పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. ఉన్నట్టుండి గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    08/02/2021 8:02 pm

    ముల్లు గుచ్చుకుని విరిగిపోయింది. తీయడానికి రాదు. ఆ సలుపు అలా వుండిపోతుంది.

  2. సాధన ఫలితం గురించి తఃతః అభిప్రాయం:

    08/02/2021 2:29 pm

    పూర్ణిమ :
    నేనెవరో నాకు తెలియలేదు గానీ
    ఈ కథ చదివింతర్వాత మీరెవరో తెలిసింది-.మీరొక మంచి రైటర్.
    తఃతః

  3. ఆచార్య చేకూరి రామారావు భాషాశాస్త్ర పరిశోధన, మార్గదర్శనం గురించి Pulipaty Krishna Chaithanya అభిప్రాయం:

    08/02/2021 7:15 am

    Dear editors,

    I really like the article written by Prof. Garapati on Chekuri Rama Rao. I have been searching for an academic paper written by Chekuri, namely Chekuri (1976) pasted below, that Prof. Garapati cites in this article. Can you please let me know how I can contact Prof. Garapati for the paper? I could not find the paper online or in the libraries of the Osmania University and the EFLU.

    రామారావు చేకూరి, 1976. Vowel Harmony in Telugu. Papers in Linguistic Analysis, vol.1.1:25-36.

    I greatly appreciate your help on this request. Thank you in advance.

    Kind regards,
    Pulipaty Krishna Chaithanya

  4. ఆగస్ట్ 2021 గురించి Anwar అభిప్రాయం:

    08/01/2021 10:54 pm

    సుమారు ఇరవై సంవత్సరాల క్రిందటి మాట. తెలివి ఎక్కువ మూర్తి ఒకాయన, ఆయన శక్తి మేరకు భాషకు, సాహిత్యానికి communal harmonyకి తన వంతు ఋణం తీర్చుకునే ప్రయత్నంలో తెలుగు, ఉర్దూ వ్యాస రచన పోటీ పెట్టి తెలుగు వ్యాసం మొదటి బహుమతి ముస్లిం అబ్బాయికి, ఉర్దూ వ్యాసం మొదటి బహుమతి హిందూ అబ్బాయికి వచ్చేలా సరిచూసారు. ఆ పిల్లలూ పెద్దవాళ్ళే- 15 నుండి, 18 వరకు వయసు. బహుమతి ప్రదాత శ్రీ దాశరథి రంగాచార్య. బహుమతులు ముగిశాక పిల్లలు స్పీచ్ ఇవ్వాలి. సాహెబుల అబ్బాయికి మైక్ ఇచ్చారు. ఆయన చక్కగా తెలుగు సినిమా సాహెబులు మాట్లాడే స్క్రిప్ట్ భాషలో “మీది తెల్గు నాది రాసినపుడుకి…” అని మొదలుపెట్టారు. రంగాచార్యగారు తాపీగా అన్నారు కదా “పాపం పిల్లాడికి తెలుగు రాకపోతే ఉర్దూలో మాట్లాడమని చెప్పండి”.

    తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గారికి పొరపాటున తెలుగు వచ్చి ఉంటే, ఆవిడకు సమయం అనేది ఉండి ఉంటే, అపుడు ‘ఈ మాట సంపాదకీయం’ చదివి ఉంటే అయ్యో ఏమయ్యేది?! జీవహింస కాదూ 😔

