పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 8 గురించి srinivasa rao vuppala అభిప్రాయం:

    06/01/2022 11:46 pm

    అనువాదంలా కాక, ఆర్కే లక్ష్మణ్ గారిలోకి పరకాయ ప్రవేశం చేసి వ్రాస్తున్నారు అన్వర్ గారు. చదువుతుంటే, కళ్ళ ముందు దృశ్యాలు కదలాడుతున్నాయి. ధన్యవాదాలు అన్వర్ గారు. వి.శ్రీనివాసరావు.

  2. సోల్జర్ చెప్పిన కథలు: మొదటి గంట గురించి C.Suseela అభిప్రాయం:

    06/01/2022 7:33 pm

    మిలిటరీ గురించి వినటమే కానీ, ఈ నేపథ్యం కొత్తగా ఉంది. చాలా కష్టమని తెలుసు. ఈ మద్యన పోలీస్ ట్రైనింగ్ గురించి ఒక సినీమా చూశాను. భయంకరంగా ఉంది.

  3. ఉత్తర మొరాకో శోధనలు 7 గురించి Amarendra Dasari అభిప్రాయం:

    06/01/2022 8:15 am

    మొరాకో శోధనలు ముగుస్తోన్న సందర్భంగా రెండు మాటలు:

    అనువాదం నాకు ఇష్టమైన పని. నాణ్యతాపరంగా నా సొంత రచనలకన్నా అనువాదాలనే ఇష్టపడతాను.

    యాత్ర, యాత్రాసాహిత్యం నా మనసుకు దగ్గరగా ఉండే ప్రక్రియలు.

    ఒక యాత్రాగాథను అనువదించే ఈ అవకాశం సంతోషాన్నీ, సంతృప్తినీ కలిగించింది.

    ఈ ప్రక్రియలో ఈమాట ఇచ్చిన ప్రోత్సాహం, మూల రచయిత శేషగిరి అందించిన సహకారం మరువలేనివి.

    అందరికీ, ముఖ్యంగా పాఠకులకు ధన్యవాదాలు

  4. ఊహల ఊట 12 గురించి chaganti tulasi అభిప్రాయం:

    06/01/2022 6:30 am

    ఊహల ఊట రచన పన్నెండవ భాగం పై స్పందించిన మీకందరికి పేరు పేరున నా ధన్యవాదాలు.
    – చాగంటి తులసి.

  5. సోల్జర్ చెప్పిన కథలు: మొదటి గంట గురించి Amarendra అభిప్రాయం:

    06/01/2022 6:09 am

    మన కథల్లో అరుదుగా కనిపించే నేపథ్యం… బావుంది

  6. పెద్రో గురించి కాజ సురేశ్ అభిప్రాయం:

    05/30/2022 12:46 pm

    అట్లూరి పిచ్చేశ్వరావుగారు కనబడ్డారు. చిన్న కథలో ఎంత చెప్పారు! సూటిగా బలేగా!

  7. పాత నెలవంక గురించి B Satyanarayana అభిప్రాయం:

    05/29/2022 5:29 am

    ఈ వ్యాసం చాలా బాగుంది.

  8. మేఘసందేశం (తెలుగులో) గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    05/28/2022 5:05 pm

    GLN శర్మగారు: మీ ప్రశ్నని చాలా ఆలస్యంగా చూసాను. యండమూరి సత్యనారాయణ (శ్రీవాత్సవ లేక సత్య) గారు “మల్లీశ్వరి” (1951) సినిమాలో రాయలు పాత్రలో కనిపిస్తారు.

    విడిగా ఆయన ఫోటో ఎక్కడా చూసిన జ్ణాపకం లేదు. R. అనంత పద్మనాభరావు రాసిన “ప్రసార ప్రముఖులు” అన్న పుస్తకంలో ఆయన గురించి కొద్ది సమాచారం వుంటుంది, కానీ ఫోటో వుండదు. 2010లో ఆకాశవాణి కళాకారుల వివరాలతో, ఎన్నో ఫోటోలతో “వాచస్పతి” అన్న పుస్తకం వచ్చింది. కాని దానిలో కూడా యండమూరి సత్యనారాయణ ఫోటో వున్నట్లుగా లేదు. But I can check my copy and confirm.

    నిజానికి ఆయన రేడియోలో చేసిన పనికంటే ఆయన రాసిన “ఉషః కిరణాలు” అన్న పుస్తకం అంటే నాకు చాలా ఆసక్తి. It’s one of my standard reference works. ఈ పుస్తకం గురించి 2014లో ఈమాట పత్రికలోనే ఒక వ్యాసంలో ఈ క్రింది వాక్యాలు రాసాము.
    —————-
    తెలుగు సాహిత్యంలో పందొమ్మిదవ శతాబ్దం అంధయుగం అనడం పరిపాటి. ఆ శతాబ్దపు సాహిత్యం మీద ప్రత్యేకమైన కృషి చేసినవారు యండమూరి సత్యనారాయణరావుగారు. ఆయన రాసిన ఉషఃకిరణాలు (1960) చెప్పుకోదగ్గ ప్రచారానికి రాలేదు కానీ ఆయన కృషిని మెచ్చుకోవడానికి ఆ పుస్తకం చదవడం అవసరం. ఆయన మాటల్లో: “19వ శతాబ్ది తెలుగు వాఙ్మయమును వర్ణించువారిలో హెచ్చుమంది ఇది యొక క్షీణయుగము లేక అంధయుగమనియే నుడివియున్నారు. అంతవరకు తెలుగుసాహిత్యములో తీరుతెన్నులు దిద్దుకున్న ప్రబంధ కావ్యములు, పురాణములు, శతకములు, యక్షగానములు మొదలైనవి ఈ కాలములో పరస్పర ప్రతిబింబములుగాను ఉపజ్ఞావిహీనములుగాను భావశూన్యములు గాను ఉన్నవని వీరి అభిప్రాయము.”
    —————–
    ఆయన గురించి వివరంగా ఒక పెద్ద వ్యాసం రాయవలసిన అవసరం ఎంతయినా వుంది.

  9. ఎమ్. ఎస్. రామారావు లలితగీతాలు గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    05/28/2022 3:45 pm

    Lyla, Thanks for your comment! That prompts me to be more rigorous and motivates me to post more such songs. You are absolutely right about బాపిరాజు’s signature words. I have to admit that I did not pay attention to them in identifying the writer. I did follow up MSR’s reference to బాపిరాజు before he sang లేపాక్షి బసవయ్య లేచిరావయ్య though and quickly checked my 2 volume set అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం (1995) but missed it (in vol. 2).

    ఇక విషయానికొస్తే ఈ పాట “లోకము” అన్న శీర్షికతో “శశికళ (పాటల సంపుటి)” – 1954 అన్న పుస్తకంలో వుంది. అలాగే సమగ్ర కవితా సంకలనం, 2వ భాగంలో కూడా. But if you look at the original text:
    https://archive.org/details/in.ernet.dli.2015.371070/page/19/mode/2up you notice that MSR made significant changes to the text.

    MSR was very good at singing those “romantic” poems. One of my favourite renditions of MSR is this set of 3 verses: విరహవీధి from రాయప్రోలు సుబ్బారావు in జడ కుచ్చులు (1925)
    https://archive.org/details/in.ernet.dli.2015.372034/page/n43/mode/2up

    Sreenivas

  10. పెద్రో గురించి Rama sundari MSBPNV అభిప్రాయం:

    05/28/2022 11:19 am

    హిందీలో గాగర్ మే సాగర్ అంటారు..అలాంటి సాంద్రత ఉంది ఇందులో…