయంగా అభ్యసించినవాడిని కాదు. అయితే పాటలు పాడటం మా ఇంట్లో అందరికీ ఇష్టం కావటంతో, చిన్నప్పటి నుంచీ సంగీతంపై మోజు వల్ల తెలిసిన వారి దగ్గరనుంచి నేర్చుకుంటూ పాటలు పాడేవాడిని. నా కవల సోదరుడైన రామన్నకూ, నాకూ (కవలలం కావటం వల్లనేమో!) పాటలు తొందరగానే పట్టుపడేవి. కానీ సంగీతంలో మా పరిమితులు మాకు తెలుసు. ఒక ఔత్సాహిక గాయకుడిగా నేను నేర్చుకున్న విషయాలు చెప్ప ప్రయత్నించిన ఫలితమే ఈ వ్యాసాలు. దానికి తోడు స్వయంగా నేర్చుకున్న వేణువు వల్ల స్వరాలతో అనుబంధం ఎక్కువైంది.
రాగాలను ‘ఈమాట ‘లో పరిచయం చేస్తున్నప్పుడు “ఈ వ్యాసాలు ఎవరికైనా ఏమాత్రం ఉపయోగమా?” అన్న అనుమానం నాకు ఎక్కువగా వస్తూ ఉండేది. శ్రోత – పాఠకుల నుంచి స్పందన ఎక్కువ లేకపోటమే ఇందుకు ఒక కారణం అనుకుంటా! కొంత రాగ, స్వర జ్ఞానం వచ్చిన తరవాత ఎవరికి వారే తమంత తాముగా మరింత తెలుసుకోగలరని నా నమ్మకం. అందువల్లే మరిన్ని వ్యాసాలు రాసే ప్రయత్నం చెయ్య లేదు. పైగా వృత్తి రీత్యా అమెరికా నుండి ఫ్రాన్స్ 2002 సంవత్సరంలో వెళ్ళటంతో ఈమాటకి ఎక్కువ రాయలేకపోయాను.
గత సంచికలలో ఈమాటలో శ్రీ కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు చాలా వ్యాసాలు సంగీత పరంగా రాసారు. ఆ అనుభవాలతో ఔత్సాహికులు స్వయం కృషి వల్ల చాలానే నేర్చుకోవచ్చు. ఇది నా స్వానుభవం.
మీరు ఉదాహరించిన పాట నాకు పరిచయం లేదు.
ధన్యవాదాలతో,
విష్ణుభొట్ల లక్ష్మన్న
సంగీతానికి స్పందన గురించి M.S.Prasad అభిప్రాయం:
06/08/2009 3:21 am
ఆచార్యా!
సోనూ నిగం వైఖరిపై మీ ఆక్షేపణ చాలా సమంజసమైనదిగా కనబడుతుంది. కానీ విద్యాపర శేష భోగులు, దిగ్గజాలవంటి ఉద్దండ పండితుల గురించి వారి మాహత్మ్యం గురించి ఏ విధమైన వాక్యాలతో ప్రస్తుతించకుండా వారిని రంగస్థలంపైకి కేవలం పేరు పిలచి ఆహ్వానించడం, వారి రాకను రసజ్ఞులు కళాభిమానులైన వారు సాదరంగా కరతాళధ్వనులతో స్వాగతించకపోవడం సమంజసమనిపిస్తుందా? సోనూ నిగం గానీ వేరెవరైనా గానీ అట్టి సందర్భాలలో ఏ విధంగా నిర్వహిస్తే హుందాగా ఉంటుందని మీరు భావిస్తారు?
మీరు వెలువరించిన భావాలు, ఉద్భోధించిన సక్రమ ప్రవర్తన సూచనలు సర్వదా సర్వధా అనుసరణీయములు ఆచరణీయములే.
భవదీయుడు
వాద్య సంగీతానికి అద్భుతదీపం వెలిగించిన అల్లాఉద్దీన్‌ఖాన్ గురించి M.S.Prasad అభిప్రాయం:
06/08/2009 2:43 am
సూర్యు డటంచు వ్రేల నిటు జూపిన గాని గ్రహింపలేని దు
ర్వార్య తమో నిమగ్నత ప్రవర్తిలు చంధత నున్న మాకు ని
ట్లర్యమ కోటి జూపి జనుషాంధత నైనను బాపు మీదు స
త్కార్య గతానురక్తి శతధా నుతియింతు ప్రసాద! కోవిదా!
