అవునండి! నాకలాగే అనిపించే వారు. ఇల్లు దేవాలయం అయినప్పుడు అమ్మా నాన్నలు మరి దేవతలే కదా ! .. అందుకని అలా అన్నా. కథ చదివి, మీ అభిప్రాయాన్ని వ్యక్త పరచినందుకు – థాంక్సండి.
మీకు నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ…
నమస్సులతో-
ఆర్.దమయంతి.
సామూహికంగా మనకు కనపడే అనేకమందిని పరిశీలించి, ఆ మనుషులందరిని మొత్తం చేసి అందులోంచి ఒక కాల్పనిక వ్యక్తిని సృష్టించి, ఆ వ్యక్తిని కథలో మలచటం నా పద్ధతి. అని చాసో తన కథను గురించి చెప్పినది తప్పకుండా ఈ గోమెజ్ పాత్రకు వర్తిస్తుంది. చక్కని కథాశిల్పము. ప్రతి రోజు సాయంకాలము నడిచేటప్పుడు మా చుట్టుపక్కలా ఇటువంటి గోమెజులను ప్రతిరోజు చూస్తుంటాను. నిజమైన ఒక కథను హృదయానికి హత్తుకుపోయేటట్లు అందించినందుకు వేలూరిగారికి అభినందనలు. విధేయుడు – మోహన
బాగుంది మీ జ్ఞాపికలు. కథ కాకపోయినా చదువుతుంటే కథలాగా racyగా ఉంది. ఈ వాక్యాలు నన్ను నిజంగా నవ్వించాయి: మొత్తానికి కొత్త చింత పండేసి తోమిన దేవతా విగ్రహాలకు మల్లే అందర్లోనూ భోగి ‘పండగ తలంటి’ కళ కొట్టొచ్చినట్టు కనిపించేది. విధేయుడు – మోహన
నేను విమర్శకుడిని గాను, నాకు కవిత్వతత్త్వవిచారములు అంతగా తెలియవు. ఊర్మిళనిద్ర పాటలోని ఛందస్సును గురించి మాత్రమే ఈ అభిప్రాయము. పాటంతా మాత్రాఛందస్సులో ఉన్నది. ప్రతి పాదములో (5-7)-(5)-(5-7) మాత్రలు ఉన్నవి. మొదటి భాగము, చివరి భాగము మాత్రల అమరికలో ఒకే విధముగా ఉన్నది. మధ్య ఉండే ఐదు మాత్రలు వీటిని కలుపుతుంది. ఏడు మాత్రల అమరిక 2-5 లేక 3-4 లేక 4-3 గా ఉంటుంది. మొదటి భాగపు, చివరి భాగపు చివరి అక్షరము లఘువైనా పాడేటప్పుడు అది గురుతుల్యమే. అందుకే భూపాలుడు పాడేటప్పుడు భూపాలుడూ అవుతుంది. మాత్రల అమరిక కోసం కొన్ని చోట్లలో దీర్ఘము కత్తిరించబడుతుంది, ఉదా. నిద్రాహారములకు బదులు నిద్ర హారము లెరుగనే. ఈ పాట అమరిక కస్తూరి రంగ రంగా నా యన్న కావేటి రంగ రంగా వంటిదే. ఛందస్సులో, పాదములో ఒకే అమరికతో ఉండే మొదటి చివరి భాగాలు మధ్యన ఉండే ఒక చిన్న గణముతో కలుపబడి ఉండుట మనకు తరచుగా కనబడుతూ ఉంటుంది. ఉదాహరణగా మత్తకోకిల, మానినీ వృత్తాలను తీసికొనవచ్చును. దీనిని గురించి అప్పుడప్పుడు ఛందస్సు, రచ్చబండ గుంపులో నేను ఎన్నో సందేశాలను వ్రాసి ఉన్నాను. విధేయుడు – మోహన
ఇధమిత్తంగా కర్తృత్వం తెలియని చోట్ల చాలా ఖచ్చితంగా ఆ పాట తాలుకు కర్తృత్వం ఒకానొక పేరు లేని పేరు తెలియని వారికి లింగనిర్దేశం చేసి అది ఒక “కవియిత్రి” రచనే నని అంటగట్టడం పరిశోధనలో కుదరదు. అవి స్త్రీల రామాయణపు పాటలు మాత్రమే !! స్త్రీలే రాసుకున్నారో స్త్రీల కోసం ఇంకెవరైనా రాసిపెట్టారో.. లేక కాలం రీత్యా వాటిలో అనేకమైన కర్తృత్వాలు కలిసాయో స్పస్టంగా విడదీసి చూడగల వీలు లేనప్పుడు నారాయణరావు వ్యాసమ్ అంతా “కవయిత్రి” అంటూ ప్రస్తావించడం లో అర్ధమ్ కనిపించదు.
ఊర్మిళాదేవి నిద్ర పాట చాలా మందికి తెలిసిన పాట. అమ్మమ్మల అమ్మల గొంతుల్లోంచి అనదిమంది తెలుగునాట విన్న పాట కూడానూ! ఇందులో నారాయణరావు” చూసిన” కల్పనలు ఆనాడు దానిని పాడిన వాళ్ళు చూసినట్టు లేదు. తెలుగు లోగిళ్ళలో ఖచ్చితంగా కొన్ని కొందరికి మాత్రమే ప్రవేశానికి అర్హ మైన ప్రాంతాలుగా పరిగణించడం “కొత్త” గా చెప్పేమని చెప్పుకునేదానికి పనికొస్తుందే గానీ ఇంటిని అన్ని విభాగాలు చేసే వీలు తెలుగు సినిమాకి సాధ్యమ్ గానీ.. తెలుగు సంసారాలకి సాధ్యమ్ కాదు.
