ఈ వ్యాసంపై అభిప్రాయాలలో కొన్నిటిని చర్చావేదికలో సాంప్రదాయ సాహిత్యం విభాగంలోకి మార్చాము. వ్యాసానికి ప్రత్యక్ష సంబంధం లేని అభిప్రాయాలను అక్కడ పోస్ట్ చేయగలరని మా విజ్ఞప్తి.
భాషలో “శభాష్” అనే అర్ధాన్నిచ్చి, ఎక్కువ సంతోషాన్ని తెలిపే మాటల నన్నిటినీ ఒక్క చోట కూర్చి చూడాలనే కోరిక వుంటే, దానికై వేమారు శబ్దార్ధ కోశాలు (Dictionaries) వెతకాలిసిన పనిలేదు. మీ వ్యాసాల చివర పాఠకుల అభిప్రాయాలను చూస్తే చాలు. (ఇంతకంటే మంచిగా నా అభిప్రాయాన్నెలా తెలుపాలో నాకు తెలియటం లేదు.)
భాషల నన్ని మాటల, “శభాష్” అని అర్ధము నిచ్చి, హెచ్చు సం
తోషము దెల్పు వాని, రస తుందిలతన్ యొకచోట చూచు చి
త్తేష గలింగె నేని, యవి యెల్లయు మీ ఘన వ్యాస వీధులన్
భేషుగ దోచు; కోశముల వేమరు చూడగ బోవ డెవ్వడున్
పాశ్చాత్య శాస్త్రీయసంగీతం గురించిన సమాచారం చాలానే దొరుకుతుంది. ఉదాహరణకు ఈ వెబ్ సైట్ చూడవచ్చు: http://w3.rz-berlin.mpg.de/cmp/musical_history.html
మన దేశపు సంగీతాభిమానులకు రెండిటినీ పోల్చ బుద్ధి అవుతుంది కాని ఈ రెండు పద్ధతుల పరిణామమూ వేరువేరు వైఖరులతో సాగింది.
పాత తరానికి చెందిన బాఖ్ సంగీతం ఇక్కడ వినవచ్చు: http://www.jsbach.net/audio/index.html
తరవాతివాడైన మోత్సార్ట్ స్వరపరిచిన అద్భుతమైన 40th symphony ని సినిమా కోసమని సలీల్ చౌదరి అనుకరించిన సంగతి తెలిసినదే. http://www.archive.org/details/Mozart_Symphony_40
మరొక మేధావి బెథోవెన్ : http://www.lvbeethoven.com/Oeuvres/Music-RealAudio.html
ఈనాడు పాశ్చాత్య శాస్త్రీయసంగీతమంతా polyphonic గానే అనిపిస్తుంది.
ఒకప్పుడు అలా ఉండేదికాదట.
మన సంగీతానికీ (ముఖ్యంగా హిందూస్తానీ), పశ్చిమదేశాల సంగీతానికీ ఉన్న తేడా ఏమిటంటే వారి సంగీతానికి స్వరరచయితా (కంపోజర్), నిర్వాహకుడూ (కండక్టర్), వాయించేవారూ (ఆర్క్కెస్ట్రా) వేరువేరు వ్యక్తులు. మనకు అలాకాదు. ఏ సంతూర్‌నో పట్టుకుని స్టేజి ఎక్కిన కళాకారుడు మూడూ తానే అవుతాడు. వారిలాగ కచేరీల్లో మనకు ‘రాసిపెట్టిన’ స్వరాల అవసరం ఉండదనేది తెలిసినదే.
శ్రోతల స్పందనకూడా కాస్త వేరుగా ఉంటుంది. ప్రసిద్ధుల symphony లన్నీ వినడానికి నాకు చాలా బావుంటాయి. అనేక ‘పొర’లలో చేసిన ఆ స్వరరచనలు ఎంతో అద్భుతమైనవి. మనకు సంగీతంలో individuality ఎంత ముఖ్యమో, వారికి విధేయత, నిబద్ధత అంతే ముఖ్యం.
హిందుస్తానీ కళాకారుల గురించి తెలుగులో చదవాలనుకుంటే, సదాశివ గారి యాది, మలయమారుతాలు, ముచ్చట్లు(మూడో టైటిల్ నాకు సరిగ్గా గుర్తులేదు). చదవండి. చాలా ఆసక్తికరమైన, స్ఫూర్తి దాయకమైన విషయాలు తెలుసుకోవచ్చు.
