🙂 ఈ కథాకాలానికి అంటే క్రీశ 1110కి ఆ ప్రాంతంలో ముస్లిం దండయాత్రల గురించిన సమాచారం ప్రస్తుతానికైతే ఏం లేదు. మీకు గుర్తురావడం చేత వాటి కాలాన్ని ముందుకు నెట్టలేం కదా! సమస్య ఎక్కడ ఉంటుందంటే ప్రతిదీ పండించాలి అనే దగ్గరే. నేనేమీ పరిశోధకుడ్ని కాదు కాబట్టి కంక్లూజన్ని పండించాలి అనే నేను అనుకోలేదు. మన దృష్టికోణం అనేది మన విశ్వాసాలచేత, ఆలోచనా విధానం చేత, మనం కట్టుకున్న గంతల చేత మారిపోతూనే ఉంటుంది. బహుశా అది సరిగా పంటను పండించి ఉండకపోవచ్చు. థాంక్యూ సతీష్‌గారు.
“కప్ప దొరకాలని పాములు కోరుకుంటాయి. తప్పించుకోవాలని కప్పలు కోరుకుంటాయి. తప్పించుకోవడం, దొరికించుకోవడం అనేది వాటికున్న ఒడుపు వల్ల వస్తది. పాము ఒడుపుతో ఇంకో కప్పని దొరికించుకోవచ్చు. కప్ప చురుగ్గా లేనిరోజు ఇంకో పాము నోట్లో పడొచ్చు. నీటిపాము కప్పని పట్టుకోవచ్చు. కాని ఎండ్రకాయని పట్టుకోవాలనుకుంటే దాని చావు అది తెచ్చుకున్నట్లే.”
మనుషులు అవసరాల్లో అవకాశాల్ని ఎంత బాగా మలుచుకుంటారో పై చిన్న ఉదాహరణ ద్వారా కథకు అనుసంధానించిన విధానం చాలా చక్కగా నేర్పుగా ఉంది.
“బలహీనతల్ని దగ్గరుండి చూసిన మనిషి. మనం అడక్కుండానే అంత పెద్ద సాయం చేశాడంటే అతను సులువుగా నమ్మకాన్ని సంపాదించుకునే మార్గాన్ని ఎంచుకున్నాడు. బలహీనులుగా కనపడుతూ మన బలహీనతలని ఆసరా చేసుకొని అతినమ్మకంగా మనదగ్గర అడుగుపెట్టాలనుకొనే వాళ్ళ వెనుక బలమైన ఆలోచనుంటుంది. ఎందుకో అది మనకి మంచిది కాదనిపించింది. ఆశలు, అవసరాలు పెరిగేకొద్ది అవకాశం దొరికితే మనమైనా మన పరిధులు దాటి వెళ్తాం. అది తప్పుగా కూడా అనిపించదు. అంత అవకాశం అతనికివ్వడం అనవసరమనిపించింది. అందుకే డబ్బులిచ్చి పంపా. అది అతన్ని తక్కువ చేయడం కాదు. మనల్ని మనం సేఫ్ జోన్‌లో ఉంచుకోవడం”
మనుషుల ఆలోచనల్ని చదవగలిగినవారే రాబోయే ప్రమాదాల్ని నివారించుకోగలరు. కరుణలో చూపిన నిశిత దృష్టి, దూరాలోచన ఎంతో బావున్నాయి.
ఆఖరి చూపు
గురించి పిన్నమనేని మృత్యుంజయరావు అభిప్రాయం:
చాగంటి తులసిగారి ఊహల ఊట రెండవ భాగం చదివాను. చాలా బాగుంది. వైవిధ్యంగా ఉంది. చాలా సహజంగా ఉంది ఊహల ఊట. చదివిన వాళ్ళందరిని బాల్యంలోకి తీసుకెళ్ళిపోతుంది భాష. తులసిగారంటే తులసిగారే! బెల్కోరా ఎలుక పళ్ళు భలే తమాషాగా ఉన్నాయి. ఇలాంటి సహజమైన కథలు అందిస్తున్న తులసిగారికి ధన్యవాదములు.
“ఓ యాభై తరాలు వెనక్కిపోతే ఈ రోజు నువ్వు పూజించే దేవుడ్ని అప్పటి నీ వాళ్లు పూజించి ఉండకపోవచ్చు. అంత చారిత్రకదృష్టి ఉంటే మతాల మధ్య ఇంత ఘర్షణే ఉండేది కాదు.”
