పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16393

  1. గాయక గంభీరుడు ఉస్తాద్ అమీర్ ఖాన్ గురించి madhuraswaram అభిప్రాయం:

    09/07/2007 11:59 pm

    అద్భుతం రోహిణి ప్రసాద్ గారు. సి.ఎస్ . రావు గారితో నేను పూర్తి గా ఏకీభవిస్తున్నాను.

  2. కీబోర్డ్ మీద రాగాలు గురించి madhuraswaram అభిప్రాయం:

    09/07/2007 11:41 pm

    శ్రీ కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారికి

    ఈ వ్యాసం ఔత్సాహిక కళాకారులందరికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ప్రసాద్ గారు చాల అద్భుతంగా విపులీకరించారు. రాగాలకు సంబందించి సినిమా పాటలు సేకరించటం , మళ్లీ వాటికి సంబందించిన శాస్త్రీయ సంగీత కీర్తనలు సేకరించి అన్నింటిని ఒక దగ్గర కూర్చి ఒక వ్యాసం లో రాయటం ఇది చదువుతున్నంత సులభం కాదు. ఒక సంగీత కళాకారుడిగా నాకు తెలుసు ఇది చాల శ్రమతో కూడిన పని . రోహిణిప్రసాద్ గారు అభినందనీయులు .

  3. అరణ్య కవితలు గురించి Alok అభిప్రాయం:

    09/07/2007 10:42 pm

    ఓహో మీరు క్రిష్న గారు కాదా? కానీ మీరిద్దరూ గుంటూరు శేషేంద్రశర్మ గారినే ఉటంకిస్తారా? “వాక్యాలన్నిటినీ ఒకే పేరాలో వ్రాయకుండా విరిచేసి నాలుగో ఐదో పంక్తుల కట్టలు కొన్ని చదవడానికి పడేశారు. అలా నింపడమేనా కవిత్వం అంటే? ” అని క్రిష్న గారంటే “అసంపూర్తిగా వదిలేసిన వాక్యం వచనం కాకుండా, కవిత్వం అయిపోతుందా” అని మీరడిగారు. ఇద్దరి వాదనలూ అర్ధరూపాయి గాదు రెండు పావలాలన్నట్టే వుంది !! సర్లేండి మీరిద్దరూ ఒకటా వేరా అన్నది దండగమారి విషయం.

    “కవిత్వానికి లాజిక్కు అక్కరలేదా? ”

    మీలాంటి లోతైన అధ్యయనశీలి కం పాఠకుడు ఇట్టాంటి ఉబుసుపోని ప్రశ్న వెయ్యడం విచారకరం. లాజిక్కు లేనిదంతా కవిత్వమా అన్న ప్రశ్నలో మీ భోళాతనం, నేటి తెలుగు సాహిత్య పాఠకుని దివాలాతనం కనపడుతోంది. సంతా సింగు బంతాసింగు జోకుల్ని కూడా అద్భుతమైన కవిత్వం అనే మరో తరం త్వరలోనే పుట్టుకొచ్చే సూచనలు కనపడుతున్నాయ్.

    కవిత్వానికి లాజిక్కు బద్ధశతృవు. సృజనాత్మకతకు లాజిక్కే పునాదైతే క్రిష్న గారు ఇక్కడే వున్న రవిశంకర్ గారి కవితలో “అద్భుతమైన చిత్రా”న్ని ఎట్లా చూడగలిగారో లాజికల్ గా చెప్పమనండి. పూలదోసిళ్లతో చెట్లు నీళ్ళు పట్టుకోడమేవిటి? చలిగాలి మనసుని కోయడమేవిటని కవిగారు వచ్చి లాజికల్ గా వివరించనివ్వండి. ఇంత లాజికల్ సర్కసూ జరిగాక కవిలోనూ, పాఠకునిలోనూ సున్నితత్త్వం, సృజన బతికుంటుందో లేదో మీరొచ్చి చెప్పండి.

    “ఇందువల్లే మన భాషకి అధోగతి పడుతోంది” అని క్రిష్న గారు అసంబధ్ధంగా బాధ పడగాలేంది నేనేసిన ప్రస్న ఎట్లా అసంబద్ధం మాబా గారూ? ఈ కవితలో కవెక్కడా భాషని చట్టుబండలు కానివ్వలేదే? ఇక్కడెవరో “అల్లాష్టకం” అని రాస్తే గౌ. సంపాదకులు గారు దాన్ని కవిత్వం కింద జమకట్టారు. ఆ అల్లాష్టకం కంటే ఈ కవితేమీ ఘోరంగా లేదే? మరి క్రిష్న గారు సడెన్ గా భాష గురించి కిందా మీదా పడ్డం అవసరమేనా? సంబద్ధమేనా?

    ముందు వీటికి సూటిగా ఇద్దరూ కూడబలుక్కుని సమాధానాలివ్వండి. సెలయేటి అలల గురించి చెప్పడం ఆనక….

    చివరగా, రాగాల గురించి తెల్సుకొన్నవారు సంగీతాన్ని ఇంకా ఎక్కువగా ఆస్వాదించగలరు. పాడాలని వుంది కార్యక్రమంలో పాల్గొన్న 10 ఏండ్ల పాపకు కూడా ఈ సంగతి తెల్సును.

  4. అరణ్య కవితలు గురించి KS Kiran Kumar అభిప్రాయం:

    09/07/2007 9:35 pm

    మాబాపదిగనోడు గారు కొంపదీసి కవిత్వానికి లాజిక్ అవసరమని, లాజికల్ గా వ్రాసిన ప్రతీది కవిత్వమని తీర్మానిస్తున్నారా ఏమిటి? కొద్దిగా వివరించమని మనవి.
    🙂

  5. అరణ్య కవితలు గురించి chavakiran అభిప్రాయం:

    09/07/2007 9:33 pm

    అయితే మీరెవరూ సెలయేటిలో అలలు చూడలేదన్న మాట!

