పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16451

  1. సోల్జర్ చెప్పిన కథలు: బాటిల్ పెరేడ్ గురించి Pathakudu అభిప్రాయం:

    05/01/2023 8:58 am

    చిన్న పిల్లాడెవరో వజ్రాల బస్తాని తన్నేసి విరజిమ్మేసినట్లు నల్లని ఆకాశం నిండా మిలమిలా మెరుస్తున్నాయి నక్షత్రాలు – Great Poetic expression! kudos!

  2. అహం మిగిల్చేది గురించి Rama Rao అభిప్రాయం:

    04/30/2023 12:51 am

    మీ భావ కవిత “అహం మిగిల్చేది” చాల బాగుంది. అభినందనలు.

  3. వెంపరాల వారి సాహిత్య యాత్ర గురించి తటవర్తి రాజగోపబాలం ‌‌ అభిప్రాయం:

    04/29/2023 7:37 pm

    మురళి గారు. నమస్తే.

    సుమారు నలబై ఏళ్ళ క్రితం నేను మహామహులు శ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రిగారిని కాకినాడలో వారింటికి వెళ్లి దర్శనం చేసికొని ఒకగంటసేపు వారి సలహాలను (అప్పుడు నేను Ph.D కోసం చేస్తున్న యస్వి.జోగారావుగారి ప్రసన్న కుసుమాయుధ‌‌‌ కావ్యం గురించి) సూచనలను వినిన మహద్భాగ్యాన్ని పొందినాను.జనని భారతీదేవిని కనులార గాంచిన దివ్యానుభూతి అది.

    ఇప్పుడు మీరు పంపిన ఈ లంకెవలన వారి మాటలలో వారి సాహిత్య స్వీయచరిత్రను వినే భాగ్యం కలిగింది. ఎంత కఠోరపరిశ్రమ, ఎంత తపస్సు చేశారో! ఇట్టి మహానుభావుల అవిశ్రాంతతపఃఫలాలనే నాలాంటి వారం ఆస్వాదిస్తున్నాం. వారల ఋణం తీరేది, తీర్చగలిగేదీ కాదు.

    శతాధిక కృతజ్ఞతలతో
    రాజగోపబాలం 🙏

  4. సి. ఎస్. ఆర్. ఆంజనేయులు: కొన్ని పాటలు, పద్యాలు గురించి Rajendra Prasad Maheswaram అభిప్రాయం:

    04/27/2023 9:23 pm

    తెలుగునాట అటు రంగస్థలం లోనూ ఇటు సినిమాల్లోనూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాయించకున్న విలక్షణ నటుడు వీరు. ఈ తరం వారికి వారిని గురించి పరిచయం చేయటం వారు పాడిన పద్యాలు పాటలు పరిచయం చేయటం నిజంగా ఒక గొప్ప పని. మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు. 🙏👏

  5. పురూరవ గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    04/27/2023 10:38 am

    ఇన్ వాలిడ్ యూ.ఆర్.ఎల్. అని వస్తోంది. పురూరవ నాటకం పి.డి.ఎఫ్ కోసం ఏదైనా లింక్ ఉంటే పెట్టండి దయచేసి!

    అసౌకర్యానికి చింతిస్తున్నాం. పిడిఎఫ్ లింకు ఇప్పుడు సరి చేశాం. మళ్ళీ ఒకసారి చెక్ చేయండి.

  6. సా విరహే తవ దీనా గురించి Sai Brahmanandam అభిప్రాయం:

    04/25/2023 11:53 pm

    దర్బారు, కానడ, దర్బారి కానడ రాగాల్లో నిర్వహించిన సినిమా పాటల కార్యక్రమం.
    తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమా పాటల కూర్పు. సంగీతం ఇష్టమున్న వారు వింటారని:

  7. పురూరవ గురించి Angara Venkata Satya Gopala Swamy అభిప్రాయం:

    04/25/2023 10:30 am

    ఇన్ వాలిడ్ యూ.ఆర్.ఎల్. అని వస్తోంది. పురూరవ నాటకం పి.డి.ఎఫ్ కోసం ఏదైనా లింక్ ఉంటే పెట్టండి దయచేసి!

  8. హలాల్‌ గురించి G S BADRI NATH అభిప్రాయం:

    04/21/2023 9:03 am

    చక్కని భాష. మానవ స్వభావం, కడప ప్రజల సంస్కృతి సొగసుగా ఉలితో చెక్కడం షరీఫ్ గారి స్వంతం.

  9. నాకు నచ్చిన పద్యం: లాక్షణికులు గుర్తించని అనురాగభేదము గురించి Lyla yerneni అభిప్రాయం:

    04/19/2023 9:21 am

    “అంతేకాదు, ఈ కవితకు కవిగారుంచిన శీర్షిక అనురాగభేదము. ‘కలిగెను భేదమొక్కటిదె’ అన్న ఎత్తుగడ ఏతదనుగుణమైనదే. భేదమంటే ఒక విశేషము.”

    పరిమి గారు:

    ఇక్కడ కవి ఉద్దేశించింది అది కాదు. ‘భేదము’ పదం ఇక్కడ వాడుక చిన్నయ సూరి మిత్రలాభము, మిత్రభేదము లో వలె. అనురాగలాభము. అనురాగభేదము. పద్యం లోని నాయకుడికి ముందు కొంతకాలం లభించిన అనురాగం. తర్వాత చెడిన అనురాగము అని. Paradise lost; Paradise regained titles లాగా. పోగొట్టుకున్న స్వర్గం, తిరిగి లభించిన స్వర్గం లాగా.

    మీ వ్యాసం అర్ధం చేసుకోవటానికి నేను చదువుతున్నవి, ఈ క్రిందివి.
    1. Bhoja’s Sringara Prakasa Raghavan V 1978 by Manish Dutta, (Detailed notice of contents, page 41.)
    2. Bhoja’s Sringara Prakasa, Sheldon Pollock.

    Thanks to you, As I was reading and thinking about your essay, I read about V. Raghavan, and there after I also listened to M.S. Subbulakshmi singing Chandrasekharam Ashraye – a carnatic musical piece written by Raghavan.

    All new and pleasurable to me
    -లైలా.

  10. హలాల్‌ గురించి Imran అభిప్రాయం:

    04/18/2023 3:38 pm

    చాలా మంచి సందేశం ఇచ్చారు.