వేలూరి గారి వ్యాసం 14 ఏళ్ల తర్వాత కూడా తాజాగా ఉంది. కొన్ని వ్యాసాలు అంత త్వరగా పాతబడవు. గ్రంథ చౌర్యం మీద ఇంత సమగ్రంగా ఎవరూ రాయలేరు అనుకుంటాను. 2008 లో నానీల నాన్న ప్రముఖ కవి నక్క గోపీ, నోబెల్ గ్రహీత Octavio Paz ను కాపీ కొడుతూ దొరికిన వైనం “ఔరా! ఏమి ఈ ‘దిగుమతి’? (ఆంధ్రజ్యోతి వివిధ)” అన్న లింకుగా కనిపిస్తుంది. కానీ ఆ లింకు ఇప్పుడు పనిచేయదు. తెలుగు పత్రికలకు కనీస వనరులు కరువు – సాహిత్య విషయాలకు కూడా archives ఉండవు. ఇలాంటప్పుడు ఈమాట లాంటి పత్రికల విలువ తెలిసి వస్తుంది.
బ్రహ్మానందం గారు: సదరు రచయిత బ్లాగు వివరాలు ఇచ్చి ఉంటే బావుండేది. తల్లకిందులై నానా కష్టాలు పడి త్యాగరాజు మీద ఒకరు చక్కని వ్యాసాలు రాస్తే వాటిని తర్జుమా చేసి తమవిగా చలామణి చేసుకోవడం నేరం.
తెలుగులో నేను గమనించిన విషయం – ఒక పరభాషాకవిని మనం అనువాదం చేస్తాము, ఆ పరభాషా మనకు రాదు, ఇంగ్లీషు సాయంతోనే బండి నడిపించాలి. అప్పుడు, ఆంగ్ల అనువాదకుని పేరు ఇవ్వాలా వద్దా ? ఉదాహరణకు, శ్రీ శ్రీ అనువాదాలు చూసినా అటువంటి వివరాలు మనకు కనిపించవు. అప్పట్లో సంపాదకులు ఇవన్నీ పట్టించుకునేవారు కాదా ? ఆంగ్ల అనువాదకుడు మూలం చదివి, సదరు కవి కవిత్వాన్ని అంచనా వేసి ఒక లఘు టిప్పణి రాశాడే అనుకుందాం, మనవాళ్ళు దాన్ని తెలుగు చేసి దాని కర్తృత్వాన్ని తమ ఖాతాలో వేసుకుంటారు- మూలం చదివి అందులో లోతులు ముట్టినట్టు పోజు. టన్నులకొద్దీ అనువాదం చేసేవారు తమకు కలిగిన inspiration, అందులో ఇతరుల ప్రమేయం, అనువాదంలో పొందిన సాయం – ఏవీ రాయరు. అందుకే నేను వీరిని స్వయంభువు అన్నది. పుస్తకాలు వేసేవారు పొడి పొడి థాంక్స్ కాకుండా, ఎవరి వల్ల ఏమి పొందామో ఆ వివరాలు పొందుపరిస్తే – పుస్తక ప్రచురణ వెనుక ఎంత భారం ఉందో అందరికీ తెలిసివస్తుంది.
ఊహల ఊట 18
గురించి Rama Rao Mallapragada అభిప్రాయం:
‘మా దయ వల్ల, మా కరుణ వల్ల, మాకున్న సమతాధర్మంవల్ల మాత్రమే నీకు ఇక్కడ కూర్చునే అవకాశం కలిగింది. కాబట్టి ఆ కృతజ్ఞతతో మాకు విశ్వాసబద్ధుడిగా ఉండు.’
అక్షర సత్యం. తాము ఉదాత్తులమనిపించుకోవాలనే తపనతో ఉన్నత వర్గీయులు తమకంటే సామాజికంగా దిగువ వర్గాల వ్యక్తుల పట్ల కొన్ని అనువైన సందర్భాలలో ఉదాత్తంగా వ్యవహరించే మానసిక (రుగ్మతని) లక్షణాన్ని బాగా చూపించారు. అరుదైన సమాచారాన్ని కథనంలో ఎలా మేళవించ వచ్చు అన్నదానికి ఈ కథ మంచి ఉదాహరణ. భాస్కర్ గారూ, మీ అనువాదానికి హృదయపూర్వక అభినందనలు.
