పద్యమే కాదు, సర్, మీ వ్యాసం కూడా చాల గొప్పగా వుంది. కనీసం ఒక నెల రోజులు అన్ని వ్యాసంగాలు పక్కన పెట్టి తిక్కన మహాభారత భాగాలు చదువుకోవాలని సంకల్పం కూడా చెప్పుకున్నాను.
పనిలో పనిగా నాకు ఎప్పటి నుంచో ఉన్న రెండు సందేహాలను పెద్దల ముందు వుంచుతున్నాను. వీలయితే, తీర్చండి. (నేను భారతం చదివిన వాడిని కాదు, చదువుకుంటున్న వాడిని మాత్రమే).
1) ఉత్తర గోగ్రహణంలో కురు వీరులందరినీ ఒంటి చేత్తో ఓడించిన అర్జునుడు కేవలం గోవులను మళ్లించుకుపోవడం కాకుండా వారి పీడ పూర్తిగా వదిలించుకుని వుంటే, కురుక్షేత్రంలో అంతటి రక్తపాతం జరిగేది కాదు కదా? భీష్ముడు నిద్ర నటించాడేమో, మిగిలిన వారి సంగతేమిటి?
2) ఇక్కడ, అంతకు ముందు అరణ్య వాసంలో ఒక సారి, అర్జునుడి చేత అంత సులభంగా ఓడిపోయిన కర్ణుడిని కురుక్షేత్రంలో హతమార్చడానికి అన్ని కుయుక్తులు ఎందుకు అవసరమయ్యాయి? (ఐరావతీ కార్వే తమ చిరస్మరణీయ గ్రంథం ‘యుగాంత’లో కర్ణుడు అర్జునుడికి సరివీరుడు కాడని నిరూపించడానికి ఈ రెండు ఘటనలను ఉదాహరించారు).
ఇదో సరికొత్త ప్రయోగం!
**
మార్చ్ 2, 2011 1:20 ఈమాట
‘ గౌరవనీయులైన సంపాదకులకు, నమస్తే!
.’ ముందుగా మీకు నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నా. ఈమాట లో -మధ్యంతర రచనలకు’ స్థానాన్ని కల్పిస్తున్న వైనం బాగుంది. అలాగే- నెలకో, రెణ్నెల్లకో, ఒక చిన్న నవల కానీ, ఒక పెద్ద కథకు కానీ వీలు కల్పిస్తే మరింత బాగుంటుందనుకుంటున్నా.(చిన్న చిన్న ఇమేజెస్ తో). – ఆర్.దమయంతి.
*(మీ అభిమానానికి కృతజ్ఞతలు. పెద్ద కథలకు ఈమాటలో ఎప్పుడూ చోటు ఉంది. నవలా సాహిత్యాన్ని ప్రోత్సహించాలని మాకూ ఎంతగానో ఉంది. కానీ సమీక్ష కోసం, నవల మొత్తం ఒకేసారి పంపమనడం, రచయితలకు కుదిరే పని కాదు. అలా అని, సమీక్ష ఏమీ లేకుండా ప్రచురించలేము కూడాను. నవలను సమీక్షించే పద్ధతిపై ఒక అవగాహనకు రాగానే తెలియజేస్తాము. -సం. )
********
పోయిన సంవత్సరం లానే – నేనిక్కడ మరో ఆశ ని కూడా వ్యక్త పరుస్తున్నా..
ఈ మాటలో చక్కని గీతాలను వినిపిస్తున్నారు. సంతోషం. అలాగే పాఠకుల నుంచి కూడా గాయనీ గాయకులను ఆహ్వానించి, బావున్న పాటలను ఇక్కడ – ప్రతి సంచిక లోనూ మాకందించ వచ్చు కదా! పాడుతా హాయిగా..లా గా ‘ ‘నా పాట ఈమాట ‘ అని ఓ కొత్త ఫీచర్ ఆరంభిస్తే బావుంటుందేమో!?
చక్కని రచనల లానే …చక్కని గాత్రాలకీ – తుది న్యాయ నిర్ణేతలు మీరే అయి వుంటే బావుంటుంది. ఆలోచించండి.
చివరిగా.. సంపాదకులకు, సంపాదక వర్గానికి నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ చేసుకుంటూ..
