“భ్రాంతి” అని పేరుపెట్టడంతోనే రచయిత్రి పాఠకుణ్ణి చెయ్యి పట్టుకుని తన దారిలో తీసుకువెళ్లారు. “బిదు మా మధ్య కొత్త వ్యక్తేమి కాదు.”తో ఆపేసివుంటే అసలు బిదు పూర్తిగా సాధు కల్పిత పాత్రేమోనని పాఠకుడు ఆలోచిస్తాడు. కానీ, అదే పేరాలో ఉన్న “ఆంధ్ర యూనివర్సిటీలో పిజి మేమంతా కలిసే చదువుకున్నాం,” తరువాతి పేరాలోని “బిదు వాడి కోసం చాలా ఎంక్వైరీలు చేసి, చివరకు బెంగాల్ వెళ్ళిపోయింది” అన్న వాక్యాలు కథకుడి ద్వారా వెలువడడంవల్ల, ఆ అవకాశం లేదు; ఆమె అతని కల్పన కాదు. “బావా, అది మనిషి కాదురా” అన్న వాక్యం, పోనీ అతని బలాత్కారం, దాని తరువాత అతనే ఆమె శిరఛ్ఛేదం చెయ్యడంవల్ల ఆమె అలా మొండెంలాగా మాత్రమే అతనికి కనిపించి భయపెట్టడాన్ని సూచిస్తోంది అని అనుకుందామని అనుకుంటే, కథకుడు ఆమె బెంగాల్ వెళ్ళిపోవడం గూర్చి చెప్పాడు గనుక ఆమె బతికే ఉంది. బహుశా సాధు చేసిన బలాత్కారం అతన్నే పట్టి పీడిస్తున్నదని అనుకుందామంటే, ఆ పరిస్థితిలో ఈ ప్రపంచంలో మసలుతూ ఊపిరి పీల్చుకునే బిదు అతని గూర్చి ఎంక్వైరీలు చేయదు కదా? ఇది భ్రాంతి మాత్రమే అయితే, కనీసం ఈ పాఠకుడు అతనికి ఆ భ్రాంతి కలగడానికి వెనక కారణాలు కథలో కనిపిస్తాయని ఆశిస్తాడు. పాఠకుణ్ణి ఆలోచించేలా చెయ్యాలనుకుంటే కథకు “భ్రాంతి” అని పేరుపెట్టకూడదు.
సెలవు నుంచి యూనిట్‌కి తిరిగి వెళ్తున్న సైనికుడి మనస్సులో, యుద్ధంలో తన బుల్లెట్లకి గురైన వాళ్ళ పట్ల ఉద్వేగభరితమైన పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తున్నట్లు రాయడం, నిస్సంశయంగా సృజనాత్మక స్వేచ్ఛ తప్ప, వాస్తవం మాత్రం కాదు. ఎన్నో హిందీ సినిమాల్లో ఈ విధంగా, సాయుధ దళాల సైనికులని ‘ఓవర్ డ్రమటైజ్’ చేసి చూపుతుంటే, ఆ నిర్మాతల/దర్శకుల అవగాహనా రాహిత్యానికి నవ్వూ కోపమూ వస్తాయి. పైగా, సైనికుల గురించి ఒక తప్పుడు అభిప్రాయాన్ని కూదా వీక్షకుల/పాఠకుల మీద రుద్దుతాయి.
అలా అని సైనికులకి మృదుత్వం ఉండదనుకుంటే పొరపాటే. అది ఎక్కడ ప్రకటితమవాలో అక్కడే ప్రకటితమవుతుంది. ఎక్కడబడితే అక్కడ కాదు. సుశిక్షితుడైన ఒక సైనికుడు ఇలా పశ్చాత్తాపపడే ప్రసక్తే లేదు. ఎందుకంటే, ఏ సైనికుడైనా యుద్ధంలో నిర్వర్తించేది తనకు అప్పజెప్పిన డ్యూటీ మాత్రమే. అందుకు దోహదపడేలా అతనిని మానసికంగానూ శారీరకంగానూ సిద్ధం చేస్తుంది, సైన్యంలో అందే శిక్షణ. ఆ శిక్షణ గురించీ, సైనికులు ఎదుర్కొనే పరిస్థితుల గురించీ సాధారణంగా బయట తెలియదు.