వినీల్.
అటువంటఫ్ఫుడు ప్రత్యేకంగా “తల్లుల్ని”మాత్రమే నెపంపెట్టడం కూడా మీరు తెలిసే చేసిన ట్టు కదా!? అప్పుడింక” MCP “అని అనుకుంటే ఎవరైనా మీరు దాన్ని easy గా పరిగణించకూడదు కూడా!! alternative voice ని మీ ఇష్టాయిష్టాల్తో నిమిత్తం లేకుండా కాస్త వినండి.. “very predictable” అని కొట్టిపడేయకుండా ఆలోచించండి. ప్రతీదానికీ..ఆడవాళ్ళనించి అతిగా ఆశించే సాంప్రదాయ..చాదస్తపు మనస్తత్వాన్నించి ఎంతోకొంత బయటపడాలి ఇవాళ ఎవరైనా! .it is trite to expect women to carry the tradition and culture on their shoulders alone.
స్పందన గురించి నిత్యమూ ఆలోచిస్తూ, అప్పుడప్పుడూ రాస్తూ ఉండే నాకు నా ప్రసంగం గురించి మీకొచ్చిన అనుమానం రాదని ఎందుకనుకుంటారు? తెలిసే రాశానని భావించండి, దయచేసి.
బడే గులాం అలీ, బిస్మిల్లా ఖాన్ వంటి ఒకరిద్దరు ముస్లిం సంగీత విద్వాంసుల గురించి తప్ప వేరే ఏ ముస్లిం విద్వాంసుల గురించి తెలియని నాకు హిందుస్తానీ సంగీత సామ్రాజ్యానికి వీరే మకుటం లేని సమ్రాట్టులై అత్యున్నత ఆచార్యస్థానాలలో ఉన్నారని మొదటి సారిగా మీ వ్యాసం ద్వారానే తెలిసింది. మత వివక్షత లేకుండా ఆ కాలంలోనే అనేకులైన ముస్లిమేతరులు వారివద్ద శిష్యరికం చేసి సంగీత విద్యను సాధించారని, వారితో వివాహాది సంబంధ బాంధవ్యాలు కలుపుకున్నారని తెలిసి ఆనందం కలిగింది. జాతి మతవిభేదాలు సామాన్య జనానీకానికే గాని సరస్వతీ పుత్రులైన కళా పిపాసులకు ఉండవు.
సంగీత రసాస్వాదనని స్కాచ్ తో పొల్చడం నాకు సంబంధించినంతవరకూ అత్యంత నీచోపమానమే కాక అత్యంత గర్హణీయం/శొచనీయం. మీ ఈ ఉపమా పదార్ధంతో సామ్యం భావించిన ఏ పదార్ధాన్నైనా, భావానైనా, తద్భావ సంబంధితమైన జుగుప్సతో తత్క్షణమే త్యజించే వారుంటారనుకుంటే మీరంత నీచోపమానం వాడేవారు కాదు. చందన కర్దమాలు (ఒక్క అద్వైతికి తప్ప) ఎప్పటికీ సమం కావు.
ఈ వ్యాసం చదివిన తరువాత శ్రీ సరిపల్లి సూర్యనారాయణ గారు వెలిబుచ్చిన ఆకాంక్ష (ప్రాచ్య-పాశ్చాత్య శాస్త్రీయ సంగీత సమీక్షణ-విశ్లేషణాత్మకమైన వ్యాసం) నాకు గూడా ప్రగాఢంగా కలుగుతోంది. గురువుగారు ఉపేక్ష మాని మా ఈ అపేక్ష తొందరలో నెరవేరుస్తారని నిరీక్షిస్తాను. వ్యాసం ఎంతబాగుందో చెప్పడమంటే సూర్య కాంతి ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో చెప్పబూనటమే.
మాటల కందరాని అతి మాన్య సుధీకము మీ విధాన మంచేటికి మాటిమాటికిని ఏము వచింపగ – ఇక చాలు ఈ ఉత్పల మాలనిక్కడ ఆపివేస్తాను మీ ఆజ్ఞానుసారం.
