చిన్నప్పుడు పడ్డ వాతలు చితిదాకా పోవు. ఎవరు ఎంత నీతిమంతులని తర్వాత తెల్సినా, తెలియజేద్దామనుకున్నా సరే. కుర్రాడు బాగా చదివేవాడిని, ఆ డబ్బుల్తో సినిమాకి వెళ్ళావేమో అంటే తగిలే దెబ్బ “అతి” దారుణంగా తగుల్తుంది – రచయిత చెప్పినట్టూ. ఐతే మన మేష్టర్లు మాత్రం తమ నోటికొచ్చిన ప్రేలాపనలు, తమ పరిథిలో తమకి తెల్సిన, నేర్చుకున్న పేలుతూ ఉంటారు. ఒక్కసారి మేష్టారు ఓ కుర్రాణ్ణి కసురుకున్నాక జీవితంలో ఆ మరకని తుడిచేసి ఎప్పుడూ మళ్ళీ అటుకేసి వెళ్ళడం అసంభవం. ” అబ్బే అలా కాదురా నువ్వు బాగ చదూతావని అలా అన్నా” అని ఈ మేష్టర్లు మాటలు మార్చినా సరే. ఎవరో “అతి తక్కువ” కొద్ది మంది తప్ప అసలు మనకి పాఠాలు చెప్పే మేష్టర్లలో ఎవరికీ కూడా కసురుకోకుండా, తిట్టకుండా, కొట్టకుండా స్కూల్లో పాఠాలు చెప్పడం రాదు. వాళ్ల జీవితాల్లో జరిగే కష్టనష్టాలకి కుర్రాళ్ళే కారణం అన్నట్టూ కుర్రాళ్లని కొడుతూ ఏదో పైశాచికానందం పొందుతారనేది జగమెరిగిన సత్యం. ఇప్పటికీ స్కూళ్లలో పిల్లల్ని కొడుతూ ఆ కుర్రాళ్ళు తెలివి తప్పి పడిపోవడం లాంటి కథలు రోజూ పేపర్లలో చదూతూనే ఉన్నాం. ఈ కథలో ఉద్యోగం పోయిన నువ్వు అనే కుర్రాడు ఏ మాత్రం బాథ పడాల్సిన పని లేదు. ఎందుకంటే కాంప్లెక్స్ గా ఉన్నది మిగతావాళ్ళు.
అన్నింటికన్న దురదృష్టం ఏమిటంటే – యూ నీడ్ టు గ్రో అప్ అనేది మన అలుసు చూసి అవతలవాళ్లు ఆడుకునే పెద్ద ఆట. అటువంటి స్టీవ్ ని కూడా జీవితంలోంచి తుడిచిపారేయడం చేయాల్సిన మొదటి పని. ఇటువంటి స్టీవ్ లు వెన్నుపోటు పొడిచే గోముఖ వ్యాఘ్రాలు. అది చివరి వరకూ తెలుసుకోకపోవడం కథానాయకుడి చేతకానితనం/అమాయకత్వం తప్ప అతను చింతించాల్సిన అవసరం “అస్సలు” లేదు.
మరో విషయం. అమెరికాలో ఉద్యోగాలు తీసేస్తూంటే, ఎవరింట్లో ఎవరికి కేన్సర్ ఉంది, ఎవరి ఆవిడ కడుపుతో ఉందీ అనేవి అస్సలు చూసుకోరు. తీయ్ రాజా తీయ్ అంటూ కొట్టుకుంటూ పోవడమే.
ఈ కథలో కిందనుంచి రెండో వ్యాక్యం అనవసరం అని నాకు అనిపిస్తోంది. ముల్లులా గుచ్చుకోవాల్సినది స్టీవ్ చేసిన వెన్నుపోటు మాత్రమే. కథ మాత్రం బాగా చెప్పారు. రచయితకి అభినందనలు.
