పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. వేటూరి పాట గురించి Mahesh అభిప్రాయం:

    07/19/2021 11:10 am

    శంకరాభరణంలో రెండు చరణాలు ఒకేలా ఉండాలి, పాదాలు ఒకేలా ఉండాలి అని నియమం లేదు. ఇక్కడ రచన సాహిత్యం ముఖ్యం. తరువాత లయ. కావాలనే అలా వ్రాసారు. తెలియక కాదు.

    ఈ వ్యాసంలో వేటూరి వారికి సరి అయిన గౌరవం లేనట్టు కనిపిస్తుంది. వ్రాసిన వారికి సాహిత్య సంగీత జ్ఞానం లేనట్టు కనిపిస్తుంది.

  2. అస్తిత్వపు ఆనవాళ్ళు గురించి నాదెళ్ల అనూరాధ అభిప్రాయం:

    07/19/2021 11:04 am

    కథ చదివి అభిప్రాయాన్ని పంచుకున్న మిత్రులకు ధన్యవాదాలు.

  3. రాగలహరి: చక్రవాకం, మలయమారుతం, కళావతి గురించి ముప్పాళ్ళ శ్రీ సూర్య ప్రకాశ రావు అభిప్రాయం:

    07/18/2021 11:41 am

    ఈ వ్యాసం చాలా బావుంది. సినిమా పాటల విషయంలో మాలాంటి పామరులకి (స్వర రాగ జ్ఞానం లేని వారికి) సందేహాలు తీర్చటానికి ఇన్నాళ్లకి మీరు దొరికేరు.

    బండరాముడు సినిమా లోని “మేలుకో మహారాజ” పాట, “ఏడుకొండల వాడ వెంకటా రమణా” ఒకటే రాగం అనుకునేవాణ్ణి. ఈ వ్యాసం చూసిన తరువాత ఆ పాట మలయమారుతం (మేలుకో శ్రీరంగా లాగా) అని అర్థమైంది.

    కొండగాలి తిరిగింది పాట చరణాల తరవాతి ఆలాపనలో చక్రవాకఛ్చాయలున్నాయా? (చక్రవాకంలో ఉండే విషాదఛ్చాయలు నాకు ఆ ఆలాపన లో వినిపిస్తాయి)

  4. ఊహల ఊట 2 గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    07/17/2021 10:13 am

    పంచదార కొబ్బరుండ లస్కోరా కన్నా… బెల్లం కొబ్బరుండ బెల్కోరా కన్నా… పాఠకులని బాల్యంలోకి తీసుకెళ్ళిపోతున్న చాగంటివారమ్మాయి ఉహల ఊట… తియ్యగా చాలా బాగుంది

  5. గిడుగు గురించి శ్రీపాద గురించి అభిలాష్ అభిప్రాయం:

    07/16/2021 2:12 pm

    నాదొక సందేహం. ఇందులో శ్రీపాద వారు గిడుగుగారికి ఎందుకు వ్రాసి చూపిస్తున్నారు? ఎందుకు మాట్లాడడం లేదు?

  6. ఊహల ఊట 2 గురించి Swathi అభిప్రాయం:

    07/16/2021 5:59 am

    అద్భుతం. చైతన్య స్రవంతి.అవును.బావులేనివీ ఉంటేనే ఏవి బావుంటాయి తెలుస్తుంది.

  7. ఉన్నట్టుండి గురించి శిరీష్ ఆదిత్య అభిప్రాయం:

    07/13/2021 5:43 am

    చంద్రగారు, మెలంకలీని మీరు ఎంత బాగా పట్టుకుంటారో. ఇంత చిన్న కథల్లో అంత లోతైన భావాల్ని ఎలా దాస్తారో తెలీదు కానీ ముఖ్యంగా రెండో వీన్యెట్ బాంబులా పేలింది. మొన్నీ మధ్య మూడో ముద్రణలో కొన్ని కథలు ఇష్టంగా చదివాను. అయితే వాటితో పోలిస్తే ఈమాటలో గత 3-4 ఏళ్ళుగా చదివిన కథలు ఇంకా లీనర్ అండ్ మీనర్ – లీథల్.

  8. అజెండా గురించి Padma vylta అభిప్రాయం:

    07/12/2021 9:25 pm

    పాత్రల ఎంపిక అద్బుతం! పాముని, కప్పని తీసుకొని చిన్ని కథలో పెద్ద పచ్చినిజాలను వెలికితీసారు. కథకి యాస ప్రాణం పోసింది. ఆలోచింపజేసే కథ అజెండా.‌ ఇక్కడ శ్రీధర్,శేషు, కరుణా ముగ్గురిని తీసుకొంటే మనిషి అంతరంగపు వైఖరికి అద్దంలా ఉన్నారు. కాపాడాడు అనే విషయం కంటే, కరుణ డబ్బులు ఎందుకు ఇచ్చింది అనే మానవ స్వభావం… శేషు విషయానికి వచ్చినప్పడు సరిగ్గా పాముని, కప్పని తీసుకొని వచ్చి భలే చెప్పారు. కరుణ విషయానికి వచ్చేసరికి…

    “ఆశలు, అవసరాలు పెరిగేకొద్ది అవకాశం దొరికితే మనమైనా మన పరిధులు దాటి వెళ్తాం. అది తప్పుగా కూడా అనిపించదు. అంత అవకాశం అతనికివ్వడం అనవసరమనిపించింది. అందుకే డబ్బులిచ్చి పంపా. అది అతన్ని తక్కువచేయడం కాదు. మనల్ని మనం సేఫ్ జోన్‌లో ఉంచుకోవడం.”

    ఇక్కడ ఈ ముగ్గురిలో ఎవరి అలోచనలు ఆలోచింపజేసేవిలా ఉన్నాయి అనే చోట ఆగేకన్నా మనిషి నైతిక ప్రవర్తన ఇది కదా అన్పించింది. సూపర్బ్ సుధా!

  9. ఊహల ఊట 2 గురించి అనిల్ అభిప్రాయం:

    07/12/2021 1:52 am

    “బాగుండనివి తప్పనిసరిగా ఉండాలి. ఉండితీరాల్సిందే!” 👌🏽

  10. కా. రా. కథలు రెండోసారి చదవడానికి ముందు గురించి మొనవాయి పుల్లయ్య అభిప్రాయం:

    07/11/2021 12:21 pm

    చాలా విలువైన విశ్లేషణ.
    ఏదైనా రచనని యే కళ్ళద్దాలూ(సిద్ధాంతాలు) లేకుండా చదవాలి. ఇటువంటి విమర్శ తెలుగు సాహిత్యంలో కొరవడి తాలూ తప్పా గొప్ప డాబులూ, గోలుగప్ప గొప్ప తిళ్ళూ ఐపోయాయి.