    ఆంధ్రా యూనివర్సిటీ ప్రారంభించిన తొలి రోజుల్లో విశ్వవిద్యాలయం తరుపున మహాపండితులను సత్కరించాలని అట్టివారిని వెదుక్కుంటూ విజయనగరంలో తాతా సుబ్బరాయశాస్త్రిగారి వద్దకు వచ్చారట కట్టమంచి రామలింగారెడ్డిగారు. “మీ గురువుగారికి యూనివర్సిటీ తరుపున ‘కళా ప్రపూర్ణ’ బిరుదు ఇస్తాము, మీరు ఒప్పించాలి” అని తాతావారి శిష్యులను కోరారుట. శిష్యులు గురువుగారిని కళాప్రపూర్ణ కమ్మని బలవంతపెట్టారు. శాస్త్రిగారు లేచి, పక్కన ఉన్న బల్ల మీద చేతులు కట్టుకుని నిలబడ్డారు. శిష్యులు అదిరిపోయారు. “గురువుగా నేను మీకు కళాప్రపూర్ణ అనే మాటకు అర్థం చెప్పలేక పోయినందుకు నాకు నేను వేసుకుంటున్న శిక్ష ఇది” అన్నారు తాతావారు.
    అదంతా చరిత్ర. ఈ మాట సంపాదకీయం వల్ల ఉదయాన్నే తాతావారి వంటి గొప్పవారిని గుర్తు చేసుకునే అదృష్టం కలిగింది. నమస్కారం.

  5. తెగిన గొలుసులు గురించి Mani Sarma అభిప్రాయం:

    08/01/2021 6:50 pm

    భావం ఆలోచింపజేసేది కానీ అంతకంటే ముందుగాను ఎక్కువగాను నాకు శుద్ధ ఆనందం కలిగేది మాత్రం మీ పదబంధాలతో- ‘సహస్రాక్షుడి సహపంక్తిభోజనం’.

  6. మూడిట్లో యేది? గురించి దశరధ్ అభిప్రాయం:

    08/01/2021 12:37 pm

    ఇది అనువాద కథ అని చెప్పటానికి కారణం ఏమి కనబడటంలేదు, ఒక్క పేర్లు తప్ప. తమిళ్, తెలుగు రెండు భాషల్లో ఎంతో పట్టు ఉంటే తప్ప ఇలాంటి అనువాదాలు సాధ్యం కాదు. హాట్సాఫ్ దాము.

  7. ఊహల ఊట 3 గురించి Ravada shyamala అభిప్రాయం:

    08/01/2021 7:27 am

    మేడం గారు మీ ఊహల ఊట లో ఆదివారం తలంటి స్నానం అనే మహా యజ్ఞాన్ని ఎంత బాగా గుర్తుచేసుకుని మరీ చెప్పారు. కొన్ని విషయాలు అంతే. మనసు ఫలకంలో నిలిచిపోతాయి. మనం ఎంత పెద్దదైనా మన బాల్యాన్ని మర్చిపోలేము. ఆ తీపి గుర్తులు మర్చిపోలేం. అలాగే మీ ఈ రచన ద్వారా నాన్నగారిని, అమ్మగారిని, బామ్మగారిని,ముత్తవ్వనీ వారి స్వభావాన్ని మాకు పరిచయం చేస్తున్నారు. అలాగే మీ కొచ్చిన సందేహల,ప్రశ్నల పరంపరని కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం.

  8. విశ్వమహిళా నవల: 10అ. జేన్ ఆస్టిన్ నవలలు గురించి శారద అభిప్రాయం:

    08/01/2021 2:25 am

    మృణాళిని గారూ,
    మీ ఈ వ్యాసాల పరంపర చాలా చాలా బాగుందండీ.
    నేను చాలా శ్రద్ధగా, ఆసక్తిగా చదువుతున్నాను.
    శారద

  9. ఆఖరి చూపు గురించి Lyla yerneni అభిప్రాయం:

    07/30/2021 12:27 pm

    “Ours is essentially a tragic age, so we refuse to take it tragically. The cataclysm has happened, we are among the ruins, we start to build up new little habitats, to have new little hopes. It is rather hard work: there is now no smooth road into the future: but we go round, or scramble over the obstacles. We have got to live, no matter how many skies have fallen. This was more or less Constance Chatterley’s position. The war had brought the roof down over her head. And she had realized that one must live and learn.”*

    Isn’t that the position of the daughter, in this story?

    రచయిత గారూ! మీ కథ చివర్లో, ఒక కవర్లో ఆస్తి కాగితాలుంచితే, చూసారా? చదివే మా అందరికీ ఆ లప్ప మీదే దృష్టి. నాకైతే, ఎవరెలా చస్తే నాకేంటి, అట్లాంటి కవరు నాకొస్తే, (రోజుకొకటి) ఎంత బాగుండునో అనిపించింది. నాకు, ఆ చిన్న పిల్ల ఆ ఆస్తి కాగితాలున్న కవరు తీసుకుంటే సంతోషం కలిగింది. Why shouldn’t she?

