కొడవళ్ళ హనుమంత రావు గారు, నేను ఇప్పుడే చదివాను మీ అభిప్రాయాన్ని. మీ అభిప్రాయం తో నాకు పూర్తి ఏకీభావం వుంది.
అసలు ఆసక్తిఅంటు వుండాలి గాని ఎలాంటి పుస్తకాన్నైనా చదవ వచ్చు. మీకు కొన్ని కారణాల వల్ల పద్యం మీద ఇష్టం కలిగితే, మరి కొందరికి మరికొన్ని కారణలకి పద్యం గాని లేదా ఇతర కవిత్వం గాని ఆకట్టుకొవచ్చును. అందువల్ల విషయం ఏదైనా, కారణం ఏమైనా పద్యం చదవాలన్న ప్రేరణ కలగటం కదా ముఖ్యం.
చాలామంది దృష్టికి రాని అనేక సరదా పద్యాలు వున్నాయి మన సాహిత్యంలో. అవి చదివే సందర్భం మీకు తటస్థపడాలని మనసా కోరుకుంటున్నాను.
వుదాహరణకి:
“సహసా నఖంపచ” మనుచరిత్ర లో,
అలాగే “చలిగాలి బొండు మల్లెల పరాగము రేచి” మనుచరిత్ర లో
“తరగల్ పిప్పల పాత్రముల్” “పవి పుష్పంబగు” లాంటివి కనీసం ఒక 25 పద్యాలైనాదూర్జటి కాళహస్తీశ్వర శతకం నించి.
కందుకూరి రుద్రకవి జనార్దనాష్టకం మొత్తంగా 8 పద్యాలు
ఒక చిన్న పద్యం పాండురంగ మహత్మ్యం నించి తెనాలి రామకృష్ణునిది. “వెడదకన్నుల వాని, వే నామముల వాని” అన్నది
క్రీడాభిరామం లో “శ్రీమదసత్యమధ్యకును, చిన్నివయారికి ముద్దులాడికిన్” అనే ప్రేమ లేఖ
ప్రస్తుతానికి వీటితో ఆపుతాను. మీకు వుద్దేశించి నేను ఇది రాస్తున్న. మీతోపాటు మంచి పద్యాలంటే సరదాపడే ఇతర సాహితీ మిత్రులు కూడ చదివి ఆస్వాదిస్తారన్న ఆశతో వీటిని పేర్కొంటున్నాను. ఇవి మీరు చదివి మీకు నచ్చితే సంతొషమే.
బహుశా నా తరమంతా వ్యావహారికమే అభ్యుదయమని నమ్ముతూ పెరిగామంటే అతిశయోక్తి కాదేమో! ఇప్పుడీ నాలుగు వ్యాసాలు చదివి ఆ నమ్మకాలన్నీ మార్చేసుకున్నానని చెప్పను కానీ, ఓపెన్ మైండ్ తో చదివితే వీరి వాదంలో కూడా వ్యావహారిక భాషావాదులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందనే అని పిస్తుంది. ఇంత చదువూ చదివి కనీసం పోతన భాగవతం కూడా సొంతగా చదువుకోలేక పోవటం అంతకంటే షేక్స్పియర్ నాటకాలనే సులభంగా చదువుకోగలగటం చూస్తుంటే వీరి వాదాలు మరింత అర్థవంతంగా తోస్తున్నాయి.
అదే సమయంలో సాహిత్యాన్ని జన బాహుళ్యానికి దగ్గరగా తెచ్చి, ఇన్ని వేల సంవత్సరాల్లో జరగని సామాన్యుల జీవన చిత్రణ గత వందేళ్ళలోనే జరగటానికి వ్యావహారిక భాషని ఆశ్రయించటం వల్లనే సాధ్యమయుంటుందనే నా అమాయక మయిన నమ్మకానికి ఏమన్నా ఆధారం ఉందోలేదో పెద్దవాళ్ళే చెప్పాలి.
ఇలా రెంటినీ బాలెన్స్ చేసే మార్గం చెప్పే మోడరేట్ గ్రూప్ ఎందుకు ఏర్పడ లేదు? ఏర్పడినా అది నా బోంట్లకు తెలీదా?
ఏమయినా ఈ వ్యాసాలకి ఆనాటి వ్యావహారిక వాదులు ఏం సమాధానం చెప్పారో, ఆ తర్వాతి కాలంలో ఏంజరిగిందో చెప్పాలి.
అలాగే ఈ ఉత్తరాలనీ, వ్యాసాలనీ ఈమాట ఎక్కణ్ణించి సేకరించిందో చెపితే బావుంటుంది.
నన్నయ హంసగీతికలు గురించి rama bharadwaj అభిప్రాయం:
06/07/2008 5:37 am
కొడవళ్ళ హనుమంత రావు గారు, నేను ఇప్పుడే చదివాను మీ అభిప్రాయాన్ని. మీ అభిప్రాయం తో నాకు పూర్తి ఏకీభావం వుంది.
అసలు ఆసక్తిఅంటు వుండాలి గాని ఎలాంటి పుస్తకాన్నైనా చదవ వచ్చు. మీకు కొన్ని కారణాల వల్ల పద్యం మీద ఇష్టం కలిగితే, మరి కొందరికి మరికొన్ని కారణలకి పద్యం గాని లేదా ఇతర కవిత్వం గాని ఆకట్టుకొవచ్చును. అందువల్ల విషయం ఏదైనా, కారణం ఏమైనా పద్యం చదవాలన్న ప్రేరణ కలగటం కదా ముఖ్యం.
