పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. ముక్కలయిన వాస్తవం: సిగిౙ్మండ్ క్రిజ్‍జనావ్‍స్కీ గురించి VarmA అభిప్రాయం:

    02/01/2019 8:14 am

    ఎక్స్‌లెంట్!

  2. గడినుడి – 28 గురించి subha అభిప్రాయం:

    02/01/2019 7:58 am

    గడి నుడి ప్రింటు చేసుకునే సౌకర్యం వుంటే బాగుంటుంది.

  3. వనమయూరము గురించి చంద్రహాస్ అభిప్రాయం:

    01/31/2019 7:16 pm

    ఎప్పటి లాగే అనేక కొత్త చందోసంబంధ విషయాలను పరిచయం చేస్తున్నారు, ధన్యవాదాలు మోహనరావు గారు! మిశ్రగతి ఝంపె తాళం అన్నచోట మిశ్రజాతి ఝంపె తాళం అని చెప్పడం మీ ఉద్దేశం అనుకుంటాను.

  4. నేనొక చిత్రమైన చిక్కుముడి: 3. తార్కికంగా తర్కాన్ని తోసిరాజన్న తర్కం గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    01/30/2019 11:49 am

    >>మీర్రాసినది నాకర్థమైందనీ కాదు.
    >>అర్థం కాలేదనీ కాదు.
    >>అర్థం అయిందీ, అర్థం కాలేదూ అని కూడా కాదు.
    >>అర్థం అయిందో కాలేదో చెప్పలేను అనీ కాదు

    ఇందులో మొదటి రెండు లైన్లలో ఉన్నవాటికీ మూడో లైన్లో ఉన్న దానికీ ఏమిటండీ తేడా? ఇదేదో నేను, అసలు-నేను, ఎడమ-నేను, కుడి-నేను లాంటిదా?

  5. గాయకులుగా సంగీత దర్శకులు గురించి Venkata S Vutukuri అభిప్రాయం:

    01/27/2019 12:12 am

    Thanks Srinivas Garu for your very interesting article. I am giving here some additional information.

    Balamuralikrishna composed some songs in Satee Savitri (1957) Film. He also composed songs for the film – Thodu (1997). For Bhagavadgita (1993) (Dubbing) Film, he composed 56 Slokamulu.

    It appears M Subrahmanya Raju did not sing any Film Songs.

    Susarla Dakshinamurty sang about 21 songs in 12 Telugu Films, namely, Palnati Yuddham (1947), Leila Majnu (1949), Paramandayya Sishyulu (1950), Samsaram (1950), Sri Laksgmamma Katha (1950), Sarvadhikari (1951), Stree Sahasam (1951), Attinti Kapuram (1952), Santhanam (1955), Harischandra (1956), Ilavelupu (1956) and Bhale Bava (1957).

    J V Raghavulu has about 24 songs in 19 Telugu Films – Sontavuru (1956), Pelli Sandadi (1959), Bhakta Raghunath (1960), Krishna Prema (1961), Paduka Pattabhishekam (1966), Sakunthala (1966), Chadarangam (1967), Rahasyam (1967), Rangula Ratnam (1967), Sri Krishnavatharam (1967), Papa Kosam (1968), Drohi (1970), Sambarala Rambabu (1970), Kannatalli (1972), Manassakshi (1977), Savasagallu (1977), Mouna Geetam (1981), Athaku Thagga Alludu (1982) & Tharangini (1982).

    S P Kodandapani has 2 songs – 1 in Yekaika Veerudu (1962) and 1 in Pandanti Kapuram.

  6. చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి 2 గురించి తః తః అభిప్రాయం:

    01/25/2019 3:02 pm

    ఇప్పటికి కూడా తెలుగు భాష కవిత్వం, కథలు, నవలలు రాసుకునే భాష అయింది కానీ కొత్త ఆలోచనలు తయారు చేసే భాష కాలేదు.

    ఇందులో తెలుగు భాష చేసిన పాపం ఏమీ లేదు. (ఈ రచయితలే తెలుగులో ఆనాళ్లల్లో వచ్చిన శాస్త్రగ్రంథాలను పేర్కొని ‘ఇప్పటికి కూడా’ అనటం ఎందువల్లనో).

