సంగీతం ఎవరిదైనా అది విని ఆనందించవలసిందే. సంగీతాన్ని గురించి ఎవరు ఎంత రాసినా అవన్నీ పరిచయవ్యాసాలే.
కీబోర్డుతో స్వరాలూ, రాగాల సాధన గురించి నేను చెప్పిన విషయాలను చదివి కొందరు కీబోర్డు మెట్లమీద స్టికర్లు అతికించుకుని ప్రయత్నిస్తున్నారు. అవి వారికి కొంత ప్రేరణనిచ్చి ముందుకెళ్ళేలా చెయ్యవచ్చు.
కాని మొత్తంమీద తెలుగువారికి సంగీతం వినడం, సాధనచెయ్యడంలో చాలా తక్కువ ఆసక్తి ఉన్నట్టుగా అనిపిస్తుంది. మిత్రుల ఎదుట నేను ఎప్పుడైనా చిన్న సోదాహరణ ప్రసంగంవంటిది చేస్తే కాస్త ఆసక్తి కనబరిచేది మగవారే. మహిళలు ఏ మాత్రం ఆసక్తి చూపరు. తెలుగు పిల్లలకు సంగీతం రాకపోవడానికి ఇదొక ముఖ్య కారణం అనిపిస్తుంది. (ఇలా అన్నందుకు నన్ను MCP అని తిట్టుకోకండి!)
అయ్యా! శ్రీమదిత్యాది శ్రీమాన్ రోహిణీ ప్రసాద్ ఆచార్యుల వారూ!
అది ఇది అని పేరు పెట్టి చెప్పవలసిన పని లేకుండా మీరు వ్రాసిన అన్ని వ్యాసాలు అమూలాగ్రం ఉత్కంఠ భరిత సమాచారాలతోనూ స్ఫూర్తిదాయక మైన అనేక విషయాలతో సుసంపన్నమై ఉంటున్నాయి. వయం ధన్యాః వయం ధన్యాః వయం ధన్యాః మహీతలే, రోహిణీ వల్లభో యేషాం సంగీత పధ దర్శకః.
ఏదో సంగీతం గురించిన ఒకటి రెండు విషయాలు తెలుసుకుందామని యాధాలాపంగా ఒక వ్యాసం చదివిన తరువాత మీ తక్కిన వ్యాసాలు చదవకుండా ఉండలేకపోతున్నాను. దిశా నిర్దేశన మాత్రమే కాక దిగ్గజాల ప్రదర్శన కూడా మాలాంటి వారికై చేస్తున్న మీ కృషి ప్రశంసనీయం.
ఎందర జూపెనేని వరియింపదు మా కవితా కుమారి – మీ పేరు విని ఉరకలు వేసి వస్తుంది చిత్తగించండి
ఈ సందర్భంలో చలం “మైదానం” కన్నా “స్త్రీ” సముచితం – మన చెంపలు ఛెళ్ళుమనిపిస్తాడు! వంటా, తుడవడాలతో సతమతమయే ఆడవాళ్ళకి విలువ లేదు, వాళ్ళు చదువుకొని స్వతంత్ర ఆర్జన చెయ్యడమే మార్గం అన్నాడు. అని కూడా దాదాపు వందేళ్ళయింది. ఇప్పుడు భార్యలు ఉద్యోగం చేస్తూ, మూడు పూటలా వంట కూడా చేస్తున్నారు – అదీ అమెరికాలో – అంటే వాళ్ళ భర్తలు చాలా సిగ్గుపడాలి. చదువుకున్న అమ్మాయిలు కిమ్మనకుండా వాళ్ళమ్మలు చెప్పిన సూక్తులు విని సర్దుకుపోవడం శోచనీయం.
