బావుంది. అరుదైన కథలు, సిపాయి జీవితాలను demystify చేస్తున్నాయి. కొత్త రిక్రూట్లు నిలదొక్కుకున్నాక మరబొమ్మల స్థితిని దాటి సహజవ్యక్తుల్లా కనిపిస్తారని ఆశిస్తున్నాను.
అంజానా జాస్మిన్. గుబాళింపు అద్భుతం. సెట్టి వీధిలో పెసరట్టు, ఉల్లి చెట్నీ నేను తినలేదుగానీ రావి శాస్త్రిగారి గురించి ఈ వ్యాసం చదివాక తెలియని విషయాలు ఎన్నో ఎన్నెన్నో తెలిసాయి. ఈ మధ్యన మీ నాన్నగారి శతజయంతి వేడుకల ముగింపు సందర్భంగా ప్రచురించిన “సి.ఎస్. శర్మ రచనలు” పుస్తకంలో “కథలు ఎందుకు రాస్తారు” అన్న వ్యాసం చివర్లో…
“రాయలేక ఆగేను
ఆగి సగం వగచేను
అసలు రాసేనా?” అన్న వాక్యాలు గుర్తుకొస్తున్నాయి.
ఆగొద్దు! శ్యామ్. ఇటువంటి ఆణిముత్యాలు నేటి సాహిత్యంలో ఏనాడో కనుమరుగై పోయాయి. నువ్వు వ్రాస్తూనే ఉండు. మేము చదివి ఆనందిస్తాం.
అక్కడ మంగలి షాప్‍లో రివాల్వింగ్ కుర్చీలో నారదుడికి, ఇక్కడి కీ డ్రాయింగ్ ఆర్టిస్ట్ కుర్చీ నాకూ అంటూ సారూప్యత భలే బాగ నచ్చింది. కంట్రోల్ లక్ష్మణ్ కంట్రోల్, బోధించే పని మాత్రం చేయకు అనిపించడం గురించి కూడా కళ్లకు కట్టినట్లుగా వ్రాసారు. అన్వర్ గారు మాత్రమే కాక పాఠకులని కూడా పరకాయ ప్రవేశం చేయించారు, ధన్యవాదాలు మరియు హేట్సాఫ్ అన్వర్ గారూ.
రావిశాస్త్రికి ఒకన్నగారున్నట్టుగా -ఇప్పుడు మనమధ్యలేని – నాకు సన్నిహితమిత్రుడూ, రావిశాస్త్రితో బంధుత్వం ఉన్నవాడూ, ఆంధ్ర విశ్వకళాపరిషత్‌లొ బాటనీ ప్రొఫెసర్‍గా రిటైర్ అయిన వాడూ, సైటో జెనెటిక్స్‌లో ప్రసిద్ధమైన పరిశోధనలు పబ్లిష్ చేసినవాడూ అయిన పుచ్చా (ఇంకా మూడో నాలుగో ఇంగ్లిష్ అక్షరాల తర్వాత) నరసింగరావు చెప్పాడు: “జి. వి. అప్పారావని ఒకతను చాలా బాగారాస్తాడ్రా” అని ఆ అన్నగారు రావిశాస్త్రితో అన్నాడని.
రావిశాస్త్రి తనకు సబ్ కాస్ట్ ఫీలింగ్ ఉన్నదన్నాడన్న సంగతి గూడా అతను నాకు చెప్పాడు.
మరికొంచెం: ఆ అన్నగారు తెలుగులోకి దించిన షెల్లీ ‘టు ఎ స్కైలార్క్’ను నాకూ మరొక స్నేహితునికీ అతనే- మా ఫేకల్టీ క్లబ్బులో- వినిపించాడు. (అప్పుడు అతను చదివిన ప్రతి తెలుగు పద్యానికీ ఒరిజినల్ ఇంగ్లిష్ స్టాంజా నేను వినిపించాను.) రావిశాస్త్రి వచనం అనితర సాధ్యం.
మీరు ఇక్కడ రావిశాస్త్రి గారి గురించి ఇచ్చిన సమాచారం ఏ విశ్వవిద్యాలయంలోనైనా తెలుగులో ఒక సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించడానికి సరిపడినంత ఉంది. మీ వ్యాసాలు గాని, ప్రసంగాలు కాని ఎప్పుడూ ఒక కొత్త విషయాన్ని పాఠకుడికి / శ్రోతకి తెలియజేస్తూనే ఉంటాయి. ఈ వ్యాసం కూడా ఆ కోవలోకే వస్తుంది.
