పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. రెక్కలావు గురించి suryanarayana pudipeddi అభిప్రాయం:

    01/03/2019 6:37 am

    లెక్కల్రావు అని చదివా…, మంచి టైటిల్ దొరికింది నా కథకి… బెమ్మాండమైన కాన్సెప్ట్ రెక్కలావు. గబగబా అనండి రెక్కలావు లెక్కలావు..

  2. నాకు నచ్చిన పద్యం: శబ్దాలంకారపు సంగీత మాధుర్యం గురించి Markandeyulu అభిప్రాయం:

    01/03/2019 6:19 am

    ఆడియో ఇక్కడ వినవచ్చు:
    గూగుల్ డ్రైవ్ లో లలనా జనాపాంగ

  3. వాడుక భాష: రచనకు కొన్ని నియమాలు గురించి Dr. Y. Kameswari అభిప్రాయం:

    01/03/2019 4:49 am

    వెలలేని ఈ పుస్తకం ఇచ్చినందుకు ధన్యవాదాలు.

  4. రెక్కలావు గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    01/02/2019 7:54 pm

    ప్రముఖ కవి, కథకుడు దాట్ల దేవదానం రాజు గారిచ్చిన ప్రోత్సాహంతో రెట్టించిన ఉత్సాహంతో తెలుగు కధా సాహిత్య రంగంలో రెచ్చిపోతున్న చిరంజీవి వర్మ గారండీ ఏం రాసారండి ” రెక్కలావు ” అంటూ. నేటి సమాజాన్ని ఎంతలా చూస్తే ఇలా రాయగలరండి.

    అందుకేనేటి త్రిపుర గారి ఆప్తమిత్ర, నాటి తరం కధకులు పెద్దలు భమిడిపాటి జగన్నాధరావు గారు ( “ఆయనకు కథ గురించి తెలుసు. కథకుల గురించీ తెలుసు. అంతేకాక మనుషుల్లోని మంచి, చెడ్డల్ని తనదైన విలక్షణ అవగాహనతో లోతుగా అర్థం చేసుకోవడం తెలుసు” అనిపించుకున్న వారు ) మీ కధలంటే ఉహూ తెగ ముచ్చట పడి పోతున్నారు.

    యీ “రెక్కలావు” కధలో మీరు చేసింది అష్టావధానం కాదు, వేయిచేతుల కార్తవీర్యాజునుడి లా శరసంధానం. గంగిగోవూ, కామధేనువూ లాంటిదైన తెలుగు తల్లి, సరస్పతి తల్లి దీవెనలు మీ శిరస్సు పై మెండుగా కురుస్తున్నాయి.

  5. వనమయూరము గురించి మోహన అభిప్రాయం:

    01/02/2019 12:55 pm

    నాలుగు శీరుల (గణముల) వృత్తములయందలి ఒక ప్రత్యేకత వనమయూరమును బోలినది. దీనిని ఎనిమిదవ శతాబ్దములో తిరుజ్ఞానసంబందర్ తేవారములో కొన్ని పద్యములుగా వ్రాసెను. అందులో నొకదానిని క్రింద ఇచ్చినాను. ఇది చివరి క్షణములలో నేను చూచినాను. అందువలన వ్యాసములో ఉంచడానికి వీలు లేక పోయినది.

    నాలుగు శీరుల వృత్తపు అమరిక – కూవిళంగాయ్/కూవిళంగాయ్ – కూవిళంగాయ్/తేమా

    కూవిళంగాయ్ – నేర్-నిరై-నేర్ – గో-ధన-గో – UIIU, UIUU, UIII, UIUI
    తేమా – నేర్-నేర్ – గో-గో – UU, UI

    ఈ అమరికలో కూవిళంగాయ్ గణమునకు UIII, తేమా గణమునకు UU ఎంచుకొనబడినవి. అక్కడక్కడ ఇతర గణములు కూడ ఉన్నాయి. కాని పాడేటప్పుడు వనమయూరపు లయయే. పద్యమును చదివి (తెలుగులో కూడ), పాటను ఇక్కడ విన వీలగును –

    முன்னிய கலைப்பொருளு மூவுலகில் வாழ்வும்
    பன்னிய வொருத்தர்பழ வூர்வினவின் ஞாலந்
    துன்னியிமை யோர்கள்துதி செய்துமுன் வணங்குஞ்
    சென்னியர் விருப்புறு திருப்புகலி யாமே.
    – திருஜ்ஞானசம்பந்தர் தேவாரம், 2.029

    మున్నియ కలైప్పొరుళు మూవులగిల్ వాళ్వు’మ్
    పన్నియ వొరుత్తర్బళ’ వూర్వినవిన్ ఞాలం
    దున్నియిమై యోర్గళ్ తుది శెయ్దుమున్ వణంగుం
    జెన్నియర్ విరుప్పుఱు తిరుప్పుగలి యామే
    – తిరుజ్ఞానసంబందర్ తేవారం, 2.029