చాలామంది దృష్టికి రాని అనేక సరదా పద్యాలు వున్నాయి మన సాహిత్యంలో. అవి చదివే సందర్భం మీకు తటస్థపడాలని మనసా కోరుకుంటున్నాను.
వుదాహరణకి:
ప్రస్తుతానికి వీటితో ఆపుతాను. మీకు వుద్దేశించి నేను ఇది రాస్తున్న. మీతోపాటు మంచి పద్యాలంటే సరదాపడే ఇతర సాహితీ మిత్రులు కూడ చదివి ఆస్వాదిస్తారన్న ఆశతో వీటిని పేర్కొంటున్నాను. ఇవి మీరు చదివి మీకు నచ్చితే సంతొషమే.
సాహిత్యాకాంక్షలతో,
rama.
గ్రామ్యాదేశ నిరసన సభ – కందుకూరి వీరేశలింగం పంతులుగారి ప్రసంగము గురించి sUryuDu అభిప్రాయం:
06/07/2008 5:19 am
I second his opinion 🙂
ఈమాట జూన్ 2008 ప్రత్యేక సంచిక గురించి అక్కిరాజు భట్టిప్రోలు అభిప్రాయం:
06/07/2008 1:16 am
ఈమాట చదవటమే ఓ ఎడ్యుకేషన్!!
బహుశా నా తరమంతా వ్యావహారికమే అభ్యుదయమని నమ్ముతూ పెరిగామంటే అతిశయోక్తి కాదేమో! ఇప్పుడీ నాలుగు వ్యాసాలు చదివి ఆ నమ్మకాలన్నీ మార్చేసుకున్నానని చెప్పను కానీ, ఓపెన్ మైండ్ తో చదివితే వీరి వాదంలో కూడా వ్యావహారిక భాషావాదులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందనే అని పిస్తుంది. ఇంత చదువూ చదివి కనీసం పోతన భాగవతం కూడా సొంతగా చదువుకోలేక పోవటం అంతకంటే షేక్స్పియర్ నాటకాలనే సులభంగా చదువుకోగలగటం చూస్తుంటే వీరి వాదాలు మరింత అర్థవంతంగా తోస్తున్నాయి.
అదే సమయంలో సాహిత్యాన్ని జన బాహుళ్యానికి దగ్గరగా తెచ్చి, ఇన్ని వేల సంవత్సరాల్లో జరగని సామాన్యుల జీవన చిత్రణ గత వందేళ్ళలోనే జరగటానికి వ్యావహారిక భాషని ఆశ్రయించటం వల్లనే సాధ్యమయుంటుందనే నా అమాయక మయిన నమ్మకానికి ఏమన్నా ఆధారం ఉందోలేదో పెద్దవాళ్ళే చెప్పాలి.
ఇలా రెంటినీ బాలెన్స్ చేసే మార్గం చెప్పే మోడరేట్ గ్రూప్ ఎందుకు ఏర్పడ లేదు? ఏర్పడినా అది నా బోంట్లకు తెలీదా?
ఏమయినా ఈ వ్యాసాలకి ఆనాటి వ్యావహారిక వాదులు ఏం సమాధానం చెప్పారో, ఆ తర్వాతి కాలంలో ఏంజరిగిందో చెప్పాలి.
అలాగే ఈ ఉత్తరాలనీ, వ్యాసాలనీ ఈమాట ఎక్కణ్ణించి సేకరించిందో చెపితే బావుంటుంది.
అక్కిరాజు భట్టిప్రోలు
నీటి అద్దాలు గురించి Ananth అభిప్రాయం:
06/05/2008 9:22 pm
ఫణి గారు,
నీటి అద్దాలు, ఊట, నీటి గుంటలు, వయసునిబట్టి మారేతీరు బాగుంది. మంచి కవిత.
డాలర్ దేహాన్నొదిలి గురించి Ananth అభిప్రాయం:
06/05/2008 8:59 pm
చాలా బాగుంది. కానీ, బతుకుబాటలొ ‘రూపాయి దేహాన్ని’ ధరించకతప్పదు.
చివరకు మిగిలేది గురించి Ananth అభిప్రాయం:
06/05/2008 8:49 pm
నిజం, చివరకుమిగిలేది.. ఇదే… ఇదే…
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 3: బాబేజ్ యంత్రాలు గురించి Indrani Palaparthy అభిప్రాయం:
06/05/2008 12:12 am
హనుమంత రావు గారు, మంచి వ్యాసం.అభినందనలు.
ఇంద్రాణి పాలపర్తి.
అలిగితివా… గురించి A.Prasuna అభిప్రాయం:
06/04/2008 8:34 pm
చాలా బావుందండీ.
నాకు నచ్చిన పద్యం: ధూర్జటి చంద్రబింబపు వర్ణన గురించి Kiran అభిప్రాయం:
06/04/2008 5:50 am
చాలా బాగుందండీ మీ ఈ మాట.
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 2 గురించి Srinivas Bheemani అభిప్రాయం:
06/04/2008 4:16 am
నాగ మురళీ గారూ ! Kudos !! Your analytical stuff is veritably bangup..await తరువాయి సంచిక…
Regards,
srinivas