నమస్సులతో –
ఆర్.దమయంతి.
ఊర్మిళ నిద్ర గురించి మరో కథ 🙂 లక్ష్మణుడికి రాముడిపైన, సీతపైన ఎంతో అభిమానము, గౌరవము, ప్రేమ. వాళ్లిద్దరిని సేవ చేస్తూ తన్మయుడవుతూ ఉండేవాడు వనవాసములో. నిద్రనుండి పూర్తిగా దూరమయ్యాడు, ఇలా నెలలు, సంవత్సరాలు గడిచాయి. ఇతని దీక్ష నిద్రాదేవికి తెలిసింది. ఒక రోజు లక్ష్మణుడి ముందు నిద్రాదేవి ప్రత్యక్షమయింది. లక్ష్మణా, నీ దీక్ష, రాముడిపైన నీకుండే అపారమైన భక్తి, ప్రేమ నన్ను సంతోషపరచింది. నిద్రలేని నీకు అలసట కలగకుండా ఉండాలని నీకు వరమిస్తానని అన్నది. నాకు రాముడి సేవలో ఎప్పుడూ అలసట కలుగదు, నీ దగ్గర నేను వరము పుచ్చుకొంటే నా దీక్షలో, నా వ్రతముపై నాకే సందేహము కలుగుతుంది, అందువల్ల నీ వరము నాకు అక్కర్లేదు అన్నాడు లక్ష్మణుడు. ఇంత దూరము వచ్చాను, కాబట్టి నీకు వర మేదీ యివ్వకుండా నేను వెళ్లకూడదు, ఏ వరమైనా అడుగు, అది నీకిస్తాను అని చెప్పింది. అప్పుడు లక్ష్మణుడు అన్నాడు – సరే, ఇక్కడ నాకు అన్నగారి నీడలో ఏ అపాయము లేదు, అక్కడ నా భార్య ఊర్మిళ ఏమి కష్ట పడుతున్నదో, ఆమెకు కష్టాలేమీ లేకుండా చేయమని అడిగాడు. నిద్రాదేవి సరేనని అయోధ్యకు వచ్చి ఊర్మిళ ముందు నిలిచింది తాను ఆమె భర్త లక్ష్మణుని చూచానని అతడు ఆమెకు కష్టాలేమీ లేకుండా, రాకుండా వరమివ్వ మన్నాడని చెప్పాడని తెలిపింది. అప్పుడు ఊర్మిళ, ఇక్కడ పెద్ద వారి సేవలో నేను నిమగ్నమై ఉన్నాను, నాకేమీ కష్టాలు లేవు, నన్ను తలబోస్తూ అక్కడ లక్ష్మణుడు తన స్వామి కార్యమును సరిగా చేయలేక పోతున్నాడో ఏమో, అండువల్ల లక్ష్మణుడు నన్ను సంపూర్ణముగా మరచిపోయేటట్లు వరమివ్వమని నిద్రాదేవిని అడిగింది. ఒకరికన్నా మరొకరు త్యాగశీలురు గదా ఈ రామాయణ కథలో.
ఊర్మిళను కేంద్రముగా నుంచుకొని హిందీకవి మైథిలీశరణ్ గుప్తా సాకేత్ అనే ఒక కావ్యాన్ని కూడా వ్రాసియున్నాడు. విధేయుడు – మోహన
కృష్ణారావు గారు , మీకు ఊర్మిళాదేవి నిద్ర అన్న పాటని గురించి పల్లెటూళ్ల ల్లోని స్త్రీల సంభాషణల గురించి ఎంత తెలుసునో నాకు అంత గానూ తెలుసును. దాని గురించి మీరు చింత పడనవసరం లేదు. నాకు పరిశీలనానుభవమూ పరిశోధనానుభవమూ సైతం పుష్కళంగానే ఉన్నాయి. అందువలన నా అభిప్రాయాలు నా విమర్శ కి కూడా బలమైన పునాది ఉంటుంది. మీ ఇతర మాటలలో నాకు జవాబు రాయవలసినంత బలమైన అంశం ఏదీ కనిపించలేదు గనక నేను ప్రతిస్పందించడం లేదు.
