మహెజబీన్ కవితలు మధుకుల్యలు, తేనె వాకలు. వాక్యం చలువరాయి అయితే, కవిత ఒక చల్లని ఇల్లు. పాఠకులు ఎంతసేపైనా సేదదీరగల అద్భుతమైన సృజనాత్మకత ఈమె సొంతం.
న్యాయపతి శ్రీనివాసరావు
న్యాయపతి శ్రీనివాసరావు రచనలు
కృష్ణశాస్త్రి కవిత్వంలో ప్రధానంగా కనిపించే భావధారలు రెండే. మాధుర్యం, దుఃఖం.
ఎక్కడా దిక్కు తోచక, ఏ దారీ దొరక్క, అంధతమిస్రం వంటి ఈ ప్రపంచాన్ని ఎలా తరింపజెయ్యాలా అన్న పెనుభారాన్ని మోస్తూ కరుణతో ప్రేమతో కవిత్వం రాశాడు బైరాగి.
రవిశంకర్ మన మధ్యే తిరుగుతున్న మన కవి. ఈయనకు ఏటిపుట్టేడాదీ మనకు దైనందినంగా తోచే సాధారణమైన అనుభవాలు – నిద్ర లేవడం, ఇంట్లో భార్యాబిడ్డలను చూసుకోవడం, బయట ప్రకృతిని గమనించడం వంటివి – పునరాలోచించాల్సిన అనుభవాలై మమత్వం వాటిని పెనవేసి అనుభూతులై మిగిలాయి. ఇలా నిజాయితీగా రాసి తన కవిత్వం మీద తాను నిలబడగలిగిన కవి విన్నకోట రవిశంకర్.
రఘు శబ్దాల రంగూ రుచీ వాసనా పూర్తిగా తెలిసిన కవి. కనుక ఏ మండేన్ (mundane) విషయమైనా ఈ కవి తన టెక్నిక్ సంచిలో ముంచి తియ్యగానే, ఆ విషయం మురిపెంగా మనను ముద్దాడుతుంది. ఇంతకు మించి ఏ కవీ సాధించలేడు.
కుగ్రామంలో పుట్టి పెరిగి, పట్నానికి వెళ్ళి, దాన్ని వదలిపెట్టి అడవి దాపుకి వెళ్ళిన కవి మనిషినీ ప్రకృతినీ పునర్దర్శించి వాటి మధ్యనున్నది, ఆదిమానికీ ఆధునికానికీ మధ్యనున్నదీ అయిన ఒకే అనుబంధాన్ని కనుగొని జీవితానికి అర్థమేమిటనే అందర్నీ తొలిచే ప్రశ్నను ఆదరించి చేసిన కవనయజ్ఞఫలాన్ని పఠితలకిస్తూ వినయంగా తల వంచాడు.
ఎంత యూరోపియన్ ప్రతీకలూ పాశ్చాత్య కవులూ తత్త్వవేత్తల ప్రభావం తన కవిత్వంలో కనిపించినా భద్రుడు ప్రధానంగా భారతీయ కవి. ఎందుకంటే ఉపనిషత్సుధాధారల్లోంచే భద్రుడి కవిత్వం జనించింది, తను పుట్టిపెరిగిన శరభవరమే కేంద్రంగా నిలిచింది, అక్కడి జనుల మాటల్నే గంగానమ్మ జాతర్ల పాటల్నే ప్రతిధ్వనించింది.