నువ్వు!

గుండె పెదవులపై
నిలిచిన విషాదం
నిశ్శబ్ద దుఃఖం
రెక్కలు విరిగిన పక్షిలా
విలవిలలాడుతూ

రాలిన రంగు రంగుల పూలు
కథలు కథలుగా
కాగితంపై

కలవరంగా అరుస్తున్న
కాకి దుఃఖం
ఒక ఖాళీ మధ్యాహ్నంలో

చెంపలపై
కన్నీటి చారికలు
అద్దం
మసక నదిలా కనిపిస్తో

అర్ధరాత్రి
ఉప్పెనలా
వెక్కిళ్ళ ప్రవాహం వరదల్లే
ఆసాంతం
భయాల బరువులు ముంచేస్తూ

ఇరుకైన పంజరంలో ముద్దలా
ఎముకలు విరిగిన దేహం
మౌనంలో కాలుతూ

నువ్వు!