తహ తహ గారూ !! మీకు మల్లేనే ఆ వ్యాసం లోని ” మనం ” లో నేను కూడా లేను:)
వస్తువు, శిల్పం గూర్చి చాసో స్వానుభవ కథనం రచయితలకు మంచి పాఠం. విమర్శకుల అవసరం రచయితలకు ఎంత వుంటుందో కూడా చాసో చక్కగా సూచించారు. మళ్ళీమళ్ళీ చదువుకోవాలనిపించే ఈ వ్యాసం అందించిన అందరికీ ధన్యవాదాలు.
“ఊర్మిళ గురించిన ప్రస్తావన వాల్మీకి రామాయణంలో ఒక్కచోట మాత్రమే కనిపిస్తుంది. సీతను రాముడికిచ్చి పెళ్ళి చేసినప్పుడు సీత చెల్లెలయిన ఊర్మిళను లక్ష్మణుడికిచ్చి పెళ్లి చేశారు అని వాల్మీకి రామాయణంలో ఉంది. ఆ తరువాత ఊర్మిళ గురించి వాల్మీకం మనకేమీ చెప్పదు.
వాల్మీకి వదిలేసిన ఊర్మిళని తెలుగు ఆడవాళ్ళు దగ్గరికి తీసుకున్నారు. ఆవిడని గురించి ఒక అందమైన కథ అల్లారు. అడివికి రాముడితో పాటు సీత వెళ్ళిపోతూంటే ఊర్మిళ కూడా లక్ష్మణుడితో పాటు వెళ్తానంటుంది కాని లక్ష్మణుడు దానికి అంగీకరించలేదని మనకి తెలుసు.”
ఈ మనము ఎవరు? [ఈ మనము లోనేను లేను, ఎందుకంటే వాల్మీకి మనకేమీ చెప్పలేదు గనక] వారికి ఈ విషయము ఎలా తెలుసు? ఇది చూసింతర్వాత చదవ బుద్ధి వెయ్యలేదు గానీ చదివాను.
మీ ప్రతి వాదనతో నాకేమీ పేచీ లేదు గానీ, పాట గొంతు స్త్రీలది (నాలాంటి వాడు పాడితే వింటే ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి నాకే భయంగా ఉంది సుమండీ!), మీరన్నట్టుగా పాడినవారంతా స్త్రీలే. రాసిన వారెవరో పరమాత్మునికెరుక. ఉన్న పరిస్థితులను బట్టి నారాయణరావు గారు అది కవయిత్రి విరచితమేనని అభిప్రాయపడ్డారు. అది ఊహాజనితమే కావచ్చు. పరిశోధకులు సిద్ధాంతం చేయడానికి కొన్ని ఆధారాలు తీసుకుంటారు. కేవలం ఖండించాలి కాబట్టి సిద్ధంతాన్ని ఖండించడం కంటే తగిన ఆధారాలతో ఖండించడం సబబు అనుకుంటాను.
పురుషులు ‘ఆడవాళ్ళ ప్రపంచాల’ మీద ‘అఖ్ఖర్లేని సానుభూతి’ – damned if you do, damned if you don’t! నారాయణరావు గారు కాకుండా ‘నారాయణమ్మ’ గారు ఇదే వ్యాసాన్ని రాస్తే మీకు అభ్యంతరం ఉండదనిపిస్తోంది నాకు.
మీకు పల్లెటూటూరి స్త్రీల నర్మగర్భ సంభాషణలతో ఎంత పరిచయం ఉందో నాకు తెలియదు (తెలియకుండా ఊహించే సాహసం చేసే ధైర్యం కూడా లేదు!). అప్పట్లో తెలియలేదు గానీ, స్త్రీలు బహిరంగంగా వ్యక్తం చేయలేని అభిప్రాయాలని పరోక్షంగా (నారాయణరావు గారు ఉదహరించినట్టుగా) ఎంత స్పష్టంగా చెప్పుకునేవారో ఇప్పుడు తీరిగి ఆలోచిస్తే జ్ఞానోదయంతో ఒళ్ళు పులకరిస్తుంది. (మందమతిని, ఇంతకాలం పట్టింది, క్షంతవ్యుణ్ణి!). దీనికి ప్రత్యేకమైన ‘ఆధునిక దృక్పధం’ అంటూ నిరసన ప్రకటించడం కంటే, ఇప్పటికైనా ఆధునిక దృక్పధంతో వచ్చిన పరిజ్ఞానంతో అప్పటి స్త్రీల భాషను అర్ధం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా గుర్తించడం మంచిదేమో? మంచి పనికి ఆడవారైతేనేం, మగవారైతేనేం?