ఒకవేళ మీ సోదాహరణ ప్రసంగంలోనే ఆడవాళ్ళని ఆకట్టుకోగల విశేషాంశాలు ఏమన్నా లోపించాయేమో..అన్న ఆలోచన మీకెప్పుడూ సందేహంగానైనా రాలేదా?? మంచి టీచర్లు ఎప్పుడూ వినేవాళ్ళని తప్పుపట్టటం చేయకూడదంటారు మరి.
త్యాగయ్య నించి..మన మంగళంపల్లి దాకా వాళ్ళని గొప్ప గాయకులుగా బాల్యం నించీ ప్రోత్స హించింది వాళ్ళ తల్లులే. ఇవాళ్టికీ పిల్లల్లో ఉన్న టాలెంట్
చాలా ఆశ్చర్యం కల్గించేదిగా ఉంటుంది. గమకాలని సునాయాసంగా పలికిస్తూ
ఎంతో క్లిష్టమైన సంగతులని కూడా అలవోకగా పాడే పిల్లల్ని చూస్తూంటాం!
అందువల్ల ఆసక్తీ..ప్రోత్సాహం లేదనేందుకు లేదు.
పిల్లల్ని కేవలం గాయకులుగానే ఎదగమని నిశ్చింతతో తల్లితండ్రులు అనుకోగల కాలాలు కావివి. అదీకాక శాస్త్రీయసంగీతాన్ని నేర్పించిన వారు
ఎక్కువగా బ్రాహ్మణులు. వాళ్ళు ఇవాళ వాళ్ళ ఇతర కుల విద్యల్ని వదిలిపెట్టీసిన ట్టే..సంగీతాన్నీ క్రమంగా వదిలేస్తున్నారు. గురువుల కొరత అన్ని కళారంగాల్లో ఉన్న ట్టే శాస్త్రీయ సంగీతానికీ ఉంది. ఇదేం రెండుమూణ్ణెళ్ళలో పూర్తిచేసేసే crash course కాదుకదా ప్రావీణ్యులైపోయేందుకు? ఇందులో పిల్లల తప్పూ..వారి తల్లుల తప్పూ ఏదీ?
కళాకారులు అందరూ కాలేరు. అయ్యేవాళ్ళని ఎవరూ ఆపనూ లేరు. మ చ్చుకి కొన్నాళ్ళు atleast for a change మీరు మీ focus నీ.. మీ complaints నీ..మీరు తల్లుల మీదనించి తండ్రుల మీదకి మార్చరాదో??!
రమ.
స్త్రీ పర్వంలో గాంధారి గురించి Madhav అభిప్రాయం:
06/24/2009 5:10 am
ఈ వ్యాసంపై అభిప్రాయాలలో కొన్నిటిని చర్చావేదికలో సాంప్రదాయ సాహిత్యం విభాగంలోకి మార్చాము. వ్యాసానికి ప్రత్యక్ష సంబంధం లేని అభిప్రాయాలను అక్కడ పోస్ట్ చేయగలరని మా విజ్ఞప్తి.
– సంపాదకులు.
రచయితలకు సూచనలు గురించి మృత్యుంజయరావు అభిప్రాయం:
06/24/2009 3:43 am
ఈమాట పత్రిక లోని రచనలు అద్భుతంగా ఉంటున్నాయి. ఈ స్థాయి తగ్గకుండా పత్రిక చిర కాలం నడవాలని కోరుకుంటున్నాను
గాయక గంభీరుడు ఉస్తాద్ అమీర్ ఖాన్ గురించి M.S.Prasad అభిప్రాయం:
06/22/2009 1:41 am
భాషలో “శభాష్” అనే అర్ధాన్నిచ్చి, ఎక్కువ సంతోషాన్ని తెలిపే మాటల నన్నిటినీ ఒక్క చోట కూర్చి చూడాలనే కోరిక వుంటే, దానికై వేమారు శబ్దార్ధ కోశాలు (Dictionaries) వెతకాలిసిన పనిలేదు. మీ వ్యాసాల చివర పాఠకుల అభిప్రాయాలను చూస్తే చాలు. (ఇంతకంటే మంచిగా నా అభిప్రాయాన్నెలా తెలుపాలో నాకు తెలియటం లేదు.)