వంట చేసేందుకు వంకాయలు తరుగుతూ, ‘అయ్యో, వీటికి నొప్పెడుతుందేమో’ అనుకుంటారా ఎవరైనా? అలా అనుకుని పశ్చాత్తాపపడడంవంటిదే ఈ కథ కూడా. రాయబోతున్న విషయం మీద పూర్తి అవగాహన లేకుంటే ఇటువంటి అవాస్తవికమైన కథనాలే వెలికొస్తాయి. ‘All Quite on The Western Front’ చూడండి వీలయితే.
నేను ఆక్షేపించలేదండి. పదకొండు పదాలు కూడా అఖ్ఖర్లేదేమో కదా అనే అర్ధంతో చెప్పాను. నేను పదో తరగతి తర్వాత తెలుగు చదువుకోలేదు. నాకు వచ్చినది కూడా ఏ వార్తా పత్రికో చదివే బాపతు గోదావరి జిల్లా తెలుగు మాత్రమే. హైదరాబాదు/తెలంగాణా వెళ్తే ఒక్క ముక్క అర్ధం కాదు నాకు. అక్కడి ముఖ్యమంత్రుల, వారి పిల్లలు మాట్లడేది వార్తల్లో వస్తే చదివి బుర్ర గోక్కోవడమే. కొస అనేది ఇలా వాడతారని తెలియదు. అందుకే భలే ఉంది అన్నాను. నమస్కారం.
శర్మగారూ,
కవిత నిడివి ఎప్పుడూ చూసుకోలేదండీ. చెప్తున్న భావానికి అనుగుణంగా కవిత తన నిడివిని తనే నిర్ణయిచుకుంటుందని నమ్ముతాను. “అస్సలు” పదంపై మీ ఆక్షేపణ కొంతవరకూ నిజమే. అయితే రాస్తున్నది వచన కవితే అయినా అందులో కూడా ఒక రకమైన లయ, అక్షర మైత్రి ఉండాలని అనుకుంటాను. అందుకనే ఆ పదం వాడాల్సి వచ్చింది. ఇక “కొస” అంటే తాడు చివర అని మాత్రమే కాదనుకుంటానండీ – the end, tip అనే అర్ధం కూడా ఉంది. జి. యన్. రెడ్డిగారి తెలుగు పర్యాయపద నిఘంటువులో అగ్రభాగము, అగ్రము, కొన, శిఖరము, శిఖి అనే పదాలు కూడా కనిపించాయి. “కొండకొస” “ఆ కొసకెలా చేరాలో” లాంటి ప్రయోగాలు మనకి కొత్త కాదు.
సినారె “మట్టీ, మనిషీ, ఆకాశం” నుండి –
పొద్దు పొడుపును చూడగానే
తూర్పుదిక్కు పట్టనంత పరవశించిపోయే తాను –
కొండకొస నుంచి దూకే జలధారలో
గుండెలోని శ్రుతిని సరిచూసుకునే తాను-
తోటి మనిషి అలికిడి వింటేనే
తుళ్ళిపడతాడెందుకని?
బడే గులాం చేత దక్షిణ భారతంలో విపరీతంగా ప్రభావితులైనవారిలో వోలేటి వెంకటేశ్వర్లు గారు, జి. ఎన్. బాలసుబ్రమణ్యం గారూ ఉన్నారు. వోలేటి గారు హిందుస్తానీలో సంగీతం సమకూర్చినవన్నీ ఈ ప్రభావానికి లోబడిన తరువాతే. బడే గులాం ఎప్పుడు మద్రాస్ వచ్చినా వోలేటి గారింట్లో దిగేవారని విన్నాను. GNB ఆయన సంగీతాన్ని మెచ్చుకున్నారు గానీ నాకు తెలిసి ఆ పంథాలో వేటికీ సంగీతాన్ని సమకూర్చలేదు.
కొన్ని చిన్న అంశాలు:
1. కర్ణాటక సంగీతంలో లాగా కాక హిందుస్తానీలో ప్రతి రాగానికీ ఒక నిర్ణీతసమయం ఉన్నది. కామోద్ రాగానికి, రాత్రి రెండవ ఝాము – ద్వితీయ పహార్. కథ మొదట్లో వాడుక సమయం సరయినదే కానీ, రెండవసారి ఉదయం ఫలహారాలు అయిన తరువాత అని ఉన్నది. బడే గులాం పొరబాటున కూడా ఆ తప్పు చెయ్యరు.