పొద్దెరగని పిచ్చగాడిలాగా వెబ్ జైన్స్ ని వెతుక్కుంటూ వెళ్ళి ముందు కధలు చదువుకోవటం నీకున్న అలవాటేగా! అందుకని ఈమాట కి వెళ్లి ముందు కధల కోసం చూస్తావు. అక్కడ ‘నీడ’ కనపడుతుంది. చదవడం మొదలు పెడతావు.
కాలర్ పట్టుకుని లాక్కెళ్తుంది చివరిదాకా. బాగుందిగా అనుకుంటావు.
కింద కామెంట్లేమన్నా ఉన్నాయా అని చూస్తావు. ఏమి ఉండవు. అందరు నీ లాంటి పిచ్చోళ్ళు కాదుగా అనుకుంటావు. ఫేస్ బుక్ కాని చోట్ల చాలమంది కామెంట్ చెయ్యడం లేదు అని కూడా అనుకుంటావు. కధ మీద నీ అభిప్రాయం చెప్పాలనుకుంటావు. ఈలోపు ఎవరిదో ఫోన్ కాల్ వస్తుంది. కామెంట్ చెయ్యడం గురించి మరిచిపోతావు. వేదిక మరొకటో పరుగులో పడతావు. ఈ సారి ఫేస్ బుక్ లోకి వెళ్తావు. అక్కడ న్యూస్ ఫీడ్ లో Siva పోస్ట్ కనబడుతుంది. ఏమిటా అని చూస్తావు. నువ్వు చదివిన ‘నీడ’ మీద అని అర్ధం అవుతుంది. అర్రర్రరే! అని నాలుక కొరుక్కుంటావు. ఒహో శివ ఈ టపా ని సెకెండ్ పర్సన్ నెరెటివ్ రాసాడుగా, కధని బ్రహ్మానందం గారు రాసినట్టుగా అనుకుంటావు. ‘బాగుంది’ అని నవ్వుకుంటావు. తన టపాలో శివ “తల గోక్కోవటం” చూసి కింద కామెంట్ లో జవాబు టైపుదామనుకుంటావు. కాని అప్పటికే కింద కామెంట్స్ లో ఆ కధ రాసిన బ్రహ్మానందం తమాషాగా తన కామెంట్ ని కూడా సెకండ్ పర్సన్ లో పోస్టేసి ఉంటాడు. అరే ఇదేదో బాగానే ఉందిగా అనుకుంటావు. ఇంకెవరు కామెంటారు అని చూస్తావు. శివ సందేహాన్ని నివృత్తిని చేస్తూ మోహన రావు గారి వ్యాఖ్య కనపడుతుంది. మళ్ళీ ఈమాట కెళ్ళి ఆ కధకింద కామెంట్స్ చూస్తావు. ”లాభం లేదు. ఈ సారైనా కమెంటెసెయ్యాలి,” అనుకుని అక్కడ ఈ పెద్ద వ్యాఖ్యన్ని పోస్టుతావు.
‘నీడ’ కధకులు బ్రహ్మానందంగారు,
ఈ వ్యాఖ్య సెకండ్ పర్సన్ నరెటివ్ అవుతుందా? చి న
అమరేంద్ర గారూ! బావుంది మీ ట్రావెలాగ్. రెండు దశాబ్దాల క్రితం, పనుల మీద ఎన్నోసార్లు తిరిగాను. నెలలకొద్దీ ఉన్నాను. అప్పట్లో అంత పరిశీలనగా చూడలేదు. ఇది చదివాక మళ్లీ సందర్శించాలా అనిపిస్తోందంటే మీరు చెప్పిన రీతికున్న బలం తెలుస్తోంది. కొత్తగా వెళ్ళదలచుకున్న వాళ్ళకు, మంచి కరదీపిక మీ ట్రావెలాగ్.