    Why begrudge the little girl, if she accepts a house that is left by her father? What does the society want of her? That she should be a sacrificial lamb? To be cluelessly noble and be dependent on the mercy of the mother and her present husband? Wait for the pocket money every month. Climb into a plane, climb off a plane, to view a dead body, or some other Mysore scenery, whichever their fancy hits, on any given day?

    There is a turbulence, an upheaval, a war going on, in that young girl’s life, God knows from what tender age! All she can do is cope. Cope. Try to cope.
    Does one have to be loving and loyal to accept a house after someone’s death? Is it a problem for the society moral goons, that the little girl did not coerce the bigtime adult money earners, by her good behavior, to earn a big reward?

    ఈ పత్రిక ప్రారంభ దశలోనే పరిచయం చేయబడిన ఫిరదౌసి కథ, విమర్శ చదివాముగా. ఫిరదౌసి ఇప్పటి సినిమా రచయిత కాదు, అప్పటి పాదుషా ఆస్థాన కవి. అతని కూతురు ఏం చేసింది? తండ్రి ఏళ్ల తరబడి శ్రమించి షానామా రాసి, చివరకు ఎలాగైతే ఆయన పాదుషా నుండి రాబట్టిన దీనార్లను, నా తండ్రి లేనప్పుడు ఆ డబ్బెందుకు నాకు, అని తిరస్కరించి అతడు కుటుంబం కోసమే అన్నేళ్లు పడిన శ్రమ అంతా వ్యర్థం చేసింది. ఆ చర్య కొందరితో సెభాష్ అనిపించింది. తెలుగు వాళ్లకు ఇలాటి త్యాగాలంటే మహా ఇష్టం. నాకు డబ్బు అక్కర్లేదు అని ముఖాన కొట్టి తలుపేసుకుంటే ఉన్నతులు అనుకుంటారు, ఎందుకో. వెనకటి పురాణాలన్నీ, చిన్నయ సూరి నీతిచంద్రికలో జంతువుల కథలన్నీ, తిరగేసి బోర్లేసి చదువుకున్నాము కదా? అందుకేమో. ఏది పాత్రదానమో ఏది అపాత్రదానమో, ఇస్తే ఎవరి చెయ్యి కిందవుతుందో ఎవరి చెయ్యి మీదవుతుందో, డబ్బు తీసుకుంటే ముందు జన్మలో కుక్కై పుట్టి వాళ్ల కుర్చీలో పడుకుని కాపలా కాయాలో ఏమో, అంతా దమ్మిడీ పైసలతో లెక్కలే లెక్కలు.

    అయ్యో! మీరు కథలో ప్రస్థావించిన Raymond Carver కథ చదివి కదా, మిగతా కథ చదవాలి. What a story it is! అది చదవకుండా ఈ కథ చదివితే, ఏమి చదివినట్టు!

    There is almost always a war going on, in almost all of our lives. If I sympathize, I sympathize with all people in the story. If you ask me to take a side, I am on the dependent daughter’s side. To neutralize the power hold of adults.

    కథ నాకు నచ్చిందండీ, రచయిత గొర్తి గారు! కథ చదివాక నేననుకుంది చెబితేగాని నా బుర్రలో రణగొణ అణగదనిపించింది. సరిగా పలికి ఉండకపోతే గాని, వైణికులు మీరు, నన్ను క్షమిస్తారు. నాకు తెలుసు.
    – లైలా

    * D.H. Lawrence’s opening words of his novel -The Lady Chatterley’s Lover.

  10. పహాడీ రాగం అందాలు గురించి మణికంఠ అభిప్రాయం:

    07/29/2021 5:10 am

    ఈ రాగం యెక్క విశిష్టత తెలుసుకున్నాక ఈ రాగంలో ఉన్న పాటలను వింటు మైమరచాను. చాలా కృతజ్ఞతలు సర్.