ఇంక ఈ పాట “మగ ప్రపంచాన్ని చితక్కొట్టేసిన” పాటగా నిరూపించడానికి ఏ ఆధారమూ లేదు. అన్ని కాలాల్లోనీ అన్ని వర్గాల్లోనీ అన్ని ప్రపంచాలూ కనిపిస్తాయి. హాలుడి గాధా సప్తశతిలో ఆడవాళ్ళ కన్నా తెగించి శృంగారాన్ని అనుభవించిన వాళ్ళు ఈ ఆధునిక కాలంలోనీ కనిపించరే:) ఇంక ఊర్మిళా దేవి నిద్రకి ఇవాళ కొత్తగా “ఫెమినిస్టు” స్టేటసు ఇవ్వడం వల్ల గానీ దీనినేదో తెలుగుదేశాన ఫెమినిస్టులు పెద్దగా పట్టించుకోక వారి పరిశీలనా సామర్ధ్యాన్ని కుదించుకున్నారని గానీ రాసే వ్యంగ్యాలతోనీ పనిలేదు. ఆడవాళ్ల ప్రపంచాల మీద మగ విమర్శకుల అఖ్ఖరలేని సానుభూతి, అనవసరమైన ప్రయాసా తప్పిస్తే !!
ఇంతకీ ఈ విశ్లేషణ ఆధునికమో జానపద సాహిత్య చట్రమో, మౌఖిక సాహిత్య పరిధో లేక “ఆధునిక” దృక్పధమో ఎవరన్నా నాకు విశదీకరిస్తే వింటాను. ఇదివరలో వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఒక తాళ్లపాక తిమ్మక్కని తయారు చేసి పెట్టారు. ఇప్పుడీ వ్యాసంలో నారాయణ రావు గారు ఒక “ఆధునిక” మైన ఈ ఊర్మిళనీ ఆమె అంతరంగాన్నీ కొత్త కొత్తగా ఇలా నిర్మించిపెట్టారు.
కామేశ్వరరావు గారి అభిప్రాయమ్తో ఏకీభావం ఉంది నాకు.
రమ.
మరుగున పడిపోయిన (పడిపోతున్న) యిలాంటి సాహిత్యాన్ని పదిలపరుచుకోవడం, కొత్తతరాలకి పరిచయం చెయ్యడం చాలా మంచి పని. ఈ సాహిత్యాన్ని గురించి కొత్తగా ఆలోచించడం కూడా అవసరమే. అయితే యీ వ్యాసంలో నారాయణరావుగారు చేసిన ఆలోచనలో కొన్ని అంశాలపై నాకు అనుమానాలు అభ్యంతరాలు ఉన్నాయి. విజ్ఞులు పరిశీలించగలరు:
1.
శ్రీరాము తమ్ముండనే అతడనగ సృష్టిలో నొకరు గలరా?
జనకునల్లుని గానటే? భూమిలో జనకులనగా నెవ్వరు?
శతపత్రమున బుట్టినా చేడెరో సీతకూ మరిదిగానా?
సీత యనగా నెవ్వరూ [చెప్పుడీ] సృష్టిలో నేను యెరుగ
ఇక్కడ లక్ష్మణుడు ఊర్మిళ భర్తనని చెప్పకుండా “డొంకతిరుగుడుగా” చెప్పాడని దానికి కారణం తాను పెరిగిన కుటుంబ మర్యాదలని నారాయణరావుగారు అన్నారు. ఇది నాకు సమంజసమని అనిపించలేదు. నాకు కనిపించిన విషయం ఏమిటంటే – ఊర్మిళ నిద్ర మగతలో లక్ష్మణుడు పరపురుషుడని భ్రమపడినప్పుడు అతన్ని ఎలా భయపెట్టింది?
మాతండ్రి జనకరాజూ వింటె మిము ఆజ్ఞసేయక మానడూ
మా యక్క బావ విన్నా మీకిపుడు ప్రాణముల హాని వచ్చూ
మాయక్కమరది విన్నా మిమ్మిపుడు బ్రతుకనివ్వరు జగతిలో
ఇక్కడ ఆమె ప్రస్తావించినది జనకుడు, రాముడు, సీత, సీత మరది అయిన లక్ష్మణుడు. అందుకే వారినే తన జవాబులో లక్ష్మణుడు పేర్కొన్నాడు. ఆమె మాటలే తీసుకొని తానెవరో వివరించాడన్న మాట. ఇది సహజ సంభాషణే కాని డొంకతిరుగుడు కాదు, కుటుంబ మరియాద కోసం చేసినదీ కాదు.
నారాయణరావుగారి వ్యాసం చదవకముందు, చదివాక కూడా నాకలానే అర్థమయ్యిందా భాగం. ఆ అన్వయం చాలా సహజంగాను సరళంగాను ఉన్నట్టనిపిస్తోంది. నా పురుషాహంకారమేమైనా నేనలా అర్థం చేసుకొనేట్టు చేసిందేమోనని అనుమానం వచ్చి, నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు స్త్రీలనికూడా అడిగి చూసాను. నా అన్వయం కాని, నారాయణరావుగారి అన్వయం కాని చెప్పకుండా. వారికీ నాలాగనే అర్థమయ్యింది మరి! ఈ పాట గురించి వివరించిన మలయవాసినిగారు ఏ అర్థమిచ్చారో నాకు తెలియదు. అసలు నారాయణరావుగారికి నాకు తట్టిన అర్థం తట్టనే లేదో, తట్టినా అది తప్పనుకున్నారో తెలుసుకోవాలని ఉంది. ఒకవేళ ఆ అర్థం తడితే, దాన్ని కూడా ప్రస్తావించి, తాను చెప్పిన అన్వయమే ఎందుకు సరి అనుకుంటున్నారో వివరిస్తే బాగుండేది.
అసలు ఊర్మిళ ప్రస్తావన లేకుండా హఠాత్తుగా అలా ఆమె మాట్లాడిందని అనుకోవడం నిర్మాణ పరంగానూ, అర్థంచేసుకోడంలోను కూడా సంక్లిష్టత కలిగిన అన్వయం. సరళమైన అన్వయాన్ని వదిలి దాన్ని గ్రహించాల్సిన అవసరం ఏమిటి? ఆ తర్వాత నారాయణరావుగారు తన అన్వయానికిచ్చిన వివరణంతా విపరీత వ్యాఖ్యానమే అని అనిపించింది.