2. “మీ అంత మంచి గాయకుడికి, సంగీత పండితుడికి హిందూస్తానీలో కూడా ప్రవేశముండడం చాలా అవసరం. మనం సినిమా తీసేలోగా మీరు హిందూస్తానీ కూడా నేర్చుకోవడం అవసరం.” అన్న రాజుగారి డైలాగ్ ద్వారా మూర్తికి హిందూస్తానీలో అసలు ప్రవేశమే లేదని రచయిత నిర్ధారిస్తారు గనక, ఆయన పాట కామోద్ రాగంలో అని ఏ పాత్ర చేతనయినాచెప్పించి వుంటే బావుండేది. సర్వసాక్షి కథనంతో మాత్రమే ప్రస్తావించడం సబబు అనిపించలేదు. మిగిలిన రాగాల ప్రస్తావనలో, అలాగే ఏది ఠుమ్రీ, ఏది ఖయాల్ అని వాడిన చోట్ల కూడా ఇదే వ్యాఖ్య వర్తిస్తుంది.
3. “జ్నాపకమొచ్చింది” కి బదులు “జ్ఞాపకమొచ్చింది” అని ఉండాలి. వర్డ్ లో గానీ గూగుల్ లో గానీ jnaa అని టైప్ చేస్తే అది పొరబాటున కూడా “జ్ఞా”ని ఒక ఛాయిస్ కింద చూపదు. సరయిన అక్షరం రావడానికి “gnaa” అని టైప్ చెయ్యాలి.
4. “తొండంతో చెరుకుగడల కట్టనెత్తుకున్న గున్నేనుగు లాగున్నాడు”, “రెండు పెద్ద రాతిగుండ్ల మధ్యలోంచి ఊరే కొండనీటి ఊటలా, బడే ఖాన్‌సాబ్ లావుపాటి బుగ్గల మధ్యలోంచి …” అన్న వర్ణనలు ఒక సంగీత విద్వాంసుడి మదిలోకి బడే గులాం గూర్చి ప్రవేశిస్తాయని అనుకోవడం పాఠకుడికి అంత సులువు కాదు.
5. ఆంగ్లంలో Jaijaivanti అని కనిపించినా గానీ, పలికేటప్పుడు “జయజయవంతి” గా కాక ఆ రాగం “జైజవంతి” గా వినిపిస్తుంది.
భ్రాంతి గురించి శివకుమార శర్మ అభిప్రాయం:
06/06/2024 5:20 pm

(నీ)వాళ్ళు గురించి Sreenivas Bandaa అభిప్రాయం:
06/05/2024 9:51 pm
సెలవు నుంచి యూనిట్‌కి తిరిగి వెళ్తున్న సైనికుడి మనస్సులో, యుద్ధంలో తన బుల్లెట్లకి గురైన వాళ్ళ పట్ల ఉద్వేగభరితమైన పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తున్నట్లు రాయడం, నిస్సంశయంగా సృజనాత్మక స్వేచ్ఛ తప్ప, వాస్తవం మాత్రం కాదు. ఎన్నో హిందీ సినిమాల్లో ఈ విధంగా, సాయుధ దళాల సైనికులని ‘ఓవర్ డ్రమటైజ్’ చేసి చూపుతుంటే, ఆ నిర్మాతల/దర్శకుల అవగాహనా రాహిత్యానికి నవ్వూ కోపమూ వస్తాయి. పైగా, సైనికుల గురించి ఒక తప్పుడు అభిప్రాయాన్ని కూదా వీక్షకుల/పాఠకుల మీద రుద్దుతాయి.
అలా అని సైనికులకి మృదుత్వం ఉండదనుకుంటే పొరపాటే. అది ఎక్కడ ప్రకటితమవాలో అక్కడే ప్రకటితమవుతుంది. ఎక్కడబడితే అక్కడ కాదు. సుశిక్షితుడైన ఒక సైనికుడు ఇలా పశ్చాత్తాపపడే ప్రసక్తే లేదు. ఎందుకంటే, ఏ సైనికుడైనా యుద్ధంలో నిర్వర్తించేది తనకు అప్పజెప్పిన డ్యూటీ మాత్రమే. అందుకు దోహదపడేలా అతనిని మానసికంగానూ శారీరకంగానూ సిద్ధం చేస్తుంది, సైన్యంలో అందే శిక్షణ. ఆ శిక్షణ గురించీ, సైనికులు ఎదుర్కొనే పరిస్థితుల గురించీ సాధారణంగా బయట తెలియదు.