బళ్ళో పాఠాలు చెప్పి సర్టిఫికెట్లివచ్చు. అది ముందు తరాల వాళ్ళకి. ఈ తరం మగాళ్ళు మారాలి. అంతకన్నా ముఖ్యంగా ఆడవాళ్ళు కాస్త స్వతంత్రం చూపెట్టాలి. “మా అమ్మ ఏనాడైనా చట్నీ చేయకుండా దోశ చేసిందేమో అడుగు,” అన్న రాఘవకి, “మీ అమ్మ నాలాగా బయట ఉద్యోగం చేసిందోమో అడుగు,” అని లత ఎదురుచెప్పగలగాలి.
మైనారిటీలకు భరత దేశం లో హక్కులు లేవనా రచయిత్రి ఉద్దేశం?
పునరపి
గురించి Akella Suryanarayana Murthy అభిప్రాయం:
06/14/2009
4:42 am
సమస్యను గుర్తించేరు బాగుంది, పరిష్కారం? హనుమంతరావు గారు other side of the story బాగా చూపించేరు. ఇలాంటి సమాధానాలు వేరే ఇళ్లల్లో వస్తాయని తెలిసి వినోదంగా అనిపించింది
ఎందుచేతనో పరుచూరి శ్రీనివాస్ గారి కామెంట్ మిస్ అయాను.
చంద్రహారం తీస్తున్నప్పుడో, తీశాకో విజయావారు నెల జీతాలు మొదలుపెట్టారు. అంతకుముందు కాదు. ఈ విషయంలో అనుమానం లేదు. బైట పాడకుండా ఉండటానికి ఘంటసాల లక్ష రూపాయలో, అంతకంటే ఎక్కువో అడిగాడని మా నాన్నగారే చెప్పారు. ఎటొచ్చీ చంద్రహారం దెబ్బతినడంతో ఈ నెలజీతాల ప్రణాళిక కొనసాగలేదు. అలాగే ఘంటసాల చుట్ట అలవాటు మధ్యలో వచ్చి, మధ్యలోనే పోయిందని అంటారు.
కేళ్కర్‌గారు అమరసందేశం సినిమాకు ప్రధాన సంగీతదర్శకుడు. వయీ ప్రాంతపు మరాఠీ బ్రాహ్మణుల పద్ధతిలో ఆయన కాస్త అమాయకుడు. ఆయనకు చెప్పకుండా ప్రసాదరావు పేరును జత చెయ్యడం ఆయనకు చాలా కోపం తెప్పించింది. ఇదంతా జరిగిన ఒక దశాబ్దం తరవాత నేను శిష్యుడైనప్పుడు కూడా ఆయన సినిమావాళ్ళని తిడుతూనే ఉండేవాడు.
మద్రాసు రాకపూర్వం ఆయన బొంబాయి సినీ ఆర్కెస్ట్రాలో వయొలిన్ తదితర వాద్యాలు వాయించేవాడట. ఆయన వినాయకరావు పట్వర్ధన్ శిష్యుడు. గాత్రం నేర్చుకుంటున్నప్పుడు డి.వి. పలూస్కర్‌కు సహాద్యాయి. పూట గడవడానికి సినిమాల్లో చేరాడు. మధ్యలో అల్లా ఉద్దీన్ బృందంతో కలిసి ఉదయశంకర్ నృత్యప్రదర్శనల్లో వాయించడానికి విదేశాలకు వెళ్ళాడు. అందులో వయొలిన్ వంటి విదేశీవాద్యాలకు చోటు లేదు కనక తబలాతరంగ్ జలతరంగ్ మొదలైనవి వాయించానని నాతో అన్నాడు.
రాగం అంటే ఏమిటో తెలిసినదే.
