పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. చావు బ్రతుకులు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    06/02/2024 2:02 pm

    దంతుర్తి గారు,

    మీరు చెప్పినట్లు చందమామ పాత సంచికలు చదివాను. మే 1961 సంచికలో “ఈ విధంగా బ్రహ్మయొక్క ప్రోత్సాహంతో వాల్మీకి రామాయణ కథను, తన నోట అప్రయత్నంగా వెలువడిన శ్లోకాలలాటి శ్లోకాలతో, అందరికీ ఆనందం కలిగించే విధంగా రచించాడు. ఆ కథనే మనం కూడ చదివి ఆనందించుదాం,” తో మొదలయి ఆగస్టు 1966 సంచిక లో కుశలవుల పట్టాభిషేకం తో ముగుస్తుంది. సీతారాముల కాలకృత్యాలు, అన్న పానీయాల విషయం పలుమార్లు వస్తుంది.

    జూన్ 1962 సంచికలో, “రాముడు చిత్రకూటానికి వచ్చి నెల అయింది. ఈ రోజే అతను తన పర్ణశాల విడిచి సీతతో సహా కొండ మీద విహరించటానికి బయలుదేరాడు. చిత్రకూట పర్వతం చాలా అందమైనది. అక్కడి చెట్లూ, పక్షులూ, మృగాలూ, చిత్రవిచిత్రమైన ధాతువులూ, పక్కనే ప్రవహించే మందకినీ నదీ, మనోహరమైన దృశ్యాలూ చూస్తూ వారిద్దరు చాలాసేపు విహరించారు. రాముడు సీతతో, “నీవు, లక్షణుడూ నా వెంట ఉంటే ఈ దృశ్యాలు చూసి ఆనందిస్తూ ఎన్ని ఏళ్లపాటయినా ఇక్కడే ఉండి పోగలను,” అన్నాడు. ఇలా చాలా సేపు విహరించిన పిమ్మట సీతారామలక్ష్మణులు ఒకచోట కూర్చున్నారు. రాముడు కులాసాగా కబుర్లు చెపుతూ సీత చేత మాంసఖండాలు తినిపించాడు.”

    ఇది మీకు ఎందుకు వెటకారంగా కనిపించిందో నాకర్థం కాలేదు. అంత పెద్ద కథలో తిండీ తిప్పలకన్నా ముఖ్యమైన విషయమేదన్నా చెప్తే మీరన్న వెటకారానికి విలువ ఉండేది.

    కొడవటిగంటి నాస్తికుడయి తన సంపాదకత్వం క్రింద రామాయణ మహాభారతాల కథల్ని వేయించడం అన్నింటికన్నా ఆశ్చర్యమన్నారు మీరు. ఎందుకాశ్చర్యం? మీదగ్గర వున్న కొ.కు. సాహిత్య సెట్టులో ఉందో లేదో, “వ్యాస ప్రపంచం – 5, సాహిత్య వ్యాసాలు,” లో “బాలల సాహిత్యం,” అన్న భాగంలో తన అభిప్రాయలని చెప్పాడు:

    “బాల సాహిత్యం పిల్లల మెదడులో కొన్ని మౌలికమైన భావాలను బలంగా నాటాలి. ధైర్య సాహసాలూ, నిజాయితీ, స్నేహపాత్రత, త్యాగబుద్ధీ, కార్యదీక్షా, న్యాయమూ మొదలైనవి జయించటం ద్వారా సంతృప్తిని కలిగించే కథలు, ఎంత అవాస్తవంగా ఉన్నా, పిల్లల మనస్సులకు చాలా మేలు చేస్తాయి.”

    “దేవుడి మీద భక్తినీ, మత విశ్వాసాలనూ ప్రచారం చెయ్యటనికే రచించిన కథలు పిల్లలకు చెప్పటం అంత మంచిది కాదు. కథల్లో దేవతలూ, భక్తులూ ఉండరాదని కాదు. దేవుణ్ణి నమ్ముకుంటే అన్ని సుఖాలూ ఒనగూడుతాయన్న అభిప్రాయాన్ని పెద్దలు కలిగి ఉండటం ఎంత తప్పో, పిల్లలకు ఇవ్వటం అంతకు పదింతలు తప్పు.”

    “బాల సాహిత్యం ప్రయోజనాలలో ఒకటి ప్రాచీన సాహిత్యం గ్రంథాలతో ప్రథమ పరిచయం ఒకటి అని నా నమ్మకం.”

    “వ్యాస ప్రంపంచం – 8, లేఖలు,” లో కృష్ణాబాయి కి 1964లో వ్రాసిన ఉత్తరం నుండి : ” చందమామకు కథలు బయట నుంచి కూడా వస్తాయి. కొన్ని మాత్రమే నేను మా లైబ్రరీ పుస్తకాలలో నుంచి ఏరుతాను. అన్ని కథలూ చక్రపాణి గారు చూసి ఆమోదించటం జరుగుతుంది. నేను చేసేది కథలను తిరగరాయటం.”