పాండురంగ మాహాత్మ్యం కావ్యాన్ని నారికేళ పాకానికి ఉదహరిస్తారు. మీ వివరణ తో నారికేళ పానీయ రసమాధుర్యాన్ని చవి చూచాం. ధన్యవాదాలు స్వీకరించండి. ఒకచోట “మట్ట” మధ్యాహ్నం అనేది మిట్టమధ్యాహ్నం అనే పదానికి పర్యాయ పదం అయివుండవచ్చని చదివి నప్పుడు దాని వెనుక కూడ ఏదైనా రహస్యం దాగి ఉన్నదా అనే సందేహం కలిగింది. కారణం, తమిళం లో “మట్ట” అనే పదాన్ని “పట్ట పైన” అనే వాడుక విన్నాను. ఉదాహరణకి “మట్టమాడి” ( పైన ఏ అంతస్తులూ లేని మేడ పై భాగము) అనే పదం తరచుగ విన్నాను. ఈ సందర్భంలో “ఏ ఆచ్చాదనా లేని తలమీద మధ్యాహ్నపు సూర్యరశ్మి పడటం వల్ల కలిగిన తాపం” అనే అర్థం చెప్పుకోవచ్చా అనే సందేహం. దక్షిణాంధ్ర జిల్లాలలో ఈ జాతీయం “మట్ట” అనేది వాడుకలో ఉన్నదేమో తెలిసికొన గోరుతూ — అరుణాచల.
నాకు నచ్చిన పద్యం: అర్జునుడి ఎత్తిపొడుపు గురించి హెచ్చార్కె అభిప్రాయం:
01/05/2012 5:13 am
చిన్న దిద్దుబాటు. అర్జునుడు అరణ్య వాసం ఘటనలో కర్ణాదులను ఓడించిన వారిని ఓడించాడు కదూ.
నాకు నచ్చిన పద్యం: అర్జునుడి ఎత్తిపొడుపు గురించి హెచ్చార్కె అభిప్రాయం:
01/05/2012 4:50 am
పద్యమే కాదు, సర్, మీ వ్యాసం కూడా చాల గొప్పగా వుంది. కనీసం ఒక నెల రోజులు అన్ని వ్యాసంగాలు పక్కన పెట్టి తిక్కన మహాభారత భాగాలు చదువుకోవాలని సంకల్పం కూడా చెప్పుకున్నాను.
పనిలో పనిగా నాకు ఎప్పటి నుంచో ఉన్న రెండు సందేహాలను పెద్దల ముందు వుంచుతున్నాను. వీలయితే, తీర్చండి. (నేను భారతం చదివిన వాడిని కాదు, చదువుకుంటున్న వాడిని మాత్రమే).
1) ఉత్తర గోగ్రహణంలో కురు వీరులందరినీ ఒంటి చేత్తో ఓడించిన అర్జునుడు కేవలం గోవులను మళ్లించుకుపోవడం కాకుండా వారి పీడ పూర్తిగా వదిలించుకుని వుంటే, కురుక్షేత్రంలో అంతటి రక్తపాతం జరిగేది కాదు కదా? భీష్ముడు నిద్ర నటించాడేమో, మిగిలిన వారి సంగతేమిటి?
2) ఇక్కడ, అంతకు ముందు అరణ్య వాసంలో ఒక సారి, అర్జునుడి చేత అంత సులభంగా ఓడిపోయిన కర్ణుడిని కురుక్షేత్రంలో హతమార్చడానికి అన్ని కుయుక్తులు ఎందుకు అవసరమయ్యాయి? (ఐరావతీ కార్వే తమ చిరస్మరణీయ గ్రంథం ‘యుగాంత’లో కర్ణుడు అర్జునుడికి సరివీరుడు కాడని నిరూపించడానికి ఈ రెండు ఘటనలను ఉదాహరించారు).
