పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16393

  1. అరణ్య కవితలు గురించి Alok అభిప్రాయం:

    09/07/2007 12:07 am

    హనుమంతుజీ చక్కగా అడిగినారు.

  2. అరణ్య కవితలు గురించి తెలుగుఅభిమాని అభిప్రాయం:

    09/07/2007 12:01 am

    అడివిమనుషులంమనము.( కుంచెం వేరే రకమైన అడవిలో
    తప్పిపోయి ఉన్నాముకదా.) అందుకే అడివి కవితలు
    తొందరగా ఇష్టపడలేము.అలాగే కృష్ణగారి విమర్శ
    కూడా స్వాగతించదగ్గదే. నాలుగు మినీ కవితలను కలిపి
    ఒకేచోట వేసినట్టుంది. ఎక్కడో చదివిన భావంకలిగినా
    మంచిపాటను మళ్ళీ మళ్ళీ విన్నట్టుగా తప్పులేదు కదా.

  3. అరణ్య కవితలు గురించి Raghothama Rao C అభిప్రాయం:

    09/06/2007 11:22 pm

    కృష్ణ గారూ,

    మీ వాదనలోను, విమర్శ లోనూ లోపాలు ఉన్నాయి. యదుకులభూషణ్ గారు వ్రాసిన “నేటి కాలపు కవిత్వం, తీరుతెన్నులు” తప్పక చదవాల్సిన పుస్తకం. మీరు అది చదివి అర్థం చేసుకునే వరకూ వాదనలు అనవసరం.

    నమస్తే
    రఘు

  4. అరణ్య కవితలు గురించి Alok అభిప్రాయం:

    09/06/2007 9:53 pm

    “చదివాక మనల్ని అలోచింపచేసేదిగా లేదు” అని మీరే గదా అన్నది. అందుకనే ఈరోజుల్లో “ఆలోచింప”జేస్తున్న కవితల వరైటీల్ని చెప్పా. అందులో భాగమే వాళ్ళని పట్టుకొచ్చా. నేను దళితుల్ని పొగిడినట్టు బాపనలని తిట్టినట్టు మీకెలా, ఎందుకు, ఎక్కడ కనిపించిదో నాకర్ధమ్ కాలేదు. ఇది చాలు మీకు చదవడం రాదని. చదివినా అరకొరగానే చదూతారని తెల్సుకోడానికి. ముందు మీరు “సరిగ్గా”చదవడం నేర్వండి సార్

    “అసంపూర్తిగా వదిలేసిన వాక్యం వచనం కాకుండా, కవిత్వం అయిపోతుందా?”
    విమర్శకుడు ఇంత పేలవంగా మాట్టాడ్డం అవమానకరం. అసంపూరి వాక్యం వచనం అనెవరన్నారో రెఫెరెన్స్ చూపండి. మీరుదహరించిన వాక్యాలు మీకు అర్థం కాకపోడమే కవి చేసిన తప్పా?

    మళ్ళీమళ్ళీ శేషేంద్రశర్మ గారి పేరెత్తుతున్నారంటే మీకు వారు తప్ప ఇంకొహరు తెలీదన్న మాట. తప్పు సార్. విమర్శకుడిగా అవతారమెత్తాక కూపస్థమండూకావతారాన్ని విడిచితీరాలి.

    చివరగా ఒక సలహా…క్రిష్న అన్న పేరు బావులేదనా డుండుండిగాడిగా టైపు పేరుతో వొచ్చారు. ఊరుమారినా ఉనికి మారునా అన్న తీరున మీరు జేసే జ్ణానోపదేశానికి మళ్ళీ మళ్ళీ నామకరణాలు జేసుకొనే అవసరం లేదులేండి.

  5. అరణ్య కవితలు గురించి Hanumantu అభిప్రాయం:

    09/06/2007 8:37 pm

    చాలాకాలానికి మంచి కవిత్వం చదవటం తటస్థించింది.

    ఈ కవిత గుంటూరు శేషేంద్రశర్మ గారి శైలిలా ఉన్నదనటం ఆశ్చర్యం.
    కృష్ణగారి విమర్శ ఏమాత్రం సహేతుకంగా లేదు. ఇందులోని భావం అర్ధంకాలేదని భాషను ఎద్దేవా చేయటంలోని ఔచిత్యం ఏమిటో?