    “చందమామలో భక్తిని రేకెత్తించే కథలు గాని, మతప్రచారం చేసే కథలుగాని వెయ్యము. చక్రపాణిగారి పాలసీ కూడా అదే. అయితే శాస్త్రీయ భావాలను పెంచే కథలు కూడా వెయ్యటంలేదు. శాస్త్రవిజ్ఞానం పట్ల నాకెంత నమ్మకమో చక్రపాణిగారికి అంత అనుమానం – చదివే వాళ్ళు అర్థం చేసుకోలేరని. అప్పటికీ చాలా రోజులు శాస్త్ర విషయాలకు కొన్ని పేజీలు కేటాయిస్తూ వచ్చాను. దాన్ని నిలిపి వెయ్యవలసి వచ్చింది.”

    “చందమామలో పిల్లల మనస్సులను నీరసపరిచేవి, నిర్వీర్యం చేసేవీ అయిన కథలు రాకుండా సాధ్యమైనంత శ్రద్ధ తీసుకుంటూనే ఉన్నాం. ప్రత్యేకంగా ఏ కథ అయినా అటువంటి దోరణిలో ఉన్నదనిపిస్తే శ్రమ అనుకోక నాకొక కార్డుముక్క రాయండి.”

    ఈ ఉల్లేఖనలు కొందరికైనా ఉపయోగపడతాయనే ఆశతో,
    కొడవళ్ళ హనుమంతరావు

  2. త్యాగరాజు – సాహిత్యము గురించి సాయి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:

    06/02/2024 1:44 pm

    సంపాదకులకి:

    పాత వ్యాసం మీరు మరలా టైపు చేసారని తెలుసు.

    ఈ క్రింది వాక్యంలో “విదులకు మ్రొక్కెద” అని వుండాలి; “విడుదలకు” కాదు.

    ‘విడుదలకు మ్రొక్కెద’ ‘ఉండేది రాముడొకడు’ ‘అలకలల్ల లాడగ’ వంటి చక్కని భావాల అందపురచనలేవో కొన్ని రాకపోతాయా?

    -సాయి బ్రహ్మానందం గొర్తి

    [సవరించినాము. అచ్చుతప్పు చూపినందుకు ధన్యవాదాలు. – సం.]

  3. అద్వైతం గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    06/02/2024 9:25 am

    ఇంత నిడివంటూ ఉండాలి
    అని కాదు కానీ
    కవిత పదకొండు పదాలతో
    ఐదు లైన్లు
    భలే !
    “రచయిత గురించి” అనేది
    దాదాపు మూడు రెట్లు ఉంది
    భలే ! భలే !!
    “అస్సలు” అనే పదం తీసేసినా
    అర్ధమేమీ మారదోయ్
    “కొస” అనేది
    తాడు చివర్లు కాదని
    శిఖరాగ్రానికి వాడొచ్చని
    కొత్తగా తెల్సింది
    భలే ! భలే !!

  4. తెలుగుదారి ఒకదారి మాత్రమే గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    06/02/2024 9:17 am

    తః తః గారు
    మీరు:

    1. నేను మీరు వేసిన “ప్రశ్నకి సమాధానం మాత్రమే” చెప్పి, ఉదాహరణ ఇచ్చాను, అని గమనించలేదు.
    2. నన్ను అనవసరంగా ఈ వ్యాసం లో మీ సాహిత్య/లేదా మరో చర్చ/ఆలోచనలోకి లోకి దింపబోయేరు.
    3. నేను బరిలోకి విసిరిన మూడు సెంట్లూ మిమ్మల్ని తీసుకోమని నేను చెప్పలేదని విస్మరించారు.
    4. నేను మిమ్మల్నీ, మిగతా పాఠకులని నవ్వించడానికి చేసిన ప్రయత్నాన్ని పట్టించుకోకుండా మీ ఆవేశాన్ని బయటకి లాగారు.
    5. ఈ వ్యాసం, దీనిమీద ముందు మీర్రాసిన మిగతా వ్యాఖ్యానాలు నేను అప్పటికీ ఇప్పటికీ కూడా చదవలేదని, చదవబోననీ గమనించలేదు. (పైన 2 మరోసారి చూడుడు).

    నమస్కారాలతో
    శర్మ దంతుర్తి

  5. చిన్న చిన్నవి గురించి A.sesharatnam అభిప్రాయం:

    06/02/2024 7:59 am

    బావుంది

  6. Private: అను-రాగం గురించి Sujata M అభిప్రాయం:

    06/01/2024 11:31 am

    చాలా రోజులకి వరద ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ చదివించిన కథ చదివాను. జీవితం చాలా విలువ అయింది. అందరూ ప్రత్యేకమైనవారే. ఆ జ్ఞానం సంగీతమే ఇవ్వగలదేమో.

