పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. అంతా రొటీనే గురించి NageswaraRao అభిప్రాయం:

    03/01/2022 10:58 am

    కథలలో పదును కవితలలోకి అనువదిస్తున్నారు శ్రీధర్ గారు. పచ్చి నిజాలు మాట్లాడారు. బుజాలు తడుముకున్నవారిలో నేనూ ఉన్నానోచ్!!

  2. ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 5 గురించి Gowri Kirubanandan అభిప్రాయం:

    03/01/2022 8:12 am

    ఆర్ .కె. లక్ష్మణ్ గారి జీవన ప్రస్తానం – అన్వర్ కలం జుగల్బందీలా పోటీ పడుతున్నాయి. ఆ తెలుగు నుడికారం, భాష రెండూ రచనను సానబెట్టిన వజ్రంలా తీర్చి దిద్దుతున్నాయి అంటే అతిశయోక్తి కాదు.

  3. మార్చ్ 2022 గురించి Amarendra అభిప్రాయం:

    03/01/2022 6:56 am

    మంచి మాటలు. ఉపయోగపడే మాటలు.

  4. ఊహల ఊట 9 గురించి పద్మావతి రాంభక్త అభిప్రాయం:

    03/01/2022 12:31 am

    చెప్పొచ్చేదేమిటంటే ఇంతకీ, ఈ ఊహల ఊటలో ఎక్కడికో కొట్టుకుపోతున్నాను. ఈసారి అమ్మాయి మాటలబాణాన్ని బామ్మకు బాగా గురిపెట్టింది.చెప్పొచ్చేదేమిటంటే పాకం చలిమిడి తిన్నంత రుచిగా రాస్తున్నారు తులసిగారూ!

  5. ఊహల ఊట 9 గురించి Palagiri Viswaprasad అభిప్రాయం:

    02/28/2022 8:49 am

    ఊహల ఊట ఊరుతూనే వుంది. ఎందులో పడి ఎందులో నుండి ఎందులోకొస్తోందో తెలియకుండానే ప్రవాహంలా సాగుతోంది. ఊత పదాలతో పాఠాలు చెప్పే అయ్యవార్లకు పేర్లు పెట్టని పిల్లలుండరు. ఇందులో ఆ చిన్నప్పటి ఆ జ్ఞాపకాలను తట్టి లేపారు.

  6. రెండు అక్షరసామ్య యతులు గురించి Lyla yerneni అభిప్రాయం:

    02/27/2022 3:02 pm

    ఈ వ్యాసంలోని అతి చిన్న ప్రపోజల్ గాని, ఇతర పెద్ద వ్యాకరణాలు రాసిన వారి సూత్రాలు గాని చూస్తే, అవన్నీ కవి చక్కని కవిత్వాన్ని చెప్పాలన్న కోరికతోనే అనిపిస్తున్నది. “కవ్యనుమతమున” -భాషలో మార్పులు జరుగుతాయి. సూత్రాలు బిగుతు చేసినా, సడలించినా గాని కవి కోసమే. అతడి పదకోశాగారం, మ్యూజికాలిటీ పెంచటానికే. మీకు నచ్చిన సూత్రాలు ఉంచుకోండి, నచ్చకపోతే తీసెయ్యండి, అని మధ్య మధ్య, వీరందరూ చెపుతున్నారు.
    ఇన్ని వీలుసాలులు చెపుతున్నప్పుడు, నాకు పద్యం రాయాలనే అనిపించింది. ఈ రచయితవే, ఈ పత్రిక లోని -శత కంద సౌరభము, కంద పద్య గాథ వ్యాసాల్లో, అక్కడే మరొకసారి రూల్స్ చదువుకుని వచ్చి రాస్తున్నాను. Isn’t that convenient!

    స్థితిమంతురాలికి, స్వర
    శ్రుతి శ్రావ్యత సొరగు షోకు శ్రితశార్వరికిన్
    అతిలాలస యగు సుదతికి
    యతితో పొసగదుగ కృష్ణ మోహన రాయా!

