పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. పుస్తక పరిచయం: అడవి నుండి అడవికి గురించి Amarendra Dasari అభిప్రాయం:

    11/05/2018 9:23 pm

    రామయ్యగారు…థాంక్సండీ…Pl call Sri Pandurangarao, mattimudranalu 9848015364. He will send.

  2. నవంబర్ 2018 గురించి మోహన అభిప్రాయం:

    11/05/2018 4:20 pm

    ఒక పత్రిక 20 ఏండ్లు నింపుకొన్నాయంటే అది నిజముగా గర్వ కారణమే. ఒక పత్రికను విజయవంతముగా నడపాలంటే దానికి సంస్థాపకుల సంకల్పము, దీక్ష, ధనము, మందిబలము, సంపాదకుల నేర్పు, సునిశిత బుద్ధి, నిష్పక్షపాతము, మున్నగునవి ముఖ్యమైన కారణాలు. తరువాత రచనల స్థాయి, విలువ, గరిమ, పట్టుదల ఎన్నదగినవి. అంటే రచయితలు కూడ ఒక పత్రిక విజయానికి ముఖ్య కారణమే. రచయితలు లేక రచనలు లేవు, రచనలు లేక పత్రికలు లేవు. అన్నిటికన్న ముఖ్యమైనది పాఠకుల ఆదరము. అది లేకుండ ఏ పత్రిక కూడ మనజాలదు. అనగా, సంస్థాపకులు (వీరు దిశను నిర్ణయిస్తారు), సంపాదకులు (వీరు మంచి రచనలను ఎన్నుకొంటారు), రచయితలు (వీరు మంచి రచనలను వ్రాస్తారు), పాఠకులు (వీరు మంచి రచనలను ఆదరిస్తారు) – వీరు నాలుగు మూల స్తంభాలు ఈ పత్రికా భవనానికి. ఒక పాఠకునిగా, ఒక రచయితగా నేను ఈ పత్రికకు ఎంతో ఋణము పడి ఉన్నాను. పత్రిక అభివృద్ధితో వ్యక్తిగతముగా కూడ నేను ముందుకు వెళ్లినాను. నా రచనలపైన పాఠకులు ఇచ్చిన స్పందనలు నాకెంతో ఉపయోగ పడ్డాయి. వారికి కూడ నేను కృతజ్ఞుడినే. ఈ సమయములో పాఠకులు ఇరవై ఏండ్లలో తమను ప్రభావితము చేసిన రచనలు, తమకు నచ్చిన మూడు రచనలను పేర్కొంటే బాగుంటుందని నా అభిప్రాయము. అంతే కాక, వారికి ఇంకా ఎటువంటి రచనలు కావాలో, పత్రికలో ఏయే మార్పు చేయాలో అనే విషయములను కూడ తెలిపితే బాగుంటుంది. నా ఉద్దేశములో పత్రిక సంపాదకులు పాఠకులకోసము ఒక సంచికను దీనికై కేటాయించాలి.

    హార్దిక శుభాకాంక్షలతో, విధేయుడు – మోహన

  3. ఏడు కవితలు గురించి Veluri Venkateswara Rao అభిప్రాయం:

    11/05/2018 4:16 pm

    My sincere thanks to Sri Thammineni Yadukula Bhushan and Sri tahataha for their appreciative, and incisive comments.

    To Sri tahataha: I am always of the opinion that poetry defies translation from one language to another language. That was the primary reason I label all my re-worked poetry from one language to another as ” trans-creations.” (అనుసృజనలు)

    I am glad that you met Saubhgya. When you go to his home, please collect a copy of our dual-language work అవ్యయ, a collection of sixty selected Odia poems from Misra’s poetry volumes, trans-created into Telugu by us.

    I humbly admit that a trans-creator’s work can never be satisfactorily completed.

    When we finally publish ద్వా సుపర్ణా, I will make sure that you would get a copy.

    Regards.

    Veluri Venkateswara Rao.

  4. మాగ్నెట్ గురించి Veluri Venkateswara Rao అభిప్రాయం:

    11/05/2018 3:21 pm

    An attractive poem on memories.
    The last lines,
    “… జ్ఞాపకం ఎప్పుడూ ఆకర్షణే.
    ఆకర్షణ, ఒక జ్ఞాపకమిప్పుడు.”

    make it a brilliant poem.
    Congratulations Manasa garoo!

    Veluri Venkateswara Rao.

  5. నేనొక చిత్రమైన చిక్కుముడి: 1. ఆఖరి కథతో ఆరంభం! గురించి నాగరాజు పప్పు అభిప్రాయం:

    11/05/2018 12:17 pm

    kamesh – glad you picked this up. hopefully that 30 page reading list i prepared is going to be of some use 🙂

    ఈ, ఇది, నేను, నా–మొదలైన సర్వనామాలు ఉపయోగించకుండా, తన గురించి తాను చెప్పుకొనే ఒక తెలుగు వాక్యాన్ని తయారు చేయగలరా?

