పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16489

  1. రాగాలూ స్వరాలూ గురించి Rohiniprasad అభిప్రాయం:

    05/25/2009 7:19 am

    ప్రసాద్ గారూ, మీరు సంగీతానికి కొత్త అయితే ఈ దశలో వివాది స్వరాలను ఉపేక్షించడం మంచిది.

    హార్మోనియం, పియానో, కీబోర్డ్స్ వంటి పాశ్చాత్య వాయిద్యాలు tempered (diatonic) scale మీద ఆధారపడే టటువంటివి. Continuous spectrumలాంటి స్వరస్థానాల్లో మనం 12, 16, 22 లేదా ఈజిప్ట్ లోనో మరెక్కడో అనుకున్నట్టు 96 శ్రుతులు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు (పలికించగలిగిన వారు ఉన్నట్టయితే!)
    ఈ కింది వెబ్ సైట్లో కొన్ని వివరాలున్నాయి. మీ academic doubts కోసం చూడండి.
    http://www.carnaticdarbar.com/views_01.htm

    Vivadi swara is a dissonant note, perceived by many in the musical world, to be an enemy note. That is probably the reason why vivadi melas were called ragas with “dosha” (some harmful element like an enemy perhaps!). According to Prof. Sambamurthy, vivadi melas are those scales which take one of the following notes: shatshruti rishabha (R3). Suddha Gandhara (Ga1), shatshruti dhaivata (Dha 3) and suddha nishada (Ni1). There are 40 such ragas which are supposed to have vivadi dosha.
    .
    ..many of the 72 melakarta ragas existed even before Venkatamakhi times.

    …the beauty of many of these vivadi melakarta ragas can be fully appreciated when one listens to these ragas played on the veena. As explained earlier, Vivadi is a dissonant note in relation to an adjacent note and is viewed as an enemy note.
    ఇటువంటివి పలికించలేదు కనకనే హార్మోనియం నిషేధానికి గురి అయింది. అయితే అది అర్థంలేని పని. బడే గులాం, పక్కవాద్యంగా హార్మోనియం సరిపోతుంది. (గోవిందరావు టేంబే, రామకృష్ణ చిమోటే మొదలైన విద్వాంసులు హార్మోనియం సోలో వాద్యంగా ఎంత గొప్పగా మోగుతుందో నిరూపించారు). అమీర్ ఖాన్ వంటి గొప్ప గాయకులు హార్మోనియం పక్కవాద్యంగా ఉపయోగించుకున్నారు. ఒకప్పుడు కర్నాటకంలో హార్మోనియం విద్వాంసులుండేవారు. ఇప్పుడు కొందరు తమిళులు pitch bender సహాయంతో గమకాలు పలికిస్తూ కీబోర్డ్స్ చక్కగా ఉపయోగిస్తున్నారు.

  2. రాగాలూ స్వరాలూ గురించి M.S.Prasad అభిప్రాయం:

    05/25/2009 4:07 am

    మీరు వ్రాసిన వ్యాసాలు నాకందుబాటులోకిరావడం నా మహద్భాగ్యంగా భావిస్తున్నాను. దారీ తెన్నూ లేని నా వంటి వారి సాధనకి ఒకింత దిశా నిర్దేశనం చేస్తున్నాయి. కృతజ్ఞుడను.

    కొన్ని రాగాలు 12 స్వరాల చట్రంలో సరిపోకపోవడం వలన 16 స్వరాల అమరిక ఏర్పడీందని కొన్ని అటువంటీ రాగాలను వాటిలో స్వరపరిచిన కొన్ని పాటలను వివరించారు. మరి అన్ని కీ బోర్డుల/హార్మోనియం లాంటి వాయిద్యాలలోనూ 12 స్వరాల అమరికే వుంటుంది గదా. ఈ రాగాలను, పాటలను ఎలా నిర్దుష్టంగా వాటిపై పలికించగలరు?
    తరువాత హార్మోనియంను ఆకాశవాణిలో నిషేధించారని అన్నారు. ఏ అవలక్షణాల వలన ఆ వాయిద్యానికి ఆ దుర్గతి పట్టింది? వేణు వాయులీనాలు ఆ కొరతలు లేనివా? ఇవి మేము తెలుసుకోదగినవైతే తెలుపగలరు.

