మోహనరావుగారు: గతి, నడక, మాత్రాఛందస్సుల గురించి *ముఖ్యంగా మీకు* 🙂 చెప్పనవసరంలేదు కానీ చాలా “స్త్రీల పాటలు”, ఉదా. “రాఘవ పరిణయం”, ఇలానే నడుస్తాయి (/పాడబడతాయి). కస్తూరి రంగ రంగ పాటని ప్రస్తావించారు కనుక, ఆపాటను “ఊర్మిళనిద్ర” పాడిన గాయని బి. సుబ్బులు గొంతులోనే యిక్కడ వినవచ్చు. పాడిన కాలం: 1930లు. నా దగ్గరున్న రికార్డు బాగా అరిగిపోయి ఉంది. So, please bear with the poor audio quality. — శ్రీనివాస్
ఈ వ్యాసమును చూచిన తక్షణము నాకు నేను 8వ తరగతి చదువుచున్నప్పటి (1963) తెలుగు పుస్తములోని ఒక పద్యము జ్ఞాపకమునకు వచ్చుచున్నది.
“నలుగురు నంగనాచి గహనాలకుగాంతునిగెంటి ఇంటిలో గులుకుచు కూరుచున్నదటంచురందురని రవంతయేని చింతిలుకుము తల్లి”
ఈ సన్నివేశము: లక్ష్మణుడు అన్నగారితొ కలిసి అడవులకు వేళ్ళును.ఊర్మిళాదేవి ఒక్కటే అయోధ్యలో బాధపడు సమయములొ కవి ఆమెను అనునయించుచూ ఈ పద్యమును వ్రాశారు. దీనిని వ్రాసిన కవి, కావ్యము పేరు, ఆ కావ్యము ఎచ్చట దొరుకునో చెప్పగలరని నా సవినయ ప్రార్థన. బెంగళూరు (కర్నాటక)లో తెలుగు పుస్తకములు దొరుకుట దుర్లభము.
హిందుస్తానీ గాయకులలో అగ్రగణ్యుడైన బడేగులామలీ పాడిన ఖమాజ్‌కన్నా ఆయన తమ్ముడు పాడినదే నాకు చాలా ఇష్టం. నాకు నెట్‌లో దొరకలేదుగాని గిరిజాదేవి పాడిన సాజన్ బిన మోరా అనే పూరబీ అగ్ ఠుమ్రీకూడా బావుంటుంది.
మేలుకోవయ్యా అనే పాట కమాస్ ఆధారంగా చేసినదే అయినా అందులో కలావతీ (వలజి) పోకడలుకూడా స్పష్టంగా వినిపిస్తాయి కనక నేను ఉదహరించలేదు. ఒకే రాగంమీద ఆధారపడ్డ ట్యూన్లు చెయ్యాలనే పట్టింపు సినిమావాళ్ళకు ఉండదు కనక రాగపరిచయం చెయ్యడానికి ఉదాహరణలు జాగ్రత్తగా ఎంపిక చెయ్యాలి.
ఇవే ప్రశ్నలకి నాకు పెద్దలు చెప్పిన సమాధానాలు –
1. ఆ కాలంలో వాళ్ళు ఏం చేసినా ఓ పద్ధతి ప్రకారమే చేసేవాళ్ళు, ప్రాణాలకన్నా పద్ధతికే ఎక్కువ విలువ ఇచ్చేవారు. పద్ధతి లేకుండా ప్రవర్తించేవాళ్ళని చాలా నీచంగా చూసేవాళ్ళు. ఆ పద్ధతినే ధర్మం అని పిలిచేవారు. గోగ్రహణ ఘట్టంలోని యుద్ధం పరిమిత యుద్ధం. ఆ పరిమితిని దాటడం పద్ధతి కాదు.
2. కర్ణుడు అర్జునుడికి సరివీరుడు కాడు. కానీ అతనికి అర్జునుడి మీద, పాండవులమీద ఉన్న తీవ్రమైన ‘కసి’ కొన్నిసార్లు ఒక ‘ఎడ్జ్’ ని ఇచ్చేది. ఇద్దరు ఆటగాళ్ళు ఇంచుమించు సమాన స్థాయివాళ్ళైనా, ఎక్కువ కసితో ఆడేవాడు ఒక్కోసారి పైచేయి సాధిస్తాడు. అందుకే కర్ణుణ్ణి చంపడానికి అంత కష్టపడాల్సి వచ్చింది.
ప్రసాద్ గారు, బర్కతలీ ఖాన్ పాట చాలా చాలా బావున్నది. ధన్యవాదాలు. మేలుకోవయ్య అన్న భానుమతి పాట (రాజేశ్వరరావు) ఇదే కావచ్చు. మీరన్నట్టు రాజేశ్వర రావు తప్ప మిగతా వాళ్ళు పెద్దగా ఈ రాగాన్ని సినిమాల్లో ఉపయోగించినట్టు లేదు.
