పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. నువ్వు! గురించి Lakshmi kandimalla అభిప్రాయం:

    11/01/2022 7:47 am

    ధన్యవాదాలు రామ్మోహన్ గారు.

  2. Rhapsody in Woods గురించి సాయి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:

    11/01/2022 7:45 am

    సీతా రాముల `eternal love` లో ఎంతమంది భాగస్వాములయ్యారో? – కాలాలకతీతంగా!

    పాత కొత్త కలయికల సమ్మేళనం అద్భుతంగా వుంది – కళ్ళముందు ఈ ballet గింగిర్లు కొడుతోంది. అద్భుతంగా వుంది: ఎవరైనా ప్రదర్శిస్తే చూడాలన్నంతగా!

    నండూరిని, విశ్వనాథనీ, సుబ్బులక్ష్మినీ, చిట్టిబాబునీ, రఫీని, బెతోవన్‌నీ ఇలా అందర్నీ సమ్మిళితం చేసిన తీరు బాగా నచ్చింది.

    బాగా నచ్చినవి కొన్ని:

    వెడద భుజములవాడ! వెలుగుల మోము వాడ!
    సొగసు విరిసే వయసు – అగరు ఎరుపేలే!
    తగవు కొరకే కదర – రగులకుము రామా!
    వినబడే ప్రణవమై, ధరణిజ ప్రణయమే పఠనమై

    అక్షరాల కౌగిట్లో సంగీతం తలదాచుకున్నంతగా – అధ్భుతంగా వుంది లైలా గారూ!

    You made my day!

  3. వంద కుర్చీలు గురించి Amarendra Dasari అభిప్రాయం:

    11/01/2022 6:41 am

    ఓహ్, ఎలాంటి, ఎంతటి కథావస్తువు! కథంతా ఒకేసారి చదవగలిగితే బావుండేది.

  4. జానకమ్మ ఇంగ్లండ్‌ యాత్ర గురించి Amarendra Dasari అభిప్రాయం:

    11/01/2022 5:34 am

    బాలాజీ గారూ, నవోదయ హైదరాబాద్, ఫోన్ 9247471362, సోల్ డిస్ట్రిబ్యూటర్లు.

  5. మాతృత్వానికి మరో ముడి గురించి tadepalli subrahmanyam అభిప్రాయం:

    10/30/2022 4:25 am

    విషాదంగా మనసును తాకే కథ. నిజమైన భక్తి కంటే ప్రదర్శన పటాటోపాలు ఎక్కువైన చోట పూర్తిగా ఇలాగే ఉంటుంది. అందుకే జీవితాన్ని బాగా పరికించిన వాళ్ళు వేయి రామాయణాలకంటే వందరూపాయల నోటు; దీనికంటే ఒక్క మెతుకు అన్నం గొప్పవని చెపుతారు.

  6. జానకమ్మ ఇంగ్లండ్‌ యాత్ర గురించి K BALAJI MAJUMDAR అభిప్రాయం:

    10/29/2022 8:51 pm

    అమరేంద్ర గారూ, ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో సెలవివ్వగలరు.

  7. చలంతో రజని ముఖాముఖి గురించి రాధికాప్రసాద్ అభిప్రాయం:

    10/29/2022 4:44 am

    అద్భుతమైన రూపకం! మహామహుల గళం వినే అవకాశం అదృష్టం కొద్దీ దొరికింది. ధన్యోస్మి.🙏🏻

  8. కొండ నుంచి కడలి దాకా గురించి రాధికాప్రసాద్ అభిప్రాయం:

    10/29/2022 4:39 am

    రూపకం గతంలో విన్నాను. చాలా సంవత్సరాల తరువాత వింటున్నాను. అందించినందుకు ధన్యవాదాలు 🙏🏻
    ఇంతమంది పెద్దలు చెబుతారు అని అడుగుతున్నాను. చిత్తరంజన్ గారు హైదరాబాద్ ఆకాశవాణిలో ఈపాట నేర్చుకుందాం శీర్షికన నేర్పిన పాట “గోదావరి నాదఝరీ, ఎన్నెన్ని యుగాల స్మృతులు ఎద బరువై…”. ఎంతో అద్భుతమైన సాహిత్యం, సంగీతం కలిసిన ఈపాట వింటుంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత దూరదర్శన్ లో కూడా వినవచ్చేది. ఈమధ్య చాలా నెలలుగా ఈ పాట కోసం వెతుకుతూ ఉన్నాను. ఎక్కడా కానరాలేదు. ఈ పాటను ఈ తరం పిల్లలు కూడా వినాల్సిన అవసరం ఉంది కదూ. ఎవరైనా దయచేసి ఈ పాటను అందివ్వగలరా.. ముందుగా ధన్యవాదాలు.. 🙏🏻

  9. కలలు రాని నిద్ర గురించి హేమావతి బొబ్బు అభిప్రాయం:

    10/29/2022 2:41 am

    కథ సహజంగా చాలా బాగుంది

  10. కూటి రుణం గురించి Tadepalli subrahmanyam అభిప్రాయం:

    10/28/2022 2:25 am

    జయహో కెత్తెల్ సాహెబ్ మహారాజ్ కి! బహుశా కాళిదాసు, వాల్మీకి కూడా వాళ్ళు వ్రాసిన ఇతిహాసాలు చదివించుకుని అంతే బ్రహ్మానందం అనుభవించి వుంటారు. వ్రాసిన తెలుగులో ఇంద్రధనస్సులు సృష్టించారు రచయిత. ఇంత గొప్ప (సంఘటన అందామా?) దృశ్యం కళ్ళముందు నిలిపిన వారికి వేనవేల కృతజ్ఞతలు.