    భవదీయుడు

    [అయ్యా – మీరు దయచేసి మీ ఈమెయిలు ఒకసారి చూసుకోవలసినది. మీరు పత్రికాముఖంగా అడిగిన ప్రశ్నలకు మేము మీకు సమాధానాలను పంపి వున్నాము. మీనుంచి ఏ విధమైన స్పందన లేకపోవడంతో ఇలా పత్రికాముఖంగానే మిమ్మలి హెచ్చరించవలసి వస్తున్నది. – సం.]

  3. చలంతో రజని ముఖాముఖి గురించి SIVARAMAPRASAD KAPPAGANTU అభిప్రాయం:

    05/24/2009 6:23 pm

    అద్భుతం పరమాద్భుతం. చలం గారి గళం వినాలని నాకు ఎప్పటినుండో కోరిక. రేడియో కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారని తెలుసు కాని, ఇంతకాలానికి వినే అవకాశం దొరికింది. పరుచూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు.

    ఇదే విధంగా శ్రీ విశ్వనాధ సత్యనారాయాణ ఆకాశవాణి హైదరాబాదు కేంద్రానికి ఒక గంట నిడివి ఇంటర్వ్యూ ఇచ్చారు. అది వినే భాగ్యం నాకు దాదాపు పాతిక సంవత్సారాల క్రితం కలిగింది. అప్పట్లో నాదగ్గర రికార్డు చెయ్యటానికి సదుపాయం లేక భద్రపరచలేకపొయ్యాను. శ్రీనివాస్ గారూ ఈ ఇంటర్వ్యూ కూడ సంపాయించి తెలుగు లోకానికి అందిగలిగితే ధన్యులం.

    ఇంకా ఇలాంటి నిధులు ఆకాశవాణి వారి మట్టి బీరువాల్లో ఎన్ని ఉన్నాయో,ఇప్పటి వారి అయోమయ, అజ్ఞాన ఉద్యోగులకు వాటి విలువ తెలుసో లేదో, వాళ్ళు బీరువాల ఖాళీ ఉద్యమంలో ఈ నిధుల్ని ఎక్కడ పారేస్తారో లేక ఇప్పటికే పారేశారో తలుచుకుంటే నే దుఖం కలుగుతున్నది. ఆకాశవాణి వారు ఈ పాత రికార్డింగులన్నీ కూడ వారి నెట్ లో పెట్టేట్టుగా చెయ్యటానికి ఇన్ఫర్మేషన్ ఏక్ట్ కింద ఏమైన చెయ్యగలమా అని సాహిత్య సంఘాలన్ని సమకూడి చెయ్యవలసిన పని అని నాకు అనిపిస్తున్నది.

  4. పునరపి గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    05/24/2009 10:22 am

    ఈ కథ చదివిన వెంటనే, అనేక సంవత్సరాలుగా ప్రొద్దున్నే లేచి, పచ్చి పాలూ, corn flakes కలుపుకొని తిని పనికి పరుగెట్టే నేను, అమావాస్యకీ పౌర్ణమికీ మా ఆవిడ ఇచ్చే ప్రియా ఇడ్లీలనే ప్రసాదంగా తినే నేను, ఎంత ఉన్నతుణ్ణి, అనుకోడంతో నాఛాతీ పెరిగింది. ఇక ఉండబట్టలేక, మా ఆవిడని పిలిచి, “ఈ కథ చదువు. అప్పుడన్నా తెలుస్తుంది నీవెంత అదృష్టవంతురాలివో, నాలాంటి ఆదర్శప్రాయుడైన భర్తని పొందినందుకు,” అన్నా.