దేవగిరి కోట అనగానే ఫస్ట్ గుర్తు వచ్చేది అల్లాహ్ ఉద్దీన్ ఖిల్జీ చేసిన దాడులు, ఇస్లామిక్ రూలర్స్ invasion. అవేవీ ప్రస్తావించకుండా, కేవలం, కాకతీయులు, బౌద్ధులు, జైనుల గురించే మాట్లాడుతూ, 50తరాల క్రితం ఎవరి దేవుళ్ళు ఎవరో అంటూ పాఠాలు చెప్పటం కొంచం వింతగొల్పుతుంది.
50 కాదు 100 తరాల ముందు కూడా హిందూలు హిందూలే కదా Bhaskar గారు. It’s the only surviving ancient religion అంతకు ముందు వేరే రిలీజియన్ అంటూ ఏదీ ఉండేదే కాదు కదా ఈ నేల మీద. మధ్యలోనే బుద్ధిజం వచ్చింది. ఎంత fastగా వచ్చిందో, అంతే ఫాస్ట్‌గా వెళ్ళిపోయింది కూడా.
మిగతా మతాల వాళ్ళే, కొన్ని తరాల ముందు వేరే విశ్వాసంతో ఉండే వాళ్ళు కదా. ఈ కధతో సంబంధం ఉన్నా కానీ, వాళ్లని మాత్రం వదిలేసి, ఈ పాఠాలు హిందూలకి చెప్పడానికి మాత్రం ఎందుకు ఇంత ఆరాటం? కొన్ని important లాజిక్‍లు వదిలేసి మరీ 😏
ఆ కోట కూడా ఒక బుద్ధిస్ట్ కట్టడం ఏమో అన్న మీ ఊహాగానం బాగానే పండించారు కానీ, మీ conclusion మాత్రం అంతగా పండించలేక పోయారు. 🙁
తెలుగు సాహిత్య విమర్శ చరిత్రను, వివిధ దశలుగా, వివిధ రీతులల్లో ఎలా పరిణామం జరిగిందో సంక్షిప్తంగా కొండను అద్ధంలో చూపించినట్లు సమన్వయించారు. పరిశోధకులు ప్రథమాంధ్ర విమర్శకుడిగా భావిస్తున్న కందుకూరి విరేశలింగంగారి నుంచి ప్రారంభించి ఆలంకారిక విమర్శ , కవిజీవిత సమన్వయ విమర్శ, తులనాత్మక విమర్శ, మార్క్సిస్టు విమర్శ, చారిత్రక విమర్శ మొదలైన పద్ధతుల్లో సాహిత్య విమర్శలో కృషి చేసిన విమర్శకుల దృక్పథాలను చక్కగా విశ్లేషణ చేశారు. ఆధునిక సాహిత్యంలో వచ్చిన స్త్రీవాద, దళితవాద సాహిత్యాన్నీ, ఆ విమర్శ యొక్క తీరు తెన్నులను తెలియజేశారు. సాహిత్య విమర్శకుడికి ఉండవలసిన లక్షణాలను సమన్వయిస్తూ, సమకాలీన సాహిత్యంలో వెలువడుతున్న విమర్శను ఎలా అధ్యయనం చేయాలో సూచించారు. సాహిత్య విమర్శలో చర్చించాల్సిన అనేక అంశాలను ప్రతిపాదించారు. మీరు ఇలాంటి విమర్శ వ్యాసాలను మరిన్నీ రాయాలని భావిస్తున్నాను. సాహిత్యాన్ని బోధించే ఆచార్యులు, పరిశోధకులు, విమర్శకులు, ఈ విమర్శ వ్యాపాన్నీ చదవాలని ఆశిస్తున్నాను.
ఊహల ఊట 2 గురించి రత్నాల బాలకృష్ణ, విజయనగరం అభిప్రాయం:
07/01/2021 11:01 am
చాలా సహజంగా బాల్యంలో వచ్చిన ఆలోచనలను ఊహల ఊట రూపంలో అందిస్తున్న తులసిగారికి అభినందనలు.
అజెండా గురించి భాస్కర్ కె అభిప్రాయం:
07/01/2021 10:16 am
ఒక పెద్దపాయింట్ ని చిన్నకథలో ఎంత బలంగా చెప్పారో.