కేవలం కుతూహలం కొద్దీ అడుగుతున్న ప్రశ్న. ఈ గేయరచనకీ బాలాంత్రపు రజనీకాంతరావు (రజని) గారు రాసిన “ఓ విభావరి ఓహో విభావరి” (సాలూరి రాజేశ్వరరావు గారు అద్భుతంగా పాడారు) అన్న పాటకి ఏమయినా సంబంధం, లేక స్ఫూర్తి పొందడంలాంటిది కానీ ఉందా!
నామిని తను రాయాల్సిందేదో రాసేసి “చెప్పాల్సింది నేను చెప్పానూ! మీ విమర్శతో నాకేం పని?” అన్నట్టు నిమ్మళంగా కూచోడం నాకేమాత్రం నచ్చదు. రంగనాయకమ్మ గారి విమర్శకు నామినికి బుర్ర తిరిగి పోయి ఉండాలి. అయినా జవాబు చెప్పడు. ఎందుకంటే జవాబు ఆయన దగ్గర లేదు కనుక!
ఇంకోటి, “ఏం? నామిని తన బాధ తను ఓపెన్ గా చెప్పుకున్నాడూ! అందులో తప్పేముంది? ” అని ఆయన్ని వెనకేసుకొచ్చేవాళ్ళు ఉన్నారని ఆయనకు తెలుసు. ఈ “జవాబు చెప్పే బాధ్యత” వాళ్ళు తీసుకోవాలని ఆయన భావన కావొచ్చు
బాగుంది మీ ప్రయత్నము. మూడు, నాలుగు మాత్రల మిశ్రగతితో అందముగా ఆరంభించి మధ్యలో ఎందుకు నడక మార్చారు? బహుశా మీరు ఏదో మెట్టులో వ్రాసినారేమో? విధేయుడు – మోహన
ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:
01/06/2012 5:01 am
మోహనరావుగారు: గతి, నడక, మాత్రాఛందస్సుల గురించి *ముఖ్యంగా మీకు* 🙂 చెప్పనవసరంలేదు కానీ చాలా “స్త్రీల పాటలు”, ఉదా. “రాఘవ పరిణయం”, ఇలానే నడుస్తాయి (/పాడబడతాయి). కస్తూరి రంగ రంగ పాటని ప్రస్తావించారు కనుక, ఆపాటను “ఊర్మిళనిద్ర” పాడిన గాయని బి. సుబ్బులు గొంతులోనే యిక్కడ వినవచ్చు. పాడిన కాలం: 1930లు. నా దగ్గరున్న రికార్డు బాగా అరిగిపోయి ఉంది. So, please bear with the poor audio quality. — శ్రీనివాస్
[కస్తూరి రంగ రంగా పాటను అలనాటి పాట:ఊర్మిళ నిద్రలో ఆడియోగా ఉంచాము. గమనించగలరు. – సం.]
ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి PCS RAO అభిప్రాయం:
01/06/2012 3:07 am
ఈ వ్యాసమును చూచిన తక్షణము నాకు నేను 8వ తరగతి చదువుచున్నప్పటి (1963) తెలుగు పుస్తములోని ఒక పద్యము జ్ఞాపకమునకు వచ్చుచున్నది.
“నలుగురు నంగనాచి గహనాలకుగాంతునిగెంటి ఇంటిలో గులుకుచు కూరుచున్నదటంచురందురని రవంతయేని చింతిలుకుము తల్లి”
ఈ సన్నివేశము: లక్ష్మణుడు అన్నగారితొ కలిసి అడవులకు వేళ్ళును.ఊర్మిళాదేవి ఒక్కటే అయోధ్యలో బాధపడు సమయములొ కవి ఆమెను అనునయించుచూ ఈ పద్యమును వ్రాశారు. దీనిని వ్రాసిన కవి, కావ్యము పేరు, ఆ కావ్యము ఎచ్చట దొరుకునో చెప్పగలరని నా సవినయ ప్రార్థన. బెంగళూరు (కర్నాటక)లో తెలుగు పుస్తకములు దొరుకుట దుర్లభము.
కన్నెవాన గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
01/06/2012 3:05 am
‘మా ఇంటిచూరు నీటితీగవే ‘ ‘ ఆకుచెంపపై మెరిసి’ ఈ గీతం లో నాకివి నచ్చాయి.
అభినందనలు.
ఆర్.దమయంతి.
ఖమాజ్/ ఖమాచ్/ కమాస్ రాగం గురించి Rohiniprasad అభిప్రాయం:
01/06/2012 1:05 am
రమానాథ్ గారూ,
హిందుస్తానీ గాయకులలో అగ్రగణ్యుడైన బడేగులామలీ పాడిన ఖమాజ్‌కన్నా ఆయన తమ్ముడు పాడినదే నాకు చాలా ఇష్టం. నాకు నెట్‌లో దొరకలేదుగాని గిరిజాదేవి పాడిన సాజన్ బిన మోరా అనే పూరబీ అగ్ ఠుమ్రీకూడా బావుంటుంది.