2.
మా తండ్రి జనకరాజూ మిమునమ్మి మరచి కళ్యాణమిచ్చే
మానవంతల్లుడనుచూ తెలియకా మదిని ఉప్పొంగుచుండే
చిత్తమొకదిక్కునుంచీ సమయమున చిన్నబుత్తురు యింతులా
దీనికిచ్చిన వివరణ నాకు సంతృప్తిగా లేదు. “చిత్తమొకదిక్కునుంచీ సమయమున చిన్నబుత్తురు యింతులా” అంటే, ఇంకొకళ్ళ మీద మనసుపెట్టి నన్ను నలుగురిలో చిన్నబుచ్చారని అర్థం తీసుకోవచ్చా? లక్ష్మణుడు ఎవరిపై మనసుపెట్టాడు? ఊర్మిళని నలుగురిలో ఎప్పుడు చిన్నబుచ్చాడు? అన్నమీద మనసుతో తనని విడిచి అడవికి వెళ్ళడం తనని చిన్నబుచ్చడమా? మరి “సమయమున” చిన్నబుచ్చడమేమిటి? ఇందులో “మానవంతుడు” కాకపోవడమేమిటి?
3. ఈ పాట ఏ కాలానికి చెందినదో తెలియదు. ఆ కాలంలో సాంఘికపరిస్థితులు అసలు తెలియవు. అలాంటప్పుడు, ఇందులో యిది ఊహ యిది వాస్తవమూ అని ఎలా నిశ్చయించగలం. ఉదాహరణకి,
“తెలుగు ఆడవాళ్ళు బావగారి పేరూ, భర్త పేరూ చెప్పకూడదు. ఒక పక్క తాను హింసపడే ప్రమాదం ఎదురుగుండా ఉన్నప్పటికీ కూడా తెలుగు కుటుంబాల ఆడవాళ్ళు ఎంత జాగ్రత్తగా మసలవలసిన నిర్బంధంలో ఉన్నారో ఈ పాట సున్నితమైన మాటల్లో, కొరడాతో కొట్టినంత చురుక్కుమనిపించేలాగా చెబుతుంది.” అన్నారు. అది చెప్పకూడదనే నిర్బంధమో, అలా వరసలు పెట్టి చెప్పే అలవాటో ఎలా నిర్ణయించగలం? ఇంకొకటి – ఇవి నిజంగానే అచ్చంగా ఊర్మిళ మాటలో, లేదా పాడుతున్న స్త్రీ మాటలో కూడా చెప్పలేం. ఊర్మిళ రావణాసురుడు సీతనెత్తుకుపోవడాన్ని ప్రస్తావిండం అది అచ్చంగా ఆమె మాటలు కావని, అది కథ పాడుతున్న ఆడవాళ్ళ మాటలని సమర్థించారు కదా (ఇంతకీ యిలా కాలక్రమాన్ని అతిక్రమించడంలో “నిర్మాణదక్షత” ఏమిటో నాకర్థం కాలేదు!). అలానే ఇక్కడ కూడా యిలా వరసలతో బావగారిని భర్తని ప్రస్తావించడం పాడుతున్న ఆడవాళ్ళు అలవాటుగా చేసిన ప్రయోగమని ఎందుకు భావించకూడదు?
అలాగే, “తమకి పురుష శాస్త్రాలే ఇచ్చిన గౌరవాన్ని స్త్రీ మర్యాదని కాపాడడానికి, కుటుంబాలలో మొగాళ్ల మాటున బతికే అబలలైన స్త్రీలు అవసరం వొచ్చినప్పుడు బలంగా ఉపయోగించుకోగలరని ఈ పాటల కవయిత్రులు ఊహించడం వాళ్ల భావనా దక్షతకి నిదర్శనం.” అన్నారు. అవసరం వచ్చినప్పుడు బలంగా ఉపయోగించుకోగలగడం ఊహో నిజమో ఎలా నిర్ణయించగలం? అలాగే, “ఆడబడుచు దెప్పడం పోయి, ఇలా గొప్పగా పొగడడం ఆడవాళ్ల ఊహల్లో ఉండే మాట.” అన్నది ఆ కాలంలో ఊహో నిజమో మనకి తెలియదు కదా!
4.
“రామరాజ్య ధర్మం పటాపంచలై పోతుంది. ఊర్మిళ ఆ సందర్భంలో అనే మాటలు వింటే పరపురుషుడి చేత బలాత్కరించబడిన స్త్రీ ఎంత అసహాయ పరిస్థితిలో ఉంటుందో. తాను హింసకు గురై ఎలా చివరికి అపరాధిలా అందరిముందూ నిలబడాల్సి వస్తుందో గుండె చెదిరే లాగా బోధపడుతుంది.”
ఇక్కడ పటాపంచలమైన రామరాజ్య ధర్మమేమిటో నాకు బొత్తిగా బోధపడలేదు! అలాగే ఊర్మిళ మాటల్లో బలాత్కరింపబడిన స్త్రీ అసహాయ స్థితి కూడా నాకు కనబడలేదు. పరాయి పురుషుడు తన పడకమీదకి వచ్చాడని ఆమె భ్రమించింది. అందుకతన్ని నయానా భయాన పొమ్మని చెప్పింది. “హెచ్చయిన…” అనే రెండు వాక్యాలని పట్టుకొని ఆమె అపరాధిలా అందరిముందూ నిలబడాల్సిన పరిస్థితి గుండె చెదిరేలాగా చిత్రింపబడింది అనడం నాకు అతిశయోక్తిగా తోచింది.
5.
“సుగ్రీవుడు రాముడికి బహుమానంగా ఇచ్చాడు ఈ నగలని. ఎందుకంటే ఆయన కౌసల్యాపుత్రుడు కాబట్టిట. ఒక తల్లికి కొడుకుగా రాముణ్ణి గౌరవించడం ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన మాట.”