    “నీ బడాయి కేమిలే,” అంటూ కథ చదివి, తను, “ఈ కాలంలో అమెరికాలో weekdays ప్రొద్దున్నే లేచి దోసెలు వేసే వాళ్ళున్నారంటే నేను నమ్మను. ఉంటే, నూటికి కోటికి ఒకరున్నారేమో. మన స్నేహితులలో ఎవరన్నా ఉన్నారా అసలు?” అని నన్నొక సామాన్యుడిగా చేసేసింది. “ఏమో! మన స్నేహితుల్లో తెలుగు వాళ్ళు తక్కువ కదా,” అన్నా.

    సాయంత్రానికల్లా ఓ తెలుగు స్నేహితురాలితో email సంభాషణ సాగించి, తన కోలీగ్ భర్త రాఘవ లాంటి వాడేనట, అని చెప్పింది. మరి ఎలా ఎందుకు వేగుతోంది అని అడిగితే, “కొట్టడు, వేరే హింస లేదు కదా, భరించవచ్చు” అన్నదట కొలీగ్!

    ఇలాంటి కథల అవసరం ఉంది కాని, మృణాళిని రాసిన “కోమలి గాధారం” లాంటి కథల అవసరం ఇంకా ఎక్కువనిపిస్తుంది.

    కొడవళ్ళ హనుమంతరావు

  5. స్వీడన్‌లో మాతృ భాష వాడకం గురించి రాకేశ్వర రావు అభిప్రాయం:

    05/23/2009 1:21 am

    దేఁవుఁడా . నాకూ ఇలాంటి అనుభవాలు చాలా అయినాయండి.
    నేను తెలుఁగులో మాట్లాడం, వాళ్ళు ఆంగ్లంలో జవాబివ్వడం.
    ఒక సారి మఱుగుదొడ్డి ఎక్కడ అని అడిగితే వాడు నన్ను చూసాడు చూపు… ఏమని చెబుదుం.

  6. ఒక తెలుగు పుస్తకం కావాలి గురించి Savithri Machiraju అభిప్రాయం:

    05/22/2009 7:37 am

    I think the problem is not lack of a style book in Telugu, but lack of instruction in any kind of writing in any language. Have any of you seen the kind of English writing produced by any of our “English medium” educated graduates? People don’t seem to know even the most basic grammar such as that a sentence should have a subject and verb, Whether in English or Telugu, this requirement doesn’t change.

    Other frequent mistakes I have seen, even in published stories, is a confusion between first person and third person when narrating. That is, a story starts out being written in the first person, but part way through, the author starts referring to the first person character in the third person. E,g: “నేను చాలా అలసిపోయాను. నీరసంగా వనక్కి వాలాడు అతను.” Or “ఆమె నిర్లక్ష్యానికి నాకు చాలా కోపం వచ్చింది. ఇలా ఈసడిస్తే తనకెలా ఉంటుంది?”

    And finally, we have the wholesale importation of English verb forms and usages, such as the passive voice (which doesn’t exist in Telugu) — e.g.: “అతన్ని ఎవరో చంపారు” అనకుండా, “అతను చంపబడ్డాడు” – or strange imitation of the present progressive tense into Telugu — e.g. “ఆమె స్నానం చేసింది” అనకుండా, “ఆమె స్నానించింది” అనడం.

    Talking of tenses, I have also seen quite a lot of confusion of past, present, and future tenses in published Telugu writings.

    First let us correct these most elementary grammatical errors, and then we can worry about style. Punctuation, paragraphing, and conciseness are second level skills for which the basis is yet lacking.

    But I second the suggestion that Vemuri garu should publish his style book.

  7. అతడు నేను గురించి Krishna Prasad అభిప్రాయం:

    05/22/2009 12:13 am

    బాగా ఉంది.
    especially the words, “మనం జీవించడానికి కావల్సిన ముఖ్యమైన లక్షణం జీవితం మీద ప్రేమ. ఇతరుని జీవింపచెయ్యడానికి కావల్సిన ముఖ్యమైన లక్షణం మనుషుల మీది నమ్మకం, జాలి, దయ, ప్రేమ. ప్రపంచాన్నీ, మనుషుల్నీ నమ్మలేని ప్రేమించలేని స్థితి విషాదకరమైంది.”