ఖచ్చితంగా చెప్పలేను కాని, తానం ఉత్తరాదినుంచి సంక్రమించినట్టుగా అనిపిస్తుంది. ఇప్పటి ఖయాల్ శైలికన్నా పాతదైన ధ్రుపద్ గాత్రంలో నోమ్ తోమ్ ఆలాపన, జోడ్ పాడతారు. నోటితో వీణలాగా పాడడానికి కారణం అప్పటి సంగీతంలో (రుద్ర) వీణకు ఉండిన ప్రాముఖ్యతే అంటారు. రుద్రవీణను సోలో వాద్యంగానూ, గాత్రానికి వంతగానూ ఉపయోగించేవారట. హార్మోనియంవంటిది లేని ఆ రోజుల్లో గాయకుణ్ణి ఇబ్బంది పెట్టాలంటే వైణికులు కష్టసాధ్యమైన శ్రుతిని అందించడం మొదలైన పనులు చేసేవారట. మొత్తంమీద వీణదే పైచెయ్యిగా ఉండేదట. అందుకని ధ్రుపద్ గాయకులు చాలావరకు వీణని అనుకరిస్తూ పాడడం చూస్తాం. రాగప్రస్తారం మధ్యలో ఆపినప్పుడు పాడే మొహ్రా (ముద్ర) కూడా అటువంటిదే. ఇదే తరహాలో దక్షిణాది గాయకులు కూడా తానం పాడతారు. నిజానికి జోడ్ లాగే తానం కూడా వీణవంటి వాద్యాలమీదనే అన్నిటికన్నా బావుంటుంది. ఇందులో లయ ఉంటుంది కాని తాళం ఉండదు.
1565లో జరిగిన తళ్ళికోట యుద్ధానికి పూర్వం ఉత్తర, దక్షిణ సంగీతపద్ధతులకు ఇప్పటికన్నా దగ్గర సంబంధం ఉండేదనీ, ఆ తరవాత రెండూ క్రమంగా విడిపోయాయనీ కొందరంటారు.
నౌషాద్ గురించి Rohiniprasad అభిప్రాయం:
06/17/2009 9:55 am
ప్రసాద్‌గారూ,
మీకు వ్యాసాలు నచ్చినందుకు సంతోషమేగాని మరీ నా మీద పద్యాలు రాసెయ్యకండి.
నాకు అభిమాన సంగీతదర్శకుడు నౌషాద్‌తో ఇంటర్వ్యూ అయిదు భాగాలలో లభిస్తోంది. http://www.youtube.com/view_play_list?p=DC113E4207FDE09D&search_query=Naushad+interview
సంగీతం ఎవరిదైనా అది విని ఆనందించవలసిందే. సంగీతాన్ని గురించి ఎవరు ఎంత రాసినా అవన్నీ పరిచయవ్యాసాలే.
కీబోర్డుతో స్వరాలూ, రాగాల సాధన గురించి నేను చెప్పిన విషయాలను చదివి కొందరు కీబోర్డు మెట్లమీద స్టికర్లు అతికించుకుని ప్రయత్నిస్తున్నారు. అవి వారికి కొంత ప్రేరణనిచ్చి ముందుకెళ్ళేలా చెయ్యవచ్చు.
కాని మొత్తంమీద తెలుగువారికి సంగీతం వినడం, సాధనచెయ్యడంలో చాలా తక్కువ ఆసక్తి ఉన్నట్టుగా అనిపిస్తుంది. మిత్రుల ఎదుట నేను ఎప్పుడైనా చిన్న సోదాహరణ ప్రసంగంవంటిది చేస్తే కాస్త ఆసక్తి కనబరిచేది మగవారే. మహిళలు ఏ మాత్రం ఆసక్తి చూపరు. తెలుగు పిల్లలకు సంగీతం రాకపోవడానికి ఇదొక ముఖ్య కారణం అనిపిస్తుంది. (ఇలా అన్నందుకు నన్ను MCP అని తిట్టుకోకండి!)
నౌషాద్ గురించి M.S.Prasad అభిప్రాయం:
06/16/2009 11:07 pm
అయ్యా! శ్రీమదిత్యాది శ్రీమాన్ రోహిణీ ప్రసాద్ ఆచార్యుల వారూ!
అది ఇది అని పేరు పెట్టి చెప్పవలసిన పని లేకుండా మీరు వ్రాసిన అన్ని వ్యాసాలు అమూలాగ్రం ఉత్కంఠ భరిత సమాచారాలతోనూ స్ఫూర్తిదాయక మైన అనేక విషయాలతో సుసంపన్నమై ఉంటున్నాయి. వయం ధన్యాః వయం ధన్యాః వయం ధన్యాః మహీతలే, రోహిణీ వల్లభో యేషాం సంగీత పధ దర్శకః.