దేవగిరి గురించి భాస్కర్ కె అభిప్రాయం:
07/01/2021 10:14 am
🙂 ఈ కథాకాలానికి అంటే క్రీశ 1110కి ఆ ప్రాంతంలో ముస్లిం దండయాత్రల గురించిన సమాచారం ప్రస్తుతానికైతే ఏం లేదు. మీకు గుర్తురావడం చేత వాటి కాలాన్ని ముందుకు నెట్టలేం కదా! సమస్య ఎక్కడ ఉంటుందంటే ప్రతిదీ పండించాలి అనే దగ్గరే. నేనేమీ పరిశోధకుడ్ని కాదు కాబట్టి కంక్లూజన్ని పండించాలి అనే నేను అనుకోలేదు. మన దృష్టికోణం అనేది మన విశ్వాసాలచేత, ఆలోచనా విధానం చేత, మనం కట్టుకున్న గంతల చేత మారిపోతూనే ఉంటుంది. బహుశా అది సరిగా పంటను పండించి ఉండకపోవచ్చు. థాంక్యూ సతీష్‌గారు.
అజెండా గురించి Siddhiq అభిప్రాయం:
07/01/2021 10:02 am
“కప్ప దొరకాలని పాములు కోరుకుంటాయి. తప్పించుకోవాలని కప్పలు కోరుకుంటాయి. తప్పించుకోవడం, దొరికించుకోవడం అనేది వాటికున్న ఒడుపు వల్ల వస్తది. పాము ఒడుపుతో ఇంకో కప్పని దొరికించుకోవచ్చు. కప్ప చురుగ్గా లేనిరోజు ఇంకో పాము నోట్లో పడొచ్చు. నీటిపాము కప్పని పట్టుకోవచ్చు. కాని ఎండ్రకాయని పట్టుకోవాలనుకుంటే దాని చావు అది తెచ్చుకున్నట్లే.”
మనుషులు అవసరాల్లో అవకాశాల్ని ఎంత బాగా మలుచుకుంటారో పై చిన్న ఉదాహరణ ద్వారా కథకు అనుసంధానించిన విధానం చాలా చక్కగా నేర్పుగా ఉంది.
“బలహీనతల్ని దగ్గరుండి చూసిన మనిషి. మనం అడక్కుండానే అంత పెద్ద సాయం చేశాడంటే అతను సులువుగా నమ్మకాన్ని సంపాదించుకునే మార్గాన్ని ఎంచుకున్నాడు. బలహీనులుగా కనపడుతూ మన బలహీనతలని ఆసరా చేసుకొని అతినమ్మకంగా మనదగ్గర అడుగుపెట్టాలనుకొనే వాళ్ళ వెనుక బలమైన ఆలోచనుంటుంది. ఎందుకో అది మనకి మంచిది కాదనిపించింది. ఆశలు, అవసరాలు పెరిగేకొద్ది అవకాశం దొరికితే మనమైనా మన పరిధులు దాటి వెళ్తాం. అది తప్పుగా కూడా అనిపించదు. అంత అవకాశం అతనికివ్వడం అనవసరమనిపించింది. అందుకే డబ్బులిచ్చి పంపా. అది అతన్ని తక్కువ చేయడం కాదు. మనల్ని మనం సేఫ్ జోన్‌లో ఉంచుకోవడం”
మనుషుల ఆలోచనల్ని చదవగలిగినవారే రాబోయే ప్రమాదాల్ని నివారించుకోగలరు. కరుణలో చూపిన నిశిత దృష్టి, దూరాలోచన ఎంతో బావున్నాయి.
ఆఖరి చూపు గురించి పిన్నమనేని మృత్యుంజయరావు అభిప్రాయం:
07/01/2021 9:04 am
మనుషులు. అంతే…. 😔
ఊహల ఊట 2 గురించి కొ o కే పూడి అనూరాధ అభిప్రాయం:
07/01/2021 6:07 am
చాగంటి తులసిగారి ఊహల ఊట రెండవ భాగం చదివాను. చాలా బాగుంది. వైవిధ్యంగా ఉంది. చాలా సహజంగా ఉంది ఊహల ఊట. చదివిన వాళ్ళందరిని బాల్యంలోకి తీసుకెళ్ళిపోతుంది భాష. తులసిగారంటే తులసిగారే! బెల్కోరా ఎలుక పళ్ళు భలే తమాషాగా ఉన్నాయి. ఇలాంటి సహజమైన కథలు అందిస్తున్న తులసిగారికి ధన్యవాదములు.
ఊహల ఊట 1 గురించి పార్థసారధి అభిప్రాయం:
06/27/2021 1:48 am
ఊహల ఊట చాలా మనసు చదువుతుంటే అపుడే అయిపోయిందా అనిపించింది.