    బహుపురాతనమైన చతుషష్టికళలయందలి సూక్ష్మమైన విషయములను, తీవ్రముగ ఆలోచించిన పిదప, ముల్లోకములను జీవమును పోసి, కాపాడి, అంత్యమున అంతమొందించి, పునరుద్ధరణచేయు విశిష్టమైన ఒకే ఒక్క దైవముగా విరాజిల్లు ఆ పరమేశ్వరుని ఊరు ఏదని ప్రశ్నించినచో, భూమికి దిగివచ్చి, తనను మొట్టమొదట కొనియాడి పూజించు దేవతలశిరస్సులపైనుండు ఆతడు మక్కువతో వెలసి అనుగ్రహించుచున్న తిరుప్పుగలి అనబడు స్థలమే అగును.
    (శశికళ దివాకర్ అనువాదము)

    విధేయుడు – మోహన

  6. నేనొక చిత్రమైన చిక్కుముడి: 3. తార్కికంగా తర్కాన్ని తోసిరాజన్న తర్కం గురించి indrakanti pinakapani అభిప్రాయం:

    01/02/2019 9:24 am

    అంటే అర్థం కావడం కాకపోవడం అనేవి ఇటువంటి వ్యాసాలకు వర్తించవని మీ ఉద్దేశ్యమా నాగమురళి గారూ !వినేవాడికి చెప్పేవాడికి కూడా అర్థం కానిదే వేదాంతం అన్న నానుడి గుర్తొస్తూంది. కానీ భైరవభట్ల గారి “ఎడమ నేను” కు మాత్రం తాను చెప్పదలుచుకున్న విషయమ్లో చాలా స్పష్ఠత ఉన్నట్లు నాకు స్పష్ఠమైంది.

    ఇక్కడ నాకు మరో రెండు లాజిక్కులు గుర్తుకొస్తున్నాయి. మా మేనల్లుడొకడు చాలా చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు తను లేస్తే తన సీట్లో మరొకరు కూచోకుండా “ఈ సీట్లో కూచున్నవాడు పంది” అని ఒట్టు పెట్టే వాడు. వెంటనే వాడికి గుర్తుకు వచ్చేది తరవాత తనే అక్కడ కూచోవాలని ! కాబట్టి ఆ ఒట్టుకు “నా తప్ప” (నేను తప్ప) అని చేర్చేవాడు. మన నిత్యజీవన వ్యవహారాల్లో చాలా వాటికి ఇలా “నా తప్ప”ను అధ్యాహారం గా చేర్చుకోవాలనుకుంటాను. “మనవాళ్ళుట్టి వెధవాయిలోయ్”అని గిరీశం అన్నప్పడు తానెప్పుడూ “మనవాడు” కాదని అతని ఉద్దేశ్యం స్పష్ఠం గా తెలుస్తూనే ఉంటుంది.

    మరోటి నేను గవర్నమెంటులో పని చేస్తున్న నాటి సంగతి. ఒకతను నా సహోద్యోగి గవర్నమెంటు వాళ్ళందరూ అవినీతి పరులండీ అనేవాడు. మనం పొరపాటున అదేంటండీ అలాగంటారు ! మీరూ గవర్నమెంటు వాళ్ళే గదా అనో లేకపోతే వాళ్ళలో కూడ మహానుభావులుంటారు అని “బైరాగి” లెవల్లోనో మాట్లాడామా ! అతని ఉద్దేశ్యం లో మనం మొదటి గవర్నమెంటు వాళ్ళమైపోతాము ! అలా కాకుండా వినయంగా అవునండీ నిజమే ! అంటేనే మనకు ఈ గవర్నమెంటు ( e- government కాదండోయ్ !) వాళ్ళనుండి మినహాయింపు లభిస్తుంది. ఆయన ఏదో కనుక్కున్నట్లు మనకే వచ్చి చెప్తున్నాడంటేనే తననూ మననూ మినహాయించి చెబుతున్నాడనే కదా ! if you negate it, you will be it. అదన్నమాట లాజిక్కు.

  7. నాకు నచ్చిన పద్యం: శబ్దాలంకారపు సంగీత మాధుర్యం గురించి indrakanti pinakapani అభిప్రాయం:

    01/02/2019 8:21 am

    అద్భుతమైన ఈ పద్యాన్ని చదివినపుడల్లా నాకు ఒక విషయం బలంగా అనిపిస్తుంటుంది. మధు మాస వాసరములు అని నపుంసక లింగం చేయబట్టి ప్రతి విశేషణం బిందు పూర్వకం గ ఉండాల్సి వచ్చింది. దానిని తరువాతి పాదమ్ లోని పదంతో సంధి చేసి run on verse గా నిర్వహించాల్సి వచ్చింది. ప్రతి పాదమూ విడివిడిగా అద్భుతమైన పంచమాత్రా గతిలో తూగుతూ నడుస్తున్నా చివరి కొచ్చే సరికి పాదాంతం లో పదాంతం కానందు వల్ల గతి కుంటుబడింది. ఇదే పద్యం ఏ మధుమాస లక్ష్మి గానో స్త్రీలింగంతో ఉన్నట్లయితే ప్రతి పాదమూ “లలనా జనాపాంగ వలనా వసదనంగ తులనాభికాసంగ దో: ప్రసంగ” ఇత్యాదిగ తెగి చదువుకోవడానికి, పాడడానికి కూడా ఎంతో బాగుండేది. ఇప్పుడు ఉన్న స్థితిలో గతి చెడకుండా దానిని పాడడం కష్టమే!