  8. ప్రచురణకి వచ్చే రచనల గురించి గురించి రాకేశ్వర రావు అభిప్రాయం:

    05/20/2009 9:18 am

    ఈ వ్యాసం మీరు ఒక ఏఁడాది ముందు వేసుంటే, నా తరఫునుండి మీకు ఒక బాణం మినహాయింపుగలిగేది. నేను ఈ-మాటకు పంపేముందు ‘దాన్ని’ ఇద్దరు బుల్లి సంపాదకులకు పంపాను. వారిదగ్గర ఈ చిట్కాల చిట్టా లేక పాపం కాదనలేకపోయారు. నా కవిత ఎంత సక్సో (ఈ పదప్రయోగం తప్పుటకాలేదు, దాని వలన అశ్లీల పాళ్ళు పెరగకుండ ప్రార్థన ) నాకు తరువాత తెలిసిందనుకోండి. స్నేహితుల్ని సంపాదకులుగా పెట్టుకోకూడదన్నమట :). ఇలా పలు సార్లు పలు చోట్ల యాచాయాచితాలుగా జరిగిందనుకోండి. అయినా నేర్చుకునేవయస్సుగా, పర్వాలేదు.

    చాలా ధైర్యం కావాలి ఒక పూర్తి స్థాయి ఈ-పత్రికకు ఇలాంటి వ్యాసం ప్రచురించడానికి. ఇలాంటివి సాధారణంగా నాలాంటి విప్లవాత్మక బ్లాగర్ల బ్లాగుల్లో కనిపిస్తుంటాయి. అక్కడుకూడా వెటకారమాడినప్పుడు జనులు గర్హించేవారు. అతిథి దేవోభవః అన్నట్టు రచయితదేవోభవః అని ఏదైనా సూక్తి పాటిస్తాయేమో ఈ పత్రికలు అనుకుంటే పప్పులో కాలేసినట్టేనన్నమట.

    ఏదీ ఏమైనా ‘కొన్ని’ మంచి ఆచరణీయ సూక్తులు చెప్పారు. యాచిత రచయితల అహాల గుఱించి సగటు పాఠకునికి పెద్ద పట్టింపు లేకపోయినా, రచనల గుఱించి చేసిన సూక్తులు ఆచరణీయములుగా బాగున్నాయి (పునరుక్తి వ్యాఖ్యలకు వర్తించదుగదా కంపఁదీసి). కానీ మీరు FYEO అని మీ మామూలు సంపాదకులుకుఁ జెప్పి మఱీ ఈ ఉత్తరం వ్రాసారు కాబట్టి రచయితల వ్యక్తిత్వాల గుఱించి వ్రాయడం సబబే. కానీ అలా ఎప్వైవోయూ అని చెప్పినా ఎవరో లీకు చేసారంటే, అలాంటి వారికోసం లీకు చేయకూడదంటూ ఇంకో ఎప్వైవోయీ ఉత్తరం వ్రాయవచ్చు. అది లీకైతేనో ???

    పునరుక్తి గుఱించి ఒక్క మాట, పైన మోహన గారు, శ్రీనివాసు గారు ప్రస్తావించే పునరుక్తి మీ పునరుక్తి వేఱు వేఱు (మళ్ళీ మళ్ళీ క్షమించగలరు) అనుకుంట. వారు ప్రస్తావించింది అచ్చమైన పునరుక్తి, మీరు ప్రస్తావించింది అదే భావనను పునరుక్తి చేయడం అనుకుంట. ఉదా- నేను ఎప్పుడో వ్రాసిన కాపలాదారు కవితలో అచ్చపునరుక్తి లేకపోయినా, ఒక విషయాన్ని మరలా మరలా (యఱ్ఱ్.. మరలా మరలా క్షమించగలరు) చెప్పినందుకు, పునరుక్తి వచ్చింది రాకేశ్వర తస్మాజ్జాగ్రత్త అని గురువులు హెచ్చిరించడం జరిగింది.