సందర్భోచితంగా ‘హైకూ యాత్ర’ లోని quotable quote ని ప్రయోగించి, మమ్మల్నీ కాస్త సందేహావస్థలో పడేశారు. మీరు మరిన్ని యాత్రలు చెయ్యాలని ఎదురుచూస్తూ…
ఆర్యా! ఉత్తమ పాఠకుడు బహుమతి కోరుతూ మీరు పెట్టుకున్న అర్జీ పత్రాన్ని పరిశీలించిన నో-బుల్ కమిటీ మీ నుండి మరికొన్ని వివరాలు కోరుతున్నారు. వాల్మీకి రామాయణం, కవిత్రయం తెనిగించిన భారతాలు, పోతన భాగవతం, శ్రీనాధుడి నైషధము మీరు చదివిన దాఖలాలు జతచెయ్యగలరు (వీలుంటే పెద్దల సాక్షి సంతకాలతో).
కాళిదాసు, భారవి, భవభూతి బుక్కులు మీవద్ద ఉన్న ఫొటోలు కూడా జతచెయ్యగలరు.
విశ్వనాథ, శ్రీశ్రీ, తిలక్, చాసో, శ్రీపాద, రావి శాస్త్రి లు మీకు ఇష్టులు అనే జగమెరిగిన సత్యానికి …. భౌతిక శాస్త్రం నోబెల్ పురస్కారం అందుకున్న ఖగోళభౌతిక శాస్త్రవేత్త చంద్ర (సుబ్రమణియం చంద్రశేఖర్) ఆత్మకధ (Chandra: A Biography of S. Chandrasekhar by Kameshwar C. Wali) ను చదివిన వారుగా మీకు కొన్ని బోనస్ మార్కులు లభిస్తున్నాయి.
పైన పేర్కొన్న వివరాలు దఖలు పరిచినచో నో-బుల్ పురస్కారం మిమ్మల్నే వరిస్తుందని మా ప్రఘాఢ విశ్వాసం. మీరు అర్జీని ఆమెన్ (Amen) అంటూ ముగించారు. ఎందుకైనా మంచిది ఆమెన్ తో పాటు ఆవుమెన్ (Awomen) అని కూడా అనండి… ఆన్ లైన్ వోటింగ్ కూడా చేస్తాము కాబట్టి మీకు దండిగా వోట్లు దొరుకుతాయి. Insha Allah
నవంబర్ 2019
గురించి Digavalli Suryanarayana Murty అభిప్రాయం:
11/01/2019
3:22 pm
ఈమాట వెబ్ నాకు ఈరోజునే తెలిసింది. తెలుగులో వ్రాయవచ్చునేమో చూద్దామని ఇలా వ్రాస్తున్నా.
ఎడిటోరియల్ చదివాను. బాగుంది. నేను వొక విశ్రాంత సీనియర్ సిటిజెన్. ప్రస్తుతం అమెరికాలో వుంటున్నా.
నీడ గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
11/05/2019 11:20 am
చిన్నప్పుడు పడ్డ వాతలు చితిదాకా పోవు. ఎవరు ఎంత నీతిమంతులని తర్వాత తెల్సినా, తెలియజేద్దామనుకున్నా సరే. కుర్రాడు బాగా చదివేవాడిని, ఆ డబ్బుల్తో సినిమాకి వెళ్ళావేమో అంటే తగిలే దెబ్బ “అతి” దారుణంగా తగుల్తుంది – రచయిత చెప్పినట్టూ. ఐతే మన మేష్టర్లు మాత్రం తమ నోటికొచ్చిన ప్రేలాపనలు, తమ పరిథిలో తమకి తెల్సిన, నేర్చుకున్న పేలుతూ ఉంటారు. ఒక్కసారి మేష్టారు ఓ కుర్రాణ్ణి