ఏదో సంగీతం గురించిన ఒకటి రెండు విషయాలు తెలుసుకుందామని యాధాలాపంగా ఒక వ్యాసం చదివిన తరువాత మీ తక్కిన వ్యాసాలు చదవకుండా ఉండలేకపోతున్నాను. దిశా నిర్దేశన మాత్రమే కాక దిగ్గజాల ప్రదర్శన కూడా మాలాంటి వారికై చేస్తున్న మీ కృషి ప్రశంసనీయం.
ఎందర జూపెనేని వరియింపదు మా కవితా కుమారి – మీ పేరు విని ఉరకలు వేసి వస్తుంది చిత్తగించండి
ఇది హృద్యం బనవద్య మాఢ్య మిది యెంతే ప్రీతి పాత్రంబటం
చెది గైకొన్నను తోప జేసెడి తవానేకామలోదార జ్ఞా
నద వ్యాసావళి భారతీ చరణ ద్వంద్వ ప్రాప్త పుష్పౌఘమై
కదలించున్ రస భావ కందళిత హృత్కంజాత పుంజంబులన్
ఇరువది ఏడు తారలను యింపుగ పెండిలి యాడి “రోహిణీ”
తరుణి “ప్రసాద” బుద్ధి జని తక్కిన వారి ననాదరించు యా
కొరత “సితార వల్లభత” కొంచెము సేసిన రోహిణీ ప్రసా
దురుతర శేముషీ విభవ మూర్జితమై చెలువొందు గావుతన్
అయ్యా! మాకుమరికొన్ని రాగాల పరిచయ భిక్ష ప్రసాదించండి.
భవదీయుడు
తెలుగు అధికార భాష కావాలంటే గురించి vamsi అభిప్రాయం:
06/16/2009 4:20 am
రహమ్ తుల్లా గారు,
తెలుగు అధికార భాష అయినది కనుక, మీ పుస్తకము పేరు మార్చగలరు.
పునరపి గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
06/14/2009 9:14 pm
ఈ సందర్భంలో చలం “మైదానం” కన్నా “స్త్రీ” సముచితం – మన చెంపలు ఛెళ్ళుమనిపిస్తాడు! వంటా, తుడవడాలతో సతమతమయే ఆడవాళ్ళకి విలువ లేదు, వాళ్ళు చదువుకొని స్వతంత్ర ఆర్జన చెయ్యడమే మార్గం అన్నాడు. అని కూడా దాదాపు వందేళ్ళయింది. ఇప్పుడు భార్యలు ఉద్యోగం చేస్తూ, మూడు పూటలా వంట కూడా చేస్తున్నారు – అదీ అమెరికాలో – అంటే వాళ్ళ భర్తలు చాలా సిగ్గుపడాలి. చదువుకున్న అమ్మాయిలు కిమ్మనకుండా వాళ్ళమ్మలు చెప్పిన సూక్తులు విని సర్దుకుపోవడం శోచనీయం.
బళ్ళో పాఠాలు చెప్పి సర్టిఫికెట్లివచ్చు. అది ముందు తరాల వాళ్ళకి. ఈ తరం మగాళ్ళు మారాలి. అంతకన్నా ముఖ్యంగా ఆడవాళ్ళు కాస్త స్వతంత్రం చూపెట్టాలి. “మా అమ్మ ఏనాడైనా చట్నీ చేయకుండా దోశ చేసిందేమో అడుగు,” అన్న రాఘవకి, “మీ అమ్మ నాలాగా బయట ఉద్యోగం చేసిందోమో అడుగు,” అని లత ఎదురుచెప్పగలగాలి.