కొత్త ఏడాదికి కొత్త తీర్మానాలు గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
01/05/2012 3:43 am
ఇదో సరికొత్త ప్రయోగం!
**
మార్చ్ 2, 2011 1:20 ఈమాట
‘ గౌరవనీయులైన సంపాదకులకు, నమస్తే!
.’ ముందుగా మీకు నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నా. ఈమాట లో -మధ్యంతర రచనలకు’ స్థానాన్ని కల్పిస్తున్న వైనం బాగుంది. అలాగే- నెలకో, రెణ్నెల్లకో, ఒక చిన్న నవల కానీ, ఒక పెద్ద కథకు కానీ వీలు కల్పిస్తే మరింత బాగుంటుందనుకుంటున్నా.(చిన్న చిన్న ఇమేజెస్ తో). – ఆర్.దమయంతి.
*(మీ అభిమానానికి కృతజ్ఞతలు. పెద్ద కథలకు ఈమాటలో ఎప్పుడూ చోటు ఉంది. నవలా సాహిత్యాన్ని ప్రోత్సహించాలని మాకూ ఎంతగానో ఉంది. కానీ సమీక్ష కోసం, నవల మొత్తం ఒకేసారి పంపమనడం, రచయితలకు కుదిరే పని కాదు. అలా అని, సమీక్ష ఏమీ లేకుండా ప్రచురించలేము కూడాను. నవలను సమీక్షించే పద్ధతిపై ఒక అవగాహనకు రాగానే తెలియజేస్తాము. -సం. )
********
పోయిన సంవత్సరం లానే – నేనిక్కడ మరో ఆశ ని కూడా వ్యక్త పరుస్తున్నా..
ఈ మాటలో చక్కని గీతాలను వినిపిస్తున్నారు. సంతోషం. అలాగే పాఠకుల నుంచి కూడా గాయనీ గాయకులను ఆహ్వానించి, బావున్న పాటలను ఇక్కడ – ప్రతి సంచిక లోనూ మాకందించ వచ్చు కదా! పాడుతా హాయిగా..లా గా ‘ ‘నా పాట ఈమాట ‘ అని ఓ కొత్త ఫీచర్ ఆరంభిస్తే బావుంటుందేమో!?
చక్కని రచనల లానే …చక్కని గాత్రాలకీ – తుది న్యాయ నిర్ణేతలు మీరే అయి వుంటే బావుంటుంది. ఆలోచించండి.
చివరిగా.. సంపాదకులకు, సంపాదక వర్గానికి నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ చేసుకుంటూ..
నమస్సులతో –
ఆర్.దమయంతి.
.
ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి మోహన అభిప్రాయం:
01/04/2012 6:37 pm
ఊర్మిళ నిద్ర గురించి మరో కథ 🙂 లక్ష్మణుడికి రాముడిపైన, సీతపైన ఎంతో అభిమానము, గౌరవము, ప్రేమ. వాళ్లిద్దరిని సేవ చేస్తూ తన్మయుడవుతూ ఉండేవాడు వనవాసములో. నిద్రనుండి పూర్తిగా దూరమయ్యాడు, ఇలా నెలలు, సంవత్సరాలు గడిచాయి. ఇతని దీక్ష నిద్రాదేవికి తెలిసింది. ఒక రోజు లక్ష్మణుడి ముందు నిద్రాదేవి ప్రత్యక్షమయింది. లక్ష్మణా, నీ దీక్ష, రాముడిపైన నీకుండే అపారమైన భక్తి, ప్రేమ నన్ను సంతోషపరచింది. నిద్రలేని నీకు అలసట కలగకుండా ఉండాలని నీకు వరమిస్తానని అన్నది. నాకు రాముడి సేవలో ఎప్పుడూ అలసట కలుగదు, నీ దగ్గర నేను వరము పుచ్చుకొంటే నా దీక్షలో, నా వ్రతముపై నాకే సందేహము కలుగుతుంది, అందువల్ల నీ వరము నాకు అక్కర్లేదు అన్నాడు లక్ష్మణుడు. ఇంత దూరము వచ్చాను, కాబట్టి నీకు వర మేదీ యివ్వకుండా నేను వెళ్లకూడదు, ఏ వరమైనా