ఇది కేవలం విమర్శకుని ఊహ మాత్రమే. ఆ ఉద్దేశంతోనే ఆ మాట వాడబడినదని అనుకోడానికి ఎలాంటి బలమైన కారణమూ లేదు. ఈ పాటలో రామునికి చాలా పేర్లు వాడబడ్డాయి. కనీసం మరికొన్ని చోట్ల యిలా సార్థక ప్రయోగం జరిగిందని స్పష్టంగా తెలిస్తే అప్పుడీ ఊహకి కొంత బలం చేకూరుతుంది.
తెనాలి రాముని సూక్ష్మజీవితసంగ్రహం చాలా బాగుంది. కాశీపురవర్ణన కళ్ళకు గట్టినట్లుగ వుంది. వారకాంతల వర్ణన వారెవా! గాఢతపోనిధియైన అగస్త్యుని చూచి వింధ్యభూధరము..
భూధరము అని పర్వతమునకు పర్యాయపదప్రయోగం .. రాజహంస, వేసవికాకకి ఓర్వలేక శిథిలమైన ఱెక్క చివర కలదియై చెరువు (పద్మిని) లో తామరాకు గొడుగు క్రింద (మిగతా చోటుకంటే అక్కడ ఇంకా ఎక్కువ చల్లగా వుంటుందిట) చేరిందిట. దవడ (తాలువు) నుండి జారుతున్న, కారుతున్న (స్రవత్) నురుగు సమూహముతో (ఫేనజాలమ్ముతో) పంది (ఘోణి) సమీపంలో (పంచల) బురదలో (రొంపి) పొర్లి (కలంచి) ఆడిందిట (యాడె). దూరం నుండి లేస్తున్న (దూర + ఉద్గమత్) దావాగ్ని పొగను (దావధూమ) మేఘమనుకొని (అంబుద బుద్ధిన్) నెమలి (నెమ్మి) – ఎండకు తాళలేక పొదలో ఎక్కడో లోపల దాక్కొని వున్నది, మెడ నిక్కించి చూసిందిట. కడుపులోపలనున్న (జఠరస్త) నీళ్ళను తొండంద్వారా (నాసా నాళమున) బయటకి పీల్చుకొని ఏనుగు తనమీద అటూ ఇటూ చల్లుకుందిట.
అధ్భుత వివరణ..
సురవేశ్యలు (అప్సరసలు)… ఇలా ప్రతిపదమును వివరంగా మెచ్చుకుంటూ పోతే యింకొక వ్యాసం అయిపోతుంది. చాలా రోజులతర్వాత ఇటువంటి వ్యాసం చదివే భాగ్యం కలిగించిన ఈమాట పత్రికకి ధన్యవాదములు..
మంచి వ్యాసము, రచయితకు అభినందనలు. (1) మహమ్మదీయులలోని పెళ్లిగురించి ఒక విషయము. ఔరంగజేబు తన సోదరుడైన దారాను చంపి పాదుషా అయ్యాడు (సారా మానను చదవండి). దారాకు ఉండే కొడుకును బంధించి చంపాడు చిన్నాన్న ఔరంగజేబు. దారాకు జానీ అని ఒక కూతురు ఉండేది, ఆమె అంటే తాతగారైన షాజహానుకు కూడ ప్రీతి. ఆమెను తన సోదరియైన రోషనారావద్దకు పంపాడు ఔరంగజేబు, ఆమె జానీని కష్టపెట్టేదట. అది భరించలేక మరో సోదరి జహానారా ఆమెను తాను పెంచుతానని ఔరంగజేబుకు చెప్పి జానీని పెంచిందట. జానీ చాల మంచిదట. ఆ సుగుణవతిని చూచి కొన్నాళ్లకు ఔరంగజేబే మనసు మార్చుకొన్నాడట. అంతేకాదు ఆమెను తన కొడుకైన ఆజమ్‌కు ఇచ్చి పెళ్లి చేసాడట. పెదనాన్న చిన్నాన్న పిల్లల మధ్య జరిగే పెళ్లికి ఇది ఒక ఉదాహరణ. (2) అత్త అనే పదము ప్రాకృతమునుండి వచ్చినదని భావిస్తారు. ఈ పదము హాలుని గాథాసప్తశతిలో ప్రయోగించబడినది. మరాఠీ ప్రాకృతమునుండి జనించింది కనుక మరాఠిలో అత్త అనే పదము చేరి ఉంటుంది. అత్తె కన్నడములో కూడ తెలుగులోని అత్తవలె ఉంది. ఈ అత్త పదాన్నితెలుగు భాష ప్రాచీనతను నిరూపించడానికి ఒకప్పుడు వాడినట్లు గుర్తు. విధేయుడు – మోహన
భోగి తలంట్లు గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
01/03/2012 9:51 pm
అవునండి! నాకలాగే అనిపించే వారు. ఇల్లు దేవాలయం అయినప్పుడు అమ్మా నాన్నలు మరి దేవతలే కదా ! .. అందుకని అలా అన్నా. కథ చదివి, మీ అభిప్రాయాన్ని వ్యక్త పరచినందుకు – థాంక్సండి.
మీకు నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ…
నమస్సులతో-
ఆర్.దమయంతి.