    అయినా, దీనికి తెలుగు సమాజములో చోటు చేసుకున్న సాంఘిక, రాజకీయ పరిణామాలే ఎక్కువగా కారణం. సాంఘిక విలువలు మార్పుచెంది ‘Value for money’ అన్నది తెలుగు వారి నరనరాల్లోకీ పాకటం, ఐ టి లో ఆంధ్రులు అద్భుతాలు సాధిస్తున్నారంటూ రాజకీయ ప్రయోజనాల కోసం గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న ప్రచారంతో మొలకెత్తిన అపోహల విత్తనాలు వృక్షాలుగా ఎదిగి యువతను చదువు నుంచి దూరం చేయటం. తెలుగు సమాజం లో శతాబ్దాలుగా నెలకొన్న బ్రాహ్మినికల్ వాల్యూస్ నుంచి (బ్రాహ్మణేతరులు శంకరాద్వైత గ్రంథాలను తెలుగు చేయటం నాకు తెలుసు) సమాజాన్ని మళ్ళించిన ఉద్యమాలు అంతటితో ఆగిపోయి, ఉన్నతమైన కొత్త విలువలను అందివ్వలేక రాజకీయ వాణిజ్యానికి దాసోహమనటం సినిమా దానికి వత్తాసు పలకటం వంటివి. రచయితలు ఈవిషయాలను గమనించలేకపోవటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించదు.

    తః తః

  7. చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి 2 గురించి Raghavendra అభిప్రాయం:

    01/24/2019 9:24 pm

    తెలుగులోనికి మారుస్తున్నామంటూ వేరే భాషలో రాయటం దగాకాక వేరేమిటి? వందల ఏళ్ళుగా సాగుతున్న ఈ సెబ్బర ద్రోహచింతనతో కాకపోవచ్చు. ఇతర భాషలలోని పదాలు అనువదించుకొనేటపుడు పదాన్ని కాక అర్ధాన్ని అనువదించుకుంటే మంచిపదాలు తట్టవచ్చు. స. వెం. రమేశ్ గారు తన “ఎల్లలు లేని తెలుగు”లో మంచి మచ్చులు చూపారు.

  8. మరణ మృదంగం గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    01/24/2019 9:30 am

    అందరికీ
    అనువాదం నచ్చినందుకు ధన్యవాదాలు. ఇలా అనువాదం సరిగ్గా రావడానికి కారణం ఈమాట ఎడిటర్ మాధవ్ మాచవరం గారే. నేను రాసినది, ఎలా ఉండాలో ఉండకూడదో చెప్పి నా చేత సరిగ్గా రాయించారు మొదటినుండీ. అందువల్ల – కథ బాగుంటే అది టాల్ స్టాయ్ గొప్పదనం, అనువాదం సంపాదకుల గారి ప్రోత్సాహం వల్లాను. మాధవ్ గారికి కృతజ్ఞతలు.

    మొదటి సారి కుదించి రాసినప్పుడు దాన్ని సవరించమని చెప్పడం వల్ల రెండో సారి దాదాపు ముక్కస్య – ముక్కార్ధ అన్నట్టూ చేసాను. అలా రెండో సారి చేసినప్పుడు మాత్రం చాలా సార్లు కథలో భావానికి వెన్ను వణికింది అనేది ఒప్పుకోవల్సిందే.

    ఇంకో విషయం. ఈ కథని అమెరికాలో కొన్ని మెడికల్ కాలేజీలలో పాఠ్యాంశంగా వాడతారు అని ఒక డాక్టర్ అన్నారు. ప్రస్తుతం అమెరికన్ జనాభాలో వయోవృధ్ధులు (ఒకప్పటి బేబీ బూమర్స్) ఎక్కువ అవుతుంనందువల్ల ఈ కధకి మరింత ప్రాధాన్యత అని అన్నారు.

    తా. క. ఈ కథలో నా పేరు మీద నొక్కితే మిగతా టాల్ స్టాయ్ అనువాదాలు చూడవచ్చు.