అడుగు, అది నీకిస్తాను అని చెప్పింది. అప్పుడు లక్ష్మణుడు అన్నాడు – సరే, ఇక్కడ నాకు అన్నగారి నీడలో ఏ అపాయము లేదు, అక్కడ నా భార్య ఊర్మిళ ఏమి కష్ట పడుతున్నదో, ఆమెకు కష్టాలేమీ లేకుండా చేయమని అడిగాడు. నిద్రాదేవి సరేనని అయోధ్యకు వచ్చి ఊర్మిళ ముందు నిలిచింది తాను ఆమె భర్త లక్ష్మణుని చూచానని అతడు ఆమెకు కష్టాలేమీ లేకుండా, రాకుండా వరమివ్వ మన్నాడని చెప్పాడని తెలిపింది. అప్పుడు ఊర్మిళ, ఇక్కడ పెద్ద వారి సేవలో నేను నిమగ్నమై ఉన్నాను, నాకేమీ కష్టాలు లేవు, నన్ను తలబోస్తూ అక్కడ లక్ష్మణుడు తన స్వామి కార్యమును సరిగా చేయలేక పోతున్నాడో ఏమో, అండువల్ల లక్ష్మణుడు నన్ను సంపూర్ణముగా మరచిపోయేటట్లు వరమివ్వమని నిద్రాదేవిని అడిగింది. ఒకరికన్నా మరొకరు త్యాగశీలురు గదా ఈ రామాయణ కథలో.
ఊర్మిళను కేంద్రముగా నుంచుకొని హిందీకవి మైథిలీశరణ్ గుప్తా సాకేత్ అనే ఒక కావ్యాన్ని కూడా వ్రాసియున్నాడు. విధేయుడు – మోహన
ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి rama bharadwaj అభిప్రాయం:
01/04/2012 1:31 pm
కృష్ణారావు గారు , మీకు ఊర్మిళాదేవి నిద్ర అన్న పాటని గురించి పల్లెటూళ్ల ల్లోని స్త్రీల సంభాషణల గురించి ఎంత తెలుసునో నాకు అంత గానూ తెలుసును. దాని గురించి మీరు చింత పడనవసరం లేదు. నాకు పరిశీలనానుభవమూ పరిశోధనానుభవమూ సైతం పుష్కళంగానే ఉన్నాయి. అందువలన నా అభిప్రాయాలు నా విమర్శ కి కూడా బలమైన పునాది ఉంటుంది. మీ ఇతర మాటలలో నాకు జవాబు రాయవలసినంత బలమైన అంశం ఏదీ కనిపించలేదు గనక నేను ప్రతిస్పందించడం లేదు.
తహ తహ గారూ !! మీకు మల్లేనే ఆ వ్యాసం లోని ” మనం ” లో నేను కూడా లేను:)
రమ.
ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి lyla yerneni అభిప్రాయం:
01/04/2012 1:05 pm
చాలా బాగా రాసావ్ నారాయణరావ్! చాలా బాగా రాసావు. సెభాష్!
లైలా
ఎందుకు పారేస్తాను నాన్నా! కథారచన గురించి Bhavani అభిప్రాయం:
01/04/2012 5:25 am
వస్తువు, శిల్పం గూర్చి చాసో స్వానుభవ కథనం రచయితలకు మంచి పాఠం. విమర్శకుల అవసరం రచయితలకు ఎంత వుంటుందో కూడా చాసో చక్కగా సూచించారు. మళ్ళీమళ్ళీ చదువుకోవాలనిపించే ఈ వ్యాసం అందించిన అందరికీ ధన్యవాదాలు.
ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి TahaTaha అభిప్రాయం:
01/04/2012 2:23 am
“ఊర్మిళ గురించిన ప్రస్తావన వాల్మీకి రామాయణంలో ఒక్కచోట మాత్రమే కనిపిస్తుంది. సీతను రాముడికిచ్చి పెళ్ళి చేసినప్పుడు సీత చెల్లెలయిన ఊర్మిళను లక్ష్మణుడికిచ్చి పెళ్లి చేశారు అని వాల్మీకి రామాయణంలో ఉంది. ఆ తరువాత ఊర్మిళ గురించి వాల్మీకం మనకేమీ చెప్పదు.