    “చివర్న క్రియాపదంతో అంతమయ్యేదే సూటైన తెలుగు వాక్యం”

    does this qualify?

  6. పుస్తక సమీక్ష: బుద్ధ చరితమ్ గురించి Bhaskar Kompella అభిప్రాయం:

    11/05/2018 11:44 am

    తః తః,

    ధన్యవాదాలు.

    నాకు తెలిసినంత వరకూ…
    కొచ్చర్లకోట రామచంద్ర వేంకట కృష్ణారావు అనే పోలవరం జమీందార్ కి Sir Edwin Arnold రాసిన “The Light of Asia” అనే పుస్తకం అంటే చాలా ఇష్టం. ఆయన కోరగా, ఒక ఆంగ్ల పండితుడిచేత అర్ధం చెప్పించుకుని రాసారట.

    భాస్కర్

  7. పుస్తక పరిచయం: అడవి నుండి అడవికి గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    11/05/2018 10:51 am

    ప్రియమైన దాసరి అమరేంద్ర గారూ!

    ‘అడవి నుండి అడవికి’ పుస్తకం ఆవిష్కరణ సభలో మీరు చేసినది పరిచయంగా కాదు పున్నమి రేయి పోటెత్తిన సంద్రంలా మమ్మల్ని ముచ్చెత్తింది. “అడవి తల్లికి దండాలు, మా కన్నతల్లికి దండాలు, అడవి చల్లగుండాలా… మా బతు కులు చల్లగుండలా” ఆలాపనను గుర్తుకు తెచ్చింది.

    జయతి లోహితాక్షన్‌ గారి ‘అడవి నుండి అడవికి’ పుస్తకం ప్రింటుకాపీ కానీ, e-బుక్కు కాపీ కాని ఎక్కడ దొరుకుతుందో తెలియజెయ్యరా? (నవోదయ బుక్ హౌస్ కాచీగూడా వారి వెబ్ సైట్ లో కాని, కినిగే వారి వెబ్ సైట్ లో కానీ పుస్తకం వివరాలు లేవు).

    పోనీ యీ క్రింది అడ్రెస్ తో సంప్రదించి పుస్తకం తెప్పించుకునే సదుపాయం ఉన్నదా?

    జయతి లోహితాక్షన్‌,
    “మట్టిముద్రణలు”
    ఆలగడప, మిర్యాలగూడ,
    నల్లగొండ జిల్లా,
    తెలంగాణా – 508 207

  8. నవంబర్ 2018 గురించి హెచ్చార్కె అభిప్రాయం:

    11/05/2018 9:30 am

    ‘ఈ మాట’ పయనం వెనుక వున్న అందరికీ మనసారా అభినందనలు, శుభాకాంక్షలు.
    దాదాపు మొదటి నుంచి నాకు ‘ఈమాట’ తెలుసు. ఇటీవలి కాలంలో ఎక్కువగా చూస్తున్నాను.
    బాగా మొదట్లో ఈమాట లో కాలమ్ రాయాలని వేలూరి గారు అడిగారు. ‘ఈనాడు’ లో వుండగా.. చాల జాగర్తగా పొయెమ్స్ మాత్రం మారుపేరుతో అచ్చేసే వాడిని, మరెక్కడా సృజనాత్మక రచనలు చేసే వాడిని కాదు, అది నిబంధన… అందువల్ల కాలమ్ కోసం డబ్బు ఇస్తామని కూడా వేలూరి గారు అంటే లోలో నవ్వుకున్నాను.. కుదరలేదు. అమెరికా వచ్చాక కొన్ని సార్లు నా కవిత్వ ప్రచురణకుఈ వేదికను వుపయోగించుకున్నాను. అందువల్ల ఇవి కృతజ్ఞతా పూర్వక అభినందనలు కూడా.

  9. పుస్తక సమీక్ష: బుద్ధ చరితమ్ గురించి తః తః అభిప్రాయం:

    11/05/2018 1:03 am

    భాస్కర్ మీకు అభినందనలు – తిరుపతివేంకట కవులు వారి అనువాదానికి అర్నాల్డ్ ను మూలంగా స్వీకరించటానికి గలా కారణాలెటువంటివో ఊహించగలమా? (తిరుపతి కవులు, కవులేగానీ పండితులు కారన్న వెల్చేరువారి వాదానికి యీ విషయం కొంత బలం చేకూర్చే అవకాశం కల్పిస్తున్నాదేమో!).

    తః తః

  10. గాయకులుగా సంగీత దర్శకులు గురించి Raghavendra అభిప్రాయం:

    11/04/2018 10:46 am

    ఎప్పటిలాగే శ్రీనివాస్ గారి వ్యాసం వారు ప్రస్తావించిన అంశాలను తరచి ఇంకా తెలుసుకొనే ఆసక్తిని రగిలించింది. ఇది ఒక రచనకుగానీ, ప్రసంగానికిగానీ ఉండవలసిన మంచిలక్షణమని నేను నమ్ముతున్నాను.