పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. కాల్వీనో కథల నుంచి – 1 గురించి మోహన అభిప్రాయం:

    01/06/2012 3:31 pm

    చిన్న కథలు బాగున్నాయి, మూడవ కథ బలే బావుంది 🙂
    విధేయుడు – మోహన

  2. మారిన కాలం మారిన మనుషులు గురించి మోహన అభిప్రాయం:

    01/06/2012 3:29 pm

    కరుణ రసాన్ని చిందించే మంచి కథ, చక్కని అనువాదము. టరమ్ ఫీసుకోసం బంగారు గాజులు, గొలుసు బ్యాంకుకు వెళ్లిన రోజులు జ్ఞాపకానికి వస్తున్నాయి. ఫీసులు లేకుండా ఏ పరీక్షలైనా ఉన్నాయా అసలు? విధేయుడు – మోహన

  3. మౌనంతో ముఖాముఖి గురించి మాలతి అభిప్రాయం:

    01/06/2012 3:09 pm

    కథనం బాగుంది. మామూలుగా మనం మాటాడుతున్నప్పుడు ఎదటివారు జవాబు ఇవ్వకపోతే దాన్ని passive aggressive అంటారిక్కడ. ఏ సమస్య అయినా మాటాడుకుని పరిష్కరించుకోవచ్చు అని కూడా అంటారు. ఈకథలో మౌనం ఒక మనిషి అనుకుంటే, సంభాషణలు ఎలా ఉంటాయో చిత్రించినట్టుంది. పైన చెప్పిన రెండో సూత్రం పని చెయ్యడంలేదు ఇక్కడ. మొదటిసూత్రంవల్ల ఆ మనిషికి గెలిచిన ఆనందం కలగొచ్చు కానీ జవాబుకోసం ఎదురు చూసేవారికి కలిగే నిస్పృహ, చిరాకులాటిని ఆవిష్కరించడం జరిగింది అని నా అభిప్రాయం.

  4. ఉరి: కధ నచ్చిన కారణం గురించి మాలతి అభిప్రాయం:

    01/06/2012 3:00 pm

    కథ, విశ్లేషణ కూడా నన్ను ఆకట్టుకునేలా ఉన్నాయి. నాకు మరొక కోణం కూడా కనిపిస్తోంది. ముగింపులో రచయిత మన సాంఘిక విలువలు, ధర్మాలమీద వ్యాఖ్యానిస్తున్నట్టు అనిపించింది. బతికుండగా కూడు పెట్టని మన చట్టాలు జైలులో కూడు పెడతాయి. ఆ సత్యం గ్రహించిన కథకుడు (నిందితుడు) తనపిల్లలు నేరం చెయ్యకపోయినా ఎక్కడున్నా వెతికి పట్టుకు మరీ జైల్లో పడేయమంటాడు. అలా ఏడుస్తున్నాయి మన న్యాయాలూ, ధర్మాలు అని విశ్వనాథగారు చెప్తున్నట్టు అనిపిస్తోంది. ఏమైనా మంచి కథని మరోసారి వెలికి తీసి అందించినందుకు ధన్యవాదాలు.

  5. నాకు నచ్చిన పద్యం: అర్జునుడి ఎత్తిపొడుపు గురించి కామేశ్వరరావు అభిప్రాయం:

    01/06/2012 1:26 pm

    మంచి పద్యానికి చాలా చక్కని వ్యాఖ్యానం అందించారు! ఈ పద్యంలో ధ్వనించే అర్జునుని మనస్స్థితిని అద్భుతంగా వర్ణించారు.
    ఈ పద్యానికి ఒక చిన్న పాఠాంతరం కూడా ఉంది.
    “కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర” బదులు
    “కయ్యమున నోడి పాఱిన గౌరవేంద్ర” అని.
    అప్పుడు దాని అర్థం –
    ఓ కౌరవేంద్ర! యుద్ధంలో నువ్విలా పాఱిపోతే (పాఱిపోతూ ఉంటేనే కదా పిలిచి తూలనాడేది), ఆ అవమానభారంతో క్రుంగి కృశించడమే కాని, యింక ఏనుగులెక్కి రాజవీథులలో ఎలా ఊరేగుతావు? భూషణాలు ధరించి ఎలా కొలువుతీరగలుగుతావు? సుగంధ్రద్రవ్యాలు పూసుకొని ఎలా భోగిస్తావు? అంగనలతో ఎలా వేడుక చేసుకుంటావు? అందుకే ప్రాణత్యాగమే ఉత్తమం – అని.

    పద్యంలో చిన్న అచ్చుతప్పు పడింది. “ఎడ్డోలగంబు” కాదు “ఒడ్డోలగంబు”.