  7. తెలుగుదారి ఒకదారి మాత్రమే గురించి తః తః అభిప్రాయం:

    05/31/2024 11:37 pm

    శర్మగారూ, మీరు:

    1. ‘పొరపాటునే అనుకుందాం‘ అన్నదాన్ని విస్మరించారు.
    2. ‘ఆభిప్రాయి’ వ్యక్తిగత జీవితం లోకి దూరబోయారు.
    3. అసలు విషయాన్ని అసలు పట్టించుకోలేదు.

    వెరసి నా ఆలోచనను వదిలేసి ఆవేశాన్ని మాత్రమే చూశారు.

    నమస్కారాలతో
    తః తః

  8. తెలుగుదారి ఒకదారి మాత్రమే గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    05/31/2024 10:42 am

    తన ఇంట్లో కప్పు పొరబాటునే అనుకుందాం పగలకొడితే వాణ్ణి వాడి పెళ్ళాం బూతులు తిట్టొచ్చా?

    తః తః గారు,

    మీరు సమాధానం కోసం తఃతఃలాడుతున్నట్టు కనిపిస్తున్నది కనుక నేను నా మూడూ సెంట్లు విసురుతున్నాను బరిలోకి (అసలు రెండు సెంట్లకి నేను ఇన్‌ఫ్లేషన్ వల్ల మరో సెంటు జేర్చాను, గమనించగలరు).

    మీరు — లేదా ఇతరులు (నాతో సహా) — కప్పులు ముక్కుమీద పెట్టి నిలబెట్టినా, బయట ఎలా ఏడ్చినా, నోబుల్ ప్రైజ్ సంపాదించి వచ్చినా, ఇంట్లో కప్పు పగలగొట్టక్కర్లేదు, పెళ్ళాం చేత బూతులు తిట్టించుకోవడానికి. మీ ఆవిడని ఏమీ అనడం లేదు కానీ (పాపము శమించుగాక) మీకు ఇది జీవితంలో అనుభవం అయిందని నేను అనుకుంటున్నా. 🙂

  9. తెలుగుదారి ఒకదారి మాత్రమే గురించి తః తః అభిప్రాయం:

    05/30/2024 2:08 pm

    “తెలుగు సాహిత్యాన్ని ప్రపంచసాహిత్య రంగమ్మీద సమున్నత స్థానాన ఉంచటంలో అద్వితీయ కృషి నారాయణరావుది. బహుశ ఆయన రాసిన వందకి పైగా వ్యాసాలు, డజను పైగా పుస్తకాల గురించి ఇండియాలో తెలిసిన వారు, తెలిసినా పట్టించుకున్న వారు బహు అరుదు – అసలంటూ ఉంటే. ఈ రచయిత్రి కూడ ఆయన కవితావిప్లవాలు తప్ప మరే రచననీ (“తెలుగుదారి” వరకు) చదివినట్టు చెప్పలేదు. అది ఆయన రాసి యాభై ఏళ్ల పైగా అయింది.“

    వెల్చేరువారి గురించి పైన చెప్పిన విషయానికీ వారి ‘తెలుగు దారి’ పై అభిప్రాయాన్ని చెప్పటానికీ సంబంధం ఏమిటో నాకు తెలియటం లేదు.

    ముక్కుమీద మూడొందల కప్పులను నిలబెట్టి సర్కస్ డేరా అంతా ఒక్క కప్పూ కదలకుండా తిరిగిన వాడు, తన ఇంట్లో కప్పు పొరబాటునే అనుకుందాం పగలకొడితే వాణ్ణి వాడి పెళ్ళాం బూతులు తిట్టొచ్చా – తిట్ట్గకూడదా? ఎవరైనా తెలుపగలరు.

    తః తః

  10. తెలుగుదారి ఒకదారి మాత్రమే గురించి తః తః అభిప్రాయం:

    05/30/2024 11:06 am

    “తెలుగుదారి ఒకదారి మాత్రమే” అన్నవారు కనీసం మరొక దారినైనా చూపించినట్టు నాకనిపించలేదు” అన్న వాదన అర్థవంతమైనదేనా? అలా చూపిస్తేనేనా ‘ఒకదారి మాత్రమే’ అనాలా? ఒక కావ్యం లేదా ఒక పద్యం ‘బాగులేదన్న’ వాదనలో పస ఉన్నదా లేదా అన్నది ముఖ్యమా లేక “అలా అన్నవాళ్ళు ఒక కావ్యం/పద్యం రాసి చూపించాలన్న“ నియమాలేవన్నా ఉన్నాయా? ఎవరైనా తెలుపగలరు.

    తః తః