భాషల నన్ని మాటల, “శభాష్” అని అర్ధము నిచ్చి, హెచ్చు సం
తోషము దెల్పు వాని, రస తుందిలతన్ యొకచోట చూచు చి
త్తేష గలింగె నేని, యవి యెల్లయు మీ ఘన వ్యాస వీధులన్
భేషుగ దోచు; కోశముల వేమరు చూడగ బోవ డెవ్వడున్
భవదీయుడు
జుగల్‌బందీ కచేరీలు గురించి Rohiniprasad అభిప్రాయం:
06/19/2009 1:55 pm
పాశ్చాత్య శాస్త్రీయసంగీతం గురించిన సమాచారం చాలానే దొరుకుతుంది. ఉదాహరణకు ఈ వెబ్ సైట్ చూడవచ్చు:
http://w3.rz-berlin.mpg.de/cmp/musical_history.html
మన దేశపు సంగీతాభిమానులకు రెండిటినీ పోల్చ బుద్ధి అవుతుంది కాని ఈ రెండు పద్ధతుల పరిణామమూ వేరువేరు వైఖరులతో సాగింది.
పాత తరానికి చెందిన బాఖ్ సంగీతం ఇక్కడ వినవచ్చు:
http://www.jsbach.net/audio/index.html
తరవాతివాడైన మోత్సార్ట్ స్వరపరిచిన అద్భుతమైన 40th symphony ని సినిమా కోసమని సలీల్ చౌదరి అనుకరించిన సంగతి తెలిసినదే.
http://www.archive.org/details/Mozart_Symphony_40
మరొక మేధావి బెథోవెన్ :
http://www.lvbeethoven.com/Oeuvres/Music-RealAudio.html
ఈనాడు పాశ్చాత్య శాస్త్రీయసంగీతమంతా polyphonic గానే అనిపిస్తుంది.
ఒకప్పుడు అలా ఉండేదికాదట.
మన సంగీతానికీ (ముఖ్యంగా హిందూస్తానీ), పశ్చిమదేశాల సంగీతానికీ ఉన్న తేడా ఏమిటంటే వారి సంగీతానికి స్వరరచయితా (కంపోజర్), నిర్వాహకుడూ (కండక్టర్), వాయించేవారూ (ఆర్క్కెస్ట్రా) వేరువేరు వ్యక్తులు. మనకు అలాకాదు. ఏ సంతూర్‌నో పట్టుకుని స్టేజి ఎక్కిన కళాకారుడు మూడూ తానే అవుతాడు. వారిలాగ కచేరీల్లో మనకు ‘రాసిపెట్టిన’ స్వరాల అవసరం ఉండదనేది తెలిసినదే.
శ్రోతల స్పందనకూడా కాస్త వేరుగా ఉంటుంది. ప్రసిద్ధుల symphony లన్నీ వినడానికి నాకు చాలా బావుంటాయి. అనేక ‘పొర’లలో చేసిన ఆ స్వరరచనలు ఎంతో అద్భుతమైనవి. మనకు సంగీతంలో individuality ఎంత ముఖ్యమో, వారికి విధేయత, నిబద్ధత అంతే ముఖ్యం.
హిందూస్తానీ గాత్ర సంగీతంలో ఘరానాలు గురించి వినీల్ అభిప్రాయం:
06/19/2009 9:26 am
హిందుస్తానీ కళాకారుల గురించి తెలుగులో చదవాలనుకుంటే, సదాశివ గారి యాది, మలయమారుతాలు, ముచ్చట్లు(మూడో టైటిల్ నాకు సరిగ్గా గుర్తులేదు). చదవండి. చాలా ఆసక్తికరమైన, స్ఫూర్తి దాయకమైన విషయాలు తెలుసుకోవచ్చు.
వినీల్.
నౌషాద్ గురించి rama bharadwaj అభిప్రాయం:
06/19/2009 9:13 am
రోహిణీప్రసాద్ గారూ!!
అటువంటఫ్ఫుడు ప్రత్యేకంగా “తల్లుల్ని”మాత్రమే నెపంపెట్టడం కూడా మీరు తెలిసే చేసిన ట్టు కదా!? అప్పుడింక” MCP “అని అనుకుంటే ఎవరైనా మీరు దాన్ని easy గా పరిగణించకూడదు కూడా!! alternative voice ని మీ ఇష్టాయిష్టాల్తో నిమిత్తం లేకుండా కాస్త వినండి.. “very predictable” అని కొట్టిపడేయకుండా ఆలోచించండి. ప్రతీదానికీ..ఆడవాళ్ళనించి అతిగా ఆశించే సాంప్రదాయ..చాదస్తపు మనస్తత్వాన్నించి ఎంతోకొంత బయటపడాలి ఇవాళ ఎవరైనా! .it is trite to expect women to carry the tradition and culture on their shoulders alone.