కసురుకున్నాక జీవితంలో ఆ మరకని తుడిచేసి ఎప్పుడూ మళ్ళీ అటుకేసి వెళ్ళడం అసంభవం. ” అబ్బే అలా కాదురా నువ్వు బాగ చదూతావని అలా అన్నా” అని ఈ మేష్టర్లు మాటలు మార్చినా సరే. ఎవరో “అతి తక్కువ” కొద్ది మంది తప్ప అసలు మనకి పాఠాలు చెప్పే మేష్టర్లలో ఎవరికీ కూడా కసురుకోకుండా, తిట్టకుండా, కొట్టకుండా స్కూల్లో పాఠాలు చెప్పడం రాదు. వాళ్ల జీవితాల్లో జరిగే కష్టనష్టాలకి కుర్రాళ్ళే కారణం అన్నట్టూ కుర్రాళ్లని కొడుతూ ఏదో పైశాచికానందం పొందుతారనేది జగమెరిగిన సత్యం. ఇప్పటికీ స్కూళ్లలో పిల్లల్ని కొడుతూ ఆ కుర్రాళ్ళు తెలివి తప్పి పడిపోవడం లాంటి కథలు రోజూ పేపర్లలో చదూతూనే ఉన్నాం. ఈ కథలో ఉద్యోగం పోయిన నువ్వు అనే కుర్రాడు ఏ మాత్రం బాథ పడాల్సిన పని లేదు. ఎందుకంటే కాంప్లెక్స్ గా ఉన్నది మిగతావాళ్ళు.
అన్నింటికన్న దురదృష్టం ఏమిటంటే – యూ నీడ్ టు గ్రో అప్ అనేది మన అలుసు చూసి అవతలవాళ్లు ఆడుకునే పెద్ద ఆట. అటువంటి స్టీవ్ ని కూడా జీవితంలోంచి తుడిచిపారేయడం చేయాల్సిన మొదటి పని. ఇటువంటి స్టీవ్ లు వెన్నుపోటు పొడిచే గోముఖ వ్యాఘ్రాలు. అది చివరి వరకూ తెలుసుకోకపోవడం కథానాయకుడి చేతకానితనం/అమాయకత్వం తప్ప అతను చింతించాల్సిన అవసరం “అస్సలు” లేదు.
మరో విషయం. అమెరికాలో ఉద్యోగాలు తీసేస్తూంటే, ఎవరింట్లో ఎవరికి కేన్సర్ ఉంది, ఎవరి ఆవిడ కడుపుతో ఉందీ అనేవి అస్సలు చూసుకోరు. తీయ్ రాజా తీయ్ అంటూ కొట్టుకుంటూ పోవడమే.
ఈ కథలో కిందనుంచి రెండో వ్యాక్యం అనవసరం అని నాకు అనిపిస్తోంది. ముల్లులా గుచ్చుకోవాల్సినది స్టీవ్ చేసిన వెన్నుపోటు మాత్రమే. కథ మాత్రం బాగా చెప్పారు. రచయితకి అభినందనలు.
బేతాళ కథలు: కథన కుతూహలం – 5 గురించి Bhaskar Pulicherla అభిప్రాయం:
11/04/2019 10:48 pm
ఇంకో రెండు మధ్యమ పురుష కథలు సెప్టెంబర్ 19 సంచికలో వచ్చాయి కదా!
నీడ గురించి Anil అట్లూరి అభిప్రాయం:
11/04/2019 10:18 pm
పొద్దెరగని పిచ్చగాడిలాగా వెబ్ జైన్స్ ని వెతుక్కుంటూ వెళ్ళి ముందు కధలు చదువుకోవటం నీకున్న అలవాటేగా! అందుకని ఈమాట కి వెళ్లి ముందు కధల కోసం చూస్తావు. అక్కడ ‘నీడ’ కనపడుతుంది. చదవడం మొదలు పెడతావు.
కాలర్ పట్టుకుని లాక్కెళ్తుంది చివరిదాకా. బాగుందిగా అనుకుంటావు.