మేలుకోవయ్యా అనే పాట కమాస్ ఆధారంగా చేసినదే అయినా అందులో కలావతీ (వలజి) పోకడలుకూడా స్పష్టంగా వినిపిస్తాయి కనక నేను ఉదహరించలేదు. ఒకే రాగంమీద ఆధారపడ్డ ట్యూన్లు చెయ్యాలనే పట్టింపు సినిమావాళ్ళకు ఉండదు కనక రాగపరిచయం చెయ్యడానికి ఉదాహరణలు జాగ్రత్తగా ఎంపిక చెయ్యాలి.
నాకు నచ్చిన పద్యం: అర్జునుడి ఎత్తిపొడుపు గురించి nagamurali అభిప్రాయం:
01/05/2012 10:50 pm
ఇవే ప్రశ్నలకి నాకు పెద్దలు చెప్పిన సమాధానాలు –
1. ఆ కాలంలో వాళ్ళు ఏం చేసినా ఓ పద్ధతి ప్రకారమే చేసేవాళ్ళు, ప్రాణాలకన్నా పద్ధతికే ఎక్కువ విలువ ఇచ్చేవారు. పద్ధతి లేకుండా ప్రవర్తించేవాళ్ళని చాలా నీచంగా చూసేవాళ్ళు. ఆ పద్ధతినే ధర్మం అని పిలిచేవారు. గోగ్రహణ ఘట్టంలోని యుద్ధం పరిమిత యుద్ధం. ఆ పరిమితిని దాటడం పద్ధతి కాదు.
2. కర్ణుడు అర్జునుడికి సరివీరుడు కాడు. కానీ అతనికి అర్జునుడి మీద, పాండవులమీద ఉన్న తీవ్రమైన ‘కసి’ కొన్నిసార్లు ఒక ‘ఎడ్జ్’ ని ఇచ్చేది. ఇద్దరు ఆటగాళ్ళు ఇంచుమించు సమాన స్థాయివాళ్ళైనా, ఎక్కువ కసితో ఆడేవాడు ఒక్కోసారి పైచేయి సాధిస్తాడు. అందుకే కర్ణుణ్ణి చంపడానికి అంత కష్టపడాల్సి వచ్చింది.
మహాకవి తెనాలి రామకృష్ణుని ‘పాండురంగ మాహాత్మ్యము’ గురించి Balantrapu Venkata Ramana అభిప్రాయం:
01/05/2012 2:08 pm
రమ గారు, అరుణాచలగారు – చాలా చాలా కృతజ్ఞతాభివందనాలు. నా ఈ చిరు ప్రయత్నం మీకు నచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది.
ఖమాజ్/ ఖమాచ్/ కమాస్ రాగం గురించి Ramanath అభిప్రాయం:
01/05/2012 1:56 pm
ప్రసాద్ గారు, బర్కతలీ ఖాన్ పాట చాలా చాలా బావున్నది. ధన్యవాదాలు. మేలుకోవయ్య అన్న భానుమతి పాట (రాజేశ్వరరావు) ఇదే కావచ్చు. మీరన్నట్టు రాజేశ్వర రావు తప్ప మిగతా వాళ్ళు పెద్దగా ఈ రాగాన్ని సినిమాల్లో ఉపయోగించినట్టు లేదు.
రమానాథ్
ఆగవే రజనీ! విభావరి! గురించి Parucuri Sreenivas అభిప్రాయం:
01/05/2012 1:32 pm
కేవలం కుతూహలం కొద్దీ అడుగుతున్న ప్రశ్న. ఈ గేయరచనకీ బాలాంత్రపు రజనీకాంతరావు (రజని) గారు రాసిన “ఓ విభావరి ఓహో విభావరి” (సాలూరి రాజేశ్వరరావు గారు అద్భుతంగా పాడారు) అన్న పాటకి ఏమయినా సంబంధం, లేక స్ఫూర్తి పొందడంలాంటిది కానీ ఉందా!
భవదీయుడు,
— శ్రీనివాస్
బడి పిల్లల అయోమయం గురించి సుజాత అభిప్రాయం:
01/05/2012 12:22 pm
నామిని తను రాయాల్సిందేదో రాసేసి “చెప్పాల్సింది నేను చెప్పానూ! మీ విమర్శతో నాకేం పని?” అన్నట్టు నిమ్మళంగా కూచోడం నాకేమాత్రం నచ్చదు. రంగనాయకమ్మ గారి విమర్శకు నామినికి బుర్ర తిరిగి పోయి ఉండాలి. అయినా జవాబు చెప్పడు. ఎందుకంటే జవాబు ఆయన దగ్గర లేదు కనుక!
ఇంకోటి, “ఏం? నామిని తన బాధ తను ఓపెన్ గా చెప్పుకున్నాడూ! అందులో తప్పేముంది? ” అని ఆయన్ని వెనకేసుకొచ్చేవాళ్ళు ఉన్నారని ఆయనకు తెలుసు. ఈ “జవాబు చెప్పే బాధ్యత” వాళ్ళు తీసుకోవాలని ఆయన భావన కావొచ్చు
ఆగవే రజనీ! విభావరి! గురించి మోహన అభిప్రాయం:
01/05/2012 10:18 am