గోమెజ్ ఎప్పుడొస్తాడో! గురించి మోహన అభిప్రాయం:
01/03/2012 9:50 pm
సామూహికంగా మనకు కనపడే అనేకమందిని పరిశీలించి, ఆ మనుషులందరిని మొత్తం చేసి అందులోంచి ఒక కాల్పనిక వ్యక్తిని సృష్టించి, ఆ వ్యక్తిని కథలో మలచటం నా పద్ధతి. అని చాసో తన కథను గురించి చెప్పినది తప్పకుండా ఈ గోమెజ్ పాత్రకు వర్తిస్తుంది. చక్కని కథాశిల్పము. ప్రతి రోజు సాయంకాలము నడిచేటప్పుడు మా చుట్టుపక్కలా ఇటువంటి గోమెజులను ప్రతిరోజు చూస్తుంటాను. నిజమైన ఒక కథను హృదయానికి హత్తుకుపోయేటట్లు అందించినందుకు వేలూరిగారికి అభినందనలు. విధేయుడు – మోహన
భోగి తలంట్లు గురించి మోహన అభిప్రాయం:
01/03/2012 6:10 pm
బాగుంది మీ జ్ఞాపికలు. కథ కాకపోయినా చదువుతుంటే కథలాగా racyగా ఉంది. ఈ వాక్యాలు నన్ను నిజంగా నవ్వించాయి: మొత్తానికి కొత్త చింత పండేసి తోమిన దేవతా విగ్రహాలకు మల్లే అందర్లోనూ భోగి ‘పండగ తలంటి’ కళ కొట్టొచ్చినట్టు కనిపించేది. విధేయుడు – మోహన
మౌనంతో ముఖాముఖి గురించి మోహన అభిప్రాయం:
01/03/2012 5:48 pm
ఈ కథతో ముఖాముఖి. రెండుసారులు చదివాను, నా మట్టి బుఱ్ఱకు అర్థం కావడము లేదు ఈ కథ 😉 విధేయుడు – మోహన
ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి మోహన అభిప్రాయం:
01/03/2012 3:16 pm
నేను విమర్శకుడిని గాను, నాకు కవిత్వతత్త్వవిచారములు అంతగా తెలియవు. ఊర్మిళనిద్ర పాటలోని ఛందస్సును గురించి మాత్రమే ఈ అభిప్రాయము. పాటంతా మాత్రాఛందస్సులో ఉన్నది. ప్రతి పాదములో (5-7)-(5)-(5-7) మాత్రలు ఉన్నవి. మొదటి భాగము, చివరి భాగము మాత్రల అమరికలో ఒకే విధముగా ఉన్నది. మధ్య ఉండే ఐదు మాత్రలు వీటిని కలుపుతుంది. ఏడు మాత్రల అమరిక 2-5 లేక 3-4 లేక 4-3 గా ఉంటుంది. మొదటి భాగపు, చివరి భాగపు చివరి అక్షరము లఘువైనా పాడేటప్పుడు అది గురుతుల్యమే. అందుకే భూపాలుడు పాడేటప్పుడు భూపాలుడూ అవుతుంది. మాత్రల అమరిక కోసం కొన్ని చోట్లలో దీర్ఘము కత్తిరించబడుతుంది, ఉదా. నిద్రాహారములకు బదులు నిద్ర హారము లెరుగనే. ఈ పాట అమరిక కస్తూరి రంగ రంగా నా యన్న కావేటి రంగ రంగా వంటిదే. ఛందస్సులో, పాదములో ఒకే అమరికతో ఉండే మొదటి చివరి భాగాలు మధ్యన ఉండే ఒక చిన్న గణముతో కలుపబడి ఉండుట మనకు తరచుగా కనబడుతూ ఉంటుంది. ఉదాహరణగా మత్తకోకిల, మానినీ వృత్తాలను తీసికొనవచ్చును. దీనిని గురించి అప్పుడప్పుడు ఛందస్సు, రచ్చబండ గుంపులో నేను ఎన్నో సందేశాలను వ్రాసి ఉన్నాను. విధేయుడు – మోహన
ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి rama bharadwaj అభిప్రాయం:
01/03/2012 1:56 pm
ఇధమిత్తంగా కర్తృత్వం తెలియని చోట్ల చాలా ఖచ్చితంగా ఆ పాట తాలుకు కర్తృత్వం ఒకానొక పేరు లేని పేరు తెలియని వారికి లింగనిర్దేశం చేసి అది ఒక “కవియిత్రి” రచనే నని అంటగట్టడం పరిశోధనలో కుదరదు. అవి స్త్రీల రామాయణపు పాటలు మాత్రమే !! స్త్రీలే రాసుకున్నారో స్త్రీల కోసం ఇంకెవరైనా రాసిపెట్టారో.. లేక కాలం రీత్యా వాటిలో అనేకమైన కర్తృత్వాలు కలిసాయో స్పస్టంగా విడదీసి చూడగల వీలు లేనప్పుడు నారాయణరావు వ్యాసమ్ అంతా “కవయిత్రి” అంటూ ప్రస్తావించడం లో అర్ధమ్ కనిపించదు.
ఊర్మిళాదేవి నిద్ర పాట చాలా మందికి తెలిసిన పాట. అమ్మమ్మల అమ్మల గొంతుల్లోంచి అనదిమంది తెలుగునాట విన్న పాట కూడానూ! ఇందులో నారాయణరావు” చూసిన” కల్పనలు ఆనాడు దానిని పాడిన వాళ్ళు చూసినట్టు లేదు. తెలుగు లోగిళ్ళలో ఖచ్చితంగా కొన్ని కొందరికి మాత్రమే ప్రవేశానికి అర్హ మైన ప్రాంతాలుగా పరిగణించడం “కొత్త” గా చెప్పేమని చెప్పుకునేదానికి పనికొస్తుందే గానీ ఇంటిని అన్ని విభాగాలు చేసే వీలు తెలుగు సినిమాకి సాధ్యమ్ గానీ.. తెలుగు సంసారాలకి సాధ్యమ్ కాదు.
ఇంక ఈ పాట “మగ ప్రపంచాన్ని చితక్కొట్టేసిన” పాటగా నిరూపించడానికి ఏ ఆధారమూ లేదు. అన్ని కాలాల్లోనీ అన్ని వర్గాల్లోనీ అన్ని ప్రపంచాలూ కనిపిస్తాయి. హాలుడి గాధా సప్తశతిలో ఆడవాళ్ళ కన్నా తెగించి శృంగారాన్ని అనుభవించిన వాళ్ళు ఈ ఆధునిక కాలంలోనీ కనిపించరే:) ఇంక ఊర్మిళా దేవి నిద్రకి ఇవాళ కొత్తగా “ఫెమినిస్టు” స్టేటసు ఇవ్వడం వల్ల గానీ దీనినేదో తెలుగుదేశాన ఫెమినిస్టులు పెద్దగా పట్టించుకోక వారి పరిశీలనా సామర్ధ్యాన్ని కుదించుకున్నారని గానీ రాసే వ్యంగ్యాలతోనీ పనిలేదు. ఆడవాళ్ల ప్రపంచాల మీద మగ విమర్శకుల అఖ్ఖరలేని సానుభూతి, అనవసరమైన ప్రయాసా తప్పిస్తే !!