కింద కామెంట్లేమన్నా ఉన్నాయా అని చూస్తావు. ఏమి ఉండవు. అందరు నీ లాంటి పిచ్చోళ్ళు కాదుగా అనుకుంటావు. ఫేస్ బుక్ కాని చోట్ల చాలమంది కామెంట్ చెయ్యడం లేదు అని కూడా అనుకుంటావు. కధ మీద నీ అభిప్రాయం చెప్పాలనుకుంటావు. ఈలోపు ఎవరిదో ఫోన్ కాల్ వస్తుంది. కామెంట్ చెయ్యడం గురించి మరిచిపోతావు. వేదిక మరొకటో పరుగులో పడతావు. ఈ సారి ఫేస్ బుక్ లోకి వెళ్తావు. అక్కడ న్యూస్ ఫీడ్ లో Siva పోస్ట్ కనబడుతుంది. ఏమిటా అని చూస్తావు. నువ్వు చదివిన ‘నీడ’ మీద అని అర్ధం అవుతుంది. అర్రర్రరే! అని నాలుక కొరుక్కుంటావు. ఒహో శివ ఈ టపా ని సెకెండ్ పర్సన్ నెరెటివ్ రాసాడుగా, కధని బ్రహ్మానందం గారు రాసినట్టుగా అనుకుంటావు. ‘బాగుంది’ అని నవ్వుకుంటావు. తన టపాలో శివ “తల గోక్కోవటం” చూసి కింద కామెంట్ లో జవాబు టైపుదామనుకుంటావు. కాని అప్పటికే కింద కామెంట్స్ లో ఆ కధ రాసిన బ్రహ్మానందం తమాషాగా తన కామెంట్ ని కూడా సెకండ్ పర్సన్ లో పోస్టేసి ఉంటాడు. అరే ఇదేదో బాగానే ఉందిగా అనుకుంటావు. ఇంకెవరు కామెంటారు అని చూస్తావు. శివ సందేహాన్ని నివృత్తిని చేస్తూ మోహన రావు గారి వ్యాఖ్య కనపడుతుంది. మళ్ళీ ఈమాట కెళ్ళి ఆ కధకింద కామెంట్స్ చూస్తావు. ”లాభం లేదు. ఈ సారైనా కమెంటెసెయ్యాలి,” అనుకుని అక్కడ ఈ పెద్ద వ్యాఖ్యన్ని పోస్టుతావు.
‘నీడ’ కధకులు బ్రహ్మానందంగారు,
ఈ వ్యాఖ్య సెకండ్ పర్సన్ నరెటివ్ అవుతుందా?
చి న
థాయ్‌లాండ్ యాత్రాగాథ-1 గురించి జి కె యస్ రాజా అభిప్రాయం:
11/04/2019 10:17 pm
అమరేంద్ర గారూ! బావుంది మీ ట్రావెలాగ్. రెండు దశాబ్దాల క్రితం, పనుల మీద ఎన్నోసార్లు తిరిగాను. నెలలకొద్దీ ఉన్నాను. అప్పట్లో అంత పరిశీలనగా చూడలేదు. ఇది చదివాక మళ్లీ సందర్శించాలా అనిపిస్తోందంటే మీరు చెప్పిన రీతికున్న బలం తెలుస్తోంది. కొత్తగా వెళ్ళదలచుకున్న వాళ్ళకు, మంచి కరదీపిక మీ ట్రావెలాగ్.
సందర్భోచితంగా ‘హైకూ యాత్ర’ లోని quotable quote ని ప్రయోగించి, మమ్మల్నీ కాస్త సందేహావస్థలో పడేశారు. మీరు మరిన్ని యాత్రలు చెయ్యాలని ఎదురుచూస్తూ…
ధన్యవాదాలు. అభినందనలు.
జి కె యస్ రాజా
నో-బుల్ బహుమతి గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
11/04/2019 11:44 am
ఆర్యా! ఉత్తమ పాఠకుడు బహుమతి కోరుతూ మీరు పెట్టుకున్న అర్జీ పత్రాన్ని పరిశీలించిన నో-బుల్ కమిటీ మీ నుండి మరికొన్ని వివరాలు కోరుతున్నారు. వాల్మీకి రామాయణం, కవిత్రయం తెనిగించిన భారతాలు, పోతన భాగవతం, శ్రీనాధుడి నైషధము మీరు చదివిన దాఖలాలు జతచెయ్యగలరు (వీలుంటే పెద్దల సాక్షి సంతకాలతో).