ఊహల ఊట 15 చదివాను. తేనె పట్టులోని తేనెలా మధురంగా ఉంది. కూంబు అంటే దువ్వెన అనే తెలుసు. కానీ ఇది చదివాక కొత్త అర్థం తెలిసింది. తేనె పట్టు కుట్టు బాగుంది. ఊహలు ఊహలను ఎగిరిపోకుండా మనో గదుల్లో దాచుకోవడం, ఈత పాయల జడ ఫోటోలు సందడి చేశాయి.
కొందరు రచయితల దొంగబుద్ధిని చక్కగా తేటతెల్లమ్ చేసి ఎవరికివారుగా ఊహించకుంటే బోలెడన్ని శబ్దరత్నాకరాలు వస్తాయని నేటితరానికి మంచి సూచన ఇచ్చిన తులసిగారికి ధన్యవాదములు మరియు అభినందనలు.
సోల్జర్ చెప్పిన కథలు: మొదటి వారం గురించి Amarendra Dasari అభిప్రాయం:
08/02/2022 6:20 am
బావుంది. అరుదైన కథలు, సిపాయి జీవితాలను demystify చేస్తున్నాయి. కొత్త రిక్రూట్లు నిలదొక్కుకున్నాక మరబొమ్మల స్థితిని దాటి సహజవ్యక్తుల్లా కనిపిస్తారని ఆశిస్తున్నాను.
అన్‍జానా జాస్మిన్ గురించి Jagatpati Yerramilli అభిప్రాయం:
08/02/2022 5:40 am
అంజానా జాస్మిన్. గుబాళింపు అద్భుతం. సెట్టి వీధిలో పెసరట్టు, ఉల్లి చెట్నీ నేను తినలేదుగానీ రావి శాస్త్రిగారి గురించి ఈ వ్యాసం చదివాక తెలియని విషయాలు ఎన్నో ఎన్నెన్నో తెలిసాయి. ఈ మధ్యన మీ నాన్నగారి శతజయంతి వేడుకల ముగింపు సందర్భంగా ప్రచురించిన “సి.ఎస్. శర్మ రచనలు” పుస్తకంలో “కథలు ఎందుకు రాస్తారు” అన్న వ్యాసం చివర్లో…
“రాయలేక ఆగేను
ఆగి సగం వగచేను
అసలు రాసేనా?” అన్న వాక్యాలు గుర్తుకొస్తున్నాయి.
ఆగొద్దు! శ్యామ్. ఇటువంటి ఆణిముత్యాలు నేటి సాహిత్యంలో ఏనాడో కనుమరుగై పోయాయి. నువ్వు వ్రాస్తూనే ఉండు. మేము చదివి ఆనందిస్తాం.
ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 10 గురించి srinivasarao v అభిప్రాయం:
08/02/2022 3:14 am
అక్కడ మంగలి షాప్‍లో రివాల్వింగ్ కుర్చీలో నారదుడికి, ఇక్కడి కీ డ్రాయింగ్ ఆర్టిస్ట్ కుర్చీ నాకూ అంటూ సారూప్యత భలే బాగ నచ్చింది. కంట్రోల్ లక్ష్మణ్ కంట్రోల్, బోధించే పని మాత్రం చేయకు అనిపించడం గురించి కూడా కళ్లకు కట్టినట్లుగా వ్రాసారు. అన్వర్ గారు మాత్రమే కాక పాఠకులని కూడా పరకాయ ప్రవేశం చేయించారు, ధన్యవాదాలు మరియు హేట్సాఫ్ అన్వర్ గారూ.
అన్‍జానా జాస్మిన్ గురించి తః తః అభిప్రాయం:
08/02/2022 2:35 am
డా. శ్యామ్:
రావిశాస్త్రికి ఒకన్నగారున్నట్టుగా -ఇప్పుడు మనమధ్యలేని – నాకు సన్నిహితమిత్రుడూ, రావిశాస్త్రితో బంధుత్వం ఉన్నవాడూ, ఆంధ్ర విశ్వకళాపరిషత్‌లొ బాటనీ ప్రొఫెసర్‍గా రిటైర్ అయిన వాడూ, సైటో జెనెటిక్స్‌లో ప్రసిద్ధమైన పరిశోధనలు పబ్లిష్ చేసినవాడూ అయిన పుచ్చా (ఇంకా మూడో నాలుగో ఇంగ్లిష్ అక్షరాల తర్వాత) నరసింగరావు చెప్పాడు: “జి. వి. అప్పారావని ఒకతను చాలా బాగారాస్తాడ్రా” అని ఆ అన్నగారు రావిశాస్త్రితో అన్నాడని.