ఇంతకీ ఈ విశ్లేషణ ఆధునికమో జానపద సాహిత్య చట్రమో, మౌఖిక సాహిత్య పరిధో లేక “ఆధునిక” దృక్పధమో ఎవరన్నా నాకు విశదీకరిస్తే వింటాను. ఇదివరలో వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఒక తాళ్లపాక తిమ్మక్కని తయారు చేసి పెట్టారు. ఇప్పుడీ వ్యాసంలో నారాయణ రావు గారు ఒక “ఆధునిక” మైన ఈ ఊర్మిళనీ ఆమె అంతరంగాన్నీ కొత్త కొత్తగా ఇలా నిర్మించిపెట్టారు.
కామేశ్వరరావు గారి అభిప్రాయమ్తో ఏకీభావం ఉంది నాకు.
రమ.
(This message has been edited – Ed.)
ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి కామేశ్వరరావు అభిప్రాయం:
01/03/2012 9:45 am
మరుగున పడిపోయిన (పడిపోతున్న) యిలాంటి సాహిత్యాన్ని పదిలపరుచుకోవడం, కొత్తతరాలకి పరిచయం చెయ్యడం చాలా మంచి పని. ఈ సాహిత్యాన్ని గురించి కొత్తగా ఆలోచించడం కూడా అవసరమే. అయితే యీ వ్యాసంలో నారాయణరావుగారు చేసిన ఆలోచనలో కొన్ని అంశాలపై నాకు అనుమానాలు అభ్యంతరాలు ఉన్నాయి. విజ్ఞులు పరిశీలించగలరు:
1.
శ్రీరాము తమ్ముండనే అతడనగ సృష్టిలో నొకరు గలరా?
జనకునల్లుని గానటే? భూమిలో జనకులనగా నెవ్వరు?
శతపత్రమున బుట్టినా చేడెరో సీతకూ మరిదిగానా?
సీత యనగా నెవ్వరూ [చెప్పుడీ] సృష్టిలో నేను యెరుగ
ఇక్కడ లక్ష్మణుడు ఊర్మిళ భర్తనని చెప్పకుండా “డొంకతిరుగుడుగా” చెప్పాడని దానికి కారణం తాను పెరిగిన కుటుంబ మర్యాదలని నారాయణరావుగారు అన్నారు. ఇది నాకు సమంజసమని అనిపించలేదు. నాకు కనిపించిన విషయం ఏమిటంటే – ఊర్మిళ నిద్ర మగతలో లక్ష్మణుడు పరపురుషుడని భ్రమపడినప్పుడు అతన్ని ఎలా భయపెట్టింది?
మాతండ్రి జనకరాజూ వింటె మిము ఆజ్ఞసేయక మానడూ
మా యక్క బావ విన్నా మీకిపుడు ప్రాణముల హాని వచ్చూ
మాయక్కమరది విన్నా మిమ్మిపుడు బ్రతుకనివ్వరు జగతిలో
ఇక్కడ ఆమె ప్రస్తావించినది జనకుడు, రాముడు, సీత, సీత మరది అయిన లక్ష్మణుడు. అందుకే వారినే తన జవాబులో లక్ష్మణుడు పేర్కొన్నాడు. ఆమె మాటలే తీసుకొని తానెవరో వివరించాడన్న మాట. ఇది సహజ సంభాషణే కాని డొంకతిరుగుడు కాదు, కుటుంబ మరియాద కోసం చేసినదీ కాదు.
2.
పైనున్న లక్ష్మణుడి మాటల వాక్యాల చివరనున్న ప్రశ్నార్థకాలను నేను ఆశ్చర్యార్థకాలుగా చదువుకున్నాను (విన్నాను). నాకా వాక్యాలెలా అర్థమయ్యాయంటే – అవన్నీ లక్ష్మణుడు చెపుతున్నవే, వాక్యంలో సగభాగం లక్ష్మణుడు సగభాగం ఊర్మిళా అంటున్నవి కావు. నేను శ్రీరాముని తమ్ముడిని, శ్రీరాముడిలాంటి వారింకొకరు సృష్టిలో ఉన్నారా! నేను జనకుని అల్లుడిని. జనకులంటే ఎవరు, సామాన్యులా! అలాగే, సీతమ్మ మరదిని. ఆమెలాంటి స్త్రీని సృష్టిలో ఇంకెవిరిని నేనెరుగను!
నారాయణరావుగారి వ్యాసం చదవకముందు, చదివాక కూడా నాకలానే అర్థమయ్యిందా భాగం. ఆ అన్వయం చాలా సహజంగాను సరళంగాను ఉన్నట్టనిపిస్తోంది. నా పురుషాహంకారమేమైనా నేనలా అర్థం చేసుకొనేట్టు చేసిందేమోనని అనుమానం వచ్చి, నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు స్త్రీలనికూడా అడిగి చూసాను. నా అన్వయం కాని, నారాయణరావుగారి అన్వయం కాని చెప్పకుండా. వారికీ నాలాగనే అర్థమయ్యింది మరి! ఈ పాట గురించి వివరించిన మలయవాసినిగారు ఏ అర్థమిచ్చారో నాకు తెలియదు. అసలు నారాయణరావుగారికి నాకు తట్టిన అర్థం తట్టనే లేదో, తట్టినా అది తప్పనుకున్నారో తెలుసుకోవాలని ఉంది. ఒకవేళ ఆ అర్థం తడితే, దాన్ని కూడా ప్రస్తావించి, తాను చెప్పిన అన్వయమే ఎందుకు సరి అనుకుంటున్నారో వివరిస్తే బాగుండేది.