    కొసమెఱుపు – ఒక సారి నాతోనొక సదరు బుల్లి సంపాదకులు (‘ఒక సదరు’ తప్పైతే క్షంతవ్యుడను) చెప్పారు, “పెట్టుబడిదారువ్యవస్థ వచ్చింతరువాత ఎవరైనా వ్యవస్థాపకులే, బ్లాగులు వచ్చింతరువాత ఎవరైనా రచయితలేనని”. ఎంత నిజం.

    మీరాకేశ్వర.
    త.క- పాఠక దేవులకు సైతం సూచనలనమట. లెస్స లెస్స.

  9. కీబోర్డ్ మీద రాగాలు గురించి Rohiniprasad అభిప్రాయం:

    05/20/2009 6:12 am

    సినిమాల్లోనూ, నాటకాల్లోనూ, చందమామవంటి పత్రికల బొమ్మల్లోనూ కనబడేదంతా నిజమని నమ్మడం పొరబాటు.
    తంబురా అయినా మరే వాద్యమైనా జానపదరూపంలో చూసినప్పుడు దాని మూలాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఒకటో, రెండో తీగలతో చిన్న వాద్యాలను పట్టుకు తిరుగుతూ పాడే పల్లె గాయకులు దాన్ని ఆధారశ్రుతి కోసమే ఉపయోగిస్తారు. కచేరీల్లో వాడే తంబుర కూడా అటువంటిదే. తీగలను మీటడం తప్ప స్వరాలను పలికించడానికి దాన్నెవరూ వాడరు.
    మనవాళ్ళు మహతి అనేది వీణ అయిఉంటుంది. నారదుడి గురించిన ప్రస్తావన పూర్తిగా ఊహాజనితం.
    దక్షిణాది సంగీతంలో నాలుగు తీగలున్న పెద్ద తంబుర ఉపయోగిస్తారు. ఉత్తరాది సంగీతంలో అపుడప్పుడూ ఆరు తీగలున్న చిన్న తంబురీని వాడడం కద్దు.
    ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ తాను పాడే రాగపు స్వరాలకు ట్యూన్ చేసిన స్వరమండల్ వాడేవారు. ఆయనను అనుకరిస్తూ పాకిస్తాన్ అలీ సోదరులూ, జస్రాజ్, నిసార్ హుసేన్ ఖాన్‌వంటి గాయకులు దాన్ని వాడడం మొదలుపెట్టారు.
    సంగీతం గురించి తెలుసుకోవడానికి వ్యాసాలూ, పుస్తకాలమీద ఆధారపడకుండా కచేరీలకు హాజరవుతూ ఉండడం అవసరం.

  10. కీబోర్డ్ మీద రాగాలు గురించి M.S.Prasad అభిప్రాయం:

    05/20/2009 3:07 am

    రోహిణీ ప్రసాద్ గారికి
    తంబూర అనే వాయిద్య విశేషం యొక్క ప్రాధాన్యత వివరించవలసినదిగా ప్రార్ధన. శంకరాభరణం సినిమాలోనూ ఇంకా కొన్ని సంగీత కచేరీలలోనూ దీన్ని మీటుతూ ఒకరు ప్రక్కగా ఉండడం చూస్తాము. వీరు తక్కిన వాద్యకారుల లాగా పాడుతున్న సంగీతాన్ని వాయించుతున్నట్లు కనబడరు. అసలు ఈ వాద్యం మీద సంగీతం వాయించగలమా? నారద తుంబురాదుల వద్ద కనిపించేది తంబుర కాక వీణ అనే అనుకుంటాను. కానీ నాకు తెలిసిన వీణ బృహదాకారంతో మెడలో వేసుకొని తిరుగడానికి అనువుగా ఉండదు. మహతి కఛ్ఛపి అనే ఈ వీణలు మామూలు వీణలకన్నా చిన్న ఆకారంలో వుంటాయి. ఇటువంటీ వీణలు మమూలుగా దొరుకుతాయా?

    భవదీయుడు