అప్పట్లో సంగీతము, కుట్లు (క్రాఫ్ట్)కి ఒక పిరియడ్ కేటాయించేవారు. అలా బడిలోనే వృత్తి విద్యలు అభ్యసించడాన్ని గుర్తుతెచ్చారు. మొక్కలకి పురుగు పట్టకుండా పొగాకు నీరు పొయ్యడం కొత్త విషయం. బుర్రకి పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలాంటి రచనలే చదవాలి. బాల్యపు తీపిగురుతులను అందిస్తున్న తులసి గారికి అభినందనలు.
నమస్కారం సాయి గారు, మీ వ్యాసాలు ‘మనకు తెలియని మన త్యాగరాజ” అన్నీ చదివాను. త్యాగరాజ జీవితం పై మీరు హిస్టారికల్ పాయింట్ అఫ్ వ్యూ లో దర్శించడం చాలా బాగా నచ్చింది. ఇలాంటి వ్యాసాలు చాలా అరుదుగా చదువుతూ ఉంటాము. మీరు ఇంత మంచి వ్యాసం మాకు అందించినందుకు ధన్యవాదాలు మరియు అభినందనలు
ఊహలకందని మొరాకో -1 గురించి Raju J అభిప్రాయం:
11/04/2022 12:10 pm
ముక్తసరిగా, హాయిగా ఉంది
వంద కుర్చీలు గురించి పద్మావతి రాంభక్త అభిప్రాయం:
11/04/2022 10:19 am
ఎంత లోతైన కథ. మంచి అనువాదం. మిగిలిన కథ కోసం మరొక నెల ఆగాలంటే కష్టమే.
ఈ రచన నా సొంతం కాదు! గురించి తమ్మినేని యదుకులభూషణ్ అభిప్రాయం:
11/04/2022 7:20 am
వేలూరి గారి వ్యాసం 14 ఏళ్ల తర్వాత కూడా తాజాగా ఉంది. కొన్ని వ్యాసాలు అంత త్వరగా పాతబడవు. గ్రంథ చౌర్యం మీద ఇంత సమగ్రంగా ఎవరూ రాయలేరు అనుకుంటాను. 2008 లో నానీల నాన్న ప్రముఖ కవి నక్క గోపీ, నోబెల్ గ్రహీత Octavio Paz ను కాపీ కొడుతూ దొరికిన వైనం “ఔరా! ఏమి ఈ ‘దిగుమతి’? (ఆంధ్రజ్యోతి వివిధ)” అన్న లింకుగా కనిపిస్తుంది. కానీ ఆ లింకు ఇప్పుడు పనిచేయదు. తెలుగు పత్రికలకు కనీస వనరులు కరువు – సాహిత్య విషయాలకు కూడా archives ఉండవు. ఇలాంటప్పుడు ఈమాట లాంటి పత్రికల విలువ తెలిసి వస్తుంది.
బ్రహ్మానందం గారు: సదరు రచయిత బ్లాగు వివరాలు ఇచ్చి ఉంటే బావుండేది. తల్లకిందులై నానా కష్టాలు పడి త్యాగరాజు మీద ఒకరు చక్కని వ్యాసాలు రాస్తే వాటిని తర్జుమా చేసి తమవిగా చలామణి చేసుకోవడం నేరం.
తెలుగులో నేను గమనించిన విషయం – ఒక పరభాషాకవిని మనం అనువాదం చేస్తాము, ఆ పరభాషా మనకు రాదు, ఇంగ్లీషు సాయంతోనే బండి నడిపించాలి. అప్పుడు, ఆంగ్ల అనువాదకుని పేరు ఇవ్వాలా వద్దా ? ఉదాహరణకు, శ్రీ శ్రీ అనువాదాలు చూసినా అటువంటి వివరాలు మనకు కనిపించవు. అప్పట్లో సంపాదకులు ఇవన్నీ పట్టించుకునేవారు కాదా ? ఆంగ్ల అనువాదకుడు మూలం చదివి, సదరు కవి కవిత్వాన్ని అంచనా వేసి ఒక లఘు టిప్పణి రాశాడే అనుకుందాం, మనవాళ్ళు దాన్ని తెలుగు చేసి దాని కర్తృత్వాన్ని తమ ఖాతాలో వేసుకుంటారు- మూలం చదివి అందులో లోతులు ముట్టినట్టు పోజు. టన్నులకొద్దీ అనువాదం చేసేవారు తమకు కలిగిన inspiration, అందులో ఇతరుల ప్రమేయం, అనువాదంలో పొందిన సాయం – ఏవీ రాయరు. అందుకే నేను వీరిని స్వయంభువు అన్నది. పుస్తకాలు వేసేవారు పొడి పొడి థాంక్స్ కాకుండా, ఎవరి వల్ల ఏమి పొందామో ఆ వివరాలు పొందుపరిస్తే – పుస్తక ప్రచురణ వెనుక ఎంత భారం ఉందో అందరికీ తెలిసివస్తుంది.