వంట చేసేందుకు వంకాయలు తరుగుతూ, ‘అయ్యో, వీటికి నొప్పెడుతుందేమో’ అనుకుంటారా ఎవరైనా? అలా అనుకుని పశ్చాత్తాపపడడంవంటిదే ఈ కథ కూడా. రాయబోతున్న విషయం మీద పూర్తి అవగాహన లేకుంటే ఇటువంటి అవాస్తవికమైన కథనాలే వెలికొస్తాయి. ‘All Quite on The Western Front’ చూడండి వీలయితే.
అద్వైతం గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
06/05/2024 4:35 pm
నేను ఆక్షేపించలేదండి. పదకొండు పదాలు కూడా అఖ్ఖర్లేదేమో కదా అనే అర్ధంతో చెప్పాను. నేను పదో తరగతి తర్వాత తెలుగు చదువుకోలేదు. నాకు వచ్చినది కూడా ఏ వార్తా పత్రికో చదివే బాపతు గోదావరి జిల్లా తెలుగు మాత్రమే. హైదరాబాదు/తెలంగాణా వెళ్తే ఒక్క ముక్క అర్ధం కాదు నాకు. అక్కడి ముఖ్యమంత్రుల, వారి పిల్లలు మాట్లడేది వార్తల్లో వస్తే చదివి బుర్ర గోక్కోవడమే. కొస అనేది ఇలా వాడతారని తెలియదు. అందుకే భలే ఉంది అన్నాను. నమస్కారం.
అద్వైతం గురించి Lyla Yerneni అభిప్రాయం:
06/05/2024 10:43 am
ఏమిటి ఈ కవిత అర్థం? కవిత రాసిన సుబ్రహ్మణ్యం గారైనా, చదివి అర్థమైంది అనుకున్న వారైనా వివరించరూ.
నాకు తెలుసుకోవాలని ఉంది. అందుకని అడుగుతున్నాను.
-Lyla
అద్వైతం గురించి Rao Vemuri అభిప్రాయం:
06/04/2024 6:56 pm
నేను సాధారణంగా కవితలు చదవను కానీ ఈ చిన్న కవిత ఈ “కొస” నుండి ఆ “కొస” కి చదివించింది. అర్థగర్భితంగా ఉందేమో, “భలే” బాగుందనిపించింది.
బొమ్మలగూటిలో ఠాగూరు గురించి Rajeswari అభిప్రాయం:
06/04/2024 1:05 pm
చాలా బావుంది మీ సమీక్ష.
అద్వైతం గురించి Subrahmanyam Mula అభిప్రాయం:
06/03/2024 11:13 pm
శర్మగారూ,
కవిత నిడివి ఎప్పుడూ చూసుకోలేదండీ. చెప్తున్న భావానికి అనుగుణంగా కవిత తన నిడివిని తనే నిర్ణయిచుకుంటుందని నమ్ముతాను. “అస్సలు” పదంపై మీ ఆక్షేపణ కొంతవరకూ నిజమే. అయితే రాస్తున్నది వచన కవితే అయినా అందులో కూడా ఒక రకమైన లయ, అక్షర మైత్రి ఉండాలని అనుకుంటాను. అందుకనే ఆ పదం వాడాల్సి వచ్చింది. ఇక “కొస” అంటే తాడు చివర అని మాత్రమే కాదనుకుంటానండీ – the end, tip అనే అర్ధం కూడా ఉంది. జి. యన్. రెడ్డిగారి తెలుగు పర్యాయపద నిఘంటువులో అగ్రభాగము, అగ్రము, కొన, శిఖరము, శిఖి అనే పదాలు కూడా కనిపించాయి. “కొండకొస” “ఆ కొసకెలా చేరాలో” లాంటి ప్రయోగాలు మనకి కొత్త కాదు.
సినారె “మట్టీ, మనిషీ, ఆకాశం” నుండి –
పొద్దు పొడుపును చూడగానే
తూర్పుదిక్కు పట్టనంత పరవశించిపోయే తాను –
కొండకొస నుంచి దూకే జలధారలో
గుండెలోని శ్రుతిని సరిచూసుకునే తాను-
తోటి మనిషి అలికిడి వింటేనే
తుళ్ళిపడతాడెందుకని?
నమస్కారాలతో,
సుబ్రహ్మణ్యం
జూన్ 2024 గురించి maaciraaju saavitri అభిప్రాయం:
06/03/2024 3:57 pm
చాలా మెచ్చదగిన మాట చెప్పారు. మరి ఈ పరిస్థితికి పరిష్కారమేమిటో కూడా సూచించగలిగితే బాగుంటుంది. ఈ ధోరణి కొన్ని దశాబ్దాలుగా సాగుతున్నది. ఎందువల్ల?