వాల్మీకి వదిలేసిన ఊర్మిళని తెలుగు ఆడవాళ్ళు దగ్గరికి తీసుకున్నారు. ఆవిడని గురించి ఒక అందమైన కథ అల్లారు. అడివికి రాముడితో పాటు సీత వెళ్ళిపోతూంటే ఊర్మిళ కూడా లక్ష్మణుడితో పాటు వెళ్తానంటుంది కాని లక్ష్మణుడు దానికి అంగీకరించలేదని మనకి తెలుసు.”
ఈ మనము ఎవరు? [ఈ మనము లోనేను లేను, ఎందుకంటే వాల్మీకి మనకేమీ చెప్పలేదు గనక] వారికి ఈ విషయము ఎలా తెలుసు? ఇది చూసింతర్వాత చదవ బుద్ధి వెయ్యలేదు గానీ చదివాను.
ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి Krishna Rao Maddipati అభిప్రాయం:
01/04/2012 12:45 am
రమ గారు,
మీ ప్రతి వాదనతో నాకేమీ పేచీ లేదు గానీ, పాట గొంతు స్త్రీలది (నాలాంటి వాడు పాడితే వింటే ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి నాకే భయంగా ఉంది సుమండీ!), మీరన్నట్టుగా పాడినవారంతా స్త్రీలే. రాసిన వారెవరో పరమాత్మునికెరుక. ఉన్న పరిస్థితులను బట్టి నారాయణరావు గారు అది కవయిత్రి విరచితమేనని అభిప్రాయపడ్డారు. అది ఊహాజనితమే కావచ్చు. పరిశోధకులు సిద్ధాంతం చేయడానికి కొన్ని ఆధారాలు తీసుకుంటారు. కేవలం ఖండించాలి కాబట్టి సిద్ధంతాన్ని ఖండించడం కంటే తగిన ఆధారాలతో ఖండించడం సబబు అనుకుంటాను.
పురుషులు ‘ఆడవాళ్ళ ప్రపంచాల’ మీద ‘అఖ్ఖర్లేని సానుభూతి’ – damned if you do, damned if you don’t! నారాయణరావు గారు కాకుండా ‘నారాయణమ్మ’ గారు ఇదే వ్యాసాన్ని రాస్తే మీకు అభ్యంతరం ఉండదనిపిస్తోంది నాకు.
మీకు పల్లెటూటూరి స్త్రీల నర్మగర్భ సంభాషణలతో ఎంత పరిచయం ఉందో నాకు తెలియదు (తెలియకుండా ఊహించే సాహసం చేసే ధైర్యం కూడా లేదు!). అప్పట్లో తెలియలేదు గానీ, స్త్రీలు బహిరంగంగా వ్యక్తం చేయలేని అభిప్రాయాలని పరోక్షంగా (నారాయణరావు గారు ఉదహరించినట్టుగా) ఎంత స్పష్టంగా చెప్పుకునేవారో ఇప్పుడు తీరిగి ఆలోచిస్తే జ్ఞానోదయంతో ఒళ్ళు పులకరిస్తుంది. (మందమతిని, ఇంతకాలం పట్టింది, క్షంతవ్యుణ్ణి!). దీనికి ప్రత్యేకమైన ‘ఆధునిక దృక్పధం’ అంటూ నిరసన ప్రకటించడం కంటే, ఇప్పటికైనా ఆధునిక దృక్పధంతో వచ్చిన పరిజ్ఞానంతో అప్పటి స్త్రీల భాషను అర్ధం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా గుర్తించడం మంచిదేమో? మంచి పనికి ఆడవారైతేనేం, మగవారైతేనేం?
‘మంచియన్నది మాలయైతే మాల నేనవుతాను’ (నూట యాభై ఏళ్ళయినా మహాకవి మాటలు బ్రతికే ఉన్నాయనుకుంటున్నాను).
కృష్ణారావు
మహాకవి తెనాలి రామకృష్ణుని ‘పాండురంగ మాహాత్మ్యము’ గురించి Arunachala అభిప్రాయం:
01/03/2012 10:23 pm