    చిలకల గుంపులు వచ్చి, బాల్కనీ పక్కనే ఉన్న చెట్టుమీద వాలినప్పుడు, పిట్టలు మాయమై, చెట్టు అకస్మాత్తుగా ఎర్రని బెర్రీలు కాసిన సుందర దృశ్యం నేను చూసినందున, చిలకల కేరులు విన్నందున ఆ పద్యం.

    Don’t miss those bird sounds in the poem. -Lyla

  7. విశాఖ గురించి భాస్కర్ కె అభిప్రాయం:

    02/25/2022 9:06 pm

    అవును, శ్రీనివాస్ గారు కొన్ని అర్థం చేసుకోవడంలో ఆలస్యమవుతుంది. వెయిట్ చేస్తాను, ప్రయత్నిస్తాను అర్థం చేసుకోవడానికి. ధన్యవాదాలు సర్

    రామయ్య గారు, సుధగారు ధన్యవాదాలు.

    భూమి పొరలపైన పొరలు కప్పుకుంటూ వచ్చినట్లు, చరిత్ర ఎప్పుడూ వర్తమానంతో కనెక్ట్ అయ్యే ఉంటుంది. బహుశా నేను దాన్ని సరిగా ప్రజెంట్ చేయలేదేమో. థాంక్యూ రాఘవ.

    అవును సనత్ గారు, అయ్యి ఉండచ్చు. నేనూ విన్నాను. ధన్యవాదాలు.

    ధన్యవాదాలు రాజా గారు.

  8. తెలుగు కవిత్వంలో దళితవాదం గురించి ఇండ్ల ఉపేందర్ అభిప్రాయం:

    02/25/2022 7:27 pm

    ధన్యవాదాలు అద్భుతం

  9. ఆమె ఇల్లు గురించి Lyla yerneni అభిప్రాయం:

    02/25/2022 9:31 am

    కె.కె. రామయ్య on February 15, 2022:
    “యీ ముగింపు… … నమ్ముతున్నాను.”

    You must be kidding. ముగింపు మారిస్తే, ఈ కథ అంత నచ్చకపోతే, మరో కథ ఐనా చదివే హోప్ ఉండేది. ఐనా, “ఆమె ఇల్లు” ముగింపు మారే పరిస్థితి అసలెలాగూ లేదు కదా. అది అనువాదపు కథ. ఇతరుల కథలు అనువదించుకునేవాడు స్వతంత్రుడు కాడు. అతడు ‘అసలు రచయిత’కు విధేయుడు. మూలరచయిత ఏం రాస్తే, అనువాదకుడు అదే రాయాలి.

    కథ తను రాసిందైతే, – కాంటెంపరరీ, ప్రొగ్రెసివ్ రైటర్ – ఛ! ఇలా రాసానేంటి, ఇంత వెనకబడిన ముగింపు, ఇది ఒక misogynistic కథ లాగా సౌండ్ అవుతూంది, పొరపాటు, మార్చేస్తున్నా, అని మార్చేసుకునేవాడు. కాని, అనువాదకుడు గదా, అందువల్ల మొదలూ, మధ్యా, ముగింపూ -ఏదీ మార్చలేడు.

    అనువాద కథల్లో -అనువాదకుడి కున్న “బాధకాల్లో” ఇది ఒకటై ఉండాలి. అంత సాధకం చేసి, ఈ బాధకం తెచ్చుకోటమెందుకు!

    -Lyla

  10. ఊహల ఊట 9 గురించి చాగంటి తులసి అభిప్రాయం:

    02/25/2022 7:08 am

    పిబ్రవరి మాసపు ఊహల ఊటను నచ్చిన, మెచ్చిన ముకుంద రామారావు గారికి, కొ o కే పూడి అనూరాధ గారికి, మల్లాప్రగడ రామారావు గారికి, స్వాతి గారికి,ఝాన్సీ గారికి ధన్యవాదాలతో – చాగంటి తులసి