రమ.
నౌషాద్ గురించి Rohiniprasad అభిప్రాయం:
06/19/2009 6:14 am
రమగారూ,
Your reaction is so very predictable.
స్పందన గురించి నిత్యమూ ఆలోచిస్తూ, అప్పుడప్పుడూ రాస్తూ ఉండే నాకు నా ప్రసంగం గురించి మీకొచ్చిన అనుమానం రాదని ఎందుకనుకుంటారు? తెలిసే రాశానని భావించండి, దయచేసి.
హిందూస్తానీ గాత్ర సంగీతంలో ఘరానాలు గురించి M.S.Prasad అభిప్రాయం:
06/19/2009 2:53 am
బడే గులాం అలీ, బిస్మిల్లా ఖాన్ వంటి ఒకరిద్దరు ముస్లిం సంగీత విద్వాంసుల గురించి తప్ప వేరే ఏ ముస్లిం విద్వాంసుల గురించి తెలియని నాకు హిందుస్తానీ సంగీత సామ్రాజ్యానికి వీరే మకుటం లేని సమ్రాట్టులై అత్యున్నత ఆచార్యస్థానాలలో ఉన్నారని మొదటి సారిగా మీ వ్యాసం ద్వారానే తెలిసింది. మత వివక్షత లేకుండా ఆ కాలంలోనే అనేకులైన ముస్లిమేతరులు వారివద్ద శిష్యరికం చేసి సంగీత విద్యను సాధించారని, వారితో వివాహాది సంబంధ బాంధవ్యాలు కలుపుకున్నారని తెలిసి ఆనందం కలిగింది. జాతి మతవిభేదాలు సామాన్య జనానీకానికే గాని సరస్వతీ పుత్రులైన కళా పిపాసులకు ఉండవు.
సంగీత రసాస్వాదనని స్కాచ్ తో పొల్చడం నాకు సంబంధించినంతవరకూ అత్యంత నీచోపమానమే కాక అత్యంత గర్హణీయం/శొచనీయం. మీ ఈ ఉపమా పదార్ధంతో సామ్యం భావించిన ఏ పదార్ధాన్నైనా, భావానైనా, తద్భావ సంబంధితమైన జుగుప్సతో తత్క్షణమే త్యజించే వారుంటారనుకుంటే మీరంత నీచోపమానం వాడేవారు కాదు. చందన కర్దమాలు (ఒక్క అద్వైతికి తప్ప) ఎప్పటికీ సమం కావు.
భవదీయుడు
జుగల్‌బందీ కచేరీలు గురించి M.S.Prasad అభిప్రాయం:
06/18/2009 10:59 pm
ఈ వ్యాసం చదివిన తరువాత శ్రీ సరిపల్లి సూర్యనారాయణ గారు వెలిబుచ్చిన ఆకాంక్ష (ప్రాచ్య-పాశ్చాత్య శాస్త్రీయ సంగీత సమీక్షణ-విశ్లేషణాత్మకమైన వ్యాసం) నాకు గూడా ప్రగాఢంగా కలుగుతోంది. గురువుగారు ఉపేక్ష మాని మా ఈ అపేక్ష తొందరలో నెరవేరుస్తారని నిరీక్షిస్తాను. వ్యాసం ఎంతబాగుందో చెప్పడమంటే సూర్య కాంతి ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో చెప్పబూనటమే.
మాటల కందరాని అతి మాన్య సుధీకము మీ విధాన మంచేటికి మాటిమాటికిని ఏము వచింపగ – ఇక చాలు ఈ ఉత్పల మాలనిక్కడ ఆపివేస్తాను మీ ఆజ్ఞానుసారం.
భవదీయుడు
నౌషాద్ గురించి rama bharadwaj అభిప్రాయం:
06/18/2009 9:28 am
రోహిణీ ప్రసాద్ గారూ!!