అసలు ఊర్మిళ ప్రస్తావన లేకుండా హఠాత్తుగా అలా ఆమె మాట్లాడిందని అనుకోవడం నిర్మాణ పరంగానూ, అర్థంచేసుకోడంలోను కూడా సంక్లిష్టత కలిగిన అన్వయం. సరళమైన అన్వయాన్ని వదిలి దాన్ని గ్రహించాల్సిన అవసరం ఏమిటి? ఆ తర్వాత నారాయణరావుగారు తన అన్వయానికిచ్చిన వివరణంతా విపరీత వ్యాఖ్యానమే అని అనిపించింది.
2.
మా తండ్రి జనకరాజూ మిమునమ్మి మరచి కళ్యాణమిచ్చే
మానవంతల్లుడనుచూ తెలియకా మదిని ఉప్పొంగుచుండే
చిత్తమొకదిక్కునుంచీ సమయమున చిన్నబుత్తురు యింతులా
దీనికిచ్చిన వివరణ నాకు సంతృప్తిగా లేదు. “చిత్తమొకదిక్కునుంచీ సమయమున చిన్నబుత్తురు యింతులా” అంటే, ఇంకొకళ్ళ మీద మనసుపెట్టి నన్ను నలుగురిలో చిన్నబుచ్చారని అర్థం తీసుకోవచ్చా? లక్ష్మణుడు ఎవరిపై మనసుపెట్టాడు? ఊర్మిళని నలుగురిలో ఎప్పుడు చిన్నబుచ్చాడు? అన్నమీద మనసుతో తనని విడిచి అడవికి వెళ్ళడం తనని చిన్నబుచ్చడమా? మరి “సమయమున” చిన్నబుచ్చడమేమిటి? ఇందులో “మానవంతుడు” కాకపోవడమేమిటి?
3. ఈ పాట ఏ కాలానికి చెందినదో తెలియదు. ఆ కాలంలో సాంఘికపరిస్థితులు అసలు తెలియవు. అలాంటప్పుడు, ఇందులో యిది ఊహ యిది వాస్తవమూ అని ఎలా నిశ్చయించగలం. ఉదాహరణకి,
“తెలుగు ఆడవాళ్ళు బావగారి పేరూ, భర్త పేరూ చెప్పకూడదు. ఒక పక్క తాను హింసపడే ప్రమాదం ఎదురుగుండా ఉన్నప్పటికీ కూడా తెలుగు కుటుంబాల ఆడవాళ్ళు ఎంత జాగ్రత్తగా మసలవలసిన నిర్బంధంలో ఉన్నారో ఈ పాట సున్నితమైన మాటల్లో, కొరడాతో కొట్టినంత చురుక్కుమనిపించేలాగా చెబుతుంది.” అన్నారు. అది చెప్పకూడదనే నిర్బంధమో, అలా వరసలు పెట్టి చెప్పే అలవాటో ఎలా నిర్ణయించగలం? ఇంకొకటి – ఇవి నిజంగానే అచ్చంగా ఊర్మిళ మాటలో, లేదా పాడుతున్న స్త్రీ మాటలో కూడా చెప్పలేం. ఊర్మిళ రావణాసురుడు సీతనెత్తుకుపోవడాన్ని ప్రస్తావిండం అది అచ్చంగా ఆమె మాటలు కావని, అది కథ పాడుతున్న ఆడవాళ్ళ మాటలని సమర్థించారు కదా (ఇంతకీ యిలా కాలక్రమాన్ని అతిక్రమించడంలో “నిర్మాణదక్షత” ఏమిటో నాకర్థం కాలేదు!). అలానే ఇక్కడ కూడా యిలా వరసలతో బావగారిని భర్తని ప్రస్తావించడం పాడుతున్న ఆడవాళ్ళు అలవాటుగా చేసిన ప్రయోగమని ఎందుకు భావించకూడదు?
అలాగే, “తమకి పురుష శాస్త్రాలే ఇచ్చిన గౌరవాన్ని స్త్రీ మర్యాదని కాపాడడానికి, కుటుంబాలలో మొగాళ్ల మాటున బతికే అబలలైన స్త్రీలు అవసరం వొచ్చినప్పుడు బలంగా ఉపయోగించుకోగలరని ఈ పాటల కవయిత్రులు ఊహించడం వాళ్ల భావనా దక్షతకి నిదర్శనం.” అన్నారు. అవసరం వచ్చినప్పుడు బలంగా ఉపయోగించుకోగలగడం ఊహో నిజమో ఎలా నిర్ణయించగలం? అలాగే, “ఆడబడుచు దెప్పడం పోయి, ఇలా గొప్పగా పొగడడం ఆడవాళ్ల ఊహల్లో ఉండే మాట.” అన్నది ఆ కాలంలో ఊహో నిజమో మనకి తెలియదు కదా!
4.
“రామరాజ్య ధర్మం పటాపంచలై పోతుంది. ఊర్మిళ ఆ సందర్భంలో అనే మాటలు వింటే పరపురుషుడి చేత బలాత్కరించబడిన స్త్రీ ఎంత అసహాయ పరిస్థితిలో ఉంటుందో. తాను హింసకు గురై ఎలా చివరికి అపరాధిలా అందరిముందూ నిలబడాల్సి వస్తుందో గుండె చెదిరే లాగా బోధపడుతుంది.”
ఇక్కడ పటాపంచలమైన రామరాజ్య ధర్మమేమిటో నాకు బొత్తిగా బోధపడలేదు! అలాగే ఊర్మిళ మాటల్లో బలాత్కరింపబడిన స్త్రీ అసహాయ స్థితి కూడా నాకు కనబడలేదు. పరాయి పురుషుడు తన పడకమీదకి వచ్చాడని ఆమె భ్రమించింది. అందుకతన్ని నయానా భయాన పొమ్మని చెప్పింది. “హెచ్చయిన…” అనే రెండు వాక్యాలని పట్టుకొని ఆమె అపరాధిలా అందరిముందూ నిలబడాల్సిన పరిస్థితి గుండె చెదిరేలాగా చిత్రింపబడింది అనడం నాకు అతిశయోక్తిగా తోచింది.