    రవీ, “ఔచిత్యం” గురించి క్షేమేంద్రునికి ముందు చాలామంది ఆలంకారికులే ఆలోచించారు. ఆనందవర్ధనుడు కావ్యానికి ఔచిత్యమనేది అవసరమైన లక్షణంగా పేర్కొన్నాడు. భాష, ఇతివృత్తము, పాత్రపోషణ విషయాలలో ఔచిత్యాన్ని గురించి చర్చించాడు. అతని స్ఫూర్తితోనే క్షేమేంద్రుడు ఔచిత్యానికి పట్టంగట్టాడు.

    [అచ్చుతప్పు సవరించాము. కృతజ్ఞతలు – సం.]

  6. నాకు నచ్చిన పద్యం: అర్జునుడి ఎత్తిపొడుపు గురించి హెచ్చార్కె అభిప్రాయం:

    01/06/2012 12:28 pm

    ‘కసి’ వల్ల ‘ఎడ్జ్’ రాదని, పోతుందని జీవితానుభవం, చరిత్ర.. సామాజిక-బలహీనులు ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్న కీలక యుద్ధ రహస్యం.

    ఇక్కడి రెండు సందర్భాలలో పాటించిన పద్ధతి సరే, కురుక్షేత్రంలో కర్ణుడిని నిర్జించడానికి అనుసరించిన యుక్తులలో పద్ధతి (ధర్మం) ఉందా? కార్వేని చదివిన నాటి నుంచి ఉండిన సందేహం నాకు ఇప్పటికీ వుంది. పెద్దలు మీకు చెప్పిన మాటలు పంచుకున్నందుకు వినమ్ర కృతజ్ఙతలు.

  7. కినిమా పత్రికనుంచి గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    01/06/2012 11:41 am

    My apologies in advance for this nitpicking and ‘side-tracking’ the actual subject. Recently one columnist in The Hindu wrongly claimed that T.P. Rajyalakshmi (she acted in first Tamil-Telugu Talkie: kaaLidaasu-1931) is the first south-Indian woman director (Miss Kamala-1936), though most of the Tamil film historians rightly credit her being the first woman director in Tamil.

    Well, I don’t believe in “who is first” debates, but chronologically speaking Fatima Begum directed a film way back in 1926: Bulbul-é-Paristan.

    ఇంక తెలుగు విషయానికొస్తే: భానుమతి కంటే 15 సంవత్సరాల కంటే ముందే సురభి కమలాబాయి “భక్త జయదేవ” (1938) అన్న సినిమాకి దర్శకత్వం చేశారు (నటన, ఎడిటింగ్‌లతో పాటుగా …). ఇంకా అంతకు మూడేళ్ళ ముందే దాసరి కోటిరత్నం గారు అన్నీ తానై సతీ సక్కుబాయి (1935, తుంగల చలపతి రావు కృష్ణుడిగా – వీళ్ళిద్దరు జంటగా మైలవరం నాటకసమాజానికి సక్కుబాయి నాటకాన్ని ఆడేవారు. ఆ నాటకానికి, వీళ్ళిద్దరి గాత్రానికి తెలుగు చరిత్రలో చాలా గొప్ప పేరుంది.) చిత్రాన్ని కలకత్తాలో నిర్మించారు. దర్శకుడిగా అరోరా అనే ఉత్తర భారతీయుడి పేరున్నా, చేసిందంతా కోటిరత్నం అనేది చారిత్రక సత్యం. (గిరిజ ఈవిడ కుమార్తె.)

    – Regards, Sreenivas.

    [That mistake is editor’s. The tidbit that Bhanumati was the first woman director was gleaned from the Web and added above. Thanks for the correction -Ed.]

  8. పురూరవ: శ్రవ్య నాటిక గురించి Subhash Koti అభిప్రాయం:

    01/06/2012 9:11 am

    చలం వ్రాసిన నాటికను శ్రవ్య యోగ్యంగా మలచిన కళాకారులు అభినందనీయులు.

  9. కినిమా పత్రికనుంచి గురించి RaviReddy అభిప్రాయం:

    01/06/2012 6:00 am

    It is is very interesting to see photos of legends like Savitri, Relangi in their prime. For the new generation they may mean very little but for the 60’s generation they are unforgettable.

  10. నాకు నచ్చిన పద్యం: అర్జునుడి ఎత్తిపొడుపు గురించి రవి అభిప్రాయం:

    01/06/2012 5:55 am

    నా దృష్టిలో ఉచితజ్ఞత అనేది తిక్కన మహాకవి కవిత్వంలో స్పష్టంగా గోచరించే సుగుణం.

    చక్కని విషయం వెలికితీశారు. సంస్కృత అలంకారికులలో ఒక్క క్షేమేంద్రుడు తప్ప ఈ విషయం గురించి కాస్తంతైనా ఆలోచించిన వారు కనబడరు.