రావిశాస్త్రి తనకు సబ్ కాస్ట్ ఫీలింగ్ ఉన్నదన్నాడన్న సంగతి గూడా అతను నాకు చెప్పాడు.
మరికొంచెం: ఆ అన్నగారు తెలుగులోకి దించిన షెల్లీ ‘టు ఎ స్కైలార్క్’ను నాకూ మరొక స్నేహితునికీ అతనే- మా ఫేకల్టీ క్లబ్బులో- వినిపించాడు. (అప్పుడు అతను చదివిన ప్రతి తెలుగు పద్యానికీ ఒరిజినల్ ఇంగ్లిష్ స్టాంజా నేను వినిపించాను.) రావిశాస్త్రి వచనం అనితర సాధ్యం.
నమస్కారాలతో
తఃతః
అన్‍జానా జాస్మిన్ గురించి Narasimha Rao Mulupuru అభిప్రాయం:
08/02/2022 1:29 am
“రాచ ” కొండను అద్దంలో చూపించారు 👌🙏
కళేబరం గురించి లిఖిత్ కుమార్ గోదా అభిప్రాయం:
08/02/2022 1:18 am
తెలుగులో డిస్టోపియా తరహాలో చాలా తక్కువ కథలు వచ్చాయి. ఇది మనవాళ్ళు కూడా కొత్తగా డిస్టోపియా తరహాలో కథలు రాయగలరు అని అనిపించింది. రైటర్‌కు అభినందనలు.
అన్‍జానా జాస్మిన్ గురించి NS Murty అభిప్రాయం:
08/01/2022 11:07 pm
శ్యామ్ గారూ,
మీరు ఇక్కడ రావిశాస్త్రి గారి గురించి ఇచ్చిన సమాచారం ఏ విశ్వవిద్యాలయంలోనైనా తెలుగులో ఒక సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించడానికి సరిపడినంత ఉంది. మీ వ్యాసాలు గాని, ప్రసంగాలు కాని ఎప్పుడూ ఒక కొత్త విషయాన్ని పాఠకుడికి / శ్రోతకి తెలియజేస్తూనే ఉంటాయి. ఈ వ్యాసం కూడా ఆ కోవలోకే వస్తుంది.
హృదయపూర్వక అభినందనలు.
ఊహల ఊట 15 గురించి కొ o కే పూడి అనూరాధ అభిప్రాయం:
08/01/2022 10:54 pm
ఊహల ఊట 15 చదివాను. తేనె పట్టులోని తేనెలా మధురంగా ఉంది. కూంబు అంటే దువ్వెన అనే తెలుసు. కానీ ఇది చదివాక కొత్త అర్థం తెలిసింది. తేనె పట్టు కుట్టు బాగుంది. ఊహలు ఊహలను ఎగిరిపోకుండా మనో గదుల్లో దాచుకోవడం, ఈత పాయల జడ ఫోటోలు సందడి చేశాయి.
కొందరు రచయితల దొంగబుద్ధిని చక్కగా తేటతెల్లమ్ చేసి ఎవరికివారుగా ఊహించకుంటే బోలెడన్ని శబ్దరత్నాకరాలు వస్తాయని నేటితరానికి మంచి సూచన ఇచ్చిన తులసిగారికి ధన్యవాదములు మరియు అభినందనలు.
అన్‍జానా జాస్మిన్ గురించి Anwar అభిప్రాయం:
08/01/2022 10:37 pm
ఎంత బాగా రాసారు, రాస్తారు శ్యామ్ గారు 🙏♥️🙏
అభిప్రాయ వేదిక గురించి రామాచారి బంగారు అభిప్రాయం:
08/01/2022 9:30 pm
వర్తమాన సమాజం తీరును కళ్ళకు కట్టినట్లు చూపించారు.కవి భాస్కరం భాస్వరమై మండేలాగుంటాడు ఎప్పుడు.ధిక్కార గళం తలవంచదు.