5.
“సుగ్రీవుడు రాముడికి బహుమానంగా ఇచ్చాడు ఈ నగలని. ఎందుకంటే ఆయన కౌసల్యాపుత్రుడు కాబట్టిట. ఒక తల్లికి కొడుకుగా రాముణ్ణి గౌరవించడం ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన మాట.”
ఇది కేవలం విమర్శకుని ఊహ మాత్రమే. ఆ ఉద్దేశంతోనే ఆ మాట వాడబడినదని అనుకోడానికి ఎలాంటి బలమైన కారణమూ లేదు. ఈ పాటలో రామునికి చాలా పేర్లు వాడబడ్డాయి. కనీసం మరికొన్ని చోట్ల యిలా సార్థక ప్రయోగం జరిగిందని స్పష్టంగా తెలిస్తే అప్పుడీ ఊహకి కొంత బలం చేకూరుతుంది.
మహాకవి తెనాలి రామకృష్ణుని ‘పాండురంగ మాహాత్మ్యము’ గురించి Rama అభిప్రాయం:
01/03/2012 5:45 am
తెనాలి రాముని సూక్ష్మజీవితసంగ్రహం చాలా బాగుంది. కాశీపురవర్ణన కళ్ళకు గట్టినట్లుగ వుంది. వారకాంతల వర్ణన వారెవా!
గాఢతపోనిధియైన అగస్త్యుని చూచి వింధ్యభూధరము..
భూధరము అని పర్వతమునకు పర్యాయపదప్రయోగం ..
రాజహంస, వేసవికాకకి ఓర్వలేక శిథిలమైన ఱెక్క చివర కలదియై చెరువు (పద్మిని) లో తామరాకు గొడుగు క్రింద (మిగతా చోటుకంటే అక్కడ ఇంకా ఎక్కువ చల్లగా వుంటుందిట) చేరిందిట. దవడ (తాలువు) నుండి జారుతున్న, కారుతున్న (స్రవత్) నురుగు సమూహముతో (ఫేనజాలమ్ముతో) పంది (ఘోణి) సమీపంలో (పంచల) బురదలో (రొంపి) పొర్లి (కలంచి) ఆడిందిట (యాడె). దూరం నుండి లేస్తున్న (దూర + ఉద్గమత్) దావాగ్ని పొగను (దావధూమ) మేఘమనుకొని (అంబుద బుద్ధిన్) నెమలి (నెమ్మి) – ఎండకు తాళలేక పొదలో ఎక్కడో లోపల దాక్కొని వున్నది, మెడ నిక్కించి చూసిందిట. కడుపులోపలనున్న (జఠరస్త) నీళ్ళను తొండంద్వారా (నాసా నాళమున) బయటకి పీల్చుకొని ఏనుగు తనమీద అటూ ఇటూ చల్లుకుందిట.
అధ్భుత వివరణ..
సురవేశ్యలు (అప్సరసలు)… ఇలా ప్రతిపదమును వివరంగా మెచ్చుకుంటూ పోతే యింకొక వ్యాసం అయిపోతుంది. చాలా రోజులతర్వాత ఇటువంటి వ్యాసం చదివే భాగ్యం కలిగించిన ఈమాట పత్రికకి ధన్యవాదములు..
పలుకుబడి: మానవ బంధుత్వ పదాలు గురించి మోహన అభిప్రాయం:
01/02/2012 10:09 pm
మంచి వ్యాసము, రచయితకు అభినందనలు. (1) మహమ్మదీయులలోని పెళ్లిగురించి ఒక విషయము. ఔరంగజేబు తన సోదరుడైన దారాను చంపి పాదుషా అయ్యాడు (సారా మానను చదవండి). దారాకు ఉండే కొడుకును బంధించి చంపాడు చిన్నాన్న ఔరంగజేబు. దారాకు జానీ అని ఒక కూతురు ఉండేది, ఆమె అంటే తాతగారైన షాజహానుకు కూడ ప్రీతి. ఆమెను తన సోదరియైన రోషనారావద్దకు పంపాడు ఔరంగజేబు, ఆమె జానీని కష్టపెట్టేదట. అది భరించలేక మరో సోదరి జహానారా ఆమెను తాను పెంచుతానని ఔరంగజేబుకు చెప్పి జానీని పెంచిందట. జానీ చాల మంచిదట. ఆ సుగుణవతిని చూచి కొన్నాళ్లకు ఔరంగజేబే మనసు మార్చుకొన్నాడట. అంతేకాదు ఆమెను తన కొడుకైన ఆజమ్‌కు ఇచ్చి పెళ్లి చేసాడట. పెదనాన్న చిన్నాన్న పిల్లల మధ్య జరిగే పెళ్లికి ఇది ఒక ఉదాహరణ. (2) అత్త అనే పదము ప్రాకృతమునుండి వచ్చినదని భావిస్తారు. ఈ పదము హాలుని గాథాసప్తశతిలో ప్రయోగించబడినది. మరాఠీ ప్రాకృతమునుండి జనించింది కనుక మరాఠిలో అత్త అనే పదము చేరి ఉంటుంది. అత్తె కన్నడములో కూడ తెలుగులోని అత్తవలె ఉంది. ఈ అత్త పదాన్నితెలుగు భాష ప్రాచీనతను నిరూపించడానికి ఒకప్పుడు వాడినట్లు గుర్తు. విధేయుడు – మోహన
ఒక నేను, కొన్ని నువ్వులు గురించి మోహన అభిప్రాయం:
01/02/2012 6:43 pm
మంచి రచన, ఒక చక్కని వచన కవితలా ఉంది. కాని ఒక కథ చదివినప్పుడు కలిగే అనుభూతి కలుగలేదు. విధేయుడు – మోహన