కొడవళ్ళ హనుమంతరావు
చిలక – గోరింక గురించి sirivennela అభిప్రాయం:
06/14/2009 8:43 am
మేనరికాలు మంచివి కావని పూర్వకాలీకులు అనుకునెవారు. పోయిన సంవత్సర రీసెర్చ్ యిది అపోహ అని తెలిపినది.
“Research downplays risk of cousin marriages”
http://www.usatoday.com/news/science/2002-04-04-cousins.htm
సహచర గురించి siriviennea అభిప్రాయం:
06/14/2009 7:48 am
మంచి భావన!
“ఇప్పుడు హృదయం ఇచ్చినందుకు
రేపు స్మృతిగీతం రాయకు”
ఒక రాజకీయ ఉత్తరం గురించి siriviennea అభిప్రాయం:
06/14/2009 7:43 am
మైనారిటీలకు భరత దేశం లో హక్కులు లేవనా రచయిత్రి ఉద్దేశం?
పునరపి గురించి Akella Suryanarayana Murthy అభిప్రాయం:
06/14/2009 4:42 am
సమస్యను గుర్తించేరు బాగుంది, పరిష్కారం? హనుమంతరావు గారు other side of the story బాగా చూపించేరు. ఇలాంటి సమాధానాలు వేరే ఇళ్లల్లో వస్తాయని తెలిసి వినోదంగా అనిపించింది
మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా గురించి Rohiniprasad అభిప్రాయం:
06/13/2009 10:21 am
ఎందుచేతనో పరుచూరి శ్రీనివాస్ గారి కామెంట్ మిస్ అయాను.
చంద్రహారం తీస్తున్నప్పుడో, తీశాకో విజయావారు నెల జీతాలు మొదలుపెట్టారు. అంతకుముందు కాదు. ఈ విషయంలో అనుమానం లేదు. బైట పాడకుండా ఉండటానికి ఘంటసాల లక్ష రూపాయలో, అంతకంటే ఎక్కువో అడిగాడని మా నాన్నగారే చెప్పారు. ఎటొచ్చీ చంద్రహారం దెబ్బతినడంతో ఈ నెలజీతాల ప్రణాళిక కొనసాగలేదు. అలాగే ఘంటసాల చుట్ట అలవాటు మధ్యలో వచ్చి, మధ్యలోనే పోయిందని అంటారు.
కేళ్కర్‌గారు అమరసందేశం సినిమాకు ప్రధాన సంగీతదర్శకుడు. వయీ ప్రాంతపు మరాఠీ బ్రాహ్మణుల పద్ధతిలో ఆయన కాస్త అమాయకుడు. ఆయనకు చెప్పకుండా ప్రసాదరావు పేరును జత చెయ్యడం ఆయనకు చాలా కోపం తెప్పించింది. ఇదంతా జరిగిన ఒక దశాబ్దం తరవాత నేను శిష్యుడైనప్పుడు కూడా ఆయన సినిమావాళ్ళని తిడుతూనే ఉండేవాడు.
మద్రాసు రాకపూర్వం ఆయన బొంబాయి సినీ ఆర్కెస్ట్రాలో వయొలిన్ తదితర వాద్యాలు వాయించేవాడట. ఆయన వినాయకరావు పట్వర్ధన్ శిష్యుడు. గాత్రం నేర్చుకుంటున్నప్పుడు డి.వి. పలూస్కర్‌కు సహాద్యాయి. పూట గడవడానికి సినిమాల్లో చేరాడు. మధ్యలో అల్లా ఉద్దీన్ బృందంతో కలిసి ఉదయశంకర్ నృత్యప్రదర్శనల్లో వాయించడానికి విదేశాలకు వెళ్ళాడు. అందులో వయొలిన్ వంటి విదేశీవాద్యాలకు చోటు లేదు కనక తబలాతరంగ్ జలతరంగ్ మొదలైనవి వాయించానని నాతో అన్నాడు.
సంగీతరావుగారి చిన్ననాటి సంగతులు గురించి Rohiniprasad అభిప్రాయం:
06/13/2009 7:22 am