తెలుగుదారి ఒకదారి మాత్రమే గురించి తః తః అభిప్రాయం:
06/03/2024 10:16 am
శర్మగారూ
ఒప్పుకుంటాను – నేను ’ఎవరైనా తెలుపగలరు’ అని తప్పు చేశాను. నేను క్లుప్తంగా నా ఆలోచనను మాత్రమే నా అభిప్రాయంగా చెప్పి సరిపెట్టుకుని ఉండవలసినది.
నమస్కారాలతో
తః తః
Private: అను-రాగం గురించి శివకుమార శర్మ అభిప్రాయం:
06/02/2024 6:02 pm
బడే గులాం చేత దక్షిణ భారతంలో విపరీతంగా ప్రభావితులైనవారిలో వోలేటి వెంకటేశ్వర్లు గారు, జి. ఎన్. బాలసుబ్రమణ్యం గారూ ఉన్నారు. వోలేటి గారు హిందుస్తానీలో సంగీతం సమకూర్చినవన్నీ ఈ ప్రభావానికి లోబడిన తరువాతే. బడే గులాం ఎప్పుడు మద్రాస్ వచ్చినా వోలేటి గారింట్లో దిగేవారని విన్నాను. GNB ఆయన సంగీతాన్ని మెచ్చుకున్నారు గానీ నాకు తెలిసి ఆ పంథాలో వేటికీ సంగీతాన్ని సమకూర్చలేదు.
కొన్ని చిన్న అంశాలు:
1. కర్ణాటక సంగీతంలో లాగా కాక హిందుస్తానీలో ప్రతి రాగానికీ ఒక నిర్ణీతసమయం ఉన్నది. కామోద్ రాగానికి, రాత్రి రెండవ ఝాము – ద్వితీయ పహార్. కథ మొదట్లో వాడుక సమయం సరయినదే కానీ, రెండవసారి ఉదయం ఫలహారాలు అయిన తరువాత అని ఉన్నది. బడే గులాం పొరబాటున కూడా ఆ తప్పు చెయ్యరు.
2. “మీ అంత మంచి గాయకుడికి, సంగీత పండితుడికి హిందూస్తానీలో కూడా ప్రవేశముండడం చాలా అవసరం. మనం సినిమా తీసేలోగా మీరు హిందూస్తానీ కూడా నేర్చుకోవడం అవసరం.” అన్న రాజుగారి డైలాగ్ ద్వారా మూర్తికి హిందూస్తానీలో అసలు ప్రవేశమే లేదని రచయిత నిర్ధారిస్తారు గనక, ఆయన పాట కామోద్ రాగంలో అని ఏ పాత్ర చేతనయినాచెప్పించి వుంటే బావుండేది. సర్వసాక్షి కథనంతో మాత్రమే ప్రస్తావించడం సబబు అనిపించలేదు. మిగిలిన రాగాల ప్రస్తావనలో, అలాగే ఏది ఠుమ్రీ, ఏది ఖయాల్ అని వాడిన చోట్ల కూడా ఇదే వ్యాఖ్య వర్తిస్తుంది.
3. “జ్నాపకమొచ్చింది” కి బదులు “జ్ఞాపకమొచ్చింది” అని ఉండాలి. వర్డ్ లో గానీ గూగుల్ లో గానీ jnaa అని టైప్ చేస్తే అది పొరబాటున కూడా “జ్ఞా”ని ఒక ఛాయిస్ కింద చూపదు. సరయిన అక్షరం రావడానికి “gnaa” అని టైప్ చెయ్యాలి.
4. “తొండంతో చెరుకుగడల కట్టనెత్తుకున్న గున్నేనుగు లాగున్నాడు”, “రెండు పెద్ద రాతిగుండ్ల మధ్యలోంచి ఊరే కొండనీటి ఊటలా, బడే ఖాన్‌సాబ్ లావుపాటి బుగ్గల మధ్యలోంచి …” అన్న వర్ణనలు ఒక సంగీత విద్వాంసుడి మదిలోకి బడే గులాం గూర్చి ప్రవేశిస్తాయని అనుకోవడం పాఠకుడికి అంత సులువు కాదు.
5. ఆంగ్లంలో Jaijaivanti అని కనిపించినా గానీ, పలికేటప్పుడు “జయజయవంతి” గా కాక ఆ రాగం “జైజవంతి” గా వినిపిస్తుంది.
[అచ్చు తప్పులు చూపినందుకు ధన్యవాదాలు. సవరించాము. – సం. ]