ధన్యవాదాలతో
భవదీయుడు
రాగలహరి: సింధుభైరవి గురించి M.S.Prasad అభిప్రాయం:
06/08/2009 1:25 am
శ్రీ లక్ష్మన్న గారికి అనంత కోటి ధన్యవాదాలు. మీ వ్యాసాలు వాటిలో ఇస్తున్న సమాచారం మాకు ఎంతో ఉపయోగకరంగాఉన్నాయి. ఒకే రాగంలో వున్న పాటలను ఒకదాని తరువాత మరొక్కటి పలికిస్తుంటే ఆ రాగంలో పలికే స్వరాల గురించిన ప్రాధమిక పరిజ్ఞానం కలుగుతున్నట్లు అనిపించి స్ఫూర్తి నిస్తున్నాయి. మీరీ వ్యాసాలు 1999-2001 వత్సరాలలో వ్రాసారు. అప్పటినుండి ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలు గడిచాయి. ఎన్నో కొత్త జనాదరణపొందిన పాటలు వచ్చాయి. మీరు రాగాల వ్యాసాలలో ఇచ్చిన పాటల పట్టికలను పునర్నవీకరించి అనుబంధంగా ఇవ్వరా. ఇది మా విన్నపం మాత్రమే. తరువాత మీరు రాగాల పరిచయ వ్యాసాలను విరమించారెందుకు? మరికొన్ని రాగాలు మాకు పరిచయం చేయ రాదా.
నాది ఇంకొక్క ప్రార్ధన. ఈ శతాబ్దపు ఉత్తమ పాటలలో ఒకటిగా (నేను) భావించే “వేణు మాధవా” పాట ఏ రాగం తెలుపరా. ఈ పాట ఏ సినిమాలోదో తెలియదు గానీ శ్రియా-నాగర్జునలు తెరపై కనిపిస్తారు.
మరొక్కసారి ధన్యవాదాలతో
భవదీయుడు
స్త్రీ పర్వంలో గాంధారి గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
06/06/2009 10:11 pm
“తిక్కన పదసంపద”
“ఈ వెండ్రుకలు పట్టి యీడ్చిన యాచేయి దొలుతగాఁ బోరిలో దుస్ససేను
తనువింత లింతలు దునియలై చెదరి రూపఱియున్నఁ గని యుడుకాఱుఁగాక!
యలుపాలఁ బొనుపడునట్టి చిచ్చే యిది;”
అని చదివితే, అబ్బ! ద్రౌపది కసి ఏం కసి, అనిపించింది. చిన్న చిన్న తెలుగు మాటలతో తిక్కన లెక్కలేనన్ని కొత్త కొత్త సమాసాలూ నుడికారాలూ మన భాషకి చేర్చాడట . ‘నెత్తురు మడువు’, ”కయ్యపునేల’, ‘మెత్తనిపులి’, ‘పెట్టనికోట’, ‘గుండెకాయ’, ‘చెలియలికట్ట’, ‘చిందరవందర’, ‘తేనె పూసిన కత్తి”, ఇలా అనంతం – అని భద్రిరాజు గారి వ్యాసంలో [1] చదివాను. తిక్కన కవితా శిల్పంలో సొగసులు చూడాలంటే, దగ్గరికిపోయి నిలకడతో చూడాలన్నారు. దానికి నాకింకాస్త తీరిక దొరకాలి.
ముఖ్యమైన తెలుగు పుస్తకాలకి వ్యాఖ్యానాల అవసరం ఉంది కాని దాని గురించి కేవలం చదువుకున్న వాళ్ళు ఆలోచించి చేసేదేముంది? వాటిమీద పండితులు పని చెయ్యాలి. అందుకు తెలుగు విశ్వవిద్యాలయం లాంటి సంస్థలు సాయం చెయ్యాలి. “దక్షులెవ్వారు లుపేక్ష సేసిరది వారల చేటగు…”
కొడవళ్ళ హనుమంతరావు
[1] భద్రిరాజు కృష్ణమూర్తి “భాష, సమాజం, సంస్కృతి”, పుస్తకంలో “తిక్కన పదసంపద” అన్న వ్యాసం.
తెలుగు సినిమా పాటకి సుతీ మతీ లేవా? గురించి M.S.Prasad అభిప్రాయం:
06/05/2009 1:08 am