దేవగిరి గురించి Satish అభిప్రాయం:
06/25/2021 3:09 pm
దేవగిరి కోట అనగానే ఫస్ట్ గుర్తు వచ్చేది అల్లాహ్ ఉద్దీన్ ఖిల్జీ చేసిన దాడులు, ఇస్లామిక్ రూలర్స్ invasion. అవేవీ ప్రస్తావించకుండా, కేవలం, కాకతీయులు, బౌద్ధులు, జైనుల గురించే మాట్లాడుతూ, 50తరాల క్రితం ఎవరి దేవుళ్ళు ఎవరో అంటూ పాఠాలు చెప్పటం కొంచం వింతగొల్పుతుంది.
50 కాదు 100 తరాల ముందు కూడా హిందూలు హిందూలే కదా Bhaskar గారు. It’s the only surviving ancient religion అంతకు ముందు వేరే రిలీజియన్ అంటూ ఏదీ ఉండేదే కాదు కదా ఈ నేల మీద. మధ్యలోనే బుద్ధిజం వచ్చింది. ఎంత fastగా వచ్చిందో, అంతే ఫాస్ట్‌గా వెళ్ళిపోయింది కూడా.
మిగతా మతాల వాళ్ళే, కొన్ని తరాల ముందు వేరే విశ్వాసంతో ఉండే వాళ్ళు కదా. ఈ కధతో సంబంధం ఉన్నా కానీ, వాళ్లని మాత్రం వదిలేసి, ఈ పాఠాలు హిందూలకి చెప్పడానికి మాత్రం ఎందుకు ఇంత ఆరాటం? కొన్ని important లాజిక్‍లు వదిలేసి మరీ 😏
ఆ కోట కూడా ఒక బుద్ధిస్ట్ కట్టడం ఏమో అన్న మీ ఊహాగానం బాగానే పండించారు కానీ, మీ conclusion మాత్రం అంతగా పండించలేక పోయారు. 🙁
తెలుగు సాహిత్య విమర్శ – ఒక చూపు గురించి Nalasani Ramprasad అభిప్రాయం:
06/24/2021 2:12 pm
డా. మృణాళినిగారికి నమస్కారం .
తెలుగు సాహిత్య విమర్శ చరిత్రను, వివిధ దశలుగా, వివిధ రీతులల్లో ఎలా పరిణామం జరిగిందో సంక్షిప్తంగా కొండను అద్ధంలో చూపించినట్లు సమన్వయించారు. పరిశోధకులు ప్రథమాంధ్ర విమర్శకుడిగా భావిస్తున్న కందుకూరి విరేశలింగంగారి నుంచి ప్రారంభించి ఆలంకారిక విమర్శ , కవిజీవిత సమన్వయ విమర్శ, తులనాత్మక విమర్శ, మార్క్సిస్టు విమర్శ, చారిత్రక విమర్శ మొదలైన పద్ధతుల్లో సాహిత్య విమర్శలో కృషి చేసిన విమర్శకుల దృక్పథాలను చక్కగా విశ్లేషణ చేశారు. ఆధునిక సాహిత్యంలో వచ్చిన స్త్రీవాద, దళితవాద సాహిత్యాన్నీ, ఆ విమర్శ యొక్క తీరు తెన్నులను తెలియజేశారు. సాహిత్య విమర్శకుడికి ఉండవలసిన లక్షణాలను సమన్వయిస్తూ, సమకాలీన సాహిత్యంలో వెలువడుతున్న విమర్శను ఎలా అధ్యయనం చేయాలో సూచించారు. సాహిత్య విమర్శలో చర్చించాల్సిన అనేక అంశాలను ప్రతిపాదించారు. మీరు ఇలాంటి విమర్శ వ్యాసాలను మరిన్నీ రాయాలని భావిస్తున్నాను. సాహిత్యాన్ని బోధించే ఆచార్యులు, పరిశోధకులు, విమర్శకులు, ఈ విమర్శ వ్యాపాన్నీ చదవాలని ఆశిస్తున్నాను.
నమస్కారం.
పరిశోధక విద్యార్థి.
సంక్షోభం-శోకం-సాహిత్యం గురించి శ్రీనివాస్ బందా అభిప్రాయం:
06/22/2021 10:25 pm
అతి చిక్కటి బాధ. ప్రతి అక్షరంలోంచీ వొలుకుతోంది.