ఊహల ఊట 18 గురించి Rama Rao Mallapragada అభిప్రాయం:
11/04/2022 4:25 am
బాగుంది. కానీ వెనకటి వాటoత కాదు.
సోల్జర్ చెప్పిన కథలు: కాదేదీ! గురించి Amarendra Dasari అభిప్రాయం:
11/03/2022 8:38 pm
ఇంకా కొత్త రిక్రూట్ల (క్రమ)శిక్షణలో ఈ ఫ్యూడలిజం కలోనియలిజంల అతిచక్కని మేళవింపు కొనసాగుతోందా!!
డెస్టినేషన్ గురించి శిరీష్ ఆదిత్య అభిప్రాయం:
11/03/2022 7:14 pm
వైబ్ మస్తుంది. ఒక పదిహేడు పద్దెనిమిదేళ్ళ వయసులో కలిగే భావనలు, fierce desire and desperate longing, బా convey అయ్యాయి.
వంద కుర్చీలు గురించి NS Murty అభిప్రాయం:
11/03/2022 9:53 am
అక్షర సత్యం. తాము ఉదాత్తులమనిపించుకోవాలనే తపనతో ఉన్నత వర్గీయులు తమకంటే సామాజికంగా దిగువ వర్గాల వ్యక్తుల పట్ల కొన్ని అనువైన సందర్భాలలో ఉదాత్తంగా వ్యవహరించే మానసిక (రుగ్మతని) లక్షణాన్ని బాగా చూపించారు. అరుదైన సమాచారాన్ని కథనంలో ఎలా మేళవించ వచ్చు అన్నదానికి ఈ కథ మంచి ఉదాహరణ. భాస్కర్ గారూ, మీ అనువాదానికి హృదయపూర్వక అభినందనలు.
ఊహల ఊట 18 గురించి కొ o కే పూడి అనూరాధ అభిప్రాయం:
11/03/2022 5:32 am
అప్పట్లో సంగీతము, కుట్లు (క్రాఫ్ట్)కి ఒక పిరియడ్ కేటాయించేవారు. అలా బడిలోనే వృత్తి విద్యలు అభ్యసించడాన్ని గుర్తుతెచ్చారు. మొక్కలకి పురుగు పట్టకుండా పొగాకు నీరు పొయ్యడం కొత్త విషయం. బుర్రకి పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలాంటి రచనలే చదవాలి. బాల్యపు తీపిగురుతులను అందిస్తున్న తులసి గారికి అభినందనలు.
మనకు తెలియని మన త్యాగరాజు -1 గురించి BhavaniKL అభిప్రాయం:
11/03/2022 1:01 am
నమస్కారం సాయి గారు, మీ వ్యాసాలు ‘మనకు తెలియని మన త్యాగరాజ” అన్నీ చదివాను. త్యాగరాజ జీవితం పై మీరు హిస్టారికల్ పాయింట్ అఫ్ వ్యూ లో దర్శించడం చాలా బాగా నచ్చింది. ఇలాంటి వ్యాసాలు చాలా అరుదుగా చదువుతూ ఉంటాము. మీరు ఇంత మంచి వ్యాసం మాకు అందించినందుకు ధన్యవాదాలు మరియు అభినందనలు
కూటి రుణం గురించి Amarendra Dasari అభిప్రాయం:
11/03/2022 12:02 am
సాహితీ వేదిక, ఢిల్లీ తన నెలవారీ సమావేశంలో కూటి ఋణం కథను నవంబరు 6న చర్చిస్తోంది