కాళిదాసు, భారవి, భవభూతి బుక్కులు మీవద్ద ఉన్న ఫొటోలు కూడా జతచెయ్యగలరు.
విశ్వనాథ, శ్రీశ్రీ, తిలక్, చాసో, శ్రీపాద, రావి శాస్త్రి లు మీకు ఇష్టులు అనే జగమెరిగిన సత్యానికి …. భౌతిక శాస్త్రం నోబెల్ పురస్కారం అందుకున్న ఖగోళభౌతిక శాస్త్రవేత్త చంద్ర (సుబ్రమణియం చంద్రశేఖర్) ఆత్మకధ (Chandra: A Biography of S. Chandrasekhar by Kameshwar C. Wali) ను చదివిన వారుగా మీకు కొన్ని బోనస్ మార్కులు లభిస్తున్నాయి.
పైన పేర్కొన్న వివరాలు దఖలు పరిచినచో నో-బుల్ పురస్కారం మిమ్మల్నే వరిస్తుందని మా ప్రఘాఢ విశ్వాసం. మీరు అర్జీని ఆమెన్ (Amen) అంటూ ముగించారు. ఎందుకైనా మంచిది ఆమెన్ తో పాటు ఆవుమెన్ (Awomen) అని కూడా అనండి… ఆన్ లైన్ వోటింగ్ కూడా చేస్తాము కాబట్టి మీకు దండిగా వోట్లు దొరుకుతాయి. Insha Allah
కొత్త పుస్తకాలకు స్వాగతం! గురించి జి కె యస్ రాజా అభిప్రాయం:
11/04/2019 10:58 am
మంచి ప్రయత్నం. రచయితలకు చేదోడు. కానీ షరతులు అధికం.
ఇల్లేరమ్మకు చలవపందిరి గురించి మంగు శివరామ ప్రసాద్ అభిప్రాయం:
11/03/2019 12:07 pm
శ్రీరమణగారి ముందుమాట చదివాక, ఇల్లేరమ్మ కథలు పుస్తకం చదవాలని ఆనిపిస్తోంది. దయచెసి పుస్తకం వెల, ప్రాప్తిస్థానం చెప్పండి.
మంగు శివరామ ప్రసాద్
బేతాళ కథలు: కథన కుతూహలం – 5 గురించి Apple Macintosh అభిప్రాయం:
11/03/2019 11:14 am
పాఠకరావు నిరీక్షణ ఫలించింది! నాలుగు మధ్యమ పురుషకథలు. అన్నీ ఒక చోటే కలిపి చదువుకోవచ్చని కింద ఇస్తున్నాను.
నవంబర్ 2019 గురించి Digavalli Suryanarayana Murty అభిప్రాయం:
11/01/2019 3:22 pm
ఈమాట వెబ్ నాకు ఈరోజునే తెలిసింది. తెలుగులో వ్రాయవచ్చునేమో చూద్దామని ఇలా వ్రాస్తున్నా.
ఎడిటోరియల్ చదివాను. బాగుంది. నేను వొక విశ్రాంత సీనియర్ సిటిజెన్. ప్రస్తుతం అమెరికాలో వుంటున్నా.
ఇంతింతైన ఇల్లేరమ్మ గురించి varma అభిప్రాయం:
11/01/2019 5:35 am
వాడ్రేవు వీరలక్ష్మీదేవిగారింటికి వచ్చిన సోమరాజు సుశీలగార్ని కలసి, మాట్లాడి ఏడాది నిండలేదు. ఇంతలోనే కంటికి కనిపించనంతదూరం వెళ్లిపోయారావిడ.