పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. Sita’s Eros -A Musical గురించి Veena అభిప్రాయం:

    09/16/2022 3:30 pm

    బాగుంది

  2. చందమామ ఎంత దూరం గురించి Srinivas Bandaa అభిప్రాయం:

    09/16/2022 8:39 am

    అద్భుతమైన ఊహాశక్తి!

  3. ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 11 గురించి T.subrahmanyam అభిప్రాయం:

    09/16/2022 3:58 am

    ఆహా యెంత చక్కని తెలుగు భాష ప్రయోగమండీ. ఏదైనా తినబోతే నోరు ఊరటం మామూలే కానీ మీ భాష చదువుతుంటే నోట్లోకి నీళ్లు ఊరుతున్నాయి.మిత్రమా! ఈ పుస్తకం; కాదు కాదు పుస్తకరాజం ఎక్కడ దొరుకుతుందో చెప్ప ప్రార్థన.

  4. అమ్మ చీర గురించి T.subrahmanyam అభిప్రాయం:

    09/16/2022 2:01 am

    అవును సుమీ! అమ్మలు ఏదేశంలో వున్నా అంతే.
    కృతజ్ఞతలతో

  5. స్థితప్రజ్ఞతా వాదం: వర్తమాన సమస్యలకి ప్రాచీన పరిష్కారం గురించి rao vemuri అభిప్రాయం:

    09/15/2022 5:31 pm

    “సెనెకా గ్రీకు నాటకకర్త… ” సెనెకా రోమన్ నాటకకర్త. గ్రీకు కాదు.

    [తప్పు సరిదిద్దాం. గమనికకు కృతజ్ఞతలు – సం.]

  6. చందమామ ఎంత దూరం గురించి రహ్మానుద్దీన్ అభిప్రాయం:

    09/15/2022 1:58 am

    చాలా బావుంది!

  7. ఉద్ధరేదాత్మనాత్మానం గురించి Lyla yerneni అభిప్రాయం:

    09/14/2022 2:02 pm

    ఈ కథలోని భగవానుడు, ఈ పత్రిక లోనే ప్రచురించబడిన “మేనక” తెలుగు ఆపెరాలో – ప్రదర్శించబడిన సుందరి-నందుడి ఉపనాటికలోని బుద్ధభగవానుడు ఒకరేనా? ఆ కథలో బుద్ధుడు ఎంత అఘాయిత్యం చేశాడో మీరు చదవనే లేదా?

    అక్కడి కథ ప్రకారం – సుందరీ, నందుడు, తింటానికి ఉంటానికి సరిపడా ఉన్న యువదంపతులు. ఒకరంటే ఒకరికి ఇష్టం. హాయిగా ఉంటున్న వాళ్లింటికి, బుద్ధుడు అడుక్కోటానికి వెళ్లి, భిక్ష తీసుకుని పోకుండా, వాళ్ల సంసారం చెడగొట్టి, లిటరల్లీ -నందుడికి చిప్ప చేతికిచ్చాడు బుద్ధుడు. ఆ తర్వాత మళ్లీ వాళ్లకు ఫేవర్ చేస్తున్నట్టు, సుందరి క్కూడా, ‘అర్హత?’ ఇప్పిస్తానంటాడు. తన జన్మ లోనే తనే ఇంత క్రూరపు పని చేసి, ఆ ఇంగితం లేనివాడు, ఇతరులకు, ఇతడు ముందు జన్మలు గురించి ఏం బోధలు చేస్తాడు?

    ఎందుకు నందుని ఊరివాళ్లు బుద్ధుడికి జడుస్తున్నారు? వాళ్ల ఇళ్లూ వాకిళ్లూ ఊడగొట్టుకుని, ఈయన అడుక్కుని కట్టించే వసతులకు పోయి, ఉన్న జుట్టు గొరిగించుకుని, గోచీలు పెట్టుకుని ఇతని సోది వింటూ పడి ఉండాల్సిన పనేమిటి? Makes no sense at all. భగవానుడు ఏం చేశాడయ్యా అంటే -నందుడు, సుందరి ఆస్తి అంతా అప్పనంగా పట్టేశాడు. My God! What a scam! తన రాజ్యం వదిలేసానంటూ, ఇంకో ఇంటర్నేషనల్ సన్యాసిరాజ్యం స్ధాపించాడా?

    ఈ కధలో ఉన్నదీ ఆ భగవానుడేనా? ఈయన లెక్చర్లలో విషయాలకు ఇప్పటికీ లాజికల్ కనెక్షన్ కనపడదు. ఆ సిల్లీ ఉపన్యాసం సోపంతా అయ్యాక, ఉన్నట్టుండి -ఏవో జంతువుల గురించి -వాటిని చంపొచ్చా, మనమే చచ్చిపోతే మంచిదా,- ఆ గోలేంటి? ఆనందుడికి సుతీమతీ లేదు ఈ భగవానుడితో రోడ్లమ్మట తిరగటానికి?