    ” లలనా జనాపాంగ వలనా వసదనంగ తులనాభికాసంగ దో: ప్రసంగము – అలినీ గరుదనీక ” ఇట్లా విరవాల్సి వస్తుంది. దీని వల్ల రాజన్న కవి గారి లాంటి కొందరు దో: ప్రసంగమూ… అని రాగంతీసి చదివేవారు. దానివల్ల సహజంగా పద్యం లోని లయ కాస్తా రాగంతో కప్పబడి పోతుంది. లేదా”దో:ప్రసంగమలినీ గరుదనీక….” అని గుక్క తిప్పుకోకుండా చదివి గతిని పోషించ వచ్చు. కానీ ఇది చాలా కష్టం. ఎందుకంటే ఒక్క పాదం కాదు ఎత్తుగీతి లో మొదటి పాదం వరకు ఇలాగే ఆపకుండ చదవాల్సి ఉంటుంది.

    ఇలా కాకుండా “శృత్యంత విశ్రాంత మత్యనుక్రమణీయ భగవత్ప్రసంగతుల్ భాగవతులు” ఇలా ఏ పాదానికి ఆ పాదం తెగుతూ ఉంటే (లలనాజనాపాంగ లోని అనుప్రాసలు ఇందులో లేకపోయినా) ఎంతో హాయిగా ఉండేది. వాస్తవానికి రామరాజ భూషణుడే అనుప్రాసలతో సహా ఏ పాదానికి ఆపాదం తెగి పోయేట్లు ఎన్నో పద్యాలు నిర్వహించాడు. చీమలమర్రి వారు అటువంటి వాటిని ప్రస్తుత వ్యాసం లోనే ఉదాహరించారు కూడా. ఎటొచ్చీ లలనా జనాపాంగ పద్యం అలాంటిది కాలేక పోయిందనే నా బాధ! మంచి పద్యాన్ని మరో సారి గుర్తు చేసినందుకు రచయితకు నా ధన్యవాదాలు.

  8. తలుపు – ఒక ముగింపు గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    01/02/2019 6:04 am

    ఇదొక చమత్కారము. తలుపు వాళ్లిద్దరి కధ చెప్పడం. గోడలు చెప్పిన కథలు కూడా ఉన్నాయి. కాని ఈ కధలో ఒక తాత్వికత ఉంది.

  9. బేతాళ కథలు: కథన కుతూహలం-8 గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    01/02/2019 6:00 am

    కధలని మీరు పరిశీలిస్తున్న తీరు ఆసక్తి దాయకంగా ఉంది. ఈ పరిశీలనా వ్యాస పరంపరని క్రోడికరించి చూడాలి. ఆ ఫలితాలు ఇంతే ఆసక్తికరంగా ఉండవచ్చు.

  10. త్యాగరాజయ్య సాహిత్యము: సాహిత్యమును వెనుకకు నెట్టి నూతన సృష్టి చేసిన త్యాగయ్య గానప్రతిభ గురించి తఃతః అభిప్రాయం:

    01/02/2019 5:41 am

    1.”…. ‘సంగీత సాహిత్యములు’…….., ‘అనేక కృతులలో ‘ రెండును చేయి చేయి పట్టుకొని అపూర్వ సౌహార్దముతో ఏకాగ్రముగా రూపుగొన్న అద్భుత దృశ్యమును మనకు త్యాగయ్య ఎత్తి చూపఁగలిగినాఁడు’. ‘పలుకు పలుకులకు తేనెలొలుకు’ కృతులు అతనివెన్నో కలవు. ఆ తేనెలు మాటలవో, పాటలవో చెప్పలేము. ఎందుకనగా అవి రెండును మేళగించి దింపిన రసాయనములు”.

    2. “కాని మొత్తముమీఁద త్యాగయ్య ‘నాద విద్యా మర్మములను’ గమనించినంత మెలుకువతో శబ్ద రచనా రహస్యములను గమనింపలేదనుట మనము కనుఁగొనఁగలము. భావముల గొప్పతనమునకు సరిరాలేక ఎన్నో చోట్ల అతని భాష తంటాలుపడుచున్నది”

    1. 2. లలో గల వైరుధ్యాల తో ‘మొత్తము మీద’ ఈ వ్యాసము బాగుగా నున్నది.
    తః తః