  9. శ్రీనాథుని చాటుపద్యములు గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    01/22/2019 11:43 am

    వావిళ్ల వారు ప్రచురించిన కాశీఖండం ఇక్కడ దొరుకుతుంది –
    https://archive.org/details/in.ernet.dli.2015.329251

  10. చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి 2 గురించి Bhaskar Kompella అభిప్రాయం:

    01/21/2019 2:01 pm

    మద్దిపాటి గారూ,

    ఇది కేవలం సాంకేతిక పదజాలాన్ని తయారు చెయ్యటానికి పూనుకున్న వారి బద్ధకం, నిర్లక్ష్యం, అంతకు మించి తెలుగుకు చేసిన (చేస్తున్న) ద్రోహం.

    కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, డచ్ మొదలైన భాషలు మాట్లాడేవాళ్ళకి కూడా amphiphloic siphonostele అన్నది కొరకరాని కొయ్యే. ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, డచ్ వాళ్ళందరికీ గొప్ప గ్రీక్, లాటిన్ పాండిత్యం ఉందని కాదు. గ్రీక్, లాటిన్ వాడకపోతే వాళ్ళకి కూడా మొత్తం అర్ధాన్నిచ్చే సంక్షిప్తమైన పదం వాళ్ళ భాషల్లో లేదు. కాబట్టి, వాళ్ళు కూడా అవసరం కొద్దీ మాత్రమే వాడతారు. మెల్లమెల్లగా అలవాటు పడతారు. కొత్తపదాల్ని నేర్చుకున్నట్టే ఈ పదాల్ని కూడా నేర్చుకుంటారు. వీలైతే ‘pseudopodia’ లాంటి గ్రీక్ పదానికి సులువైన అనువాదం కుదిరినప్పుడు “False Feet” అని రెండో అర్ధం చెప్పుకుంటారు.

    amphiphloic siphonostele లాంటి పదాలు యథాతథంగా తెలుగులో రాసెయ్యాలా? లేకపోతే సంస్కృతభాషలోకి తర్జుమా చెయ్యాలా? అన్నదానికి అప్పటి అకాడెమీ సభ్యులు సంస్కృతభాషలోకి తర్జుమా మంచిది అని ఆశించి ఉండవచ్చు.

    యురోపియన్ భాషలవాళ్ళకి గ్రీక్ లాటిన్ గతి అయితే, మనకి సంస్కృతం గతి అయింది. అంతేకాని, ‘బద్ధకం, నిర్లక్ష్యం, అంతకు మించి తెలుగుకు చేసిన (చేస్తున్న) ద్రోహం’ ఏమీలేదు. తెలుగుకున్న పరిధులవల్ల ఇలా చెయ్యకతప్పలేదు. అంతకన్న బాగా చెయ్యలేమా అంటే, చెయ్యచ్చేమో. అకాడెమీ పుస్తకాల్ని విమర్శించినవాళ్ళే గాని, మంచి పదజాలంతో పుస్తకాలు రాసినవాళ్ళు లేరు. ఎందుకంటే వాటికి అమ్మకాలుండవని మనరచయితలకి తెలుసు.

    మొదట్లో పరిభాషని standardize చెయ్యడానికి ఎన్ని కష్టాలు పడ్డారో గమనించగలరు.

    ఎన్నో గ్రీక్ లాటిన్ పదాలు మనభాషలో సొగసుగా ఒదిగిపోతే అలాగే వదిలేసారు.
    ఉదాహరణలు: రేడియో ధార్మికత, క్వాంటీకరణం etc.

    ఏ శాస్త్రాధ్యయనంలోనైనా, పరిభాషని నేర్చుకోక తప్పదు.

    బహుభాషారాష్ట్రాలున్న భారతదేశంలో మాతృభాషల్లో విద్యాబోధన జటిలమైన పని. 90% ఉద్యోగాల్లో మాతృభాషని వాడలేము. అందువల్ల ఈ ప్రక్రియకి ఆదరణ లేదు.

    అన్నిటికన్నా విచారించవలసిన విషయమేమిటంటే, 70వ దశకం వరకూ, తెలుగువాళ్లకి పిండిపదార్ధం, మాంసకృత్తులు, జీర్ణకోశం, లాలాజలం, కాలేయం, ప్లీహం లాంటి పదాలు చక్కగా అర్ధమయ్యేవి. ఇప్పుడు మంచినీళ్ళు, ఉప్పు, చక్కెర లాంటివి కూడా కొందరికి అర్ధంకావటల్లేదు.