    ‘అడవి అందంగా ఉన్నదని ఏం రాసినా చెల్లుబాటౌతుందా?’ అని అడిగారు. ఈ కవితలో మీకు అడవి అందమే కనిపించి, భావం అర్ధంకాకపోవటం, విమర్శకుడుగా మీరు సాధించిన / సాధించని పరిణితి మాత్రం స్పష్టంగా తెలుస్తున్నది.

    బహుశా ఆయావాద కవిత్వాలు తలకెక్కించుకొని , అదే కవిత్వం అనుకునే ధోరణితో రాసిన విమర్శే కానీ, సహేతుకమైన విషయం ఒక్కటీ లేదు.

  6. అరణ్య కవితలు గురించి కొత్త రవికిరణ్ అభిప్రాయం:

    09/06/2007 6:08 pm

    వావ్.. నాకైతే మళ్ళీ అడవుల కెళ్ళి వచ్చినట్టే అనిపించింది. బాగా వ్రాశారు సుబ్బూ..

    కొత్త రవికిరణ్

  7. అరణ్య కవితలు గురించి కొత్తపాళీ అభిప్రాయం:

    09/06/2007 5:56 pm

    మీరంతా ఏదో కృష్ణగారికేవీ తెలీనట్టు సలహాలివ్వొచ్చారే?
    శేషేంద్రశర్మని తెలిసినవారికి ఈ మాత్రం తెలీదనుకున్నారా? ఐనాఎంత అమాయకులండీ … అది చదవండీ ఇది చదవండీ అని సలహాలు చెప్పినంత మాత్రాన వినెయ్యడానికి ఆయనేం వెర్రివాడా? పద్యం రాసి దానిమీద సంజాయిషీ ఇవ్వాల్సి రావడం జోకుని వివరించడం కన్న ఘోరం. అరణ్యకవితలకి ఆ దుస్థితి పట్టలేదనే నేననుకుంటున్నా.

  8. తిష్టతత్వం జ్వలించింది గురించి Rohiniprasad అభిప్రాయం:

    09/06/2007 9:19 am

    మంచి రచన. తలవనితలంపుగా ఇదే విషయాన్ని గురించి నేను రాసినది కూడా ఈ నెలే వెలువడింది.
    సూక్ష్మజీవులు మనకన్నా ముందు నుంచీ కొనసాగుతున్నాయి. అవి ‘బతకనివ్వడం’ వల్లనే మనం బతకగలుగుతున్నాం. వేమూరివారు చెప్పినట్టుగా ఈ లెక్కన ‘నేను’ అన్నది బహువచనం!

  9. అరణ్య కవితలు గురించి Subrahmanyam Mula అభిప్రాయం:

    09/06/2007 7:42 am

    మాబాపదిగనోడు గారు,

    “కవిత్వాన్నీ, వచనాన్నీ విడదీసే ప్రాథమిక అంశాలేవి?” , “పాఠకుడు కవి స్థాయికి ఎదగాలా , కవే పాఠకుడి స్థాయికి దిగాలా” వంటి మౌలిక ప్రశ్నల దిశగా చర్చ సాగుతోంది. వీటి మీద ఇప్పటికే లెక్కలేనన్ని వాదనలు జరిగాయి. మీరు , నేను కొత్తగా చర్చించేదేమీ లేదు. కిరణ్ గారు చెప్పినట్టు యదుకుల భూషణ్ గారి “నేటికాలపు కవిత్వం — తీరు తెన్నులు” పుస్తకం చదవండి. ఆయన అభిప్రాయాలతో మీరు ఏకీభవించకపోయినా ఒక కొత్త కోణాన్ని చూసినవారవుతారు. ఈ సైటులోనే ఉన్న ఇస్మాయిల్ గారి “కరుణ ముఖ్యం” పుస్తకం కూడా చదవండి వీలైతే.

  10. రచయితలకు సూచనలు గురించి keshav అభిప్రాయం:

    09/06/2007 6:53 am

    మీ ప్రయత్నం చాలా బాగుంది. అభినందనీయం.