  6. అరణ్య కవితలు గురించి Subrahmanyam Mula అభిప్రాయం:

    09/08/2007 12:03 am

    మాబాపదిగనోడు గారు,

    సంగీతాన్ని ఆస్వాదించడానికి రాగాలు తెలియక్కరలేకపోయినా , అందులోని లోటుపాట్లు తెలుసుకోడానికి తెలియాలి కదా! భూషణ్ గారి పుస్తకం చదువుతామన్నారు. చాలా సంతోషం. ఇండియాలో ఉంటే మీ అడ్రసు subrahmanyam.mula@gmail.com కి మెయిల్ చెయ్యండి. పుస్తకం పంపే ఏర్పాటు చేస్తాను.

    ఇస్మాయిల్ గారి కరుణ ముఖ్యం కింది లింకులో ఉంది. చదవండి వీలైతే.

    http://eemaata.com/em/category/library/karunamukhyam/

    అలాగే కింది వ్యాసం కూడా చదవండి. మీకు ఉపయోగపడొచ్చు.

    http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=32265&page=1

    ఇక కవిత్వంలో తర్కం ఎందుకుండకూడదో అన్న విషయం మీద నాగరాజు గారు చక్కని వ్యాసం రాసారు. కింది లింకు చూడండి.

    http://canopusconsulting.com/salabanjhikalu/?p=53

  7. ఒంటరి విహంగం గురించి Pandali అభిప్రాయం:

    09/07/2007 10:44 am

    I think people who live in America, and support American culture (falsely) will behave exactly this way. As long as it does not hurt you or your money, it is OK. Many Indian have this mentality, and it is horrible.

    I like the story. A better ending would have been a change in the guy’s mentality- an optimistic ending

  8. అరణ్య కవితలు గురించి మాబాపదిగనోడు అభిప్రాయం:

    09/07/2007 9:33 am

    “కవిత్వం మాథమేటిక్సు గాదు లాజికల్ గా ఆలోచించి చదువర్లని అలోచింపచేడానికి. కవిత్వం పొలికేకలు గాదు. కవిత్వం జాగ్రఫీ, తిండియావ గాదు.”

    అయ్యా అలోకు,
    మొదటగా నేను కృష్ణ ను కాదు. కవిత్వం ఏది కాదో చెప్పినంత తేలిక కాదు, కవిత్వం ఏదో చెప్పటానికి. నేను ఓ పాఠకుణ్ణి, అంతే. కృష్ణ అన్న వ్యక్తి ఏమన్నాడో నాకనవసరం. కవిత్వానికి లాజిక్కు అక్కరలేదా? ధన్యోస్మి. గుడ్డిలో మెల్ల, ఇంకా నయం, లాజిక్కు లేనిదంతా కవిత్వమే అనలేదు. నా అభిప్రాయం నేను చెప్పాను, అంతే. అయినా, రచయిత కున్నపాటి సహనం తమరికి లేకపోయింది. ఇంతచెప్పి మరి, సెలయేటి అలల గురించి (రచయిత గారిని అవమానించే ఉద్ధేశ్యంతో కాదు సుమా) మాట్లాడలేదే మరి?

    “నేను మాదిగనురా బాపనోడా అని పొలికేకలెట్టడవే కవిత్వమా కృష్ణాజీ? ”
    పై వాక్యానికి, ప్రస్తుత చర్చ కి ఏ విధంగా సంబంధం ?

    సుబ్రహ్మణ్యం గారు,

    మిమ్మల్నేదో విమర్శించ్చేద్దామని చదవలేదు. నా అభిప్రాయం చెప్పా.
    “యదుకుల భూషణ్ గారి “నేటికాలపు కవిత్వం — తీరు తెన్నులు” పుస్తకం చదవండి. ఆయన అభిప్రాయాలతో మీరు ఏకీభవించకపోయినా ఒక కొత్త కోణాన్ని చూసినవారవుతారు.” అన్నారు. త్వరలో తప్పక చదువుతాను.

    కానీ ముందుగా ఒక పుస్తకాన్ని చదివి, దాని ఆధారంగా కవిత్వాన్ని అర్థం చేసుకోండి, అని అనటం భావ్యమా? రాగాలు తెలుసుకొనే, సంగీతాన్ని ఆస్వాదిస్తామా?

  9. అరణ్య కవితలు గురించి J K Mohana Rao అభిప్రాయం:

    09/07/2007 7:01 am

    చూడ్డానికి ఒకేలా ఉన్నా
    దేని అందం దానిదే!

    అని కవితలోనే వ్రాయబడినది కదా!
    ఎందుకో ఇంత తర్జన-భర్జనలు?
    అన్ని కవితలు ఛందోబద్ధముగా నుండ నవసరము లేదు.
    అన్ని కవితలు ఒక ప్రత్యేక కవి వ్రాసినట్లు ఉండవలసిన
    అవసరము లేదు. లోకో భిన్నరుచిః
    ఎవరికివారే యమునాతీరే! కవితాభావము ఉంటే
    చాలు కవిత్వానికి. దానిని జూవాలజీ విద్యార్థి కోసే
    ఒక కప్ప కళేవరములా కోయ నవసరము లేదు.
    నచ్చితే మఱొక సారి చదవండి.

    – మోహన

  10. అరణ్య కవితలు గురించి sree Rama Murthy అభిప్రాయం:

    09/07/2007 4:29 am

    కృష్ణ గారి అభిప్రాయంతో ఏకీభవిస్తాను.