    ఆ రోడ్డు పక్కన ముసలమ్మ చుట్టూ వారిద్దరూ ఆ వెర్రి చేష్టలేంటి? హల్లీసకాల శ్రీశ్రీ కవిత్వంలో ప్రశ్నల కన్నా ఈ కథలో వీరి ప్రవర్తన ఇంకా సిల్లీయర్ గా ఉంది. శ్రీ శ్రీ పద్యం చదివారా? (మా ఒక కమ్యూనిస్ట్ చుట్టం అమెరికా వచ్చినప్పుడు నాకు ముందుగా చదివి వినిపించిన పద్యం ఇది. కమ్యూనిస్టులకు ఎందుకు ఈ పద్యం ఇష్టం?)

    “ఆ అవ్వే మరణిస్తే
    ఆ పాపం ఎవ్వరిదని
    వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్లిపోయింది
    ఎముకముక్క కొరుక్కొంటు
    ఏమీ అనలేదు కుక్క
    ఒక ఈగను పడవేసుకు
    తొందరగా తొలగె తొండ” ( విన్నకోట రవిశంకర్ వ్యాసం నుండి తీసుకున్నాను. Thank you. నా పుస్తకాలు కనబడలేదు.)

    గాలిలోకి విసురుతారు వెర్రి ప్రశ్నలు కొందరు కవులు. వారి జాలి హృదయం చూసి ఇతరులు మురిసి మూర్ఛ పోవాలని. ఎముక ముక్క, కుక్క, తొక్క, ఈగ, తొండ. ఏమిటీ సొల్లు అనకుండా, చతుర్మాత్రలు, పంచ మాత్రలు అంటూ కొందరు ఛాందసులు వ్యాసాలూ, కొందరు అరస-విరసులు సభలూ, సన్మానాలూ. ఆ ముసలామెకి తిండి తెచ్చిపెట్టరు. ఆమెనెందుకు తన షెల్టరు లోకి తీసుకువెళ్లడు బుద్ధుడు? ఈ జన్మలో ఒక్కరోజు అన్నం పెట్టించలేని వాడు, ముందు జన్మలు లేకుండా చేస్తాడంట? బుద్ధుడు తన కొంప కూలదోసుకొని, ఆ తర్వాత సిస్టమేటిక్గా, చాలామంది సంసారాలు చెడగొట్టినట్టుంది ఈ కథలు చదువుతుంటే. “ఆలికి అన్నం పెట్టలేనివాడు ఊరికి ఉపకారంట” అని తన కమ్యూనిస్ట్ మార్టియర్ మొగుడి గురించి ఒక స్త్రీ చెప్పిన తెలుగు సామెత నాకు తట్టకుండా ఎలా ఉంటుంది!

    రోడ్డు మీద కారులో వెళ్తుంటే, మెళ్లో కార్డ్ బోర్డ్ మీద “Broke. No money to buy food” అని రోడ్డు మధ్యలో డివైడర్ మీద బక్కచిక్కిపోయి, మనిషి కనిపిస్తుంటే, లేన్లు మారి, కారు విండో దించి, చేతికందిన కేష్ ఇస్తారెందరో. నేనిస్తాను. అతడు అప్పటికి అడుగుతున్నది అదే. ఆ రోజుకు బతికితే, మరోరోజుకి అవసరమైతే మరి కొందరిస్తారు. బతుకుతాడు. పాపం, పుణ్యం, బ్లేమ్ గేమ్, లాయర్ సవాళ్లలో ఏం లాభం లేదు. Darwinism is Darwinism. కాక్ రోచ్ గా పుట్టినా, మనిషిగా పుట్టినా ఆ ప్రాణికి ఒకటే జన్మ. మరో జన్మ లేదు. Dust to dust, ashes to ashes. The game is over.

    -Lyla

  8. తెలుగు కవిత – ప్రస్తుత పరిస్థితి గురించి జాన్ అభిప్రాయం:

    09/12/2022 10:24 am

    దిశానిర్దేశం. క్రొత్త పాత కవులకు మంచి అంశం. కవిత కావ్యం, వచన కవిత్వం యొక్క అవసరం, ప్రాధాన్యత వంటి చాలా ఉపయుక్తమైన మౌలిక విషయాలు తెలియజేశారు. ఎలా వ్రాయాలి, ఎలా వ్రాయకూడదు అనే విషయాన్ని కూలంకషంగా చర్చించారు. ధన్యవాదాలు నమస్సులు.

  9. ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 9 గురించి Anwar అభిప్రాయం:

    09/11/2022 9:06 pm

    తాడేపల్లి సుబ్రమణ్యం గారు, ఈ రచనను ప్రింట్ లో తేవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ మాటలో మీరు చదువుతున్న ప్రతి భాగాన్ని తాజాగా మూడు నాలుగు సార్లు తిరగవ్రాస్తున్నాను.మాటలు ఇంకా వీలయినంత సరళంగా, చవకగా, పొదుపుగా,తేలిగ్గా ఉండేలా. అనిపించేలా. పుస్తకం అచ్చులోకి రాగానే ఈ మాట పత్రిక ద్వారానే అందరికీ తెలియజేసే ప్రయత్నమూ చేస్తాను. ధన్యవాదాలు.

  10. శెలవు రోజున గురించి rammohan gs అభిప్రాయం:

    09/10/2022 12:26 pm

    good one